ఎర్రం సతీష్ కుమార్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
నమస్తే తెలంగాణ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడి సరికాదని,బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ,దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టిడబ్ల్యూ జెఎఫ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగోస్థంభంగా ఉన్న మీడియాపై బెదిరింపులకు దిగటం మంచిపద్దతి కాదని,సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్ఛ పత్రికలకు ఉంటుందని, పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే, వాటికి ఖండనలు ఇవ్వటం, వివరణలు ఇవ్వటం చేయాలి కానీ బెదిరింపులకు పాల్పడటం, భౌతిక దాడులకు దిగటానికి ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. భావప్రకటనా స్వేఛ్ఛ పై దాడి సరికాదని, తక్షణమే పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు, దాడికి ఉసిగొల్పిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లాలోని నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్యాలయంపై కొంతమంది దుండగులు బుధవారం దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి వారు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి అని అన్నారు. అన్యాయాలను నిష్పక్షపాతంగా సమాజానికి అందించే నాలుగవ స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలు దారుణం అని విమర్శించారు.ప్రశ్నించే గొంతులను అణిచివేతకు గురిచేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రభుత్వం,పోలీసు అధికారులు పత్రికా కార్యాలయంపై దాడికి కారకులను చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ లు చిట్ల రమేష్, ఉమేష్,రాజు పటేల్,రమేష్ రెడ్డి,రాజు,నరేష్ స్వెన్, రాయలింగు,వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్,పడాల సంతోష్,పార్వతి సురేష్, పార్వతి రాజేష్,సిద్దార్థ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలి స్టులపై దాడి హేయమైన చర్య మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా వారిపై దుర్భాష లాడుతూ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ప్రజాపాలన కొన సాగించాలని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రాబోయే కాలంలో విద్యార్థులు యువ కులు ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చ రించారు. ఇప్పటికైనా ఇటు వంటి చర్యలు మానుకోవాలని కొనియాడారు లేనిపక్షంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపు తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి సీనియర్ జిల్లా నాయకులు బెరుగుతరుణ్ గోపి కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు అభిలాష్ ,సిద్దు, శివకుమార్, ప్రశాంత్, వినయ్, వంశీ, సాయి కృష్ణ తేజ ,గణేష్ ,మున్ని, నాని మేఘనాథ్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గత వారం రోజుల క్రితం ఈ దేశ ఉన్నత సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సుప్రీం కోర్టు జే ల్ యు డి ఈ సిజిఐ గావాయ్ పైన జరిగిన దాడికి నిరసనగా కోహిర్ మండలం ఎన్ ఆర్ పి ఎస్ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కోహిర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఇలాంటి చర్యకు పాల్పడిన న్యాయవాదిని శిక్షించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి- అనిల్ బెజ్జంకి
కరీంనగర్, నేటిధాత్రి:
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, ఎమ్మార్పిస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు మాట్లాడుతూ అక్టోబర్7, 2025న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న విషయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడ్డారు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనాగరికమైంది ఈదాడి ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈదాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని, దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అందువల్ల దేశ ప్రజలందరూ ఈదాడిని ఖండించారని, దళితుడైన బిఆర్ గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అహం పూరితంగా ఈదాడికి తెగపడ్డారని, ఈదాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే దాడి వెనుకున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా ఈఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయస్థానంలో పునరావతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఈడిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో తునికి వసంత్ మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, కనకం అంజిబాబు మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, చిలుముల రాజయ్య మాదిగ, ఎల్కపెల్లి పౌలు మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, బొద్దులవాని మాదిగ, దండు అంజయ్య మాదిగ, అంతడుపుల సంపత్ మాదిగ, అలువాల సంపత్ మాదిగ, రేపాక బాబు మాదిగ, అంబాలా మధునయ్య మాదిగ, కనకం నరేష్ మాదిగ, శనిగరపు కొమురయ్య మాదిగ, కనుకుంట్ల శ్రీనివాస్ మాదిగ, కళ్లెపెల్లి కొమురయ్య మాదిగ, అన్నీవేణి కౌసల్య, దేవసాని ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు
జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి
ములుగు టౌన్ నేటి దాత్రి
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై చెప్పుతో దాడి చేయడం దేశ చరిత్రలోనే అత్యంత దౌర్భాగ్యమైన దినమని ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం అంటే దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారనేది స్పష్టంగా అర్థమతుందని ఈ దాడి కి పూర్తి బాధ్యత వారే వహించాలని డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా కేంద్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ములుగు మండల నాయకులు కొర్ర రాజు ఆధ్వర్యంలో అయన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల బాద్యులు రత్నం. ప్రవీణ్ మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ మూఢత్వం ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని, దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి ఇంతవరకు దాడి చేసిన వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లో బీజేపీ ప్రభుత్వ అంతరంగ ఆంతర్యం ఏమిటనేది అర్థమవుతుందని అన్నారు ఇది యావత్తు భారత ప్రజానీకానికి గుండెకాయ లాంటి రాజ్యాంగం పైన చేసిన దాడిగా ఉంది అని ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని అన్నారు దళితుడుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండటాన్ని ఆర్ఎస్ఎస్ బిజెపి జీర్ణించుకోలేకపోతుందన్నారు ఇటీవల ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలకు జస్టిస్ గవాయి తల్లిని ఆహ్వానించగా ఆమె తిరస్కరించినందుకుగాను యూపీలో బిజెపి సర్కార్ బుల్డోజర్లతో ఇండ్లను కూల్చి వేస్తున్న సందర్భంగా జస్టిస్ గవాయి బుల్డోజర్ న్యాయం చెల్లదు రాజ్యాంగ న్యాయం చెల్లుతుందని తీర్పునివ్వడం, మరికొన్ని న్యాయ తీర్పుల ఆధారంగా ఆర్ఎస్ఎస్ బిజెపి ఒక పథకం ప్రకారం కక్ష పెంచుకొని జస్టిస్ గవాయిపై ఉద్దేశపూర్వక దాడి చేసిందన్నారు సనాతన ధర్మాన్ని అడ్డుకునే వారందరినీ ప్రతిఘటిస్తామని న్యాయవాది రాకేష్ కిషోర్ మాట్లాడుతున్నాడు ఇది వ్యక్తి విసిరిన చెప్పు కాదు ఆర్ఎస్ఎస్ విసిరిన అగ్రకుల ఆధిపత్య విషర్పమని అన్నారు. ఈ దాడి రాజ్యాంగం పైన ,దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అత్యున్నత న్యాయస్థానం పైన జరిగిన దాడిగా పరిగణించాలన్నారు అత్యున్నత న్యాయస్థానాలలో కూడా ఆర్ఎస్ఎస్ మూక దాడులు ఆగట్లేదన్నారు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అనేక కీలక తీర్పులు ఇచ్చే జస్టిస్ గవాయ్ దళితుడు కావడం వల్లే ఈ వివక్షకు ఒడిగడుతున్నారని చెప్పారు. సనాతన ధర్మం లో సమానత్వం ఉందా అని ప్రశ్నించారు సనాతన ధర్మంలో సతీసహగమనం బాల్య వివాహాలు కుల వివక్ష జోగిని వ్యవస్థ అసమానతలు తప్ప సనాతన ధర్మంలో సమానత్వం లేదన్నారు సనాతన దర్మం కోసం పని చేసేవారు ముందుగా వారు దాన్ని పాటించాలని ఈ దేశంలో ఎన్ని మత ధర్మాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతంగానే అమలు చేసుకోవచ్చని ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెదులుకోవాలని ఆయన కోరారు ఈ దాడి పై ప్రధానమంత్రి పెదవులతో ఖండించడమే కాదు పూర్తి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే దాడి కి పాల్పడిన అడ్వకెట్ రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి రక్షణ లేకుండా పోయిందన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ నీచ సంస్కృతీ కి ఈ భౌతిక దాడి నిదర్శనం అన్నారు మన రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రిందట సిద్దిపేట లో ఇద్దరు ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న న్యాయవాదులు సామాజిక మాధ్యమాలలో జస్టిస్ గవాయిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారన్నారు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వెనుకాల ఉన్న లాయర్లందరూ జస్టిస్ గవాయ్ ఎడల ఈ వైఖరి కలిగి ఉన్నారంటానికి ఈ దాడి రుజువు చేస్తుందన్నారు జస్టిస్ గవాయి పై దాడి కేవలం ఒక వ్యక్తి పై చేసింది కాదన్నారు తక్షణమే సుప్రీంకోర్టు న్యాయవాది రాకేష్ కిషోర్ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాకుండ వెంటనే అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించాలని ఆయన పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి బహిస్కరించాలని నిషేదించాలని ఈ ఘటనను దేశంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొర్ర రాజు గొంది సాంబయ్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కలవల రవీందర్ కొడపాక చంటి నాయకులు చందర్ రాజు మోహన్ ప్రదీప్ కార్తీక్ పాణి సునీల్ తదితరులు పాల్గొన్నారు
కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాట్లాడుతు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైన జరిగిన దాడి అంటే రాజ్యాంగం పై దాడి అని ప్రజాస్వామ్యం పై దాడి అని దేశ దళిత బహుజనుల పై దాడి రాజ్యాంగాన్ని అవమానించడమేనని మతోన్మాద విష సంస్కృతితో నే ఇలాంటి భౌతిక దాడులు జరుగుతున్నాయి ఈ దేశాన్ని మనువాద కోణంలో పరిపాలించాలనే దురుద్దేశంతో కొంతమంది మనువాదులు దళితుల పట్ల చూపే రాజకీయవాదులు చేసే కుట్రలను మేము ఖండిస్తున్నాం,ఈ సంఘటనను దళిత గిరిజన బహుజనులు వెనుకబడిన వర్గం మేధావులు ప్రజలు వ్యతిరేకించాలని వారు తెలిపారు.
ఝరాసంగం : ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు నిలయమైన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బుధవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా మృత్యుంజయ లక్ష జప యజ్ఞానికి హాజరయ్యారు. వారికి ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలకు అభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని మంగళ హారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం
సోతుకు ప్రవీణ్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడి నీ నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్లకాడ్ల తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలని , జస్టిస్ గవాయ్ పై ఆర్ ఎస్ ఎస్ ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని ఇది ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ అన్నారు.ఈ దాడిని కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ దాడులు కేవలం జస్టిస్ గవాయ్ పైన మాత్రమే కాదు భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపైన దాడి గా చూడాలని అన్నారు.జస్టిస్ గవాయ్ ఎల్లప్పుడూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తీర్పులు ఇచ్చారనీ, అది గిట్టని మతోన్మాద శక్తులు లాయర్ రాకేష్ కిషోర్ రూపంలో దాడులు చేపిస్తున్నారని తెలిపారు. బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద అరాచకాలను ఆపాలని లాయర్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్ధన్, పొనగంటి లావణ్య, పల్లెల రజిత, పెద్దమామల సంధ్య, ఇటికల శ్రీలత, పోతుగంటి స్వప్న, వాసం రజిత, సుభద్ర రాజమణి తదితరులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
మహేష్ పై దాడి చేసిన వారికి ప్రజల సమక్షంలో పతనం తప్పదు.
యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్.
