మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ గారు… పర్వతగిరి (నేటిధాత్రి)
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పర్వతగిరి మండల యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్ గారి నానమ్మ గొడుగు లచ్చమ్మ నిన్న అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ అనంతరం కల్లెడ గ్రామానికి చెందిన మద్దెల శ్రీనివాస్, బాల్లె వెంకటయ్య ఇటివల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసాలకు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అదే విధంగా నిన్న కల్లెడ గ్రామంలో కురిసిన అకాల వర్షంతో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలో శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే స్పష్టంగా తెలిపారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
శ్రీరామసాగర్ రెండోదశ ప్రాజెక్టుకు బి.ఎన్ పేరు పెట్టాలి
ఎం సిపిఐ (యు) పార్టీ నేతల డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి:
శ్రీరామ్ సాగర్ రెండవ దశ ప్రాజెక్టుకు నల్లగొండ జిల్లా మాజీ ఎంపీ , తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.ఈ క్రమంలో నర్సంపేట ఆర్డిఓ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎన్ రెడ్డి తన జీవితమంతా ప్రజల కోసమే త్యాగం చేశారని నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టు సాధన కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు.అలాంటి వారి త్యాగాన్ని గుర్తించకుండా ఆ ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించటం సరికాదన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం త్యాగంచేసిన బిఎన్ పేరు నామకరణం చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండేలా , ముఖ్యమంత్రి పునః పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల ప్రజలను సమీకరించి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు భైరబోయిన నర్సయ్య,గనిపాక బిందు,కళ్లెపెల్లి రాకేష్ పాల్గొన్నారు.
పదేండ్లు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులో ముంచింది మీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాదా…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో. పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాలు ప్రజలను దోచుకున్నోళ్ళు దోకా. కార్డు రిలీజ్ చేయడం విడ్డూరంగా ఉందని. సిరిసిల్ల వేదికగా చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా అవినీతికి ఆద్యం పోసింది కేటీఆర్ కాదా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తుంటే కళ్ళు మండుతున్నాయి . గత మీ పాలన లో.చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని రానున్న స్థానిక ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చి కొడుతారని.తప్పుడు ప్రచారానికి తెర లేపుతున్నారని. గత పది సంవత్సరాలు. అమలుకునోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా. ప్రజలను అరిగోశపెట్టి ఇబ్బందులకు గురిచేసింది మీరు కాదా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తుంటే గులాబీ నేతల కళ్ళు మండుతున్నాయని హామీ ఇచ్చిన ప్రకారం ఆరోగ్యారంటీలలో నాలుగు హామీలను అమలు చేసిన o. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమం ఆపడం లేదు అని. సిరిసిల్ల వేములవాడ గులాబీ నాయకులు ఇంత దోపిడీ చేసింది ఏం చేసింది అందరికీ తెలుసు అని బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బి ఆర్ఎస్ నేతల . కండ్లు మండుతున్నాయని మీ ప్రభుత్వ హయాంలో మీరు బీసీలకు ఏం చేశారో చెప్పాలి. ఫామ్ హౌస్ లో.పడుకోవడానికి తప్ప పరిపాలన చేతగాని మీరా మమ్మల్ని విమర్శించేది గుట్టలకు గుట్టలకు రైతుబంధు ఇచ్చి ప్రజాధనం కోట్లు కొల్లగొట్టారని మూడు వేల కోట్ల విలువైన ఇసుకను సిరిసిల్ల నుండి తరలించి మీ నాయకులు కోట్లు సంపాదించిన మీరు ధోక కార్డు రిలీజ్ చేయడం సిగ్గుచేటని కార్డు పట్టుకొని రండి చర్చకు సిద్ధం కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని. ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ లీడర్ల అవినీతి కార్డులు రిలీజ్ చేసి ఎన్నికలకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
#మమ్మల్ని గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటాం..
#మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చెందింది మీరే కదా..
#మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు…
#బి ఆర్ ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎంపీ
హన్మకొండ, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బి ఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి కడియం కావ్య తో కలిసి పాల్గొన్నారు.
పదేళ్ల గత బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లలను పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని,రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది.
కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. బిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది. వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసింది. టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు. పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.
ఎరువుల కొరత, విత్తనాల కొరత రైతు దైనందిన కష్టాలు బిఆర్‌ఎస్ పాలనలో పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది.
మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పి) హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది. టీఆర్‌ఎస్ 2018లో ఇచ్చిన హామీ: “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.” పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్‌లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసింది. టీఆర్‌ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది. మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బిఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి
సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ కానాలకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నది కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా ప్రజల కొరకు పనిచేసిన దాకాలు లేవు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అయిన తర్వాత హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కేయడం పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారింది చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్న పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు ఇసుక మాఫియా. ప్రకృతి సంపద దోచుకోవడం. రోజురోజుకు పెరిగిపోతాయి ప్రశ్నించే గొంతుక లేకపోవడం వలన అవినీతి రాజ్యమేలుతుంది ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి.నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి. కోడం రమణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర సిపిఎం నాయకులు,సందు పట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.
పైలెట్ కాలనీ లో గల సింగరేణి కమ్యూనిటి హాల్ లో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏరియా సివిల్( ఏజినఎం ) రవికూమర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా కమ్యూనిటి హాల్ ముందు వైపు, వెనుక వైపు ఉన్న పిచ్చి మొక్కలను చెత,చెదారాలను, అధికారులు సివిల్ సిబ్బంది తో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏజినఎం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి, ప్రతి పౌరుడిలో స్వచ్ఛ భారత్ ఆలోచన పదిలంగా ఉండాలని ఆయన కోరారు. పరిశుభ్రత ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకే పరిమితం కాకుండా, సమాజ సంక్షేమానికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు . సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి వారి పని ప్రదేశాలలో, నివాస ప్రాంతాలలో శుభ్రత పాటిస్తూ మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. స్వచ్ఛతా నినాదాన్ని ప్రతిసారీ మన జీవితాల్లో భాగం చేసుకోవాలని కోరారు. అందరి కృషితోనే పరిశుభ్రత సాధ్యమౌతుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, ఎన్విరాన్మెంట్ అధికారి పోశమల్లు, సివిల్ (ఎస్. ఇ) బాలరాజు, అశోక్ రెడ్డి,ఇతర అధికారులు,ఉద్యోగులు ,సివిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారిని మరియు భారతీయ జనతా పార్టీ నీ విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి వర్ధన్నపేట( నేటిధాత్రి):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి పేద ప్రజల అభివృద్ధి తోనే సాధ్యమవుతుందని ఆలోచించి ప్రజలకు భారమైన జీఎస్టీ పన్నును నాలుగు స్లాబులుగా ఉన్నదాన్ని తగ్గి రెండు స్లాబుల కిందికి తీసుకువచ్చి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టే విధంగా ఆటోమొబైల్ పరిశ్రమలు ఫార్మా కంపెనీల లాభాలను తగ్గించి జిఎస్టిని తగ్గించడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి జిఎస్టి తగ్గిస్తే దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం చాలా హాస్యస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. లేనిపోని మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక జనాల్లోకి పోయే ముఖం లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారిని విమర్శించడం తగదని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామన్న హామీ ఇప్పటివరకు దరిదాపుల్లో కనపడడం లేదని గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు హామీని నెరవేర్చిన దిశగా వెళ్లలేదని ఆసరా పింఛన్లు డబల్ చేసి ఇస్తామని మోసం చేసి ఓట్లు ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అప్పుడు వాళ్ళ పార్టీకి మరియు నాయకులకు కళ్ళు తెరుచుకుంటాయని అప్పటివరకు భ్రమలో కొనసాగాలని మహేందర్ రెడ్డి అన్నారు.
