జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-08T124815.290-1.wav?_=1

 

జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం

◆:- మీ సేవలకు శతకోటి దండాలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!

కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….

కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

వినాయక చవితి వేడుకల సందర్భంగా జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా, శాంతి యుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాకయ కుని మండపం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ నీ అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా విలసిల్లి శాంతి, ఐక్యత తో పండుగ లో నిర్వహించుకోవాలన్నారు. తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గా ప్రతి పండుగ ను వేడుక గా నిర్వహించుకుని మధుర జ్ఞాపకాలుగా మలచుకోవాలన్నారు. అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ వంద ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, వారి సహకారం, ఆశీర్వాద బలం తో సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా దూసుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను శాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయగలరు…

క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయగలరు

క్రీడల జిల్లా అధికారి రఘు

భూపాలపల్లి నేటిధాత్రి

 

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు 2025 ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన క్రీడల శాఖ రఘు ఆద్వర్యంలో ఈ నెల 29న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీ మీటింగ్ హల్ నందు ఉదయం 11.30 గంటలకి నిర్వహించబడును.
జిల్లాలో నీ క్రీడా సంఘాల సభ్యులు, క్రీడా కారులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు

బాను ముస్తాక్ చేతుల మీదుగా మైసూరు దసరా ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T125942.319.wav?_=2

బాను ముస్తాక్‌ చేతుల మీదుగా మైసూరు దసరా ఉత్సవాలు

 

 

 

మైసూరు దసరా ఉత్సవాలు దేశంలోనే ఎక్కడాజరగని రీతిలో నిర్వహిస్తారు. అందుకు ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఏటా ఓ సాహితీవేత్త లేదా ప్రముఖుల ద్వారా ఉత్సవాలను ప్రారంభించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రముఖ రచయిత్రి, బుకర్‌ప్రైజ్‌ విజేత బానుముస్తాక్‌ ప్రారంభించనున్నారు.

బెంగళూరు: మైసూరు దసరా ఉత్సవాలు(Mysore Dussehra celebrations) దేశంలోనే ఎక్కడాజరగని రీతిలో నిర్వహిస్తారు. అందుకు ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఏటా ఓ సాహితీవేత్త లేదా ప్రముఖుల ద్వారా ఉత్సవాలను ప్రారంభించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రముఖ రచయిత్రి, బుకర్‌ప్రైజ్‌ విజేత బానుముస్తాక్‌ ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. బానుముస్తాక్‌ రచించిన హృదయదీప రచనకు బుకర్‌ప్రైజ్‌ లభించిన విషయం తెలిసిందే.

సెప్టెంబరు 22నుంచి అక్టోబరు 2దాకా 11రోజులపాటు మైసూరులో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. దసరా ఉత్సవాలు మైసూరులో రెండు ప్రత్యేక విధి విధానాలతో జరుగుతాయి. ప్రారంభం రోజున ప్రత్యేక ఆహ్వానితులతోపాటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, అధికారులు పాల్గొంటారు. చాముండేశ్వరిదేవికి పుష్పార్చన ద్వారా శ్రీకారం చుట్టే ఉత్సవాలలో ప్రతిరోజూ సాహిత్య, సాంస్కృతిక, నృత్య కళాప్రదర్శనలు ఉంటాయి.

జంబూసవారి రోజున 750 కేజీల బంగారు అంబారిపై చాముండేశ్వరిదేవిని ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. పూల ప్రదర్శన, వస్తు ప్రదర్శనతోపాటు మైసూరు నగరమంతటా ప్రత్యేకమైన విద్యుద్దీపాల అలంకరణలు ఉంటాయి. ఎయిర్‌షో, హెలిటూరిజం వంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతాయి. మరోవైపు రాజసంప్రదాయంలో భాగంగా మైసూరుప్యాలెస్ లో యువరాజు యదువీర్‌ బంగారు సింహాసనంపై ఆశీనులై ప్రైవేట్‌ దర్బార్‌ నిర్వహిస్తారు. జంబూసవారి పూజ ప్యాలె్‌సలో ప్రత్యేకంగా జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T160242.095.wav?_=3

 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ (తాజా మాజీ ఎంపీపీ)
రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈసందర్భంగా రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ భారతదేశంలో ఆధునికరణ, ఐటీ సంస్థలు నిలపడంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎంతో అహర్నిశలు కష్టపడిన నేత రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఈవేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల మాజీ సర్పంచ్ కోల రమేష్, మాజీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, గ్రామశాఖ అధ్యక్షులు కర్ణ శీను జెట్టిపల్లి వీరయ్య తడగొండ నర్సిమ్ బాబు ,హనుమంతు, నరసయ్య, అంజయ్య, బాపురాజు, ఆంజనేయులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T131758.313-1.wav?_=4

 