చిట్యాల, నేటిధాత్రి :
పంచకం మహేష్ యాదవ్ కుటుంబం పై దౌర్జన్యంగా దాడి చేయించిన పులి అంజిరెడ్డి తిరుపతిరెడ్డి కి ప్రజల సమక్షంలో పతనం తప్పదని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ అన్నారు.చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం జాతీయ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్ యాదవ సంఘం నాయకులతో కలిసి మాట్లాడుతూ మండలంలోని కాలువ పల్లి గ్రామానికి చెందిన పంచిక స్రవంతి మహేష్ యాదవ్ ల కుటుంబంపై దౌర్జన్యంగా దాడి చేయించి గాయపరిచిన మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,కాల్వపల్లి సర్పంచ్ అంజిరెడ్డిలు పంచిక మహేష్ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా మహేష్ కు తెలియజేయకుండా తెల్లారేసరికి అక్రమంగా దేవాలయ నిర్మాణం చేపట్టగా ఇదేమిటని మర్యాదపూర్వకంగా అడుగగా వారిపై దాడి చేయించడం పులి అంజిరెడ్డి కుటుంబానికి ఆప్రజాస్వామ్యమని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ మండిపడ్డారు. పంచకం మహేష్ యాదవ్ బిజెపి పార్టీ నుండి రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షతో ఆ ఊరి నుండి మహేష్ ను వెల్లగొట్టాలని నీచమైన ఆలోచనలతో పులి కుటుంబం మహేష్ ను రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక దౌర్జన్యంగా దాడులకు, బెదిరింపులకు పాల్పడుతూ నీచమైన ఆలోచనలతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వదిలిపెట్టదన్నారు.ఇప్పటికైనా మహేష్ కుటుంబం పట్ల మీ నీచ రాజకీయాలు మానుకోకపోతే కాల్వపల్లికి గ్రామానికి రాష్ట్రంలోని యాదవులమందరం ఏకమై నీ ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జక్కుల రాములు యాదవ్, కరీంనగర్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బండి మల్లేష్ యాదవ్, జంగా కొమురయ్య, చంద్రశేఖర్, సతీష్, శ్రీశైలం, సంపత్, దిలీప్,యాదవులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.
హెచ్చరించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి.
చిట్యాల, నేటిధాత్రి ;
చిట్యాల మండలం లోని కాల్వపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్ పై ఆగస్టు 15న జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్, ఆయన భార్యపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దాడులకు పాల్పడటం పూర్తిగా బలహీనత రాజకీయాలు అని నేతలు విమర్శించారు. ఇలాంటి దాడులు ప్రజలలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేవని, దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు.
దాడికి వెనుక ఉన్న పులి తిరుపతి రెడ్డి – పులి అంజిరెడ్డి గ్యాంగ్.
జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ – ఈ దాడి వెనుక తిరుపతి రెడ్డి, పులి అంజిరెడ్డి అనుచరులే ఉన్నారని స్పష్టమవుతోంది. వారే కుట్ర పన్ని, తమ అనుచరులను ప్రేరేపించి బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్, ఆయన కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించారు.
తమ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లాభాల కోసం గ్రామంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే ధైర్యం లేక భయపడి ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి అనుచరులు గ్రామ ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, బీజేపీ కార్యకర్తలను అణగదొక్కడమే తమ రాజకీయ విధానంగా మార్చుకున్నారు. కానీ ఈ పద్ధతులు ఇకపై పనిచేయవని, ప్రజలు వారిని తిప్పికొడతారని నేతలు స్పష్టం చేశారు.
