ఝరాసంగం : ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు నిలయమైన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బుధవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా మృత్యుంజయ లక్ష జప యజ్ఞానికి హాజరయ్యారు. వారికి ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలకు అభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని మంగళ హారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఫిలాటెలి డే సందర్భంగా తపాలా కార్యాలయం సందర్శించిన షైన్ స్కూల్ విద్యార్థులు
నేటిధాత్రి, వరంగల్:
Vaibhavalaxmi Shopping Mall
ఫిలాటెలి డే సందర్భంగా హనుమకొండ రాంనగర్‌లోని షైన్ ఉన్నత పాఠశాల ఎలైట్ క్యాంపస్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోస్టల్ స్టాంపులను తిలకించి, తపాలా కార్యాలయంలో అందిస్తున్న సేవల గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ మూల రమాదేవి, పోస్ట్ మాస్టర్ పవన్ కుమార్, పోస్టల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు కవిత, రమ, ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం
సోతుకు ప్రవీణ్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడి నీ నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్లకాడ్ల తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలని , జస్టిస్ గవాయ్ పై ఆర్ ఎస్ ఎస్ ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని ఇది ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ అన్నారు.ఈ దాడిని కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ దాడులు కేవలం జస్టిస్ గవాయ్ పైన మాత్రమే కాదు భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపైన దాడి గా చూడాలని అన్నారు.జస్టిస్ గవాయ్ ఎల్లప్పుడూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తీర్పులు ఇచ్చారనీ, అది గిట్టని మతోన్మాద శక్తులు లాయర్ రాకేష్ కిషోర్ రూపంలో దాడులు చేపిస్తున్నారని తెలిపారు. బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద అరాచకాలను ఆపాలని లాయర్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్ధన్, పొనగంటి లావణ్య, పల్లెల రజిత, పెద్దమామల సంధ్య, ఇటికల శ్రీలత, పోతుగంటి స్వప్న, వాసం రజిత, సుభద్ర రాజమణి తదితరులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
#వచ్చామా పోయామా అనే రీతిలో వ్యవహరిస్తున్న వైద్య అధికారులు.
#సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందిన సిబ్బంది ఎక్కడ..?
నల్లబెల్లి, నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
గత నెల రోజులుగా భారీ వర్షాలు పడడంతో గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. అసలే వర్షాకాలం దోమకాటుతోని విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతు ప్రభుత్వ దావఖానకు వెళితే సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రి ని ఆశ్రయించే పరిస్థితి నెలకొందని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.
#వైద్యాధికారాలు ఎక్కడ..?
పేద ప్రజలు అంటే ఇంత చిన్న చూప. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తూ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ. సమయానికి దావకానకు రాకుండా ప్రైవేటు ఆసుపత్రికి సమయానికి కేటాయిస్తూ పేద ప్రజలకు అందవలసిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు రోగులు వాపోయారు.
#స్పందించని వైద్యాధికారులు.
సీజనల్ వ్యాధులపై నేటి ధాత్రి మండలంలోని వైద్యాధికారులకు చరవాణి ద్వారా సంప్రదించగా ఎలాంటి స్పందన లేదు.
#రోగుల బాధలు పట్టించుకోరా.?
వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంది రోగులు మంచాన పడ్డ కూడా కనీసం ఏఎన్ఎం లో తోపాటు ఆశ వర్కర్లు ఇంటిట తిరిగి సర్వే చేయకపోవడం చాలా బాధాకరం ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని.. సామాజిక వేత్త ప్రణీత్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్స్ ను పంపించేసిన బీఆర్ఎస్ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్స్ ని ఖాసీంపల్లి 12 13 వ వార్డ్లొ ఇంటిఇంటికి పంచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన 6 గ్యారంటీ లు 420 హామీలు అమలు చేయాలనీ పిఏసిఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్ డిమాండ్ చేసారు. మునిసిపల్ పరిధిలోని 12 13 వ. వార్డుల్లో కాంగ్రెస్ బాకీ కార్డ్స్ పంపిణి సందర్బంగా సంపత్ యాదవ్ మాట్లాడుతూ ఎలక్షన్ హామీలొ భాగంగా అధకారం లోకి వచ్చింన 100 రోజుల్లో ఏక కాలం లొ ప్రతి రైతు కి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి 41 వేల కోట్లలొ కేవలం 13 వేల రుణమాఫీ మాత్రమే చేసారని, రైతు బంధు క్రింద ఎకరాకి 15 వేల రూపాయలు ఇస్తామని గడిచిన 22 నెలల్లో ఒకసారి రైతు భరోసా నిధులు ఎగొట్టి అరకొర గా వేయడం జరిగింది అని అన్నారు. అంతే కాక కల్యాణ లక్ష్మి క్రింద లక్ష రూపాయల తో పాటు తులం బంగారo ఇస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు. మహిళలకు 2500 రూపాయలు, ఆదపిల్లల కు స్కూటి తో పాటు వృద్ధుల,వితంతు పెన్షన్లు 2 వేల రూపాయల నుండి 4 వేలు పెంచుతామని చెప్పి ఇప్పటికి కూడా కెసిఆర్ ఇచ్చిన 2 వేల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వడ్ల కు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పడమే కాకుండా కనీసం యూరియా కూడా సప్లై చెయ్యలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేసారు, అనేక హామీలు ఇచ్చి తెలంగాణా లొని అన్నీ వర్గాల ప్రజలని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వనికి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లొ ప్రజలు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలొ బీ ఆర్ ఎస్ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్, సెగ్గం సిద్దు, 13 వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ మంగళపల్లి తిరుపతి, మాజీ చైర్మన్ బండారి రవి, 12 వ వార్డ్ అధ్యక్షులు మేనం రాజేందర్, నాయకులు పోలేవేనా అశోక్, మామిడి కుమార్, బొంతల సతీష్, నలిగేటి సతీష్, ప్రతాప్ రెడ్డి, ఈశ్వర్, అర్బన్ నాయకులు బీబీ చారి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవకాశం ఇవ్వాలి 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సైనికుడిలా పనిచేశాను పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నాం కష్టాలు పెట్టినా కండువా మార్చలేదు, పార్టీ జెండా వీడలేదు ఆర్ధికం కాదు అభివృద్ధియే ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ సీనియర్ నేత మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గ్యాదరి భాస్కర్
నేటిధాత్రి ఐనవోలు :-
Vaibhavalaxmi Shopping Mall
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గ్యాదరి భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కష్ట కాలంలో సైతం కండువా మార్చకుండా పార్టీ గెలుపు కోసమే నిరంతరం కృషి చేసిన నిస్వార్థపూరితమైన నేతలకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. 2001లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ కాంగ్రెస్ పార్టీలో మమేకమై పనిచేస్తూ, 2006లో ఉడత గూడెం గ్రామ వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా గెలవడం జరిగింది.
పార్టీ అధికారంలో లేకపోయినా మొక్కవోని దీక్షతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యునిగా గ్రామానికి సేవలు అందించడం జరిగింది. 2014 సంవత్సరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గ్రామస్తులు అంత ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
2018లో రెండవసారి ఏకగ్రీవంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను చేసిన సేవను గుర్తించి ఎన్నుకోవడం జరిగిందన్నారు.2018లో జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రామ్ నగర్ ఎంపిటిసి గా నామినేషన్ వేస్తే మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇతరులకు మద్దతుగా నిలబడి గెలిపించడం జరిగింది.
2020 సంవత్సరంలో అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.శ్రీనివాస్ నేను చేసిన సేవలను గుర్తించి కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు పర్యాయాలుగా కిసాన్ సెల్ మండల అధ్యక్షులుగా ఇప్పటికీ కొనసాగుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు కేటాయింపులో భాగంగా అయినవోలు జడ్పిటిసి స్థానం ఎస్సీ జనరల్ కు కేటాయించడం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ లో భాగంగా 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ కులస్తుడైన నాకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు జడ్పిటిసి గా అవకాశం కల్పించాలని కోరినట్లు భాస్కర్ తెలిపారు.
ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కర్షక కార్మిక చేతివృత్తిదారులు సబ్బండ వర్గాల ఆశీస్సులతో నన్ను జెడ్పిటిసిగా గెలిపించాల్సిందిగా భాస్కర్ కోరారు.
కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు అనుబంధం గ్రామమైన వెంకన్నగూడ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
Husband strangles wife to death…
ఇతనికి ఇద్దరు భార్యలు. రెండో భార్య అయిన రజితను అతికిరాతకంగా హత్య చేశాడు. వెంకన్నగూడ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య రజిత(30)తో గత రెండేళ్లుగా మనస్పర్దాలున్నాయి. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగిన మంగళవారం జంగయ్య రజిత హత్యకు పథకం వేశాడు. సోమవారం సాయంత్రం భార్య రజిత, జంగయ్య ఇద్దరు గ్రామ సమీపంలో మద్యం త్రాగారు. అనంతరం రజితను చున్నీతో మెడకు బిగించి ఉరివేశాడు. అప్పటికి చావలేదనుకుని సిమెంట్ కడ్డీతో మోది అతికిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఫోటోలు, వీడియోలు తీసి మొదటి భార్యకు పంపించాడు. అదేరోజు రాత్రి నిందితుడు చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆశావహుల జాబితాను అధిష్టానానికి పంపిన నేతలు కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల
నేటిధాత్రి ఐనవోలు :-
Vaibhavalaxmi Shopping Mall
అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు అయినవోలు మండల పార్టీ సూచన మేరకు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల సమావేశం బుధవారం గ్రామ పార్టీ అధ్యక్షులు మామిండ్ల సంపత్ అధ్యక్షతన గ్రామ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పార్టీ ఎన్నికల ఇన్చార్జి మున్సిపాలిటీ పరిధి నుండి మేకల రాణి డివిజన్ పార్టీ అధ్యక్షులు కాంటెస్ట్ కార్పోరేటర్& అయినవోలు మండలం నుండి గ్రామ పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ కట్కూరి రాజు హాజరై రాబోయే జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచి వార్డు సభ్యుల ఎన్నికల గెలుపు కొరకు పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసి కార్యకర్తలను ప్రోత్సహించినారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసినారు. మరియు ఎంపీటీసీ జనరల్ మహిళ ఆశావాహ పోటీ చేసే అభ్యర్థుల నుండి పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ సంపత్, మాజీ ఎంపీటీసీ కడూరి రాజు, నందనం సొసైటీ డైరెక్టర్ రాజారాపు కుమార్, సతీషు, రమేషు, భాస్కరు, ప్రతాపరెడ్డి, సమ్మయ్య, రాజు, రాజిరెడ్డి, రాజేషు, అశోకు, కుమారు, రాజు, రమేషు, రాజబాబు, కుమారు, ప్రతాపు, రాజశేఖర్, మరియు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్
పరకాల నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మడికొండ ప్రశాంత్ మండల అధ్యక్షుడు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు మూడేళ్లగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలలు లేఖలు రాశారు దీనివల్ల పాఠశాలలో చదువుతున్న 23 వేల మంది దళిత విద్యార్థులు 7వేల మంది గిరిజన విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు 154 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ఆరు నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలు విడుదల చేయాలని లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మహేష్,విజయ్,అన్వేష్,రాకేష్,కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
2025- 27 లైసెన్స్ కాలానికి మద్యం దుకాణాల నిర్వహ ణకు నోటిఫికేషన్ జారీ చేసింది గతంలో మాదిరిగా 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫి కేషన్ వెల్లడించారు రెండు సంవత్సరాల కాలపరిమితికి లాటరీ ద్వారా మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానించడం జరుగుతుంది ఈ ఏడాది 1 డిసెంబర్ 2025 నుండి 30 నవంబర్2027 రెండేళ్ల వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. జతపరచవలసిన పత్రాలు దరఖాస్తు ఫారం, మూడు లక్షల రూపాయల డీడీ లేదా చాలాన్, మూడు కలర్ పాస్ ఫోటో సైజు, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ( గౌడ్, ఎస్ టి, ఎస్ సి) దరఖాస్తుల సమ ర్పణ జిల్లా ఎక్సైజ్ అధికారి కార్యాలయం తారా గార్డెన్ దగ్గర సుబేదారి హనుమకొండ. చివరి తేదీ 18 అక్టోబర్ 2025 సాయంత్రం ఐదుగంటల లోపు సమర్పించవలెను.
సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయి పై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి
మందమర్రి నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
భారత అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీం చీఫ్ జస్టిస్… జస్టిస్ గవాయి పై జరిగిన దాడి.. యావత్ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లు అని సామాజిక ఉద్యమ నాయకుడు గుడికందుల రమేశ్ అన్నారు. బుధవారం మందమర్రిలో మాట్లాడుతూ…..సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దాడికి యత్నించిన వ్యక్తి వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న లాయర్ రాకేష్ ఏకంగా చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు యత్నించాడు. తన షూను తీసి సీజేపై విసిరేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, తోటి లాయర్లు అప్రమత్తమై తనను అడ్డుకున్నారు.భారత దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఘటనను పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఖండించాలని కోరుతూ, మన దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ నీచమైన ఘటనను ఖండించడానికి మాటలు సరి పోవని అన్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజని ఇలాంటి పిరికిపంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైన భారత ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్ కు ప్రజాస్వామ్యవాదుల మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.
భారతీయ జనతా పార్టీలో చేరికలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి
మహాదేవపూర్ అక్టోబర్ 8 నేటి ధాత్రి *
Vaibhavalaxmi Shopping Mall
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కంకణాల రాజిరెడ్డి మెరుగు లక్ష్మణ్ సారంగపని బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్బంగా చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్స్ దృష్ట్యా బీజేపీ పార్టీలో చేరికలు అవ్వడం శుభపరిణామం అని, భారత ప్రధాని గౌ ‘శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలు, వారి పరిపాలన ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు అవుతున్న కానీ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని, రాబోయే రోజులలో తెలంగాణనలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో మహాదేవపూర్ అన్నీ స్థానాలలో పోటీ చేసి, గెలిచి తిరుతామణి,కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక భారీ మూల్యం చెల్లించుకుంటుందని వారు చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్,కార్యదర్శి సంతోష్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్, చాగర్ల రవీందర్,దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్, రాము, బల్ల శ్రావణ్ కార్యకర్తలు పాల్గొన్నారు,
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. సమాచార హక్కు చట్టం కేంద్రంలోని వచ్చి 20 ఏండ్లు అయిన సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆయా శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ఎలా అమలులోకి వచ్చింది చట్టంతో ప్రజలకు ఉపయోగపడే వివరాలను తెలియజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు తదితర సమాచారాన్ని తెలుసు కోవచ్చని స్పష్టం చేశారు. దేశ భద్రత, రహస్య ఇతర ఇబ్బందులు ఎదురయ్యే సమాచారం మినహా అన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి వివరాలు ఉండాలని తెలిపారు. ఎవరైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో వారికి సమాధానం ఇవ్వాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సమాచారం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.
అనుపర్తి యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు వర్దన్నపేట (నేటిధాత్రి)
Vaibhavalaxmi Shopping Mall
వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ లోని 1వ వార్డు కు చెందిన అనుపర్తి యాకయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే వెంట ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుల్లా రవి, మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ నాయకులు బెజ్జం పాపరావు, సిలువేరు శ్రీధర్, పులి శ్రీను, వెంకట్, ఎండి అన్వర్, చిటూరి రాజు, పాక సుజాత తో పాటు తదితరులు పాల్గొన్నారు..
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రె స్ ప్రభుత్వంలో విసుగు చెందారు
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ
శాయంపేట నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
శాయంపేట మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరి యు వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారంబిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.
రైతులకి ఇస్తామని చెప్పిన రైతు బంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు,
మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దుల కు, వితంతువులకి, వికలాం గులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వ లేదు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల కు ఇదిగో మా బాకీ కార్డు,మా కు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని కోరారు.