గణపురం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది. రాజేందర్ మాట్లాడుతూ భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గండ్ర సత్యనారాయణ రావు పై తప్పుడు ఆరోపణ చేయడం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనారాయణ రావు చేస్తున్న అభివృద్ధిని కోరవలేక సత్యనారాయణ రావు మీద తప్పుడు ఆరోపాలు చేయు వారిని ఖబర్దార్ అని హెచ్చరించాడు. తన సొంత అవసరాల కోసం పార్టీ మారి కాంగ్రెస్ కార్యకర్తలను నిలువునా ముంచిన మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కి కొంచమైనా సిగ్గుండాలని, తన భార్య పదవి కోసం పార్టీ మారిన వ్యక్తిన ఈరోజు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి, మీ సొంత అవసరాల కోసం ఇసుకను జిఎంఆర్ కన్స్ట్రక్షన్ కోసం వాడుకోలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్లలో కర్రను ఎక్స్పోర్ట్ చేసింది నిజం కాదని ప్రశ్నిస్తున్నాను, మీ ప్రభుత్వ హయాంలో తెగిన చెరువులను కట్టలను మరమ్మత్తులు చేయించి రైతులకు అండగా నిలిచిన నాయకుడు జి.ఎస్.ఆర్ మీ స్వలాభం కొరకు మైలారం గుట్టపై ఉన్న 200 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకొని ఆయిల్ ఫామ్ పెట్టాలనుకున్నది మీరు. వాటిని మా ఎమ్మెల్యే ప్రజా పాలన కొరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్క్ హబ్ గా ఏర్పాటు చేశారు మైలారం గుట్టలను కబ్జా చేసింది ఎవరు? కబ్జాల కూర నుండి విడిపించి ఎడ్యుకేషన్ అబ్బుగా మార్చారు మా ఎమ్మెల్యే విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసి గత పది సంవత్సరాలుగా మండలాలలో ఎంఈఓ లను కూడా నియమించలేదు మీ ప్రభుత్వం. గెలిచిన 20 నెలల వ్యవధిలో ఇంటర్నల్స్ రోడ్స్ ఆయకట్ట రోడ్స్. వేసిన ఘనత మా ఎమ్మెల్యే ది మా ప్రభుత్వం ది. మా ప్రభుత్వము గానీ మా ఎమ్మెల్యేని గాని దూషించే ముందు ఒకసారి మీరు చేసిన పనులను గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్ చోటే మియా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి మామిళ్ళ మల్లికార్జున గౌడ్, సీనియర్ నాయకులు బోనాల రాజమౌళి, ఉమ్మడి వెంకటేశ్వర్లు, మోతపోతుల శివ శంకర్ గౌడ్, దూడపాక దుర్గయ్య,పుప్పాల రామారావు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఓరుగంటి కృష్ణ, మాజీ వార్డ్ మెంబర్ గంధం సుధాకర్ మాజీ వార్డ్ మెంబర్ గంధం ఓధాకర్, దూడపాక శ్రీనివాస్, మహమ్మద్ సైదులు, ఎస్.కె మౌలా, తదితరులు పాల్గొన్నారు
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల లోని పర్లపల్లి గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ వారు మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణలో సీఎం సహాయ నిధి ( సిఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తుందని భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవీందర్ గౌడ్ అన్నారు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్న ఖరీదైన చికిత్సకు వెనకాడకుండా ప్రజలకు ఈ సాయాన్ని వినియోగించుకోవాలని సీఎం సహాయ నిధి రాజకీయాలకు అతీతంగా అందరూ అందుబాటులో ఉంటుందని అవసరమైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామకాంగ్రెస్ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు
#నాడు పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నం…
#ఇచ్చిన మాట ప్రకారం 80% పనులను పూర్తి చేయగలిగినం..
#4,53 వ డివిజన్ లలో 92.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
హన్మకొండ, నేటిధాత్రి:
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజున నియోజకవర్గ పరిధిలోని 4 వ డివిజన్ జ్యోతి బసు నగర్ మరియు 53 వ డివిజన్ సరస్వతి నగర్ లో రూ.92.50 లక్షలతో అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.స్థానిక నాయకులు,ప్రజలతో కలసిన కాలనీల పరిస్థితులను పరిశీలించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతు నాడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ 80% పనులను పూర్తి చేశామని తెలిపారు.శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు పూర్తి అయ్యేలా చేస్తున్నామని అన్నారు.గతంలో వర్షాకాలం వస్తే వరదలో హనుమకొండ అనే శీర్షికలు ఉండేవి అని ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక్వత్వంలో ఒకటి రెండు మినహా వరద ప్రభావిత ప్రాంతాలు లేకుండా చేసుకున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రజల సహకారం ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, జిల్లా ఆర్టిఏ మెంబర్ పల్లకొండ సతీష్,మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,ఎర్రం మహేందర్ ఆయా డివిజన్ ల అధ్యక్షులు శ్రీధర్ యాదవ్,బాబాయ్ మరియు స్థానిక నాయకులు,కార్యకర్తలు,అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణిచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీరవనిత చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు. నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు 10 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పట్టుదల, ఏకాగ్రతతో పని చేస్తే సామాన్యుడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలువచ్చని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
◆:- పి.రాములు నేత
*జహీరాబాద్ నేటి ధాత్రి:
జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు కార్మిక నాయకులు వ్యవసాయ కార్మిక నాయకులు స్వచ్ఛందంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని దిగ్విజయం చేయగలరు సమావేశంలోని ముఖ్యంశాలు ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారత దేశానికి సంబంధించిన వర్తకులు కార్మికులు మన రాష్ట్రానికి వలస వచ్చి మన యొక్క వర్తకులను మన కార్మికులను మరియు వ్యవసాయ కార్మికులను వ్యాపార రంగంలో శ్రామిక రంగంలో కృంగదీస్తున్నారు దీని మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని వర్తకులు కార్మికులు వ్యవసాయదారులు అనేక రకాలుగా నష్టపోతున్నారు ఈ విషయాల పైన ప్రత్యేకమైన చర్చా ఉంటుంది అదేవిధంగా ఇంకా కొంతమంది ఉత్తరభారతీయులు రాష్ట్రం లోపల అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఉదాహరణకు నకిలీ వస్తువుల విక్రయం కల్తీ తినుబండ రాళ్ల తయారీ చేస్తూ మోసపూరితమైన స్కీమ్ లతో వ్యాపారం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు అనేక రకాలుగా అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా వారికి నకిలీ వ్యక్తులు విక్రయించి వారి ధనాన్ని కూడా దోచుకెళుతున్నారు అనేక సందర్భాలలో రకరకాల మోసపూరిత వ్యాపారాలు నిర్వహించి తెలంగాణ సామాన్య ప్రజానీకానికి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు ఇట్టి విషయాల మీద ప్రత్యేకమైన చర్చ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం అనేక రకాల ప్రజా సంఘాలు వారికి తోచిన విధంగా తమకు తామే వాళ్లకు ప్రజా సంఘాన్ని నామకరణం చేసుకొని ముందుకెళుతున్న సంగతి తెలిసినదే అయినప్పటికిని ఏది ఏమైనా ప్రతి సంఘం యొక్క లక్ష్యం తెలంగాణ ప్రజల రక్షణ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కాబట్టి ఎవరు ఏ రకంగా ముందుకు వెళ్లిన అందరం కూడా మాసానికి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏకమై ముందుకు కదలాలని కార్యచరణలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది ఇటి సమావేశానికి అందరూ కూడా సమయపాలన పాటించి స్వచ్ఛందంగా పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము కార్యక్రమంలో జాగో తెలంగాణ ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బెడబుడగజంగం నాయకులు మాదినం శివ ప్రసాద్ ,పి.దేషరథ్ ,వడ్డెర సంఘం నాయకులు పల్లెపు శేఖర్ ,డివిజన్ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ధనరాజ్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యార్థి నాయకులు కార్తీక్ రామ్ చరణ్ బాలకృష్ణ రవి కిషోర్ విష్ణు గార్లు పాల్గొన్నారు,
అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మహమ్మద్ మాక్సుధ్ హైమద్ అన్నారు.గురువారం మండల మొగుడంపల్లి కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అనేక పథకాలు అందజేశారన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జుబేర్,ఎంపీడీవో మహేష్,ఆర్ఐ సిద్ధారెడ్డి,పంచాయతీ కార్యదర్శి మారుతి,కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ కుమార్,వెంకట్ రామ్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొయ్యాడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
అనంతరం సాయుదపోరాట యోధులకు నివాళులు అర్పించిన నాయకులు
పరకాల నేటిధాత్రి
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రక్కల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి లు రాజశేఖర్ రెడ్డికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ గుండెల్లో నిలిచిన నాయకుడు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషిచేసి ఈరోజు దేశంలోనే ఎవరూ చేయలేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన మహా గొప్ప నేత ఆరోగ్యశ్రీ కార్డుతో దేశంలోనే గొప్ప పేరుగాంచిన మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఎంపీ లోని గెలిపించుకొని దేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానాయకుడని నాటి నుంచి నేటి వరకు రాజశేఖర్ రెడ్డి గుర్తులు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు.ఆ మహానీయుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.సెప్టెంబర్ 2 తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు,పరకాల అమరవీరులకు వర్గాల అమరధామంలో వారిని స్మరిస్తూ నివాళులర్పించడం జరిగింది.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పరకాల ప్రాంతంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పట్టుకుని పరకాల ప్రాంతంలో తిరుగుతున్న వారిని నిజాం ప్రజకారులు కాల్పులు జరిపి ఎంతో మందిని చిత్రహింసల గురిచేసి మహిళలు వృద్ధులు చిన్నపిల్లలను చూడకుంట విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నటువంటి రజాకారులను ఎదిరించి పోరాడిన మహనీయులను స్మరిస్తూ తెలంగాణ కోసం పరకాల ప్రాంతానికి చెందిన అమరులు ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకొని వారికి స్మరించడం జరిగింది కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు చిన్నల గునాథ్,ఒంటేరు రామ్మూర్తి,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,పసుల రమేష్,దుబాస్ వెంకటస్వామి,పాడి ప్రతాప్ రెడ్డి,సదానందం గౌడ్,బొచ్చు బాబు,నల్లల అనిల్,ఒంటేరు శ్రావణ్ కుమార్,పాలకుర్తి శ్రీనివాస్,బొచ్చు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
గిడుగు రామ్మూర్తి అవార్డు అందుకున్న సతీష్ యాదవ్ కు సన్మానము వనపర్తి నేటిదాత్రి .