నిషిధర్ రెడ్డి గారి హెచ్చరిక
“గ్రామాల్లో బీజేపీకి విపరీతమైన ప్రజా మద్దతు లభిస్తోంది. ఈ పెరుగుతున్న శక్తిని తట్టుకోలేక ప్రత్యర్థులు దాడులకు దిగుతున్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు తాత్కాలిక లాభాల కోసం పార్టీలను మార్చే వారు కాదు. వారు దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడే నిజమైన యోధులు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీలను చిన్న పిల్లలు ఆట వస్తువులు మార్చుకున్నట్లుగా మార్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సత్యనారాయణ అనుచరుడిగా మారి మా కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించడం ప్రజలు బహిరంగంగా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా తన అనుచరులను అణగదొక్కే రాజకీయాలకు ఉపయోగించుకోవడం బాధాకరం. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వహించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడమే ఆయన రాజకీయమైపోయింది. ఇకనైనా మా కార్యకర్తలపై దాడులు జరిగితే బీజేపీ అస్సలు ఊరుకోదు. ప్రజాపరంగా, చట్టపరంగా గట్టి సమాధానం ఇస్తాం. ఇది మా చివరి హెచ్చరిక – ఖబర్దార్!” అని నిషిధర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రవికిరణ్ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్టేకుమట్ల మండల అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ జిల్లా కార్యదర్శి సుదగాని శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు చక్క నరసయ్య బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అశోక్ చారి బిస్కుల రవి ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ రవి పటేల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూచిట్యాల మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన పంచిని మహేష్ యాదవ్ పైన ఆగస్టు 15 రోజున అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్ భార్య పిల్లలు వారి మామ ఇతరులపై దాడి చేశారని బిసి పొలిటికల్ జేఏసీ నీ కలవడం జరిగింది, మహేష్ పై భౌతిక దాడులు సమంజసం కాదని ఒక బీసీ యాదవ బిడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కొట్టడం బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం గుడికి సంబంధించింది గానీ ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలి గాని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు మహేష్ యాదవ్ కాల్వపల్లి గ్రామానికి సర్పంచిగా పోటీ చేస్తాడని అక్కస్సుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అగ్రవర్ణాలు అని మా దృష్టికి రావడంతో మహేష్ ను తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ నుండి సర్పంచి అభ్యర్థిగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబెట్టడానికి మేము కార్యచరణ తీసుకొని కాల్వపల్లి లో మహేష్ యాదవ్ ను గెలిపించుకుంటామని రవి పటేల్ అన్నారు ఈ కార్యక్రమంలో రోడ్డ శ్రీను ప్రణీత్ వెంకటేష్ అఖిల్ సమిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన పంచిక మహేష్ యాదవ్ ఒక యాదవ కుటుంబానికి చెందిన బిసిబిడ్డనని కావాల్సి కొని కల్వపల్లి గ్రామంలో ఉన్నటువంటి పులి అంజిరెడ్డి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఒక బీసీ బిడ్డ ఈ గ్రామంలో ఎదగడం ఏమిటని అక్కసు తోనే గత మూడు సంవత్సరాలుగా నా పైన నా కుటుంబం పైన నన్ను మానసికంగా వేధిస్తూ ఇక్కడ అవకాశం దొరికిన కావల్సుకొని నాపైన దాడులకు ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగానే గత రెండు సంవత్సరాల క్రితం నా కు సంబంధించిన భూమిలో నాకు సమాచారం లేకుండా ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయడం రోడ్డు వేయడం ఇదేమిటని ప్రశ్నిస్తే నాపైన తన అనుచరులతో దాడి చేయించడం