అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న ముడిమ్యాల పంచాయతీ కార్యదర్శ….

అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న ముడిమ్యాల పంచాయతీ కార్యదర్శి

* పంచాయతీ పరిధి111జీవోలో అక్రమ వెంచర్, పదుల సంఖ్యలో భారీగా ఫామ్ హౌస్ నిర్మాణాలు
* పిర్యాదు చేసిన చర్యలు శూన్యం, నోటీసులతో చేతులు దులుపుకున్న వైనం
* కార్యదర్శి అండతోనే అక్రమనిర్మాణాలు కొనసాగుతున్నయన్న ఆరోపణలు
•పరోక్షంగా అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నరన్న ఆరోపణలు
* పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలపరిధిలోని ముడిమ్యాల గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి తీరే వేరు. ముడిమ్యాల గ్రామపంచాయతీ పరిధిలో 111జీవోలో అక్రమంగా లే అవుట్లు చేసి, ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అంశాన్ని స్థానికులు గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకుపోయిన కానీ చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు . మొదట నోటీసులిచ్చామని సెప్పిన

కార్యదర్శి తరువాత 2 నెలలుగా పట్టించుకోలేదని
గ్రామస్తులు పలువురు ఆరోపించారు.
వివరాల్లోకి వెళితే… చేవెళ్ల మండలం 111జీవో పరిధిలోని ముడిమ్యాల రెవెన్యుపరిధిలో సర్వే నెంబర్ 121 లో 9 ఎకరాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా లే అవుట్లు చేసి యదేచ్చగా భారీగా ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎక్కడ చూసిన అక్రమానిర్మాణాలే కళ్ళకు కట్టినట్టే కనిపిస్తున్నాయి.

* కార్యదర్శి అండతోనే అక్రమాలు :

కార్యదర్శికి అక్రమపద్దతిలో ముడుపులు చెల్లించడంతోనే
అక్రమార్కులను ప్రోత్సహస్తున్నారనే విమర్శలు వెళువేత్తు న్నాయి. దీనితో ముడిమ్యాల పంచాయతీ కార్యదర్శి అండదండలు మెండుగా ఉన్నట్లు స్థానికులు గుసగుసలు
గట్టిగా వినిపిస్తున్నాయి. అక్రమనిర్మాణాలను మొదటి దశలోనే నిలిపి వేయాల్సిన పంచాయతీ కార్యదర్శి 111జీవోలో అక్రమనిర్మాణాలు పూర్తికావస్తున్న నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారిస్తున్నారు. నెలరోజుల క్రితం నోటీసులు మాత్రమే ఇచ్చారు. అయినా నిర్మాణాలు యతేచ్చగా కొనసాగిస్తుండటంతో కార్యదర్శి తమకేమి తెలియదన్నట్టు వ్యవహారిస్తున్న తీరు సరైనది కాదని
పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి పాత్ర భారీగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు…

ప్రచారంలో దూసుకుపుతున్న పామేనా నర్సిములు

• గెలుపే లక్ష్యంగా ప్రచారం
* అన్ని వర్గాల పూర్తి మద్దతు నాకే ఉంది
* విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం
* పదవి లేకున్నా గ్రామానికి అనేక సేవలు

చేవెళ్ల, నేటిధాత్రి :

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఏ గ్రామాల్లో చూసిన ఎన్నికల హడావిడి వాతావరణమే దర్శనమిస్తుంది. షాబాద్ మండలం పోతుగల్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటిగా గడపగడపకు ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోతుగల్ పంచాయతీలో పంచాయతీ అనుబంధ గ్రామం చిన్న, పెద్ద తండాలు కలుపుకొని సుమారు 12వందల ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పామేనా నర్సిములు ముందంజలో కనిపిస్తున్నారు. బొట్టుపెట్టి ఓటు అడుగుతూ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సర్పంచిగా అవకాశం ఇచ్చి అభివృద్ధికి ఓటువేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సర్పంచిగా గెలిచినా వెంటనే గ్రామంలో అండర్ డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు చేపడతానని తెలిపారు.బీటీ రోడ్లు వేయిస్తానని అన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ నీళ్లు రాని పరిస్థిలో నీటి సమస్య ఏర్పడుతుంది ఈ సమస్యను అదిగమించడానికి పోతుగల్ గ్రామంలోని ప్రతి వార్డు లో బోరు వేసి, మిని ట్యాంక్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. హామీ ఇచ్చారు.గ్రామానికి గ్రంధాలయం ఏర్పాటు చేస్థానని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తొడ్పాటు అందిస్తానని తెలిపారు. గ్రామంలో ఫిల్టర్ వాటర్ సెంటర్ ను ఏర్పాటు చేసి గ్రామప్రజలకు ఉచితంగా ఫిల్టర్ నీళ్లను అందిస్తానని తెలిపారు. గ్రామంలో మృతిచెందిన కుటుంబానికి 5 వేల రూ. ఆర్థిక సహాయం అందజేస్తానని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందేలా, గ్రామ అభివృద్ధికి అన్నివిదాల కృషి చేస్తానని తెలిపారు. గ్రామప్రజలకు ఓటర్లకు కత్తెర గుర్తుకు ఓటువేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చూపిస్తా..

