మున్సిపాలిటీ ఎన్నికలకు సహకరించాలి: తహసిల్దార్..

మున్సిపాలిటీ ఎన్నికలకు సహకరించాలి: తహసిల్దార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని తహసిల్దార్ దశరథ్ కోరారు.రాజకీయ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో, వార్డుల సంఖ్య పెరగడంతో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు తెలిపారు. పట్టణంలో 1000 మందికి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు తమ సమస్యలను నేరుగా కౌన్సిలర్లకు చెప్పుకోవచ్చని, ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం…

ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం…

#అన్నీ డివిజన్ లలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి..

#శంకుస్థాపన చేసిన ప్రతి పని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నాం..

#ప్రజల భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి…

#నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న..

#కాజీపేట,హనుమకొండ లలో పలు డివిజన్ లలో సుమారు రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

హన్మకొండ, నేటిధాత్రి:

 

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.పేర్కొన్నారు.సోమవారం రోజున శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజవర్గ పరిధిలోని 47 వ డివిజ బోడగుట్ట,31 వ డివిజన్ శాయంపేట ఎస్సీ కాలనీ,8 వ డివిజన్ గుడి బండల్ లలో సుమారు రూ.1.70 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా డివిజన్ లలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీలో అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.ఇప్పటికే నియోజవర్గంలోని అన్ని డివిజన్ లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.గతంలో పలు కాలనీల్లో కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న చాలా కాలనీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి జరుగుతున్నదని,రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు.
బోడగుట్ట గ్రామానికి ప్రధాన రహదారి నుంచి రోడ్డు వెడల్పు చేయాలని స్థానిక ప్రజలు కోరగా సంబధిత అధికారులకు ప్రణాళికల్ని సిద్ధం చేయాలని సూచించారు.
శాయంపేట దళిత కాలనీలో చాలా వరకు నూతన రోడ్లు వేశామని మిగిలిన అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు,అధికారులు ఉన్నారు.

ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకు – ప్రతి ఓటే ప్రజాస్వామ్యానికి పునాది..

ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకు – ప్రతి ఓటే ప్రజాస్వామ్యానికి పునాది!

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రజాస్వామ్యం ప్రజల చేతిలోనే ఉంటుంది.ఆ శక్తి ఓటు రూపంలో మనకు లభించింది. ఒక్క ఓటు విలువ లేదని అనుకోవడమే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద నష్టం.అనేక ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే విజయం లేదా ఓటమి నిర్ణయమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం వేసే ఓటే నాయకులను నిర్ణయిస్తుంది.పాలన దిశను మార్చుతుంది.ఓటు హక్కు మనకు ఉచితంగా రాలేదు. ఎన్నో త్యాగాలు,పోరాటాల ఫలితంగా అది మనకు దక్కింది.అందుకే ఓటు వేయకపోవడం అంటే ఆ త్యాగాలను నిర్లక్ష్యం చేసినట్లే. నా ఒక్కరితో ఏమవుతుందిలే అనుకోవద్దు.ప్రతి ఒక్కరి ఓటు కలిసినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది.కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి.ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు,మన కర్తవ్యమూ.నేడు వేసే ఒక్క ఓటే రేపటి మంచి భవిష్యత్తుకు పునాది గా మారుతుంది.

అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశాని రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమమును ఘనంగా నిర్వహించాలని.అన్నారు,. గ్రామాలలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ భావజారాన్ని ప్రజలకు తెలియ పరచాలని , మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే వర్ధంతి కార్యక్రమంలో అందరూ హాజరు కావాలని మహానీయుడు కన్న కలలను నిజం చేయాలని భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని , అందుకు కుల మతాలకు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు అంబేద్కర్ వాదులు మేధావులు ఉద్యోగులు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ ఈనెల 6న అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ శ్రీలపాక ప్రణీత్ గడ్డం సదానందం కట్కూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

మందమర్రి పోలీసులు ప్రజల భద్రత కోసం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T154143.640.wav?_=1

 

మందమర్రి పోలీసులు ప్రజల భద్రత కోసం

మందమర్రి నేటి ధాత్రి

 

పిచ్చి మొక్కల తొలగింపుతో ప్రమాదాల నివారణకు ముందడుగు
ప్రజల భాగస్వామ్యంతో ఎస్సై రాజశేఖర్ ప్రత్యేక చొరవ

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మందమర్రి పోలీసులు చిర్రకుంట సారంగపల్లి గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న సారంగపల్లి చిర్రకుంట బీటీ రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

రోడ్డుకు ఇరువైపులా మొక్కలు అధికంగా పెరగడంతో రహదారి వెడల్పు తగ్గిపోవడం, వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించకపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు పోలీసులు గుర్తించి ఈ చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని పోలీసులకు సహకారం అందించారు.