BR
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకన్న మరియు మాజీ ఎంపిటిసి మేకల శ్రీనివాస్, అట్ల రమేష్ అట్ల తిరుపతి మామిడి శంకర్ గారు మాజీ సర్పంచ్ తోట కుమారస్వామి పసునూటి రాజయ్య సామల విజయ్ చాడ రాజిరెడ్డి కొమురాజు ప్రశాంత్ దీండిగాల నాగార్జున్ కర్రు రవి, ఆకుల శంకర్, కొప్పుల బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు పోతుల విష్ణు,మాస్ అనిల్, బండారి ఆనందం, ఆకుతోటరాజు పసునూటిరాజు, గరిగరమేష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, పత్తిపాక ముఖ్య నాయకులు బి.నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, వైద్యుల తిరుప తిరెడ్డి, సాంబరెడ్డి, చల్లా సమ్మిరెడ్డి, తుడుం వెంకటేష్, గజ్జి రమేశ్, పోతుగంటి సుభాష్, నక్క రాజు మరియు కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో న్యాల్కల్ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముహమ్మద్ యూనుస్ జహీరాబాద్ తమ బృందంతో చేరుకుని, మాజీ రాష్ట్ర మంత్రి మరియు జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ ఎంపీ జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్ లను జహీరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఇన్‌చార్జి క్యాంప్ ఆఫీస్ శుక్లా వర్ధన్ రెడ్డితో కలిసి న్యాల్కల్ మండల నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దరఖాస్తును అందజేశారు. జడ్పిటిసి అభ్యర్థి ప్రకటిస్తే మండల ప్రజలను సేవలందిస్తానని ఈ అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా సంగారెడ్డి ఉపాధ్యక్షుడు ముహమ్మద్ ముల్తానీ, జహీరాబాద్ మున్సిపల్ మాజీ సభ్యుడు ముహమ్మద్ ముయిజుద్దీన్, జహీరాబాద్ మున్సిపల్ మాజీ సభ్యుడు హఫీజ్ మహ్మద్ అక్బర్ హోగేలి, కాంగ్రెస్ జహీరాబాద్ మండల అడహాక్ కమిటీ అధ్యక్షుడు రాంలు యాదవ్, మహ్మద్ ఇనాయత్ అలీ మహమ్మద్ ఇస్మాయిల్ మహమ్మద్ అయూబ్, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం
జహీరాబాద్ నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
కొద్దీ రోజుల క్రితం ప్రమాద వశాత్తు కాలుకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న మాజీ సీడీసీ చెర్మన్ ఉమాకాంత్ పాటిల్ ను ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం, పరామర్శించిన వారిలో యం.శ్రీనివాస్, యూ. మాణేన్న,టి.రాములు,టి.విఠల్,యం.శివన్న,యం.సంగ్రామ్,బి.అశోక్,కె.శ్రీశైలం,తదితరులు ఉన్నారు
సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.
`వందల మిలియన్లతో అగ్రగామిగా నిలుస్తున్న మన తెలంగాణ పాట.
`ఒకప్పుడు తెలంగాణ పాటకు అవమానం.
`ఇప్పుడు తెలంగాణ పాటకు వైభోగం.
`తెలంగాణ పాట రాష్ట్రానికే సౌభాగ్యం.
`మనసు పరవశానికి పట్టాభిషేకం.
`ఆనందాన్ని పంచుతున్న ఆరోగ్యం.
`వెలుగులోకి వస్తున్న సంగీత సరస్వతులకు జేజేలు కొడుతున్న ప్రపంచం.
`ఎన్ని సార్లు విన్నా తరగనంత సంతోషాన్ని నింపుతున్న మధురగానం.
`అది తెలంగాణ యాసలో వున్న మధురామృతం.
`ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ విన్నా సినిమా పాటలు.
`ఇప్పుడు ప్రపంచమంతా మారు మ్రోగిపోతున్న తెలంగాణ పాటలు.
`తెలంగాణ యాస కమ్మదనం తొక్కుతున్న పాటల పరవళ్లు.
`తెలంగాణ కవిగాయకులు అంటే పాటల ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులు.