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చూపిస్తా

* గ్రామప్రజలకు సేవకురాలిగా పని చేస్తా
* బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి
* ఆలూరు సర్పంచ్ అభ్యర్థి మంగలి భవాని

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

చేవెళ్ల మండం ఆలూరులో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఆలూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మంగలి భవాని వెంకటేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్పంచిగా ఆశీర్వదించి అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేస్తానని అన్నారు. తన భర్త మంగలి వెంకటేష్ ఎటువంటి పదవి లేకున్నా గ్రామంలో సొంత నిధులతో అనేక అభివృద్ధి సేవకార్యక్రమాలు చేశారాని తెలిపారు. తనకు సర్పంచిగా అవకాశం ఇస్తే మరింత సేవచేయటానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలనుండి తమకు సానుకూల స్పందన లభిస్తుందని, గ్రామస్థుల మద్దతు తనకే ఉందని అన్నారు. సర్పంచిగా తప్పకుండ విజయం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రచారంలో భవాని తనకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T141351.965.wav?_=1

 

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

* మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణి చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల, నేటిధాత్రి :

 

చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య శనివారం నవాబ్ పేట్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి పేరిట డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వెలుగు ప్రార్థనను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి, సంక్షేమ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని,గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవిత స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రధానంగా అమలు అవుతున్న పథకాలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఆదర్శ పాఠశాలలో మహిళా అధ్యక్షురాలు నియామకం, ఆర్టీసీ బస్సుల కొనుగోలులో మహిళా సమాఖ్యల భాగస్వామ్యం, వడ్డీ రహిత రుణాలు, విద్యార్థుల వసతి మెస్ చార్జీల తగ్గింపు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు . మహిళలను ఆర్థికంగా స్వావలంబి, సామాజికంగా బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళ సంఘం ప్రతినిధులు, సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఇంచార్జి టిపివో వాణి ఓవరాక్షన్…

చేవెళ్ల ఇంచార్జి టిపివో వాణి ఓవరాక్షన్

•చేవెళ్ల మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణలు
* వివరణ కోరిన మీడియాతో టిపివో వాణి సినిమా డైలాగ్స్
* నేను కాల్ సెంటర్ ఏమన్నా పెట్టానా.
వివరణకు ఫోన్లు చేయొద్దు ఆఫీస్ కు వచ్చి మాట్లాడాలి
* అక్రమనిర్మాణలపై టీపీవో నిస్సహాయ వైఖరి, వారానికి ఒక్కరోజు డ్యూటీ, వచ్చినప్పుడే లెక్క.
* మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్న చేవెళ్ల ఇంచార్జి టిపిఓ వాణి.

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపాలిటీకి కొత్తగా వచ్చిన మొయినాబాద్ టీపీవో, చేవెళ్ల ఇంచార్జీ టౌన్ ప్లాన్ అధికారిణి(టీపీవో) జి. వాణి ఓవరాక్షన్ పనులలో కంటే మాట్లాలోనే కనిపిస్తుంది. చేవెళ్ల మున్సిపల్ పట్టణ పరిదిలోని ఊరేళ్ళ
వార్డులో సర్వే నెంబర్ 195 లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది. ఈ అక్రమనిర్మాణంపై వార్తపత్రికల్లో
కథనాలు వచ్చాయి. వారం క్రితం మున్సిపల్ కమిషనర్ వెంకటేశంను వివరణ కోరగా బదులుగా ఆయన టీపీవో ను అడగాలని తెలిపారు.శనివారం ఇదే విషయాన్ని ఇంచార్జ్ టీపీవో వాణి ని ఫోన్లో వివరణకోసం ఫోన్ చేసి ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అడిగిన విలేకరుతో ఆమె మాట్లాడుతూ ‘నేనేమన్నా కాల్ సెంటర్ పెట్టనా.. ఫోన్ చేసి అడగడానికి మీరు ఏదేమైనా ఆఫీస్ కి వచ్చి మాట్లాడాలి అంటూ సినిమా డైలాగులు మాట్లాడారు. టీపీఓ వాణి చేవెళ్ల ఇంచార్జ్ టీపీవో కావటంతో చేవెళ్ల మున్సిపాలిటీలో వారానికి రెండు రోజులు డ్యూటీ, అందులోను అక్రమనిర్మాణాలపై వారం రోజులుగా వార్త కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా టీపీఓ వాణి ఇప్పటి వరకు అక్రమానిర్మణానికి సంబందించి ఏ చర్యలు చేపట్టకపోవటం విడ్డురం.