ఈ సందర్భంగా మందమర్రి ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ
“మందమర్రి ఆవడం చిర్రకుంట బీటీ రోడ్డులో ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను ప్రజల సహాయంతో తొలగించడం జరిగింది. దీనివల్ల రోడ్డుకు పూర్తి వెడల్పు అందుబాటులోకి వచ్చి, రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహకరించిన సారంగపల్లి, చిర్రకుంట గ్రామ ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

ఎస్సై సూచించిన ముఖ్య భద్రతా నియమాలు:

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ఉపయోగించాలి

నిర్ణీత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలి

మద్యం సేవించి వాహనం నడపడం నేరం అలా చేయవద్దు

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్ పత్రాలు ఎల్లప్పుడూ వెంట ఉంచాలి

మలుపులు, దృష్టి గోచరత తక్కువ ప్రాంతాల్లో నెమ్మదిగా వెళ్లాలి

మందమర్రి పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తారని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్సై రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గుడా డివిజన్‌లో ఇంటింటా ప్రచారం…..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గుడా డివిజన్‌లో ఇంటింటా ప్రచారం

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గుడా డివిజన్‌లోని 253,254,255,256,257, 258 బూత్ లో నిర్వహించిన ఇంటింటా ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే వీర్లపల్లీ శంకర్, బిసి కార్పొరేషన్ చైర్మన్ నూతి.శ్రీకాంత్ గౌడ్,సిని నటుడు సుమన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,యువ నాయకుడు,ప్రజా సంకల్పంతో నిండిన నవీన్ యాదవ్ గారిని గెలిపించడం అత్యంత కీలకమనితెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,స్థానిక నాయకులు,మహిళలు,యువత మరియు ప్రజలు పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి…

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

డీసీపీ కరుణాకర్
ఏసీపీ మడత రమేష్
ఎస్ ఐ రవి కుమార్

ముత్తారం :- నేటి ధాత్రి

పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ సి ఐ రాజు గౌడ్ టూ టౌన్ సి ఐ ప్రసాద్ రావు ముత్తారం ఎస్ ఐ రవికుమార్ మంథని ఎస్ ఐ సాగర్ కమాన్ పూర్ ఎస్ ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా, ఈదలాపూర్ గ్రామం నుండి రామగిరి గ్రామం వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ నినాదాలు తో ఈ ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా ముత్తారం ఎస్ ఐ రవికుమార్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా జరిగాయి విధి నిర్వహణలో అమరులు అయినటువంటి  పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు యువత ఉత్సాహంగా పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిందని అన్నారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు
ఈ కార్యక్రమం లో మహిళ పోలీస్ సిబ్బంది సౌజన్య ప్రత్యూష శ్వేతా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది.

పరకాలలో బందు ప్రశాంతం…

పరకాలలో బందు ప్రశాంతం

పరకాల నేటిధాత్రి

 

తెలంగాణ లో బీసీ లకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని బీసీ నాయకులు ఇచ్చిన బంద్ లో శనివారం రోజున పట్టణంలోని వ్యాపారస్థులు,ప్రజలందరు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ బంద్ కు పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.విద్యాసంస్థలు,కాలేజీలు సెలవు ప్రకటించాయి.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్….

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్థానిక న్యాల్ కల్ మండల కేంద్రం లోని బస్టాండ్ ముందు బీసీ సంక్షేమ సంఘం న్యాల్ కల్ మండల అధ్యక్షులు భోజగొండ శివరాజ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్య సంస్థలు దుకాణాలు ఇతర వ్యాపారాలు స్వచ్చందంగా బంద్ పాటించారు ఈ సందర్బంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 42 % శాతం బీసీ రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన హామీని అమలు చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయక పోవడం కారణంగానే బీసీల “బంద్” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బంద్ లో భాగంగా శాంతియుతంగా చేపట్టమని తెలిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వనికి చిత్త శుద్ధి ఉంటే మీరు ఇచ్చిన బీసీ లకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తాను అన్న మాయమాటలు చెప్పి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు బీసీలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ మల్గి సర్పంచ్ బీసీ సంఘం విద్యార్థి విభాగం ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మిర్జాపూర్ మాజీ సర్పంచ్ బీరప్ప చల్కి అశోక్ బీజేపీ మాజీ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ బీజేపీ మండలం అధ్యక్షులు మల్లేష్ బీజేవైఎం మండలం అధ్యక్షులు విష్ణు పాటిల్ మండలం ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సతీష్ కులకర్ణి మైనారిటీ సభ్యులు అసిఫ్ నర్సప్ప లావేష్ పాటిల్ రాజు యాదవ్ పాండు తదితరులు ఉన్నారు,

