అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..
రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.