* 111కు ట్రబుల్ షాట్•
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 111జీవోలో కోకొల్లలుగా వెలుస్తున్నాయి. 111జీవోలోని మొయినాబాద్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మొయినాబాద్, అజిజ్ నగర్, చిలుకూరు, హిమాయత్ నగర్, సురంగల్, ఎనికెపల్లి ముర్తుజాగూడా గ్రామాలు మున్సిపల్ పరిధిలోనె ఉన్నాయి. ఈ గ్రామాలలో అక్రమ ఫామ్ హౌస్ లు, వెంచర్లు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. మొయినాబాద్ అక్రమనిర్మాణలపై వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. అక్కడా ఈ మేడం గారే విధులు వెలగబేడుతున్నారు కాని ఏ ఒక్క దానిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మొయినాబాద్ ప్రజలు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ లో వెలగబెట్టలేనిది చేవెళ్లలో అక్రమనిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తారనుకోవటం కలే నని చేవెళ్ల, మొయినాబాద్ ప్రజలు ఆరోపిస్తున్నారు. నోటీసులు ఇస్తామని చెపుతున్న మున్సిపల్ అధికారుల మాటలు హాస్యస్పదమవు తున్నాయి. 3నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా యతేచ్చగా ఒక అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతున్నదనే విషయం అదుకారులకు తెలిసి కూడా ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు ఇవ్వని అధికారులు అదే విషయాన్ని రెండు నెలలుగా చెప్పటం హాస్యాని తలపిస్తుంది.

వందేమాతర గీతాలాపన…

వందేమాతర గీతాలాపన

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నగరం గ్రామంలో వందేమాతరం గేయం బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం జాతీయ గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నగరం గ్రామంలో గల ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక వందేమాతర గేయం ఆలపించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సిబ్బంది కొరతతో చేవెళ్ల మున్సిపల్‌లో ఇబ్బందులు…

ఊరేళ్ళ వార్డు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణానికి గతంలో పంచాయతీ అనుమతులు తీసుకున్నారని నిర్మాణదారుడు తెలిపాడు.

 

టి పి ఓ ఇంచార్జ్ ఉన్నారు వారిని ఒకసారి అడగండి. చేవెళ్ల మున్సిపల్ లో స్టాప్ కొరత వల్ల అక్రమ నిర్మాణాల పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. 2ఏళ్ల క్రితం తీసుకున్న పంచాయతీ అనుమతులు గడువు ముగిసాకా మున్సిపల్ అనుమతులు అప్డేట్ చెయ్యాలి కదా! అని విలేకర్ అడిగిన ప్రశ్నకు పంచాయతీ పాత అనుమతులు చేయాలంటే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఇద్దరు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు, ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, సెక్షన్ వర్క్ ఉండాలి. సిబ్బంది కొరత ఇబ్బందిగా మారింది. కచ్చితంగా నోటీసులు ఇస్తాం . వీలైతే బిల్డింగ్ పోల్చిపో వీలైతే బిల్డింగ్ కూల్చివేయడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కు రిపోర్ట్ పంపిస్తాం.

అక్రమ నిర్మాణాలకు చేవెళ్లమున్సిపల్ అండదండలు….

అక్రమ నిర్మాణాలకు చేవెళ్లమున్సిపల్ అండదండలు

* చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఊరేళ్ళ స.నెం.195 లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం
* పంచాయతీ అనుమతులు ఉన్నాయంటా..
* నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో పత్రాలు లేవు
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం
* పత్రికల్లో కథనాలకు స్పందించని కమిషనర్
* రెండు నెలలుగా యతేచ్చగా కొనసాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణం పనులు
* కనీసం నోటీసులు ఇవ్వని వైనం
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ పరోక్షంగా అక్రమాలకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు
* వెంటనే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి చర్యలు తీసుకోవాలి.

చేవెళ్ల,నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకు చెబుతూ అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారు. దాంతో కార్పొరేషన్‌ అదాయానికి భారీ స్థాయిలో గండిపడుతోంది. అధికారుల చేతి వాటంతోనే అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పట్టణ మున్సిపల్ పరిధిలోని ఊరేళ్ళ వార్డులోని సర్వే నెంబర్ 195 లో మున్సిపల్ అనుమతులు లేకుండా 2నెలలుగా ఓ ఫామ్ హౌస్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ అంశాన్ని నేటిధాత్రి వార్త పత్రిక కథనాన్ని వెలువరించింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఈ అక్రమ నిర్మాణానికి ఎప్పుడో గతంలో 2023లో పంచాయతీ అనుమతులు తీసుకున్నారంటా అని మున్సిపల్ కమిషనర్ నిర్దారణ చేయకుండానె చెప్పారు.

