ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు…

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ మందిరం నుంచి పోచమ్మ తల్లి మందిరం వరకు బాజా భజంత్రీలతో, కోలాటాలతో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

నైన్ పాకలో హనుమాన్ స్వాముల శోభయాత్ర.

నైన్ పాకలో హనుమాన్ స్వాముల శోభయాత్ర.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో నీ నైన్ పాక గ్రామంలో మంగళవారం రోజున హనుమాన్ మాలదారులు గ్రామం లో నగర సంకీర్తన కార్యక్రమం* ని అంగరంగ వైభవం గా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ స్వాములు గ్రామం లోని అన్ని పురావిధుల గుండా హనుమాన్ వేశాధారణలో రామనామా స్మరణ చేస్తు చప్పుళ్లతో అంజన్న స్వామి ల గంతులు వేస్తూ రామ నమా స్మరణ తో జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి స్వామి,దేవస్థాన హనుమాన్ స్వాములు,తదితరులు పాల్గొన్నారు.

జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు. !

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో శంకర్ గంజ్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి ఊరేగింపు శంకర్ గుంజీ నుండి బయలుదేరి కమాన్ చౌరస్తా రాజీవ్ చౌక్ ద్వారా భక్తిశ్రద్ధలతో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర.!

నేడు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శోభాయాత్ర

వరంగల్ నేటిధాత్రి :

జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం వరంగల్ నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు శోభాయాత్ర కన్వీనర్లు పొట్టి శ్రీనివాస్, దుబ్బ శ్రీనివాస్, దాచేపల్లి సీతారాం తెలిపారు.
సాయంత్రం 5 గంటలకు వరంగల్ స్టేషన్ రోడ్డులోని పోచమ్మ గుడి నుండి శోభాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అమ్మవారి శోభాయాత్ర మేళతాళాలు మరియు ఆడపడుచుల దాండియా ఆటలతో ముందుకు సాగుతుందన్నారు. ఈ శోభాయాత్ర పోచమ్మ గుడి నుండి పోస్ట్ ఆఫీస్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, దుర్గేశ్వర స్వామి విది, పిన్నవారి వీధి, ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్, మీదుగా బట్టల బజార్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రక్కన గల వాసవి మాత దేవాలయం చేరుకుంటుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది.
ఆర్యవైశ్య బంధుమిత్రులందరు శోభాయాత్రలో పాల్గొని దిగ్విజయం చేయాలని శోభాయాత్ర కన్వీనర్లు కోరారు.

అట్టహాసంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర.

అట్టహాసంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర

మందమర్రి నేటి రాత్రి

 

శ్రీ సీతారామ కల్యాణం పురస్కరించుకని మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అట్టహాసంగా శోభాయాత్ర నిర్వహించారు. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు ప్రత్యేక వాహనంపై ఉంచి సింగరేణి కార్మికవాడల మీదుగా శోభాయాత్ర సాగింది. భక్తిపాటలపై హనుమాన్ దీక్ష స్వాములు నృత్యాలు చేస్తూ స్థానిక ఆలయం నుంచి మార్కెట్ మీదుగా ర్యాలీ సాగింది. అంతకు ముందు పూజారులు కృష్ణకాంతాచార్యులు, శ్రీకాంతాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version