హైదరాబాద్, నేటిధాత్రి: తెలంగాణపాట అనగానే మది పులకిస్తుంది. మనసు పరవశిస్తుంది. తెలంగాణ పాట అంటేనే రక్తం ఉరకలేస్తుంది. ఊపును నింపుతుంది. ప్రశ్నను రేకెత్తిస్తుంది. వ్యవస్ధను నిలదీస్తుంది. సమాజాన్ని దారిలో పెడుతుంది. ఆలోచనను సృష్టిస్తుంది. నిజాన్ని వెలికి తీస్తుంది. నిప్పులా కాలుతుంది. సూటిగా బాణంగా గుచ్చుకుంటుంది. తూటాలా పేలుతుంది. మస్కిష్కంలోకి దూసుకుపోతోంది. ఆలోచింపచేస్తుంది. చైతన్యం నింపుతుంది. ఉద్యమానికి ఊపిరిలూదుతుంది. పోరాటానికి దారి చూపిస్తుంది. ప్రకృతిని ఆరాదిస్తుంది. ప్రకృతి గొప్పదనం చెప్పుతుంది. గాలి, నీరు, నిప్పు, నింగి,నేలను కలుపుకొని సాగుతుంది. ఉప్పెనలా దూసుకొస్తుంది. సునామీ సృష్టిస్తుంది. గడ్డిపరకలు గడ్డపారలౌతాయి. ఎండిన ఆకులు కూడా అలజడులు సృష్టిస్తాయి. వాగులు పరుగులందుకుంటాయి. వంకలు దుంకుతుంటాయి. కొండ, కోనలు కూడా ప్రతిధ్వనిస్తుంటాయి. ఇదీ తెలంగాణ పాటంటే…ఇదే తెలంగాణ గానమంటే..ఆ గానంలో ఆత్రం వుంటుంది. ఆకలి వుంటుంది. తిరుగుబాటు వుంటుంది. కమ్మదనం వుంటుంది. అందుకే తెలంగాణ పాటకు దాసోహం అనని వారుండదు. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా అంటే శివుడు కూడా కన్నీరు కార్చాల్సిందే. ఆ కన్నీటితో శివలింగం కూడా తడిసి ముద్ద కావాల్సిందే. ఆ కన్నీటితోనే అభిషేకం జరిపిన పాట తెలంగాణ పాట. అవును ఇది అతిశయోక్తి కాదు. ఆర్తి. తెలంగాణస్పూర్తి. తెలంగాణ పదానికి దేవుళ్లే కదిలిన దార్తి…తెలంగాణ ఉద్యమ కాలంలో మిట్టపల్లి సురేందర్ రాసిన రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ పాట రాస్తే, ఆ రాగానికి తెలంగాణ మొత్తం కన్నీటిపర్యంతమైంది. తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల కడుపుకోత కండ్ల ముందు కదలాడిరది. ఏకంగా శివుణ్ణే ప్రశ్నిస్తుంటే తెలంగాణ సమాజమంతా నివ్వెరపోయింది. తెలంగాణ ఇస్తారా? లేదా? అని డిల్లీని నిలదీసింది. కొట్లాడి సాదించుకుందామనే ధైర్యాన్ని ఆ పాట తెలంగాణ యువతలో నింపింది. అదీ తెలంగాణ పాట గొప్పదనం. తెలంగాణ పాట ఇప్పుడు పుట్టింది కాదు. ఇక్కడితో ఆగేది కాదు. తెలంగాణలో బతుకమ్మ పుట్టినప్పుడే పాట పుట్టింది. తర్వాత నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ పాట గళమెత్తింది. తెలంగాణ ఉద్యమం కోసం రెండు దఫాలుగా యాభై ఏళ్లపాటు ప్రతిసారి పాటల రెక్కలు కత్తిరించినా, కొత్త రెక్కలు తొడుక్కొని ఊరకలెత్తింది. ఈ భూమి మనదిరా.. వాడ మనది రా..అంటే చైతన్యం నింపింది. ఎంతో మంది కవి గాయకులు తెలంగాణను పాటల సీమగా మలిచారు. ఇప్పుడు స్వర్గసీమను ఏలుతున్నారు. ప్రజల నాలుకలమీద జీవిస్తూనే వున్నారు. అలా ఎంతో మంది కవులు,గాయకులు తెలంగాణ గడ్డ మీద పుట్టారు. అయితే తెలంగాణ పాటను తమ స్వార్ధం కోసం వాడుకున్న ఆంద్రులున్నారు. వారి రాజకీయం కోసం అణిచి వేసిన వాళ్లున్నారు. సినిమా వాళ్లు తెలంగాణ పాటతో కోటీశ్వరులయ్యారు. కాని తెలంగాణ కవులకు చిల్లిగవ్వలు ఇవ్వకుండా మోసం చేశారు. తెలంగాణ పాటను రాజకీయ నాయకులు