నాకు సమాచారం తెలియకుండా నా భూమి ముందు కావాలనే కక్షపూరితంగా గుడి నిర్మాణం పేరుతో నా భూమి ముందు రోడ్డు కబ్జా చేసి నన్ను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి పులి అంజిరెడ్డి నాకు ఎటువంటి సమాచారం తెలియకుండా నా భూమి ముందు గుడి ఎందుకు కడుతున్నారో మాట్లాదానికి వెళ్తే నా కుటుంబం మరియు పిల్లల పైన మహిళలను చూడకుండా పులి అంజిరెడ్డి తన అనుచరులతో నాపై పిడు గుద్దులు గుద్దుతూదాడి చేసి చంపుతామని భయభ్రాంతులకు గురిచే స్తూ ఉండగా నేను నా కుటుంబం భయంతో పారిపోయి రావడం జరిగింది నా కారు అద్దాలు పగలగొట్టి నన్ను భయ బ్రాంతులకు గురి చేసినటువంటి పులి అంజిరెడ్డి పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుచున్నాను. అని అన్నారు అలాగే ఈ దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు అతని వెంట బిజెపి కార్యకర్తలు ఉన్నారు
మానవ అక్రమ రవాణా మానవత్వం పై జరిగే క్రూరమైన దాడి అని టిబిఎస్ఎస్ అధ్యక్షులు అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు. బుధవారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ప్రయోజనాల కోసం మనుషులను అంగడి సరుకుగా మార్చి క్రయ విక్రయాలు జరపడం అత్యంత దుర్మార్గం అన్నారు. ఇది వెట్టి చాకిరి, లైంగిక దోపిడి, బానిసత్వం రూపాల్లో ఉంటుందన్నారు. ఇది మానవత్వం పై జరిగే క్రూరమైన దాడి అని అన్నారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం, పేదరికం, అవినీతి, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమతౌల్యాలు లాంటివి అక్రమ రవాణాకు ప్రధాన కారణాలుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు దీని బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించడంతోపాటు,నివారించడానికి వ్యక్తులు,ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిరంతరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కాంపల్లి హరిచరణ్, రాష్ట్ర నాయకుడు అంబాల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గ ము. బీసీ ముద్దు బిడ్డ, రాష్టం లో బీసీ ల రాజ్యాధికారం కోసం నిరంతరం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న యం యల్ సి మల్లన్న పై న జరిగిన దాడిని జహీరాబాద్ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఇప్పుడిప్పుడే బీసీలు రాజకీయాలు చేస్తున్న తరుణం .రాష్టం లో ఎన్నో పార్టీలు ఉన్న ఎక్కువ శాతం ఉన్న బిసి లకు ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు.ఓట్లన్నీ బిసిలవి సీట్లన్నీ వాళ్ళవి అయిపోతున్నాయి. బీసీల కష్టాలు తీరాలంటే బీసీ నే ముఖ్యమంత్రి ఉండాలి అయితేనే బీసీ ల కున్న అవసరాలు తీరుతాయి అనే ఉదేశ్యం తో రాష్ట్ర మంత తిరుగుతూ ఎన్నో వ్యయ ప్రాయసాలకు ఓర్చుకుంటు బిసిలను మమేకం చేస్తూ వారితో పాటు ఎస్సి, ఎస్టీ, మైనారిటీ లకు ఒక్కటి చేస్తూ రాజకీయాల్లో అందరూ క్రియ శీలంగా పాల్గొనాలి అని హిత బోధ చేస్తూ న్నా మల్లన్న పైన దాడి చేసి బిసి ఉద్దేమాని నీరు కార్చాలని చూస్తున్నారు.మల్లన్న పై దాడి కేవలం వ్యకి గతంగా కాదు? యావత్తు బిసి లపైనే దాడిగా జహీరాబాద్ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎవరెన్ని కుట్రలు చేసిన,ఎన్ని దాడులు చేసిన రాష్టం లో అధికారంలోకి వచ్చేది బిసి ల పార్టీనే అని బీసీ కోర్ కమిటీ సభ్యులు డా.పెద్దగొల్ల నారాయణ అన్నారు.ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే 42 శాతం బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కలిస్తాం అంటున్నారు. 42 శాతం బిసి బిల్లుకు ఆర్డినెన్స్ పాస్ చేస్తూ బిల్ పాస్ చేయించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిసి కోర్ కమిటీ సభ్యులు కొండాపురం నర్సింహులు, ఇమ్రాన్ ,విశ్వనాథ యాదవ్, కోట ధనరాజ్ గౌడ్ ,మహేష్ ముదిరాజ్,దశరత్,తదితరులున్నారు.
విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే పత్రిక విలేకరులపై దాడి చేయడం అనైతికమైన చర్య అని మండల జర్నలిస్టులు, విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుమారస్వామి లు అన్నారు. తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం జరిగిన దాడులు నిరసిస్తూ మండల కేంద్రంలోనీ చౌరస్తాలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఒక భాగమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే పత్రిక విలేకరులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సరికాదన్నారు. సమాజ హితం కోసం విలేకరులు స్వేచ్ఛపూరిత వాతావరణంలో పని చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి, శ్రీనివాస్, రవి, రామకృష్ణ, కుమార్, కిషోర్, మురళి, వెంకట్, రమేష్, విష్ణు, బాబు, శంకర్, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే.
ఈ దాడిలో 26 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే..
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి యావత్ భారత్‌ను ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఆ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
కేవలం పురుషులే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఉన్మాదంతో ఎంతో మంది మహిళలు తమ పసుపు కుంకుమ లకు దూరమయ్యారు.
అయితే, ఈ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసి ఉగ్రవాదులను చావుదెబ్బ కొట్టింది.
ఇదిలాఉంటే..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది.
పహల్గామ్, చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యాటకుల రాకపోకలు తగ్గిపోయాయి.
అక్కడికి వెళ్లాలంటనే ప్రజలు అమ్మో..
అంటూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు.
అక్కడి తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా బంద్ చేశారు.
అయితే, దాదాపు రెండు నెలలు గడుస్తున్నా..
ఇంకా అక్కడి పర్యాటక ప్రాంతాలను తెరవలేదు.
ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
జమ్మూలోని మతపరమైన యాత్రలపై కూడా ప్రభావం చూపింది.
తాజాగా, ఈ విషయంపై జమ్మూ & కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. మూసివున్న పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరచుకోనున్నాయని ఆయన ట్వీట్ చేశారు. భద్రతా పరంగా తీసుకున్న ముందు జాగ్రత్తల కారణంగా తాత్కాలికంగా మూసిన జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని పర్యాటక ప్రదేశాలను జూన్ 17 నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో పహల్గామ్ మార్కెట్, వెరినాగ్ గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాబ్ వ్యాలీ, పార్కులు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు వివిధ చర్యలు తీసుకుంటోంది. గత నెలలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గామ్‌లో క్యాబినెట్ సమావేశానికి హాజరై, బేతాబ్ వ్యాలీ వంటి మూసివున్న ప్రాంతాలను సందర్శించారు.
గణపురం మండల కేంద్రానికి చెందిన పసునూటి రాజు కొమురమ్మ దంపతుల కుమారుడు పసునూటి వెంకటేష్ వయస్సు 30 సంవత్సరాలుఈరోజు వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు వెంకటేష్ మరణంతో ఘనపురం మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ పోస్టుమార్టం నిమిత్తం పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదివాసీ యువకుడి పై దాడి చేసిన గిరిజనేతరుడి పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ డిమాండ్..
.. ఆదివాసీ నవనిర్మాణ సేన, తుడుందెబ్బ సంఘాలు…
వలస గిరిజనేతరుల నుండీ ఆదివాసీలకు రక్షణ కల్పించాలి..
ఆదివాసీల పైన అగ్రవర్ణాల ఆగడాలను అరికట్టాలి.
ఎస్సై రాజ్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన ఆదివాసీ నాయకులు..