బీసీ రిజర్వేషన్ కోసం “బంద్ ఫర్ జస్టిస్” ర్యాలీ…

బీసీ రిజర్వేషన్ల పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతాం*

-బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ లో వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్ల విషయంలో దోబూచులాట లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా హన్మకొండ యూనివర్సిటీలోని ఎస్ డి ఎల్ సిలో గల మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి మహేందర్ గౌడ్ పూలమాల వేశారు. అనంతరం యూనివర్సిటీ క్రాస్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు సకలజనులు బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్నారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అగ్రవర్ణాల పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలులో భాగంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో విఫలమైందన్నారు. సమగ్ర కులగణనను మొదలుకొని..బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించడం..ఆ బిల్లు పెండింగ్ లో ఉండగానే..మరో ఆర్డినెన్స్ తేవడం..ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే..జీవో 9 ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘోరా తప్పిదమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం..5 శాతం ఉన్న రెడ్డిలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలా చేసినప్పుడే బీసీలకు సముచిత న్యాయం దక్కుతుందన్నారు. అదేవిధంగా బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ బీసీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడని, బీసీల పాపం బిజెపికి తగులుతుందని, బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్న బిజెపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ పిలుపులో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని బిజెపి బీసీలంటే బానిసలుగా చూస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు రాణించాలంటే చట్టసభలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని, ఇందుకు బిజెపి రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్రంలో బిజెపిని బొంద పెట్టడం ఖాయమన్నారు. బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 18 శాతానికి కుదించిన బీఆర్ఎస్ పార్టీ బంద్ లో పాల్గొని బీసీ సమాజానికి ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. సకల జనులు కలిసి బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంలో ఆలోచించకుండా..అన్ని పార్టీలు ఏకమై బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం హన్మకొండ యూనివర్సిటీ నుండి ములుగు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.

మడికొండ రామలీల మైదానంలో దసరా ఉత్సవాల వైభవం…

దసరా ఉత్సవాలు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల పునరుజ్జీవనానికి ప్రతీక…

మడికొండ రామలీల మైదానంలో అంగరంగ వైభవంగా జరగబోయే దసరా ఉత్సవాల ఏర్పాట్లు…

భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వైభవం నిండిన వాతావరణంలో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్థానికులు సమన్వయంతో కృషి చేయాలి..

దసరా ఉత్సవాల స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ (నేటిధాత్రి):

హన్మకొండ జిల్లా కాజీపేట పరిధిలో మండల పరిధిలోని మడికొండ అయోధ్యపురం రోడ్డులో గల మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన రామలీల మైదానంలో అంగరంగ వైభవంగా జరగబోయే బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా మైదానాన్ని శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతూ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
దసరా ఉత్సవాలు మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల పునరుజ్జీవనానికి ప్రతీక. ప్రజలంతా సక్రమంగా పాల్గొనేలా విద్యుత్, నీరు, పారిశుధ్యం, భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.

 

ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సాంస్కృతిక వైభవం నిండిన వాతావరణంలో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్థానికులు సమన్వయంతో కృషి చేయాలన్న ఎమ్మెల్యే నాగరాజు దసరా ఉత్సవాలు ప్రతి ఇంటికీ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయి. సమాజంలో ఐకమత్యం, సత్సంకల్పం, ధర్మం కోసం పోరాడిన శ్రీరాముని మహోన్నతతను గుర్తుచేస్తాయి. భద్రతా బందోబస్తు వరకు అన్ని అంశాలను పక్కాగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని అందరూ గుర్తించాలి. కాబట్టి స్థానికులు, సన్నాహక కమిటీ సభ్యులు, అధికారులు కలసి పనిచేస్తే ఈ ఏడాది దసరా ఉత్సవాలు చారిత్రాత్మకంగా నిలుస్తాయి” అని వివరించారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