2 ఏళ్ల క్రితం పంచాయతీలో తీసుకున్న అనుమతులు గడువు ముసినప్పటికీ చేవెళ్ల మున్సిపల్ గా ఏర్పడిన తర్వాత మున్సిపల్ అనుమతులు పునరుద్ధరించకుండా అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని చేవెళ్ల మున్సిపల్ అధికారులపై స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. గతంలో పంచాయతి అనుమతులు ఉన్నాయని చెపుతు, 2 నెలలుగా నిర్వీర్యామంగా కొనసాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణానికి మేము నోటీసులు ఇస్తామని ఇప్పుడు చెప్పటం గమనర్హం.

* నోటీసులు కూడా ఇవ్వడం లేదు..

ఈ అనధికారిక ఈ ఫామ్ హౌస్‌ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవటం అక్రమనిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉదాసీనత కనబడుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా… అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస నిర్మాణ పత్రాలు లేకుండానే విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ అధికారులపై తీరుపై మండల ప్రజలు మండిపడుతున్నారు.

•అధికారుల మౌనం ఎందుకో..?

ఈ ఫామ్ హౌస్ వ్యవహారంపై అప్పటి పంచాయతీ అధికారులు, ఇప్పటి మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని చెప్పే అధికారులు ఊరేళ్ళ మున్సిపల్ పరిధిలో ఫామ్ హౌస్ కడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా, మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలియడం లేదు.ఈ విషయంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విషాదంలో ప్రజలు వినోదంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య…

విషాదంలో ప్రజలు వినోదంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య

* మీర్జాగూడలో రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ
•ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకుండా ప్రారంభోత్సవాలు
* ఎమ్మెల్యే బాటలోని ఆయన అనుచర గణం
* నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటున్న పట్టింపులేని ఎమ్మెల్యే
•అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాలే యాదయ్య
•ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కాలే యాదయ్య
•మాజీ ఎమ్మెల్యేగా మారెందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న ప్రజలు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనివున్నట్లు చేవెళ్ల నియోజకవర్గం ఓటర్ల దుస్థితి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కాలే యాదయ్య నియోజకవర్గ ప్రజల్ని నిండా ముంచుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తన ఆస్తులను, పదవిని కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని స్థానిక ప్రజలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికై పార్టీలు మారినట్లు చెబుతున్న ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, నియోజకవర్గ ప్రజలు వరుసగా మూడు సార్లు కాలే యాదయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓరగబెట్టింది ఏమి లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* ఘోర రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ

హైదరాబాదు బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల నియోజకవర్గం మీర్జాగూడ వద్ద ఈనెల 3వ తేదీన సోమవారం ఉదయం 6.15 గంటలకు ఘోర రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగితే తాఫీగా అందరూ వచ్చాక 9 గంటలకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకు స్థానిక ప్రజల నుంచి నిరసనసెగ తగిలింది. ఈ ప్రమాదానికి కారణం గత 10ఎళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులే కారణమంటూ ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానిక ప్రజలు అడ్డంగా నిలదీశారు. 2018 లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా మీరేం చేశారని ఎమ్మెల్యేను స్థానికులు సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే మీరేం చేస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారని స్థానికులు నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఓ సందర్భంలో ఎమ్మెల్యే పై స్థానిక ప్రజలు రాళ్లుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక నోరు మెదపకుండా సైలెంట్ గా అక్కడి నుంచి పారిపోయాడు. గత ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నియోజకవర్గ ప్రజల నుంచి పలు గ్రామాల్లో నిరసన సెగ తగిలింది. అయినగాని ఎమ్మెల్యే కాలే యాదయ్యలో ఎలాంటి మార్పు రాదని వచ్చే ఎన్నికల్లో కాలే యాదయ్య మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

•శవాల మీద ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

ఒకవైపు నియోజకవర్గం ప్రజలంతా ఘోర రోడ్డు ప్రమాదంలో 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయి తీవ్ర ఆవేదనలో శోకసంద్రంలో ఉంటే అదేమీ పట్టనట్లు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తో కలిసి షాబాద్ మండలంలో పలు ప్రారంభోత్సవాలు చేశారు.ఈ ఘోర రోడ్డు ప్రమాదం వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్తు దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రజలందరినీ కలిచివేయటం, అందరు దిగ్బ్రాంతికి గురై శోక సంద్రంలో మునిగిపోయారు. ఓవైపు శవాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అవుతుండగానే మానవత్వం లేని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆయన అనుచరులతో కలిసి మానవత్వాన్ని మంట కలిలిపేలా షాబాద్ మండల పరిధిలో మాచన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్, పునరుద్ధరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, పార్కును ప్రారంభించారు. అనంతరం పార్కులో ప్రారంభమైన క్రీడా పరికరాలపై విన్యాసాలు చేస్తూ ఆనందం పొందారు.

