సందడితో ముగిసిన సద్దుల బతుకమ్మ…

సందడితో ముగిసిన సద్దుల బతుకమ్మ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో బతుకమ్మ సంబరాలను మహిళలు చప్పట్ల సందడితో చందమామ పాటలతో తీరొక్క పూలతో. బ్రతుకు నిచ్చే బతుకమ్మ పండుగను ఆయా గ్రామ శివారులలో మహిళలందరూ ఒక్కటై గౌరమ్మను బ్రతుకమ్మలో అందంగా పేర్చి బతుకమ్మ పండుగను తమలో ఉప్పొంగిన రెట్టింపు ఉత్సాహంతో చిందులేసి అనంతరం గ్రామాలలోని వాగులు చెరువులలో బతుకమ్మను పోయి రావమ్మ అంటూ సాగనంపారు. మొగుళ్లపల్లి మండలంలోని మహిళలంతా బతుకమ్మ పండుగ శుక్రవారంతో ముగియనుండడంతో. మహిళలంతా. బతుకమ్మ చందమామ బంగారి బతుకమ్మ చందమామ అంటూ మొదలైన బతుకమ్మ ఆట పాటలు తో పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ సాగనంపడంతో సంబరాలు ముగుస్తున్నాయి.గ్రామాలలో పొద్దు వాలంగానే ఏ దిక్కుచూసిన తొమ్మిది రోజులు బతుకమ్మ ఆటపాటలు కనిపించాయి. రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో వాడలన్నీ పూల వాసనగా మారాయి. చెరువు గట్లు వాగులు ఆనందంతో ఉప్పొంగాయి. సద్దుల బతుకమ్మ సాగడంపడానికి ఆడిబిడ్డలంతా అత్త ఇంటి నుంచి పుట్టింటికి వచ్చారు. పొద్దు పొడవుకు ముందే ఇల్లు వాకిలి సర్దుకొని పట్టు బట్టలతో ఆనందంగా ముస్తాబయి, అన్నదమ్ములు తెచ్చిన గునుగు, గన్నేరు, తంగేడు, సీత జడ, బంతి, చామంతి తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి గ్రామ శివారులలోని ఆహ్లాదకరమైన వాతావరణం లో బతుకమ్మ వెలుగుల్లో ఆనందంగా బతుకమ్మను కొలిచిన మహిళలు పాటలు పాడుతూ. గ్రామ శివారులలోని వాగులు చెరువులలో పోయిరా పోయిరా అంటూ బతుకమ్మను సాగినంపారు.

ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు…

ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

నస్పూర్ మండలం షిర్కే కాలనీలో ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.తంగడి పూలకు తోడుగా రకరకాల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి గౌరీ దేవిని పూజించి,నూతన వస్త్రాలు ధరించి అందరూ ఒకచోట కలసి ఆడుతూ పాడుతూ బతుకమ్మను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి,మన ఆస్తిత్వానికి నిలువుటద్దమని అన్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ భూమి నీరు మానవ సంబంధాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే గొప్ప పండుగ అని తెలిపారు.మహాలయ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల జాతర తెలంగాణ సంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెపుతుందని అన్నారు.అలాగే మహిళలు, ఆడపడుచులు ఐక్యంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ వారి మధ్య అనుబంధాలను,ఐక్యతను, పెంపొందిస్తుందని,గౌరీ దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు పూజించారు.

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.

మందమర్రి గణేష్ ఉత్సవాల్లో 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు…

బొజ్జ గణపయ్యకు108 ప్రసాదాలతో పూజలు.

మందమర్రి నేటిధాత్రి

గత 5 సంవత్సరాలుగా శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రుల ఉత్సవాలను జరుపుతున్నారు.

మందమర్రి శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడికి అత్యంత ఇష్టమైన మోదకం, లడ్డు ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, పూరి, కోవా, పానకము,అరిసి పొంగల్,కుజి,బూందీ,
చారు, నైవేద్యము పండ్లు పలహారాలు 108 ప్రసాదాలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అందరూ కలిసి మన సాంస్కృతికి అనుగుణంగా చీరలు కట్టుకొని గణనాథుని పూజలో పాల్గొన్నారు.

తదనంతరం మహా గణనాథునికి హారతి పాటలతో హారతిపట్టి పూలతో అభిషేకం చేసి ఆ మూషిక వాహనానికి భక్తితో అలరించిన భక్తులు

ఈ కార్యక్రమం లో ముఖ్యులుగా ముందు ఉండి నడిపించిన వారు… చిటికనేని వెంకట్రావ్ సుశీల, పంబాల శ్రీనివాస్, పట్టి భాను చందర్, పట్టి సతీష్ బాబు, మారం వినీత్, కుంభం రాజు, నూనె రాజేశం, కట్ట తాత రావు, కట్ట సూరిబాబు, అనబోయిన కుమార్, కొమ్మ రాజబాబు, ముప్పు రాజు భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version