ముర్తుజపూర్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం…

ముర్తుజపూర్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సెప్టెంబర్ 17, బుధువారం రోజున న్యాల్కల్ మండలంలోని ముర్తుజాపూర్ గ్రామ పంచాయితీ, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైంది. రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రారంభమైంది. ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి నరేశ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాత్ , గ్రామ నాయకులు, అజమ్ పటేల్, సిరాజ్ పటేల్, మోహన్ రెడ్డి, రమేశ్ పటేల్, సాల్మన్, దినకర్,ప్రశాంత్ మరియు పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T150955.734.wav?_=2

 

బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలసి రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో
సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, పూల పండుగ అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 రోజులు జరుగనున్న నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారని, బతుకమ్మలు ఆడిన తదుపరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో బతులమ్మ ఘాట్లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రహదారులు, వీధి లైటింగ్, తాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేలా చూడాలని తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 2న జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరిగే వేడుకలకు సాంస్కృతిక సారథి కళాకారులచే కళాజాత నిర్వహించాలని డిపిఆర్వో ను ఆదేశించారు. అలాగే విద్యుత్, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక, ట్రాఫిక్ నియంత్రణ, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. అక్టోబర్ 2వ తేదీన దసరా ముగింపు వేడుకలకు డా బిఆర్ అంబేడ్కర్ మైదానంలో నిర్వహించడం జరుగుతుందని, వీక్షించేందుకు వచ్చే ప్రజలకు కుర్చీలు ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. ఉత్సవాలు అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే మనందరి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాలను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పంచాయతి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి ఎస్ ఓ టు జిఎం కవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి…

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే

సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

సిరిసిల్లలో శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

 

వినాయక నిమజ్జన స్థలం వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర సౌకర్యాల విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాలు వచ్చే, వెళ్లే దారిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, స్టేజ్, కూర్చునేందుకు కుర్చీలు వేయించాలని, క్రేన్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఆయా శాఖల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాణిక్ రావు గణేష్ మండప సందర్శన….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T152616.425-1.wav?_=3

ప్రజలందరు గణనాథుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలి

◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ షెరీ ఆహ్వానం మేరకు ,శ్రీ రామ్ వీధి లో ఏర్పాటు చేసిన మధుర గణేష్ మండపంను సందర్శించి దర్శించుకున్న శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప గారు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశంపాక్స్ చైర్మన్ మచ్చెందర్ తదితరులు …..

రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-92-1.wav?_=4

రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

రామాయంపేట ఆగస్ట్ 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన 400 మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎం. దేవేందర్ గారు పంపిణీ ప్రారంభించారు.

Clay Ganesha Distribution

ప్రజలు పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మట్టి విగ్రహాలను అందజేస్తోందని కమిషనర్ తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరుగుతుందని, మట్టి విగ్రహాల వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తదనంతరం మిగిలిన విగ్రహాలను మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులకు వార్డు అధికారులు, మహిళా రిసోర్స్ పర్సన్‌ల సమక్షంలో పంపిణీ పూర్తి చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం…

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర ప్రారంభం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

నెక్కొండ మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అర్హత పొందిన పనులను ఎమ్మెల్యే మాధవరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పిస్తూ గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందని ఈ పథకం ద్వారా ఆయిల్ ఫామ్, పండ్ల తోటలు, పంట సాగులు, గొర్రెల గేదెల షెడ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎంతో తోడ్పడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, అడిషనల్ పీడీ రేణుక, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, డిసిసి కార్యదర్శి హరిప్రసాద్, సాయి కృష్ణ, ఆవుల శ్రీనివాస్, తిరుమల్, బండి శివకుమార్, రావుల మైపాల్ రెడ్డి, సింగం ప్రశాంత్, ఉడుగుల అశోక్, వడ్డె ఏకాంబరం, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి పనుల జాతర 2025 ఏర్పాట్లు పూర్తి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-45-2.wav?_=5