•రంగులు మార్చడంలో మమ్మల్ని మించిన వారే లేరయ్యా.

చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగులు మార్చడంలో మిమ్మల్ని మించిన వారే లేరయ్యా అన్న ధోరణిలో, విశ్వదాభిరామ వినురవేమా అని వేమన పద్యాన్ని నిజం చేశారు.కేవలం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీల జెండాలను మార్చటంలో తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య చరిత్ర సృష్టించారు.వరుసగా మూడుసార్లు కాలే యాదయ్యను నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడుసార్లు పార్టీలను మార్చి తమ ఆస్తులను, పదవులను కాపాడుకునేందుకే,అవకాశవాద రాజకీయాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇది నియోజకవర్గ ప్రజల పాలిట శాపంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కేఎస్ రత్నం కూడా ఊసరవెల్లిలా తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి బిజెపి పార్టీల జెండాలను మార్చి చరిత్ర సృష్టించారు. మరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలే యాదయ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందగా, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేన భీమ్ భరత్ పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలా గెలుపొందిన మూడుసార్లు అధికార పార్టీలో లేకుంటే తన ఆస్తులు, పదవులను కాపాడుకుకోలేననే భయంతోనే రంగులు మార్చడంలో ఒకరిని మించి ఒకరు తయారయ్యారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గత 20 ఏళ్లుగా,నాలుగు పర్యాయాలు చేవెళ్ల నియోజకవర్గం (ఎస్సీ)నుంచి ప్రాతినిధ్య ఊహించిన ఇద్దరు (మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య) ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ ఆదర్శంగా నిలిచారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో వారి ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలపై ప్రేమతో కాదని నియోజకవర్గ ప్రజలు బల్లగుద్ది చెబుతున్నారు.

•ఎమ్మెల్యే కాలే యాదయ్య ఏపార్టీలో ఉన్నారో బహిరంగ ప్రకటన చయాలి

బీఆర్ఎస్ పార్టీ భీ పామ్ పై గెలుపొందిన ఎమ్మెల్యే కాలే యాదయ్య అసలు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా…? లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కోనసాగుతున్నరో నియోజకవర్గ ప్రజలకు బహిరంగ ప్రకటన చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో కోనసాగితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపుల్లో ఎందుకు పాల్గొనటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపార్టీ కండువాలు వేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతుండగా మరి ఆయన ఎందుకు కాంగ్రెస్ కండువా వేసుకోవటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేను ఈసారి ఇంటి బాట పట్టిస్తామని ఓటర్లు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధికై తమ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు భగవంతుడు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించి హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి…

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి

•భౌతికకాయానికి నివాళిలు అర్పించిన భీంభరత్
* రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

షాబాద్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు శనివారం ఉదయం అకాల మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రాములు స్వగ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, తమిల్లి రవీందర్ షాబాద్ సర్పంచ్, షాబాద్ ఎంపీటీసీ అశోక్, తొంట వెంకటయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమలపురం శ్రీరామ్ రెడ్డి, బందయ్య దోస్వాడ సర్పంచ్ రాములు, తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య, మద్దూరు మల్లేష్ సర్పంచ్, తదితరులు రిపోర్టర్ రాములు భౌతికకాయానికి నివాళిలు అర్పించారు.

చేవెళ్లలో అక్రమ ఫామ్ హౌస్‌ల కూల్చివేతకు ఆదేశాలు

 

మున్సిపల్ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చర్యలు తప్పవు. కందవాడ వార్డు 269 అసైన్డ్ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం పనులు ఆపివేశాము. జిల్లా ఉన్నత అధికారులకు రిపోర్ట్ పంపించి కూల్చివేస్తాము.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం.

అసైన్డ్ భూములలో అక్రమ ఫామ్‌హౌస్‌ నిర్మాణం….

అసైన్డ్ భూములలో అక్రమ ఫామ్‌హౌస్‌ నిర్మాణం

* మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్
•కందవాడ 269అసైన్డ్ లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలు
* పనులు ఆపివేసిన టౌన్ ప్లానింగ్ అధికారి
* అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం

చేవెళ్ల,నేటిధాత్రి:

 

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వంటి ప్రాంతాల్లో, నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములలో బహుళ అంతస్తుల భవనాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. చేవెళ్ల పట్టణ మున్సిపల్ పరిధిలోని కందవాడ వార్డులోని సర్వే నెంబర్ 269 లో సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్ పట్టాలను నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించింది. కాని ఇప్పుడు ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు పాగావేశారు. ప్రభుత్వ అసైన్డ్ పట్టాలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నయాన బయానకు కొనుగోలు చేసి ఆ భూముల్లో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ పి.ఓ.టి చట్టానికి విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కందవాడ సర్వేనెంబర్ 269 లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సుమారు 100ఎకరాల అసైన్డ్ భూమి ఉంది.
ఇందులో సుమారు 80శాతం భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వ భూములు అమ్మకూడదన్న నిబంధన ఉన్న, యతేచ్చగా విక్రయిస్తున్నారు. పట్టా భూముల ధరలు కోట్లలో ఉండటంతో, ఐదుకో పదికో చౌక ధరకు ఈ ప్రభుత్వ అసైన్డ్ పట్టా భూములను కొనుగోలు చేసి, కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు.

