దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి…

దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హనుమకొండ:నేటిధాత్రి

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తమ భూమిలోకి బాట లేదని వెళ్లనివ్వకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన బొక్క తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు . తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 133 ఏ, 133 బి, 148b2, 148సి/1/1/3 సర్వే నెంబర్లలో మొత్తం మూడు ఎకరాల రెండు గుంటల భూమి ఉండగా గత 45 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నామని కానీ గత కొంతకాలంగా తమ భూమి లోకి వెళ్లకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే విషయంపై గతంలోనే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్ కు రిఫర్ చేసిందని దానితో స్థానిక ఆర్డిఓ తహసిల్దార్ విచారణ చేసి గతంలో లాగానే వ్యవసాయ పనుల నిమిత్తం మోహన్ రెడ్డి భూమి నుండి తమ భూమి లోకి వెళ్లే విధంగా తీర్పు ఇచ్చారని దానికి మోహన్ రెడ్డి సైతం ఒప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తూ వ్యవసాయ పనులకు తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు. గతంలో తమను తీవ్రంగా కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని దానిని ఇప్పుడు ఉపసంహరించుకోమని తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు.దీని పూర్తి వివరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

సర్పంచ్,ఉప సర్పంచ్ లను శాలువాతో సత్కరించిన నాగుర్ల…

సర్పంచ్,ఉప సర్పంచ్ లను శాలువాతో సత్కరించిన నాగుర్ల

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలో నూతనంగా ఎన్నికైన ఆరెకుల ముద్దు బిడ్డలు నడికూడ గ్రామ సర్పంచ్ కుడ్ల మలహల్ రావు,వరికోల్ గ్రామ ఉప సర్పంచ్ మూర్తాల భుజంగరావు లకు హనుమకొండ లోని భవాని నగర్ లో ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్ల ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేయడం జరిగింది.అనంతరం నూతన సర్పంచ్ మలహల్ రావు, ఉపసర్పంచ్ భుజంగారావు లను శాలువాతో సత్కరించి నాగూర్ల వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకటి నాగేష్, జిల్లా ఉపాధ్యక్షులు వరికెల కిషన్ రావు నడికూడ ఆరెకుల యువ నాయకులు మోకిడి రాజు తదితరులు పాల్గొన్నారు.

బేతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు…

బేతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు

హన్మకొండ, నేటిధాత్రి:

 

హనుమకొండ 53వ డివిజన్ లష్కర్ సింగారంలోని బేతేస్తా బాప్టిస్ట్ చర్చిలో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు విష్ణు రెడ్డి హాజరయ్యారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్థానిక నేత మట్టెడ అనిల్ ఏర్పాటు చేసిన దుస్తువులను పాస్టర్ కుటుంబ సభ్యులకు విష్ణు రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రేమ, ఐక్యత, సేవ భావనలే క్రిస్మస్ సందేశమని అన్నారు.
ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, పాస్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం…

ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం…

#అన్నీ డివిజన్ లలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి..

#శంకుస్థాపన చేసిన ప్రతి పని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నాం..

#ప్రజల భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి…

#నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న..

#కాజీపేట,హనుమకొండ లలో పలు డివిజన్ లలో సుమారు రూ.1.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..

హన్మకొండ, నేటిధాత్రి:

 

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.పేర్కొన్నారు.సోమవారం రోజున శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజవర్గ పరిధిలోని 47 వ డివిజ బోడగుట్ట,31 వ డివిజన్ శాయంపేట ఎస్సీ కాలనీ,8 వ డివిజన్ గుడి బండల్ లలో సుమారు రూ.1.70 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా డివిజన్ లలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీలో అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.ఇప్పటికే నియోజవర్గంలోని అన్ని డివిజన్ లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.గతంలో పలు కాలనీల్లో కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న చాలా కాలనీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తరువాత నియోజకవర్గం ప్రత్యేక అభివృద్ధి జరుగుతున్నదని,రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని అన్నారు.
బోడగుట్ట గ్రామానికి ప్రధాన రహదారి నుంచి రోడ్డు వెడల్పు చేయాలని స్థానిక ప్రజలు కోరగా సంబధిత అధికారులకు ప్రణాళికల్ని సిద్ధం చేయాలని సూచించారు.
శాయంపేట దళిత కాలనీలో చాలా వరకు నూతన రోడ్లు వేశామని మిగిలిన అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు,అధికారులు ఉన్నారు.

యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ పై కేసు నమోదు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T154456.333.wav?_=1

 

యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ పై కేసు నమోదు చేయాలి

ఎల్తూరి సాయికుమార్ స్వేరో

హన్మకొండ, నేటిధాత్రి:

 

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజున హనుమకొండ జిల్లా లో మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయపరంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కాంగ్రెస్ పథకాల వైఫల్యాలను ఎండగడుతూ ఆరోపించడం జరిగింది. దీనికి ప్రతి ఆరోపణగా యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వ్యక్తిగతంగా గుండు మీద బొచ్చు లేదు గుండు లోపల మెదడు లేదు అంటూ పలికిన మాటలను యావత్ తెలంగాణ రాష్ట్ర స్వేరోస్ ,అభిమానులు ,విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందున తోట పవన్ పై కేసు నమోదు చేయాలని హనుమకొండ ఎస్ హెచ్ ఓ ఇంచార్జ్ ఎస్ఐ సతీష్ కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అధ్యక్షులు చెట్టుపల్లి శివకుమార్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఒకేషనల్ కాలేజ్ నాయకులు రణధీర్ ,చరణ్ ,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

స్వేరోస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా మంద మనోజ్…

స్వేరోస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా మంద మనోజ్

హన్మకొండ, నేటిధాత్రి:

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన, ఆశయాలకు అనుగుణంగా 13 సంవత్సరాల క్రితం ఏర్పడిన స్వేరో సంస్థకు గత పది సంవత్సరాల నుండి పనిచేస్తూ స్వేరో ఉద్యమానికి నికార్సైన స్వేరో నాయకుడిగా వివిధ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో కష్టనష్టాలను ఎదుర్కొని చివరి వరకు నిలబడాలనే ఆకాంక్షకు అనుగుణంగా తన పనితనాన్ని గుర్తించి హనుమకొండ జిల్లా పరకాల మండలం మాదారం కీ చెందిన యువనాయకుడు మంద మనోజ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార మల్ల ప్రకాష్ కో కన్వీనర్ పుల్ల కిషన్ ల ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనీ ప్రకటించడం జరిగింది.
అనంతరం జిల్లా అధ్యక్షుడు మంద మనోజ్ మాట్లాడుతూ స్వేరోస్ సంఘాన్ని మా జిల్లాలో ఉన్న 14 మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలు, విద్యార్థుల సమస్యలను ప్రధానంగా వెలికి తీసి వారికి స్వేరోస్ తరఫున అండగా నిలబడి అధికారుల ద్వారా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని అన్ని గ్రామాలలో స్వేరోస్ జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి..

విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి

హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్

హన్మకొండ, నేటిధాత్రి:

ఈ రోజు కాకతీయ డిగ్రీ కాలేజ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, షీ టీమ్స్ సేవలు, డయల్ 100 యొక్క ప్రాముఖ్యత, మహిళల స్వీయ రక్షణ & చట్టపరమైన హక్కులు గురించి వివరించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే, సైబర్ నేరాలు, వాటి నివారణ మరియు టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1930 గురించి కూడా విద్యార్థినులకు వివరించడం జరిగింది. విద్యార్థులు సెల్ ఫోను మరియు ఇతర విషయాల మీద కాకుండా చదువుపై దృష్టి పెట్టి తమ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకొని తోటి వారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఉమెన్ ఏ ఎస్సై కమల మంజుల, బ్లూకోల్ట్స్ టీమ్ నాయక్, కుమార్ లు మరియు సైబర్ వారియర్ కిరణ్ పాల్గొన్నారు.

పి డి ఎస్ యు దాడీ ని ఖండిస్తున్నాం.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-13T151215.162.wav?_=2

 

పి డి ఎస్ యు దాడీ ని ఖండిస్తున్నాం.

చిట్యాల,నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో ట్రస్మా ప్రైవేటు పాఠశాలల చిట్యాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందిహనుమకొండ పట్టణంలోని డిజి స్మైల్ స్కూల్ పైన బుధవారం రోజున పిడిఎస్యు విద్యార్థి సంఘ సభ్యులు చందా వసూళ్లకు పోయి ఆ పాఠశాల పైన దౌర్జన్యం చేసి పాఠశాల కరస్పాండెంట్ ను కొట్టడం జరిగింది దానికి నిరసనగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురు వారం రోజున పాఠశాల బంద్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ట్రస్మా గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ రాజ్ మహమ్మద్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రమేష్ టేకుమట్ల మండలం నుండి జిల్లా ఈసీ మెంబర్ మియాపూర్ హరీష్ జిల్లా మెంబర్ గొల్ల సతీష్ కుమార్ బండి సంపత్ కుమార్ శ్రీధర్ మొగుళ్ళపల్లి మండలం నుండి శ్రీనివాస్ రవికుమార్ మొదలగు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక..

సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఈనెల 2న హన్మకొండ జిల్లా ఎస్ డిఎల్ సి క్రీడా ప్రాంగణంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ హన్మకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ సెలెక్షన్ పోటీలలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల కేజీవీపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎన్. శరణ్య అద్భుత ప్రతిభ ప్రదర్శించి, హన్మకొండ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు జగిత్యాల జిల్లాలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్నాయి.
ఈ విజయంపై కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్ నాగపురి స్వప్న వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ తల్లిదండ్రులు శరణ్యను హృదయపూర్వకంగా అభినందించారు.

ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T150827.181.wav?_=3

 

ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం

కార్మికుల డిమాండ్ లు నెరవేర్చాలి-లంకదాసరి అశోక్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవం కార్మికులు ఘనంగా నిర్వహించారు.అనంతరం హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ జెండావివిష్కరణ చేసి ఏఐటీయూసీ 1920లో ఏర్పడి పోరాటాల ఉద్యమాల చరిత్రలో 106వ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కార్మిక వర్గానికి ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని అన్ని విధాలుగా కార్మికులను ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కోగిల.శంకర్,కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరె రవి,శ్రీపతి కలనాయక్,సప్పిడి సాంబయ్య,తిక్క స్వామి,ఈర్ల ఐలయ్య,మామిడి జగన్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం…

ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ లు విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకులు

పరకాల,నేటిధాత్రి

 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బందు పట్టణంలో విజయవంతం అయ్యింది.ఎస్ఎఫ్ఐ ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్
మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పట్టణంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ కాలేజీలను బందు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని కళాశాలలో కోర్సు అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండ యజమాన్యం విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్,పట్టణ సహాయ కార్యదర్శి అరుణ్,చంటి పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం….

మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

మహిళలు ఆర్థికపరంగా అన్ని రంగాల్లో ముందుండాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సబ్సిడీపై మత్స్యకారులకు వాహనాన్ని అందించారు మత్స్యకారులకు 10.5 లక్షల విలువ గల వాహనాన్ని సబ్సిడీపై 6 లక్షలకు ప్రభుత్వం అందించింది మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి పెట్రోల్ బంక్ , మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ వ్యాపా రుల అభివృద్ధి చెందే విధంగా మహిళలు ఆర్థికంగా ఎదగ డానికి మహిళలకు తోడ్పడు తుంది మహిళలు వ్యాపార పరంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేస్తుంది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలు, మహిళలు అధిక మొత్తంలో పాల్గొన్నా

రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు రితిక ఎంపిక…

 

రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు రితిక ఎంపిక

పరకాల,నేటిధాత్రి

 

రాష్ట్ర స్థాయి ఎస్జిఎఫ్ కరాటే పోటీలకు పరకాల పట్టణానికి చెందిన పోచంపల్లి రితిక ఎంపిక అయినట్లు క్రియేటివ్ కరాటే డూ వ్యవస్థాపకులు మాడ సంపత్ పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపికల్లో రితిక ప్రతిభ చూపినట్లు తెలిపారు.అండర్ 19.56కిలోల విభాగంలో రితిక ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపిక అయిందన్నారు.డిసెంబర్ నెలలో జరగనున్న రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు.కాగా రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన రితికను మాస్టర్ పాపయ్యతో పాటు పలువురు అభినందించారు.

బాబోయ్… కుక్కలు, కోతులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T124926.707.wav?_=4

 

బాబోయ్… కుక్కలు, కోతులు

మనిషి కనిపిస్తే చాలు వెంటాడుతూ దాడులు

ప్రభుత్వ దావాఖానాలో పెరుగుతున్న కేసులు

జంకుతున్న ప్రజలు…. పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలంలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా మండలంలో కుక్కలు ,కోతుల బెడద తీవ్రంగా మారింది ఏ గ్రామంలో చూసినా కుక్కలు కోతుల దాడులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మనిషి కనిపిస్తే చాలు వెంటప డుతూ ఉన్నాయి దీంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కోతుల, కుక్కల బెడద తీవ్రం గా ఉన్న అధికారులు తమ కేమి పట్టనట్లుగా వ్యవహ రిస్తున్నారని విమర్శలు వెలు వెత్తుతున్నాయి. చిన్నారులు మరియు వృద్ధులు కుక్కల కోతుల దాడులకు బలవుతు న్నారు రాత్రి అయితే చాలు చెప్పనక్కర్లేదు వీధులు ప్రధాన రహదారిపై గుంపులు గుంపు లుగా సంచరిస్తూ మనిషి కని పిస్తేచాలు వెంటపడుతున్నా యి ద్విచక్ర వాహనాలను వదలడంలేదు మండలము మరియు పలు గ్రామాల్లోని ప్రజలు 300నుంచి 350 మంది దాకా ఆస్పత్రులు పాలయ్యా రు దీంతో రాత్రి వేళల్లో బయ టకు వెళ్లాలంటే ప్రజలు భయ పడుతున్నారు ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T124134.174.wav?_=5

 

ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం నేరేడుపల్లి గ్రామంలో గత రబీ సీజన్లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొను గోలు కేంద్రాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు విచారణలో తేల్చారు నేపథ్యంలో అధికా రుల ఫిర్యాదు మేరకు శాయం పేట పోలీస్ స్టేషన్ లో 21 మందిపై కేసు నమోదు కాగా ఇటీవల ఇద్దరినీ అరెస్ట్ చేశారు ఈ అక్రమాలకు ప్రధాన సూత్ర దారులైన ఒకటైన బండ లలిత ప్రధాన సూతదారి బెజ్జంకి శ్రీనివాస్ బంధువు వడ్లూరి రాజేందర్ బుధవారం పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్ తర లించారు మిగతావారు పరారీ లో ఉన్నారని మిగతా వారిని గాలిస్తున్నామని సీఐ రంజిత్ రావుఎస్సై పరమేష్ తెలిపారు.

సంతోష్ యాదవ్ టెక్నికల్ అఫీషియల్ గా నియామకం

నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ టెక్నికల్ అఫీషియల్ గా సంతోష్ యాదవ్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పీ.ఈ.టి గా విధులు నిర్వర్తిస్తున్న సల్పాల సంతోష్ యాదవ్
హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అక్టోబర్ 16 నుండి 18 వరకు జరగనున్న 5వ ఇండియన్ ఓపెన్ అండర్ 23 నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు టెక్నికల్ అఫీషియల్ గా నియమితులైనారు. ఈ విషయాన్ని తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఈ. మారయ్య తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు టెక్నికల్ అఫీషియల్ గా సంతోష్ నియామకం పట్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ రవి ప్రసాద్ ప్రధానోపాధ్యాయులు రాజా రమేష్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, బెల్లంపల్లి పట్టణ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో….

ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో.

నడికూడ,నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా జడ్పీ సీఈవో రవి నడికూడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జీ.విమల మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్నదని వర్షాలు కురవడంతో పైకప్పు పెచ్చులు వూడి పడుతుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారని సీఈఓ కు వివరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్….

పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్.

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని రాయపర్తి గ్రామంలో ఉన్నత,ప్రాథమిక పాఠశాలలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు,విద్యార్థుల విద్యా ప్రగతి,బోధన కార్యక్రమాలను సమీక్షించారు. విద్యార్థుల హాజరు బోధన విధానం,పాఠశాలల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు,విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేదిశగా పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి,తహసీల్దార్ రాణి, మండల విద్యాశాఖ అధికారి కే.హనుమంత రావు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T143408.092.wav?_=6

 

నేటిధాత్రి”, బ్రేకింగ్.

 

హన్మకొండ కలెక్టరేట్‌లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం.._

కలెక్టరేట్‌లోనే తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇర్ఫాన్ సోహెల్

నిందితుడి దాడి నుండి తప్పించుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు

కలెక్టరేట్‌లోనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటే అతనికి పై స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని స్థానికుల ఆరోపణలు.

ఇర్ఫాన్ సోహెల్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్..

లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు

టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్…

టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్

#హనుమకొండ  డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య

హన్మకొండ, నేటిధాత్రి (మెడికల్):

 

టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0 లో భాగంగా నేటి నుండి డిసెంబర్ 8 వరకు 60 రోజులు యువతను లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని
హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలియచేసారు.ఈ రోజు ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వడ్డేపల్లి లో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. అలాగే పొగాకు వినియోగంపై అవగాహన కార్యక్రమము, అలాగే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అయినటువంటి గుట్కా, కైని, జర్ధ ,సిగరెట్, చుట్ట,బీడీ, పాన్ మసాలాలు వినియోగించడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు నోరు, గొంతు, ప్రేగు, ఊపిరితిత్తులు, గుండె మొదలగు వాటికి మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అంతేకాకుండా ఆడ మగ వ్యత్యాసం లేకుండా మరీ ముఖ్యంగా యువకులు ఎక్కువగా వీటికి అలవాటు పడుతున్నారు అలాగే ప్రజలు పొగాకు మరియు పొగాకు సంబంధించిన ఉత్పత్తులకు దూరంగా ఉండి మీ విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరడం జరిగింది. అలాగే 60 రోజులు జరిగే ఈ ప్రోగ్రాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో, పాఠశాలలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో వంద గజాల దూరంలో పొగాకు సంబంధించిన షాప్స్ ఉండకుండా చూడాలని, బహిరంగ ప్రదేశంలో ఎవరు ఈ ఉత్పత్తులను వినియోగించకూడదని సూచించారు.రాలీ అనంతరం ఎన్జీవోస్ కాలనీ కూడలిలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, వైద్యాధికారి డాక్టర్ మాలిక జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, సోషల్ వర్కర్ నరేష్, హెల్త్ సూపర్వైజర్ గోవర్ధన్ రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ మానస హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు ఆశాలు స్థానిక యువకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version