అణిచివేశారు. అయినా ఆకలిని కూడా ఎదరించి నిలబడిరది తెలంగాణ పాట. ఆకలికి అమ్ముడుపోనిది తెలంగాణ పాట. ఎవరో వేసే మెతుకుల కోసం ఆరాటపడనిదే తెలంగాణ పాట. తనను తాను సృష్టించుకొని పల్లకిలో ఊరేగిందే తెలంగాణ పాట. ఆ పాటల పరంపరంలో ఉద్యమానికి ఊపిరులూదిన పాటలు అనేకం వున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద అంటూ గద్దర్ పాడిన పాటలు, జయయజహే తెలంగాణ అంటూ అందెశ్రీ రాసి పాడిన పాటలున్నాయి. నేలమ్మ నేలమ్మా అంటూ జయరాజ్ రాసిన పాటలున్నాయి. అయ్యోనివా నువ్వు అవ్వోనివా అంటూ తెలంగాణను మేలుకొలిపిన పాటలున్నాయి. నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ అని వినిపించిన గానాలున్నాయి. ఇదవన్నీ తెలంగాణకు ముందు…కాని ఇప్పుడు తెలంగాణ తర్వాత కూడా తెలంగాణ పాట తన ప్రస్ధానం ఆపుకోలేదు. ఆగిపోలేదు. మరింత దూకుడు పెంచింది. అందుకే తెలంగాణ పాట గురించి చెప్పాలంటే తెలంగాణ రాకకు ముందు, తెలంగాణ తర్వాత అని చెప్పాలి. అప్పటి పాటలు ఆణిముత్యాలు. ఇప్పటి పాటలు ప్రపంచాన్ని ఏలుతున్న వజ్రాలు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పాటల పూదోట. అది ఎరుపెక్కినా పాట ద్వనిస్తుంది. పచ్చగా మారినా పరవశించి పాడుతుంది. ఉద్యమాల బాటకు దారులు వేసిన పాట. పోరాటాలను కడుపులో నింపుకొని దూకిన పాట. తెలంగాణ పాట అంటేనే పోరాటాల చరిత్ర. అణివేతను నిలదీసిన తిరుగుబాటు. అస్ధిత్వ ఆరాటాన్ని, ఆత్మ గౌరవ నినాదాన్ని నింపుకొని సాగుతుంది. పాట హృద్యంగా వుండాలన్నా, రక్తం మరగాలన్నా తెలంగాణ పాటేకావాలి. ఇది తెలంగాణ పాట గొప్పదనం. నిండు గుణం. ఒకప్పుడు తెలంగాన పాటంటే పౌరుషం..పోరాటం మాత్రమే అనుకునే వారు. కాని దాని వెనుకున్న ఆకలి ఆరాటాలు పట్టించుకునేవారు కాదు. తెలంగాణ పాటలో తిరుగుబాటు బావుటానే చూసేవారు. కాని అది గుండెల్లో మండుతున్న అగ్నికి ప్రతిరూపం అని పాలకులు భావించకపోయేవారు. సముద్రంలో ఎగసిపడుతున్న అలలు అని తెలుసుకోలేకపోయారు. వాటిని అణిచి వేశారు. పాటను కాలరాయాలనుకున్నారు. ఆనాడే తెలంగాణ పాటకు స్వేచ్చనిస్తే ప్రపంచాన్నే శాసించేది. ప్రపంచానికే చైతన్యాన్ని నింపేది. తెలంగాణలో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆ పాటలు సజీవమే..కాని తెలంగాణలో ఇప్పుడు కొత్త తరంపాటలొస్తున్నాయి. రసరంజనిలో ఓలలాడిస్తున్నాయి. ప్రతి తెలంగాణ గుండెలో ఆనందాన్ని నింపుతున్నాయి. మనసును పరవశింపజేస్తున్నాయి. ముసలీ ముతక కూడా కాలు కదిపేలా చేస్తున్నాయి. పసి పిల్లలు తొట్టెలో కూడా కూడా ఊగిపోయేలా చేస్తున్నాయి. తెలంగాణలో కన్నీటి పాటల నుంచి పన్నీటి పాటలు ఉధ్భవిస్తున్నాయి. పాటల జడివానలో ప్రపంచాన్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ పాటకు ప్రపంచం దాసోహమంటోంది. తెలంగాణ యాస ప్రపంచపు అంచులను తాకుతుంటే పాటలమ్మ పరవశించిపోతోంది. తెలంగాణ కావ్వాలకు సంగీత సాగరమే నాట్యం చేస్తోంది. తెలంగాణ మట్టి పరమిళలాతో రాగమే తాండవమాడుతోంది. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే తెలంగాణకు చెందిన ఓ కుర్ర కళాకారుడు రాము రాథోడ్ గాయకుడై, కవిjైు, నర్తించి నిర్మించిన రాను..నే..రాను బొంబైకి రాను అనే పాట సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మైకెల్ జాక్సన్ పాట కూడా 500 మిలియన్లు దాటిన సందర్భం లేదు. దేశంలోని ఏ గాయకుడు పాడిన పాట కూడా అంత దూరం వెళ్లలేదు. ఎంత పెద్ద పాటైనా సరే పది కోట్లు దాటడడమే ఒకప్పుడు రికార్డు. కాని ప్రపంచంలోని తెలుగు వాళ్లే కాదు, బాష తెలియని వాళ్లు కూడా ఆ బాణీలకు, మాటలకు ఫిదా అయిపోయారు. 50 కోట్ల మంది వీక్షించారు. తన్మయత్వానికి లోనయ్యారు. అంటే మాటలు కాదు. మామూలు విషయం అసలే కాదు. తెలంగాణ యాసలో ఈ మధ్య వస్తున్న అనేక పాటలు కూడా అదే దారిలో పరుగులు తీస్తున్నాయి. ఓ పిలగ వెంకటేష అంటూ సాగుతున్న పాట, దారి పొంట వత్తుండు..దవ్వ దవ్వ వత్తుండు..దారిదుద్దునా, పోనిద్దునా? అంటూ సాగే పాట కూడా ప్రపంచాన్ని జయించాలని పరుగులు పెడుతోంది. ఇలా రోజు రోజుకూ కొత్త కొత్త పాటలు వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ యాసను దిగంతాలకు చేర్చుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ యాసను చీదరించుకున్న వాళ్లు, ఈసడిరచుకున్న వాళ్లు సైతం ఆ మాధుర్యానికి గులాములౌతున్నారు. తామెందుకు చేయలేమని ఆంద్రాకు చెందిన వాళ్లు కూడా తెలంగాణ యాసలో పాటలు రాస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ బాషను అదేం బాష.. అనేవారు. తెలంగాణ నుడి కారాలను వెక్కిరించేవారు. తెలంగాణ నుంచి వచ్చే సాహిత్యాన్ని చిన్న చూపు చూసేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటకు ఆదరణ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాటకు పట్టాభిషేకం జరుగుతోంది. మిస్ వరల్డ్ నోటి నుంచి జాలువారిని ముత్యాల వాన రాను..నే రాను బొంబైకి రాను..! అర్ధం తెలియకపోయినా తెలంగాణ పాట అల్లుకుపోతోంది. అందరి నాలుకల మీద నాట్యం చేస్తోంది. తెలంగాణ పాట ఇప్పుడు వైబోగం చవి చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర సౌభాగ్యాన్ని గుర్తు చేస్తోంది. ప్రతి మనిషిలో వున్న పరవశానికే పదనిసలు నేర్పుతోంది. ప్రపంచమంతా పట్టాభిషేకం చేస్తుంటే తెలంగాణ యాస మధురగానంలో ఓలలాడుతోంది. పాటల పరవళ్లు తొక్కుతులంటే తెలంగాణ కళాకారులు సంగీత ప్రపంచంలో రారాజులౌతున్నారు. తమ రాజ్యాలనేలుతున్నారు. ఆల్ ది బెస్ట్. మైడియర్ న్యూ జనరేషన్.
కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి
మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు. మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి. రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం. పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు. భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది. మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి. కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని. కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.