అసైన్డ్ లో నిర్మాణాలకు అనుమతులు ఎలా..

పట్టా భూముల్లో నిర్మాణాలు చేయాలంటేనే మున్సిపల్ శాఖ నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకునే నిర్మాణం చేపట్టాలి. కాని కందవాడలో దర్జాగా అసైన్ భూముల్లో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణదారులు రెవెన్యూ చట్ట నిబంధనలను, అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా, దర్జాగా అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. పి ఓ టి చట్టానికి విరుద్దంగా అమ్మకాలు, కొనుగోలు చేసిన ప్రభుత్వ అసైన్డ్ భూములను పి ఓ టి యాక్ట్
కింద నోటీసులు ఇచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాని రెవెన్యూ శాఖ అధికారులు మండలపరిధిలో ఎక్కడ కఠినంగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారులు కఠినంగా వ్యవహరించకపోవటంతోనే ఇలా అక్రమనిర్మాణాలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ కల్చర్ పల్లెలకు విస్తరించటంతో ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా వదలటంలేదు. అసైన్డ్ భూములను మూడవ పార్టీలకు విక్రయించడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ అండతో అసైన్డ్ భూములలో దందాలకు పాల్పడుతున్నారు. కందవాడ రెవెన్యూ మున్సిపల్ పరిది 269 అసైన్మెంట్ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై సోమవారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం చర్యలు చేపట్టారు. కమిషనర్ వెంకటేశం ఆదేశాలతో చేవెళ్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఇంచార్జ్ అధికారి అమరేందర్ రెడ్డి చర్యలలో భాగంగా ఫామ్ హౌస్ నిర్మాణం పనులను నిలిపివేశారు. అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగించాలని నిర్మాణదారులను హెచ్చరించారు.

*గ్రూప్ 1 విజేతను సన్మానించిన ఎమ్మెల్యే…

*గ్రూప్ 1 విజేతను సన్మానించిన ఎమ్మెల్యే

కాప్రా నేటిధాత్రి

చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం నాగార్జున కాలనీ కి చెందిన దరవత్ సబితా ఇటీవల విడుదల అయిన గ్రూప్ 1 ఫలితాల్లో 303 ర్యాంక్ సాధించి డి.ఎస్.పి గా ఎంపిక కావడం జరిగింది.
ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారి నివాసానికి (డాక్టర్ ఏ ఎస్ రావు నగర్) డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి తో కలిసి వెళ్ళి వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి గ్రూప్ 1 ఫలితాల్లో డీ ఎస్ పి గా నియమితులైన సబితా ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని ఈమె విజయం బంజారా జాతి కే గర్వకారణం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దాతల చేయూత అభినందనీయం…

దాతల చేయూత అభినందనీయం

•చేవెళ్ల మండల విద్యాధికారి పురందాస్

చేవెళ్ల, నేటిధాత్రి :

 

 

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు చేయూతనివ్వడం అభినందనీయమని చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్. పురందాస్ అన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల ఎన్కెపల్లిలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఇదే పాఠశాలలోఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జి. కమల మనోహర్ బాబు దంపతులు శుక్రవారం మండల విద్యాధికారి ఎల్.పురన్ దాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి మునీర్ పాషా చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి పురందాస్ మాట్లాడుతూ దాతలు పేద విద్యార్థులకు ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించినప్పుడు ఇదే తరహాలో పేదవారికి సహాయం చేయాలని అన్నారు. ధనం చాలామంది దగ్గర ఉన్నప్పటికీ దానగుణం కొందరిలోనే ఉంటుందని,అలాంటి వారిలో కమల టీచర్ దంపతులు ఒకరని అభినదించారు. వారు చేసిన మంచి ఎప్పటికీ వారి వెంట ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా దాత మనోహర్ బాబు మాట్లాడుతూ భగవంతుడు తనకిచ్చిన దానిలో కొంత విద్యార్థులతో పంచుకుంటున్నాను అని అన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తదుపరి పాఠశాల పక్షాన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం కలసి దాతను విద్యాధికారి సమక్షంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రేణు అంగన్వాడి కార్యకర్త స్వరూప ,ఆశ కార్యకర్త సుజాత విద్యార్థులు పాల్గొన్నారు.

భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త …

భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త

చేవెళ్ల, నేటిధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall


కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు అనుబంధం గ్రామమైన వెంకన్నగూడ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య

నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Husband strangles wife to death…

ఇతనికి ఇద్దరు భార్యలు. రెండో భార్య అయిన రజితను అతికిరాతకంగా హత్య చేశాడు. వెంకన్నగూడ‌ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య రజిత(30)తో గత రెండేళ్లుగా మనస్పర్దాలున్నాయి. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగిన మంగళవారం జంగయ్య రజిత హత్యకు పథకం వేశాడు. సోమవారం సాయంత్రం భార్య రజిత, జంగయ్య ఇద్దరు గ్రామ సమీపంలో మద్యం త్రాగారు. అనంతరం రజితను చున్నీతో మెడకు బిగించి ఉరివేశాడు. అప్పటికి చావలేదనుకుని సిమెంట్ కడ్డీతో మోది అతికిరాతకంగా హత్య చేశాడు.
హత్య చేసిన అనంతరం ఫోటోలు, వీడియోలు తీసి మొదటి భార్యకు పంపించాడు. అదేరోజు రాత్రి నిందితుడు చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతా మా ఇష్టం అడిగేది ఎవరు…

అంతా మా ఇష్టం అడిగేది ఎవరు?

* అధికారులు ఆదేశాలు బేఖాతరు
* అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ నిర్మాణం

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

అధికారుల తూతు మంత్రపు చర్యలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకుని జీవన్ సాగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్ భూములు పట్ట భూముల్లోని ఫామ్ హౌస్ లకు దారులు వేస్తున్నారు. అధికారులు హెచ్చరించిన అక్రమార్కులు మాకు ఎవరు అడ్డు అంతా మా ఇష్టం అన్న తీరుతో అధికారుల హెచ్చరికలు, ఆదేశాలను లెక్కచేయకుండా యధావిధిగా వారిపని వారు యతేచగా తీసుకుపోతున్నారు. దీనికి కారణం అధికారులు చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోకపోవడమేనని ప్రజలు విమర్శిస్తున్నారు.

 

 

కమ్మెట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 217లోని ప్రభుత్వ అసైన్డ్ భూమిలో నుండి ఫామ్ హౌస్ కు సుమారు 20 ఫీట్ల మట్టిరోడ్డు దారివేసి వెంచర్ లో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం వార్త పత్రికలలో వచ్చిన కథనాలకు చివెళ్ళ మండల రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో కృష్ణయ్య ఆదేశాల మేరకు చంద్రమోహన్ చర్యలలో భాగంగా ప్రభుత్వ భూమిలో వేసిన అక్రమ రోడ్డుకు ఇరువైపులా జెసిబి తో కాలువ తవ్వి రాకపోకలకు అడ్డుకట్ట వేశారు. పి ఓ టి చట్టం ప్రకారం
అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. కాని అధికారులు చర్యలు చేపట్టిన కొద్ది రోజులలోపే ఇరువైపులా తీసిన కాలువను పూడ్చి ఫామ్ హౌస్ నిర్మాణదారులు యధావిధిగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. అక్రమాలపై అధికారుల ఆదేశాలు నీటి బుడగళ్ల మారాయి.

 

 

అధికారుల తూతూ మంత్రపు చర్యలతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ నిర్మాణం కొనసాగుతుంది. చేవెళ్ల మున్సిపల్ పట్టణ ఊరెళ్ళ వార్డ్ పరిధిలోని సర్వే నెంబర్ 194లో హెచ్ఎండిఏ, మున్సిపల్ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. 15 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చి పనులను ఆపివేశారు.అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టొద్దని హెచ్చరించారు. కానీ ఫామ్ హౌస్ నిర్మాణదారుడు మునిసిపల్ ఆదేశాలను బేఖాతార్ చేసి యతేచగా చక చక ఫార్మ్ హౌస్ నిర్మాణం కొనసాగిస్తున్నారు.అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ విషయంపై చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా అధికారులను పంపించి వెంటనే పనులు ఆపుచేస్తామని తెలిపారు. గతంలోని వారికి అనుమతులు వచ్చేవరకు పనులు చేపట్టవద్దని చెప్పమని, అయినా మళ్లీ పనులు చేపట్టడంతో వారిపై చట్ట పరమ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహిళ సాధికారత లక్ష్యమే స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్…

మహిళ సాధికారత లక్ష్యమే స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్

* ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, నేటిధాత్రి :

 

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 75వ పుట్టిన రోజునుపురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పట్టణ కేంద్రంలో బుధవారం కేజీఆర్ కన్వెన్షన్ హాల్ లో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అవకాశాన్ని మహిళలు, చిన్నపిల్లల కు డయాబెటిస్, డెంటల్, కలరా, సాదరణ ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 74 మంది యువత రక్తదానం చేశారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి తమ వంతు సహకారం అందించిన యువతను అభినందించారు.

