పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి అవకాశం ఇవ్వాలి
20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సైనికుడిలా పనిచేశాను
పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నాం
కష్టాలు పెట్టినా కండువా మార్చలేదు, పార్టీ జెండా వీడలేదు
ఆర్ధికం కాదు అభివృద్ధియే ప్రధాన లక్ష్యం
కాంగ్రెస్ సీనియర్ నేత మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గ్యాదరి భాస్కర్
నేటిధాత్రి ఐనవోలు :-
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గ్యాదరి భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కష్ట కాలంలో సైతం కండువా మార్చకుండా పార్టీ గెలుపు కోసమే నిరంతరం కృషి చేసిన నిస్వార్థపూరితమైన నేతలకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. 2001లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ కాంగ్రెస్ పార్టీలో మమేకమై పనిచేస్తూ, 2006లో ఉడత గూడెం గ్రామ వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా గెలవడం జరిగింది.
పార్టీ అధికారంలో లేకపోయినా మొక్కవోని దీక్షతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యునిగా గ్రామానికి సేవలు అందించడం జరిగింది. 2014 సంవత్సరంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గ్రామస్తులు అంత ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
2018లో రెండవసారి ఏకగ్రీవంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను చేసిన సేవను గుర్తించి ఎన్నుకోవడం జరిగిందన్నారు.2018లో జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రామ్ నగర్ ఎంపిటిసి గా నామినేషన్ వేస్తే మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇతరులకు మద్దతుగా నిలబడి గెలిపించడం జరిగింది.
2020 సంవత్సరంలో అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.శ్రీనివాస్ నేను చేసిన సేవలను గుర్తించి కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు పర్యాయాలుగా కిసాన్ సెల్ మండల అధ్యక్షులుగా ఇప్పటికీ కొనసాగుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు కేటాయింపులో భాగంగా అయినవోలు జడ్పిటిసి స్థానం ఎస్సీ జనరల్ కు కేటాయించడం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ లో భాగంగా 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎస్సీ కులస్తుడైన నాకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు జడ్పిటిసి గా అవకాశం కల్పించాలని కోరినట్లు భాస్కర్ తెలిపారు.
ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కర్షక కార్మిక చేతివృత్తిదారులు సబ్బండ వర్గాల ఆశీస్సులతో నన్ను జెడ్పిటిసిగా గెలిపించాల్సిందిగా భాస్కర్ కోరారు.