ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న.

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆషాఢమాసం బోనాల సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయలలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు,నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజమ్, సినియర్ నాయకులు నామ రవికిరణ్,మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, విజిలిన్స్ మెంబెర్ రామకృష్ణ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,వెంకట్, శివ ముదిరాజ్,నరేష్ రెడ్డి,మహమ్మద్ అలీ, జఫ్ఫార్, సందీప్, తదితరులు.

ఆశాఢ మాస బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్న.

ఆశాఢ మాస బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,

◆:- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారు,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్విర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని గడి విధి లో జరిగిన ఆశాఢ మాస ఊరడమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్ తన్విర్ గార్లతో కలిసి దర్శించుకున్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,మహిపాల్ రెడ్డి,అక్తర్ గోరి,రంగా అరుణ్,కాశీనాథ్,ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి,అక్బర్,జావిద్,హఫీజ్,జుబేర్,రాజు నాయక్,మల్లికార్జున్,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్,జగదీశ్వర్ రెడ్డి,నథానెయల్,అక్షయ్ జాడే,విష్ణువర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,పాండు యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు

ఆషాడమాసంలో గోరింటాకు పండగ

ఆషాడమాసంలో గోరింటాకు పండగ

గోరింటాకు పండగను జరుపుకుంటున్న మహిళలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో
శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆషాడ శుక్ల త్రయోదశి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ ఆషాడ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా భావించి మహిళలు అందరూ కలిసి రామాలయం ఆవరణంలో గోరింటాకు పండగను జరుపుకున్నారు.
గోరింటాకు ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి

 

 

పూర్వము పార్వతీదేవి ఒకరోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటుండగా గోరింటాకు చెట్టు పార్వతి దేవిని ఈ విధముగా కోరింది ప్రజలందరూ గోరింటాకు చెట్టును గుర్తించాలి అని కోరింది అందుకు పార్వతీదేవి ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల మహిళలకు సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని పొందవచ్చు అని పార్వతి దేవి చెప్పింది.
అందువల్ల మహిళల ందరూ ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఒక సాంప్రదాయంగా భావించి జరుపుకుంటారు
మహిళలు మాట్లాడుతూ. గోరింటాకు పండగను ప్రతి సంవత్సరం రామాలయంలో వైభవంగా జరుపుకుంటాము.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరానికి చలవ చేస్తాయి ఒత్తిడిని తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యంగా భావిస్తారు వివాహమైన స్త్రీలకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అని భావిస్తాము అందుకొరకు ప్రతి ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటాము.
ప్రతి ఆషాడ మాసంలో మహిళలు గోరింటా కు పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

ఆషాడ మాసం కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా.

ఆషాడ మాసం కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా…

ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Ashada Masam: ఆషాడ మాసం ప్రాధాన్యత గురించి మన పూర్వికులు ఎన్నో సంప్రదాయాలు, నమ్మకాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మానసిక విశ్రాంతి కోసం

హిందూ ధర్మం ప్రకారం, కొత్త కోడలు ఈ మాసంలో అత్త ముఖం చూడకూడదు. ఈ నిబంధన వెనుక ఉన్న భావం ఏమిటంటే, కొత్తగా పెళ్లైన వధువులకి అత్తింట్లో కొంత ఒత్తిడి, ఆందోళనగా ఉంటుంది. కాబట్టి, వారికి మానసిక విశ్రాంతి కల్పించేందుకు, స్వేచ్ఛగా కొన్ని రోజులు గడిపేందుకు, అత్తింటి నుంచి తాత్కాలికంగా విరామం ఇవ్వడం కోసం ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఏర్పడింది.

పూర్వం ఆషాడ మాసం అనేది వ్యవసాయ పనులకు చాలా కీలకమైన కాలం. అప్పట్లో పురుషులు పొలం పనుల్లో నిమగ్నమవుతూ ఇంటి విషయాలకు తక్కువ సమయం కేటాయించేవారు. అయితే, భార్య, భర్త కలసి ఉంటే ఆ వ్యక్తికి పనులపై దృష్టి తగ్గవచ్చని భావించి, తాత్కాలికంగా ఆషాడ మాసంలో భార్యను పుట్టింటికి పంపించే ఆచారం మొదలైంది.

ఆరోగ్య సమస్యలు

అలాగే, ఆషాడ మాసంలో గర్భం దాల్చినట్లయితే ప్రసవం వేసవికాలంలో జరుగుతుంది. వేసవిలో తల్లీ బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భావించి, ఈ మాసంలో దంపతులను వేరు వేరు ఉంచే సంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు. ఆధునిక సమాజంలో ఈ నిబంధనలు, ఆచారాలు తక్కువగా పాటిస్తున్నారు. అయితే, దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం వల్ల మన పూర్వికుల దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version