మల్కాజిగిరిలో వృద్ధురాలి అంతక్రియలకు సంఘం సహాయం

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం..

పేద వృద్ధురాలి అంతక్రియలకు చేయూతనిచ్చిన
మానవసేవే మాధవసేవ గ్రూప్ సభ్యులు

మల్కాజిగిరి నేటిధాత్రి

 

మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాలగూడలో నివసిస్తున్న 70 సంవత్సరాల వృద్ధురాలు యాదమ్మ అనారోగ్యంతో శుక్రవారం పరమపదించారు. ఆమెకు ఎవరు  లేకపోవడంతో అంతక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయం మీర్జాలగూడ కాలనీకి చెందిన బిక్షపతి మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కుమ్మరి రాజు వృద్ధురాలి పరిస్థితిని గ్రూప్‌లో తెలియజేశారు. మానవతా దృక్పథంతో స్పందించిన గ్రూప్ సభ్యులు తమ వంతు సహకారం అందించారు.
మొత్తం 19 మంది గ్రూప్ సభ్యుల సహకారంతో రూ.10,305/-లు సేకరించి, యాదమ్మ అంతక్రియల ఖర్చుల నిమిత్తం కాలనీ వాసుడు బిక్షపతికి గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు అందజేశారు.
సకాలంలో స్పందించి, పేద వృద్ధురాలి అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కాలనీ వాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మార్కెట్ కమిటీ చైర్మన్ బాధిత కుటుంబానికి భరోసా

బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రానికి చెందిన ఉత్తెం అశోక్ ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటి సామాగ్రితో పూర్తిగా దగ్ధమైన విషయం తెలుసుకున్న గోపాల్‌రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి సందర్శించి పర్యవేక్షించారు. ఇంటి సామాగ్రిని పూర్తిగా పరిశీలించిన అనంతరం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అభయం ఇచ్చారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో ఫోన్‌లో విషయం తెలియజేసి ఆయనతో బాధితులను మాట్లాడించారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే త్వరలోనే స్వయంగా ఇంటిని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రామడుగు తహసిల్దార్ రాజేశ్వరిని ఫోన్‌లో సంప్రదించగా వారు వెంటనే స్పందించి రెవెన్యూ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు పంపించారు. అనంతరం మేడిపల్లి రూపాదేవి ఫౌండేషన్ ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తిరుపతి అశోక్ కుటుంబానికి తక్షణ సహాయం కింద ఐదువేల నగదు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారం అందేలా స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు సామంతుల సుజాత తిరుపతి, మామిడి కుమార్, కారుపాకల నరేష్, నాయకులు వడ్లూరి రాజేందర్, జిట్టవేణి రాజు, పంజాల శ్రీనివాస్ గౌడ్, పెసరు లచ్చయ్య, ఉత్తెం కుమార్, బాసవేని శ్రవణ్, గుర్రం శ్రీనివాస్, ఉత్తెం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

మర్రిపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని మర్రిపల్లి గ్రామంలో కుడుతాల రాజు,రంపీస రాజేశ్వర్ రావులకు గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుంట రాజుకుమార్ తో కలిసి
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పొన్నాల ప్రతాప రెడ్డి,వార్డ్ మెంబర్ గాజు శివాజీ,నాయకులు ఇట్టబోయిన ఐలయ్య,గాజు చిన్న రాజయ్య,భాషబోయిన సంజీవ,పొన్నాల రాజు,గాజు రాజు,వంగ రాజేష్,సోనబోయిన కొమురయ్య,అల్లాపురం ప్రదీప్,నర్సంపేట బ్లాక్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్: నిరుపేదలకు కొత్తగూడ సర్పంచ్ ఆశా కిరణం

* సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

* కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ
*
కొత్తగూడ నేటిధాత్రి :

పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఒక వరం అని కొత్తగూడ సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ అన్నారు.గురువారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీనగర్ గ్రామానికి చెందిన మహ్మద్ యాకుబ్ కు 18500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బోడ ఈర్య, టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,ఈర్య నాయక్, అఫ్జల్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు యాదగిరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని. అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకుపేదవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే.పరిస్థితి లేకపోవడంతో ప్రజలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకునే వీలును తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కల్పించాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయాన్ని ఇది చెక్కుల పంపిణీ ఎక్కువ అందించామని. ప్రజల అభివృద్ధి ప్రజా పరిపాలన లక్ష్యం అని ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఏ ఆటంకం వచ్చిన ప్రభుత్వం ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని అలాగే ప్రభుత్వ ప్రజల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా మారిందని తెలియజేస్తూ. సారంపల్లి గ్రామంలో పలువురి లబ్ధిదారులకు.2.32.500. రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు. ఇoదుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి.0 ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్. ఉప సర్పంచ్ వంశీ. వార్డు మెంబర్లు. ఖాదర్ గడ్డమీద శ్రీనివాస్. హనీఫ్. జింక ఆనందం. కుమారస్వామి. అభిషేక్. అంజయ్య. కిషన్. వినీష్. సంతోష్. కరుణాకర్. శ్రీనివాస్. నాయకుడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

బాధిత కుటుంబనికి భరోసాగా నూతన సర్పంచ్…

బాధిత కుటుంబనికి భరోసాగా నూతన సర్పంచ్

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని బూరుగ్గుoపుకు చెందిన మల్లెల లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ, వార్డు సభ్యులతో కలిసి మృతుని ఇంటికి చేరుకున్నారు. లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
​కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి దశదిన కర్మల నిర్వహణ కోసం తన వంతు సాయంగా 50 కిలోల బియ్యం ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని సర్పంచ్ భాగ్యమ్మ, వార్డు సభ్యులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత…

మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన బొమ్మ బాబు మాతృమూర్తి బొమ్మ విజయ(63) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.తన మిత్రుడి తల్లి దశ దినకర్మ కి హాజరైన 2005 – 06 ఎస్ ఎస్ సి పూర్వ విద్యార్థులందరూ తోటి స్నేహితుడు బాబుకి రూ.20500 లు..ఆర్థిక సహాయం అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో మిత్రులందరు పాల్గొనడం జరిగింది.

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేత శ్రీరాం రాజేష్…

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేత శ్రీరాం రాజేష్

నేటిధాత్రి వరంగల్

 

ఖిలా వరంగల్ చిల్డ్రన్స్ పార్క్‌లో ఇటీవల గుర్రం దాడిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు శ్రీరాం రాజేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆయన, స్థానిక మంత్రి కొండా సురేఖ ద్వారా మరింత సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ మురళీధర్ రావును బాధిత కుటుంబ సభ్యులతో శ్రీరాం రాజేష్ కలిపించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బాధిత కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. కొండా దంపతులు ఎల్లవేళలా మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, అలాగే బాధిత కుటుంబానికి నివాసంగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు శ్రీరాం రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐని పిలిపించి, గుర్రం యజమానులను గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పగడాల సతీష్, బత్తుల నవీన్ కుమార్, అక్షిత్ పటేల్, ప్రియదర్శిని, శ్రీలత, లతతో పాటు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T151547.325.wav?_=1

పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

 

కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ఈ పథకం ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. అయితే, కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. రైతుల పేర్లను పథకం నుంచి తొలగించటంపై క్లారిటీ ఇచ్చింది. ఆ పోస్టులో.. ‘చాలా మంది రైతులు రూల్స్ ప్రకారం పథకానికి అప్లై చేయలేదు. అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేస్తున్నారు. కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు వేరు వేరుగా పథకానికి అప్లై చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదు. బెనిఫిషియరీ లిస్ట్ నుంచి పేర్లు తొలగించబడ్డ రైతులకు ఫిజికల్‌ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో వాళ్లు అర్హులని తేలితే పేర్లు మళ్లీ లిస్ట్‌లో యాడ్ అవుతాయి. అనర్హులని తేలితే పథకం వర్తించదు‘ అని స్పష్టం చేసింది.

మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం…

మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

భూపాలపల్లి నేటిధాత్రి

 

గోరుకొత్తపల్లి మండలం చేన్నాపూర్ గ్రామం గ్రామానికి చెందిన ఏరుబటి మల్లాజి ఇటీవల మృతి చెందాడు విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరైనారు అనంతరం స్నేహితులు అందరూ కలిసి లక్ష రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో వారి కూతురు పేరుమీద ఫిక్సింగ్ డిపాజిట్ చేసి పిక్స్ డిపాడ్ చేసిన బాండును వారి కుటుంబ సభ్యులకు అందించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు స్నేహితుల అందరికీ కృతజ్ఞతలు తెలిపినారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు గ్రామస్తులు పెద్దలు అందరూ పాల్గొన్నారు