సిరిసిల్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని గాంధీ చౌక్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కన్వీనర్ సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సిరిసిల్ల నిర్వహించడం ఎంతో సంతోషకరమని అంతేకాకుండ పేదల పెన్నిధిగా మహోన్నత వ్యక్తిగా, ఇది నిన్న రాజీవ్ గాంధీ ఎంతోమంది పేదలకు అండదండగా ఉంటూ ముందుకు సాగరం జరిగినది అని తెలిపారు. అంతేకాకుండా నేడు తెలంగాణలో పేదల ప్రభుత్వం నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యాంగ ముందుకు వస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆకునూరి బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ సూర దేవరాజ్, మాజీ కౌంటర్ ఎల్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవ వేడుకలు…

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవ వేడుకలు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలంలోని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల వ్యవస్థాపక అధ్యక్షుడు అనుము వీరస్వామి, మండల అధ్యక్షులు వైద్య రాజేందర్, ప్రధాన కార్యదర్శి తిర్రి శ్రీనివాస్ ,, దేశిని రాజు, గోస్కుల కుమారస్వామి సభ్యులు పాల్గొనడం

ప్రపంచ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్స్ మహాదేవపూర్…

ప్రపంచ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్స్ మహాదేవపూర్

ఆగష్టు 19 నేటి ధాత్రి *

 

 

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మహాదేవపూర్ యూనియన్ ఆధ్వర్యంలో
186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని
కెమెరా సృష్టికర్త ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురే గారి చిత్రపటానికి పూలమాల వేసి డాక్టర్ మాధవిజ్యోతి ప్రజ్వలన చేసుకుని మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ని రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు
తదనంతరం సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మేకల రాజేష్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల పెద్ద నరసింహస్వామి కోశాధికారి పెండ్యాల చిన్న నరసింహస్వామి ఉపాధ్యక్షుడు కావేరి సంతోష్ గౌరవ అధ్యక్షులు బుర్ర లింగయ్య గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు సమ్మయ్య, జయంత్ మరియు యూనియన్ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఘనంగా డబ్బాలో పాపన్న జయంతి వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-24-6.wav?_=5

ఘనంగా డబ్బాలో పాపన్న జయంతి వేడుకలు

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో బడుగుల ఆరాధ్య దైవమైన సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి వేడుకలను ఘనంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న సంక్షేమ సంఘం ఇబ్రహీంపట్నం మండల శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ గౌడ్
మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న వీరోచిత పోరాటాలను ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పుప్పాల నర్సయ్య, లింగంపల్లి గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ కోటి దేవారెడ్డి, గౌడ సంఘ అధ్యక్షులు ఎలుక అశోక్ గౌడ్, నేరెళ్ల సత్యం గౌడ్, రాజం గౌడ్, సంఘ సభ్యులు అబ్బురి ప్రకాష్, నేరెళ్ల రాజ్ కుమార్, అబ్బూరి ఆనంద్ రాజ్, ఆనంద్, శ్రీనివాస్, దశ గౌడ్, ఈమెల్ గౌడ్, రంజిత్, నేరెళ్ల అంజా గౌడ్, అబ్బూరు వేణు, వెంకటేష్ ఆకు రమేష్, సత్య నంద, తదితరులు పాల్గొన్నారు

కైలాసగిరి శివాలయానికి భక్తుల రద్దీ….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T155236.411.wav?_=6

 

కైలాసగిరి శివాలయానికి భక్తుల రద్దీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ కైలాసగిరి శివాలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జహీరాబాద్లో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 5 గంటల నుంచి బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు గణేష్ స్వామి, నందు స్వాముల ఆధ్వర్యంలో శివుడికి అభిషేకం, బిల్వార్చన, గంగాభిషేకం వంటి పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T142912.081-1.wav?_=7

 

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలో ఆవిష్కరించిన విగ్రహానికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న పోరాటాలు, త్యాగాలు వెనకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని పలువురు కొనియాడారు. జహీరాబాద్ పట్టణ గౌడ్ సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30-3.wav?_=8

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

*ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

తిరుప‌తి(నేటిధాత్రి(ఆగస్టు 16:

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా ఇస్కాన్ లోని రాధా కృష్ణ‌ స‌మేత అష్ట‌స‌తులను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం దర్శించుకున్నారు.ఆల‌య ప్ర‌తినిధులు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. గోకులాష్ట‌మి సంద‌ర్భంగా శ్రీకృష్ణ ప‌ర‌మాత్మున్ని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌకర్యం క‌ల‌గ‌కుండా ఆల‌య ప్ర‌తినిధుల తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు.తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రిపై శ్రీకృష్ణుని కృపాక‌టాక్షాలు మెండుగా ఉండాల‌ని ఆకాంక్షించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆర‌ణి జ‌గ‌న్, రాజా రెడ్డి, జీవ‌కోన సుధా, బాబ్జీ, రాజేష్ ఆచ్చారీ, మున‌స్వామి, పురుషోత్తం, శ్రావ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

న్యాల్ కల్ మండలం లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-25-4.wav?_=9