 

 

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. నరేంద్ర మోడీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నేరంద్రమోడీ పదేళ్ల పాలనలో దేశప్రగతి పురోగతి సాధించిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు.
పార్లమెంట్ లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించి సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బిజెపి యువ నాయకులు డా. మల్గారి వైభవ్ రెడ్డి , మండల అధ్యక్షులు శ్రీకాంత్, అనంతరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కొంచెం శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, శర్వలింగం, మాణిక రెడ్డి, శర్వలింగం, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, గుడిపల్లి మధుసూదన్ రెడ్డి, పత్తి సత్యనారాయణ, పెద్దోళ్ల కృష్ణ, బిజెపి శ్రేణులు వైద్య అధికారులు, అంగనివాడి, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి…

* బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి

చేవెళ్ల,నేటిధాత్రి:

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు,స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ఆర్థికంగా ఆడుకోవాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం కె.రామస్వామి, నియోజకవర్గ బీసీ కన్వీనర్ పాడాటి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కులు కల్పించి వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ,జెడ్పిటిసి సర్పంచు, ఎన్నికల్లో ప్రతి గ్రామంలో 42 శాతం రిజర్వేషన్ కోటా ప్రకారం స్థానాలు కల్పించాలని అన్నారు. రాష్టంలో అత్యధికంగా బీసీలు ఉన్నారని వారి అభివృద్ధికి బీసీ బందును ప్రవేశపెట్టి బడ్జెట్లో అధికనిధులు కేటాయించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్రం బీసీలకు ఇతర వర్గాలకు ఇండ్లు మంజూరులో ఇంటికి 10 లక్షలు రూపాయలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వాలు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని అన్నారు. నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.రైతులు యూరియా కోసం గత 20 రోజులగా అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి సకాలంలో ఎరువులను అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి బీసీ సంఘాల నాయకులు ఎం. సుధాకర్ గౌడ్,
మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, నియోజకవర్గం బీసీ కన్వీనర్ పాడాటి వెంకటయ్య, కో కన్వీనర్ జీ నరసింహులు, మొయినాబాద్ మండల సిపిఐ కార్యదర్శి కే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన కార్యక్రమం…

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన కార్యక్రమం

* ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు.

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

 

చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు జి. వెంకటరమణకుమార్. ఎం. సంతోషి ఉపాధ్యాయులు విద్యారంగంలో వారు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాశాఖ
ఉత్తమ ఉపాధ్యాయులకు వారి సేవలను గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందించింది.
చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సాంఘీకశాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిన జీ.

 

 

 

 

వెంకటరమణకుమార్ కలెక్టరేట్ లో బుధవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. గురువారం చేవెళ్ల మున్సిపల్ పట్టనకేంద్రంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేవెళ్ల మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఉపాధ్యాయురాలు సంతోషి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

 

 

 

 

 

గణిత శాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిననందుకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ పురస్కారాలు అందుకున్న వెంకటరమణకుమార్, సంతోషి ఉపాధ్యాయులను, ఎంఈఓ పురందాస్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నర్సింహా, సుధాకర్, శృతి, అలివేలు రజిత, అరుణ, అనిత పలువురు ఉపాధ్యాయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించి ప్రశంశించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, మాట్లాడుతూ తమ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందుకోవటం అభినదనీయమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన సాధించిన విజయాలు ఒక్క రోజులో వచ్చినవి కావు, అవి ఆయన పట్టుదల, నిరంతర కృషికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో

ఏసీబీ వలలో అవినీతి తిమింగళం…

ఏసీబీ వలలో అవినీతి తిమింగళం

* 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ చేవెళ్ల మున్సిపాలిటీ టౌన్ ప్లాన్ ఇంచార్జ్, నార్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

 

 

చేవెళ్ల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని, నార్సింగ్ మున్సిపాలిటీ టౌన్ ప్లానర్ మణిహారిక 4లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడింది. మంచిరేవుల లోని వినోద్ అనే వ్యక్తి కి చెందిన ప్లాట్ కు ఎల్ ఆర్ ఎస్ క్లియర్ ప్రక్రియను మొదలుపెట్టటానికి నార్సింగ్ మున్సిపాలిటీ టౌన్ ప్లానర్ మణిహారిక 10 లక్ష డిమాండ్ చేసింది.

 

 

 

 

4లక్షలకు ఒప్పందం కుదిరింది. నిహారిక భారీగా కొంచెం డిమాండ్ చేయడంతో ప్లాట్ ఓనర్ వినోద్ ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం వినోద్ నుండి 4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు.నిందితురాలు టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారికను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక విభాగం ప్రజాసంబంధాల అధికారి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం కోసం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 నెంబర్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డిఎస్పి శ్రీధర్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version