.స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం…

.స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2000- 2001 పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ తోటి స్నేహితుడు కరీం పాషా తండ్రి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా మిత్రులందరు కలసి పదివేల ఆర్థిక సాయంను అందించారు. వారు మాట్లాడుతూ తమ మిత్రుల కుటుంబాల్లో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగిన తమ వంతు సహాయం అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిత్రులు కొమ్ముల భాస్కర్, శ్రావణ్, రమేష్ , చందర్ , దేవేందర్ , రమేష్ , కిషన్ తదితరులు  పాల్గొన్నారు.

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T181124.663.wav?_=2

 

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం

‘నేటిధాత్రి”,హనుమకొండ.

 

తేదీ: 21/ 10 /2025 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాలసముద్రంలో గల చక్రవర్తి హాస్పిటల్లో తోటి కళాకారిణి పట్టపురి అనిత గారి అమ్మ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుంది, ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సినిమా మరియు టీవీ కళాకారుల సంఘం అధ్యక్షుడు “సదా.రుద్రారపు” వెంటనే స్పందించి తన తోటి కళాకారుల సహాయ సహకారంతో చక్రవర్తి హాస్పిటల్ సందర్శించి తమ వంతు సహాయంగా 5000 రూపాయలను ఇచ్చి పరామర్శించారు,ఇక నుండి కళాకారుల విషయంలో ఈ సంఘం ముందుంటుందని కళాకారులందరూ అభిప్రాయంవ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా యాక్టింగ్ మరియు టీవీ కళాకారుల అసోసియేషన్ మెంబర్స్, అనిల్ కుమార్ సుద్దాల, పాల కుమారస్వామి,ఎరుగొండ లావణ్యగౌడ్,ఎలుకపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆన్ మ్యాన్డ్ అంజి కుటుంబానికి అండగా విద్యుత్ సిబ్బంది…

ఆన్ మ్యాన్డ్ అంజి కుటుంబానికి అండగా విద్యుత్ సిబ్బంది

-ఆర్థిక సహాయం అందజేసి ఉదారతను చాటుకున్న విద్యుత్ ఉద్యోగులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి విద్యుత్ సెక్షన్ లో ఆన్ మ్యాన్డ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న జన్నే అనిల్ (అంజి) గత మూడు నెలల క్రితం విద్యుత్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగులగా..ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ..తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాలాడుతూ గత 11 రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది శుక్రవారం మృతుడు అంజి కుటుంబాన్ని పరామర్శించి, రూ. 27,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ 327 జిల్లా నాయకులు జక్కు రాజేందర్ గౌడ్, పి ఆర్ వి కె ఎస్ జిల్లా నాయకులు గూగులోతు శ్రీనివాస్ నాయక్, ఫోర్ మెన్ యాదగిరి, లైన్ మెన్ లు, మచ్చ సత్యం, శ్రీనివాస్, అనిల్, మోత్కూరి రాములు, ఆర్టీజన్ కార్మికులు, ఆన్ మ్యాన్డ్ కార్మికులు, స్పాట్ బిల్డర్స్ పాల్గొన్నారు.

మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు సహాయం…

మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు సహాయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గురువారం, ఇటీవల మరణించిన నలుగురు పిఆర్టియు ఉపాధ్యాయుల కుటుంబాలకు సంక్షేమ సంస్థ తరపున జిల్లా అధ్యక్షుడు మణయ్య లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దిగ్వాల్- విజయలక్ష్మి, చింతల్ చెరు- నీరజ, చాప్ట(కే ) – శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్- సుజాత కుటుంబ సభ్యులకు ఈ సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

గంగాధరలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ తో భరోసా

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ప్రమాదాల్లో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసానిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలబై ఆరు లక్షల అరవై మూడు వేల రూ.ల ఆర్థిక సహాయం మంజూర అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తోట కరుణాకర్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, శ్రీనివాస్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మేమంతా ఉన్నాం మా స్నేహానికి అండగా…

మేమంతా ఉన్నాం మా స్నేహానికి అండగా

నడికూడ,నేటిధాత్రి:

 