నూగూర్ వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం నేటి ధాత్రి:
ఏజెన్సీ ఏరియాలో ఆదివాసీలకు కనీస రక్షణ కరువైందని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. మండపాక గ్రామానికి చెందిన తోలేం సర్వేశ్వర్ రావు అనే ఆదివాసీ పైన విచక్షణ రహితంగా దాడి చేసిన నాగేంద్ర బాబు రాజు పైన ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాయం జానకి రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాయకులు నర్సింహా మూర్తి, పాయం జానకిరావు వాజేడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రాజ్ కుమార్ ని కలిసి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఫిర్యాదు చేసినారు. తోలేం సర్వేశ్వర్ రావు అనే ఆదివాసీ యువకుడిని వాజేడు గ్రామానికి చెందిన కృష్ణబాబు రాజు తన ఇంటి ఆవరణలో ఉన్న మట్టి దిబ్బలు చదును చేయమని ట్రాక్టర్ డ్రైవర్ తోలేం సర్వేశ్వరరావు ని తీసుకెళ్ళినరాని అన్నారు. పని చేస్తున్న డ్రైవర్ ని నాగేంద్ర బాబు రాజు అకారణంగా కొడుతూ,కులం పేరుతో దుర్భాషలు ఆడినట్టు ఫిర్యాదు లో పేర్కొన్నట్టు తెలిపారు. అనంతరం ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి, పాయం జానకి రావు మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో వలస గిరిజనేతరుల వల్ల ఆదివాసీలకు రక్షణ కరువైందని ఆరోపించారు. పని చేస్తున్న యువకుడి పైన రాత్రి ఏడున్నర గంటల సమయం లో దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. యువకుడి పై దాడి చేయడం తో పాటు ట్రాక్టర్ పైన కూడా రాళ్లతో దాడి చేసినారని అన్నారు.యువకుడి తండ్రి ముందు కూడా కొడుతూ హైదరాబాద్ బాద్ నుండి రౌడీలను తెప్పిస్తా ట్రాక్టర్ ని పెట్రోలు పోసి కాల్చేస్తా అని బెదిరించినట్టు నాయకులు మీడియా కు తెలిపారు. అగ్రవర్ణాలకు ఆదివాసీల పైన అంత అక్కస్సు ఎందుకని అన్నారు. వలస వచ్చి వాజేడు మండలం లో ఉన్న సారవంత మైన వేల ఎకరాల భూములను కబ్జా చేసినట్లు తెలిపారు. ఇక్కడున్న స్థానిక గిరిజన గిరిజనేతరుల పైన పెత్తనం చెలయిస్తూ ఉన్నారని అన్నారు. పూర్వం వాజేడు మండలం లోని ఆదివాసీల పైన అరాచకాలు, హత్యలు, హత్యా చారాలు చేసినారని అన్నారు.రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని నేటికీ వాజేడు మండలం లో వలస గిరిజనేతరుల అరాచకాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఇక్కడున్న ఎల్ టి ఆర్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ప్రభుత్వ భూములకు పట్టాలు చేపించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వాదులకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధన్యత ఇస్తూ ఉండడం కారణంగానే ఆదివాసీల పైన దుర్మార్గాలకు తెగపడుతున్నారని అన్నారు. వలస గిరిజనేతరుల స్వాధీనం లో ఉన్న గిరిజనుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. తోలేం సర్వేశ్వర్ రావు పైన జరిగిన దాడి యావత్తు ఆదివాసీ సమాజం పైన జరిగిన దాడి గా నాయకులు పేర్కొన్నారు. అగ్రవర్ణాలు అహంకారం తో ఆదివాసీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారని అన్నారు. తోలేం సర్వేశ్వర్రావు పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే వాజేడు లో భారీ ర్యాలీ చేస్తామని నాయకులు ప్రకటించారు. నాయకులు మోడెం నాగరాజు, నల్లేబోయిన సర్వేష్, కుంజ మహేష్, యుగంధర్,చాప కిరణ్, మండపాక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…
పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగినది. పహాల్గంలోని టెర్రరిస్టులు అమాయక హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని భారత దేశంలో ఉన్న పాకిస్థానీయులందరినీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నేడు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా
BJP district president
అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ ఝా కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ దుమాల శ్రీకాంత్,జిల్లా కార్యదర్శి శ్రీ గొప్పాడి సురేందర్ రావు, ఒబిసి మోర్చా అధ్యక్షుడు శ్రీ నంద్యాడపు వెంకటేష్, మరియు మాజీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు శ్రీ పొన్నాల తిరుపతి రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీ నాగుల శ్రీనివాస్ మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు మరియు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.