పాండిచ్చేరిలో డాక్టరేట్ విజయవాడలో గిడుగు రామ్మూర్తి అవార్డు అందు కున్న సందర్భంగా కొత్తకోట లో యాదవ సంఘం నాయకుల సన్మానం చేశారు. గత 20 సంవత్సరాలు వనపర్తి ప్రజాసమస్యలపై గతంలో పాత బస్టాండ్ రామాటాకీస్ నుండి మారెమ్మ కుంట వరకు పెండింగులో ఉన్న రోడ్డు విస్తరణ సి సి రోడ్ల నిర్మాణం మూరికి కాలువలు నిర్మాణ ము తల్లి తండ్రులులేనిచిన్న పిల్లలకు స్వ oత ఖర్చుతో అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కృషి సన్మానముచేసిన వారిలో మాజీ ఎంపీ టి సి సత్యం ముంత సత్యం యాదవ్ మాజీ ఎంపిటిసి జి రాముల యాదవ్ మాజీ కౌన్సిలర్, ఎం బాల కొండయ్య టీ మన్యం యాదవ్ పెంటన్న యాదవ్, పి శంకర్ యాదవ్, కురుమూర్తి, శివన్న కుమార్ బాలచంద్రి యాదవ్ లు సతీష్ ను అభినందించారు
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన జి సిద్ధప్ప గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన రూ.15,000/- విలువ గల చెక్కును ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో అందజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ మాజి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ షెరీ సత్యం ముదిరాజ్,గ్రామ యువ నాయకులు శశి వర్ధన్ రెడ్డి బి బసంతి తదితరులు .
అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు బిజెపి నాయకులు వర్ధన్నపేట (నేటిధాత్రి):
వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి: రిక్కుల శ్రీనివాస్ రెడ్డి
జైపూర్,నేటి ధాత్రి:
రైతుల సంక్షేమం కోసమే గల్లి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,నాయకులు రైతుల తరఫున కేంద్రంతో పోరాడుతున్నారని,బిజెపి- బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతు సమస్యలపై నోరు మెదపట్లేదనీ,చోద్యం చూస్తున్నారు అని జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను ఆదుకోలేని బీఆర్‌ఎస్ నేతలే ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పడం అవివేకం అని మండిపడ్డారు.యూరియా కేటాయింపులో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని,మాటలు కాదు,చర్యలు ముఖ్యమని,రైతులకు ఎరువులు తెప్పించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.బీజేపీ–బీఆర్‌ఎస్ చేతగానితనం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని రిక్కుల శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు చేసిందని నేతలు వివరించారు.ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంమని,బీజేపీ–బిఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధిని,ప్రజల ఆదరణను జీర్ణించుకోవడం లేదనీ,అందుకే వారు నిరాధార ఆరోపణలకు తెగబడుతున్నారనీ ఎద్దేవా చేశారు.చెన్నూర్ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిరంతరం సంక్షేమ పథకాలతో,అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీలం వెంకటేశం,ఆసంపల్లి శ్రీకాంత్,గద్దల అనిల్ కుమార్, సుమన్,షారుక్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
టిపిసిసి సభ్యులు రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడారు.
దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన నేడు తెలంగాణలో ప్రజాపాలన సాగుతుందని పేర్కొన్నారు.దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు వెళ్లడానికి కారణం నాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మాజీ వైస్ చైర్ పర్సన్ జంగం కళ, దీకొండ శ్యామ్ గౌడ్, గోపురాజం,పుల్లూరి కళ్యాణ్, కట్ల రమేష్,బత్తుల వేణు,శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, మహిళా నాయకురాళ్ళు,కార్యకర్తలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.