న్యాల్ కల్ మండలం లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండలంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా న్యాల్ కల్ మండలం కుర్మ సంఘం అధ్యక్షులు గొల్ల నర్సింలు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులు గా జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జక్కుల హనుమంత్ సార్ హద్నూర్ గారు రావడం జరిగింది గోపికలు శ్రీకృష్ణ వేశాధారణ తో చిన్నారులతో కృష్ణ భగవానునికి పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఉట్టి కొట్టు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీకృష్ణ భగవానుని జీవిత చరిత్ర గురించి విశ్వాహిందు పరిషత్ మండలం అధ్యక్షులు రాంచందర్ పవార్ మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమం లో మల్గి మాజీ సర్పంచ్ జట్టుగొండ మారుతీ ఓంకార్ యాదవ్ మల్గి ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మాజీ ఎస్. ఎం.సీ. చేర్మెన్ నర్సప్ప అశోక్ చల్కి దత్తు గొల్ల దిలీప్ కుమార్ యాదవ్ శ్రీనివాస్ పెద్దగొల్లా శ్రీనివాస్ గొల్ల రాములు మారుతీ మహేష్ సిద్దు సునీల్ మొగుళప్ప రాకేష్ ఆకాష్ విట్టల్ గొల్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు,

మండలంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు…

మండలంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం పాటలు, ఆటలు, క్విజ్ లు నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలలో జెండా ఆవిష్కరించిన అనంతరం పలువురు అధికారులు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి…

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

నిర్వహించాలని,ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ కోరారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తోందని గౌడ సోదరులు ముందుండి బహుజన సోదరులను ఆహ్వానిస్తూ అందరూ కలిసి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఆయన బహుజన బహుజనుల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు.చాలా గ్రామాల్లో పాపన్న గౌడ్ విగ్రహాలు ఉన్నాయని లేనిచోట్ల ఆయన ఫోటోకు పూలదండలు వేసి వేడుకలను నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ గౌడ సంఘం అధ్యక్షులు ఎలుక అశోక్ గౌడ్, నేరెళ్ల సత్యం గౌడ్, గౌడ సంఘ సభ్యులు అబ్బూరి ఆనంద్ రాజ్, చీకట్ల వేణు గౌడ్, అబ్బూరి ప్రకాష్ గౌడ్, నేరెళ్ల రాజకుమార్ గౌడ్, అబ్బూరి శ్రీనివాస్, నేరెళ్ల అంజా గౌడ్, ఎలుక శివలింగం, అబ్బూరి దశ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T151830.696-1.wav?_=10

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజున 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి.

జాతీయ గీతలాపన అనంతరం స్వీట్లు పంచి వేడుకలను ఘనంగా జరిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలో భవిత డిగ్రీ కాలేజ్ ఆవరణలో, కాలటెక్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.ఏఎంసి చౌరస్తా వద్ద స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రివర్యులు కాక గడ్డం వెంకటస్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ
అందరూ మహనీయులు త్యాగాలు ఫలితమే భారత దేశ స్వతంత్రం అని అన్నారు వారి సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు
ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం
పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలనాయకురాలు,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51.wav?_=11

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో….

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో….

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CI Krantikumar

ఎమ్మార్వో కార్యాలయంలో…..

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయం లో…….

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లో……

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.

నిజాంపేట లో ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-43.wav?_=12

నిజాంపేట లో ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు

నిజాంపేట: నేటి ధాత్రి

79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండలం ప్రభుత్వ కార్యలయాలు, వివిధ పార్టీ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం లో ఎమ్మార్వో శ్రీనివాస్, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ. రాజేష్. ఎంపీడీఓ కార్యలయంలో రాజీరెడ్డి, రైతు వేదికలో సోమలింగారెడ్డి, విద్యుత్ కార్యలయంలో ఏఈ గణేష్, కాంగ్రేస్ పార్టీ కార్యలయంలో వెంకట్ గౌడ్, గ్రామాల్లో గల పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

ఆగస్టు 18–25 పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు..

ఆగస్టు18 నుండి 25 వరకు పాపన్న గౌడ్ 375 వ జయంతి వరోస్తవాలు జయప్రదం చేయండి

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

భారతదేశం మొట్టమొదటి దళిత బహుజన విప్లవ వీరుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధన మార్గాన్ని సూచించి మొగలు పాలకుల మెడలు వంచి పన్నులను రద్దు చేసిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతివారోత్సవాలను దేశవ్యాప్తంగా ఈ నెల 18 నుండి 25 వరకు గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని జయప్రదం చేయాలని రాష్ట్ర గౌడ సోదరులందరికి పిలుపునిస్తున్నాం.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

 

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , కోహిర్ మాజి సర్పంచ్ కళీమ్ గారి జన్మదిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు కోహిర్ మండలం అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండలం అధ్యక్షులు వెంకటేశం ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,యువ నాయకులు ముర్తుజా ,దీపక్ , మల్లేష్ తదితరులు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version