చెరువులు, కుంటలు నిండాయి..
• ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
• ఎస్సై రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల మారాయని బతుకమ్మ, దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై రాజేష్ సూచించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు చెరువులు కుంటలు అధికంగా నిండడంతో రాబోయే బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సమయంలో మహిళలు, చిన్నపిల్లలు చెరువుల వద్దకు గుమి గూడి వెళ్ళవద్దన్నారు. చిన్నపిల్లలు చెరువుల వద్ద ఇష్టానుసారంగా తిరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘ పెట్టాలన్నారు. ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకోవడమే కాకుండా.. సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.