స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు.తోటి మిత్రుడికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చుక్క సతీష్ తండ్రి సల్మాన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని 1996-1997 సెవెంత్ పౌండేషన్ బ్యాచ్ మిత్రులు తమవంతు సాయంగా అతనికి రూ.10 వేలు అందజేశారు.భవిష్యత్ లోనూ తోటి స్నేహితుల ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.సతీష్ స్నేహితులను మండల పరిధిలోని గ్రామాల ప్రజలు కౌకొండ గ్రామస్తులు అభినందించారు.సహాయం అందజేసిన వారిలో ముక్కెర రాజు,ముక్కెర చిరంజీవి, ఎండి సాధిక్ పాషా,మేకల సతీష్,పేర్వాల బాలకృష్ణ, మేకల రాజేందర్,బొల్లె ఓంకార్,పసుల నర్సింగం, ఎండి గిడ్డు,జన్నారపు వేణు, మేకల కుమారస్వామి,మేకల ఓంకార్,జన్నారపు చంద్రమౌళి,సుమలత, శారద,జ్యోతి,తదితరులు ఉన్నారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T132740.736.wav?_=3

 

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రానికి చెందిన విభూతి జ్యోతి (40) గత రెండు రోజుల క్రితం మనస్థాపంతో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబమైన వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పంజా మహేందర్ ఆయన సన్నిహితుల ద్వారా మృతు రాలి కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నసీరుద్దీన్,సామల మహేష్, పెద్ద పైడి రాజిరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీటీసీ కుటుంబానికి ఆర్ధిక సహాయం…

మాజీ ఎంపీటీసీ కుటుంబానికి ఆర్ధిక సహాయం

రూ.50 వేలు ఆపన్నహస్తం అందించిన మాజీ జెడ్పీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఇటీవల గుండెపోటుతో మరణించి దుగ్గొండి మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయి కుమార్ దశ దినకర్మ సోమవారం దేశాయిపల్లి గ్రామంలో జరగగా వారి కుటుంబాన్ని పరామర్శించిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ యాభై వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో కలిసి ఉండే వ్యక్తి ఆకస్మాతుగా మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయిన సాయి కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మాజీ ఎంపీటీసీ గా చేసిన సేవలను గుర్తుంచుకొని మానవతా దృక్పధంతో పార్టీలకు అతీతంగా శంబయ్యపల్లి గ్రామస్తులు స్వచ్చందంగా ముప్పై ఒకవెయ్యి ఆరువందల రూపాయలను సేకరించి సాయి కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరితో పాటుగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు వంగేటి అశోక్ కుమార్, పెండ్యాల రాజు ఇరువురు కలసి ముప్పై ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు.

మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఊర నవీన్

మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఊర నవీన్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల బీజేపీ అధ్యక్షులు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మరణించినటువంటి కుటుంబాలు కొండాపూర్ గ్రామం లో మామిడి మల్లయ్య నగరంపల్లి గ్రామంలో మేకల శైలేందర్ పెద్ది సునీత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేస్తూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్ ఎఫ్ బి స్కీమ్ కు అప్లికేషన్ పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం పొందాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు డాకూరి కృష్ణారెడ్డి బూత్ అధ్యక్షులు భూక్య హరిలాల్ మండల సీనియర్ నాయకులు గొర్రె రవి మామిడాల మల్లన్న ఇనుగాల మొగిలి తదితరులు పాల్గొన్నారు

మరోసారి గొప్ప మనసు సాటుకున్న మహా రాజ్…

మరోసారి గొప్ప మనసు సాటుకున్న మహా రాజ్…

మృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐ రాజ్ కుమార్…

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు, మృతుని కుటుంబ సభ్యులకు ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో.. ఈ విషయం తెలుసుకున్న ఇంతకుముందు ఈ బయ్యారం మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి ఎస్ఐ రాజ్ కుమార్, వారి కుటుంబానికి 5000/. నగదు ఆర్థిక సహాయం చేశారు.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజకుమార్ మంచి మనసుతో.. అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదవాళ్ళకి, కష్టాలతో సతమతమవుతున్న వారికి యువతకి వాలీబాల్ క్రికెట్ క్విట్స్ ఇచ్చి యువతను సన్మార్గంలో నడిపిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ తనవంతు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్న, గొప్ప మనసున్న.. ఎస్ఐ రాజ్ కుమార్, కి మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ యువత పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాటి గూడెం గ్రామ పెద్దమనుషుల యువత సమక్షంలో అందజేయడం జరిగింది…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version