పనుల జాతర – 2025 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం ఐడిఓసి కార్యాలయం నుండి ఆగస్టు 22వ తేదీన నిర్వహించనున్న పనుల జాతర 2025 కార్యక్రమంపై
ఎంపిడిఓలు, ఎంపీఓలు, డిపిఓ, పీఆర్ ఇంజినీర్లు, ఏపీఓలతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల జాతర ద్వారా గ్రామాల్లో జరుగుతున్న పథకాల అమలును ప్రజలకు తెలియజేసి, వారి అభిప్రాయాలను సేకరించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
అలాగే ప్రతి మండలంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆగస్టు 22న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో 3.93 కోట్ల వ్యయంతో 1075 పనులు చేపట్టనున్నామని మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ లు, ఎంపీఓలు భాగస్వాములు కావాలని తెలిపారు. పనుల జాతర 2025 లో భాగంగా ఆగష్టు 22న పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత సంవత్సరం చేపట్టి పూర్తి అయిన పనులను ప్రారంభం, కొత్తగా చేపట్టిన పనులకు భూమి పూజ చేసి మొదలు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి గత సంవత్సరం చేపట్టి పూర్తి అయిన పనులను ప్రారంభించడం, నూతనంగా గుర్తించిన పనులకు భూమి పూజ నిర్వహించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం క్రింద పశువుల పాకలు, అజోల్ల, చెక్ డామ్స్, కంపోస్ట్ పిట్స్, పౌల్ట్రీ షెడ్స్, స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఆగస్టు 22న కనీసం ఒక పనికి భూమి పూజ చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని రోజులు చేసిన దివ్యాంగుల కుటుంబాలను గుర్తించి వారిని సన్మానించాలన్నారు. గ్రామంలో నిబద్ధతతో పనిచేసిన మల్టీపర్పస్, పారిశుద్య కార్మికులను గుర్తించి సమావేశంలో వారిని సన్మానించాలని తెలిపారు. అలాగే గ్రామంలో స్వచ్ఛందంగా చెట్లు పెంపకంలో పాల్గొని ఇతరుల భాగస్వామ్యతో పచ్చదనాన్ని పెంపొందించడానికి తోడ్పాటు అందించిన వ్యక్తులను, కుటుంబాలను గుర్తించాలని వారిని కూడా సన్మానించాలని సూచించారు. నీటి సంరక్షణ భూగర్భ జలాలు పెంచే పనులను చేపట్టిన లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా సన్మానం చేయాలన్నారు. ఫలవనాలు – వనమహోత్సవం కింద ఈత మొక్కలు, తాడిచెట్లు పండ్ల తోటలు పెంపకం లాంటి పనులను చేపట్టాలన్నారు. గుర్తించిన పనులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డిఓ బాల కృష్ణ, డిపిఓ శ్రీలత, పీఆర్ ఈ ఈ వేముకటేశ్వర్లు, అన్ని మండలాల ఎంపిడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పీఆర్ ఏ ఈలు తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యువజన కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యూత్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో. రోగులను ప్రజలను అన్నదాన ప్యాకెట్లు పంచే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు,

ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..

ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..

కేసముద్రం/ నేటి ధాత్రి

 

దేశ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అనుసరించిన బాటలో పయనించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు

నవ భారత నిర్మాత మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం కేసముద్రం మండల కేంద్రంలో గాంధీ సెంటర్ నందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి పిసిసి మెంబర్ దశ్రు నాయక్

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పన, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారని అన్నారు. అలాగే గ్రామపంచాయతీలకు నేరుగా కేంద్రం నుండి నిధులను పంపిణీ చేసి గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ యువతకు ఐకాన్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముందున్న కర్తవ్యం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, నాయకులు దామరకొండ ప్రవీణ్,వేముల శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ వెంకన్న,గ్రామ పార్టీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి,భెలియ, భూలోక్ రెడ్డి,పోకల శ్రీనివాస్, తరాల సుధాకర్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్, ఎండీ రషీద్ ఖాన్, ఎండీ నవాజ్ అహ్మద్, మాజీ ఉప సర్పంచ్ రఫీ, మాజీ వార్డు మెంబర్ బాలు నాయక్,సాంబయ్య,అల్లం నిరంజన్,కనుకుల రాంబాబు,నయీం,తోట అఖిల్, ముజ్జు షేక్,కాట్రేవుల హరికృష్ణ, ఎండీ సమీర్, ఎండీ అలీమ్, కొల్లూరి శ్రీనివాస్,వెలిశాల కమల్,బాల్మోహన్, బాధ్య నాయక్,సుందర్ వెంకన్న,శ్రీను,కళాధర్,సముద్రాలమహేష్, బోడా విక్కి,కాట్రేవుల సతీష్,రాజేష్,పరకాల కుమార్, ఆగే చిన్న వెంకన్న,నూరోద్దీన్,విజేందర్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version