సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడిని ఖండిస్తున్నాం
సోతుకు ప్రవీణ్ కుమార్
సిపిఐ పట్టణ కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడి నీ నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్లకాడ్ల తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలని ,
జస్టిస్ గవాయ్ పై ఆర్ ఎస్ ఎస్ ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని ఇది ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ అన్నారు.ఈ దాడిని కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ దాడులు కేవలం జస్టిస్ గవాయ్ పైన మాత్రమే కాదు భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపైన దాడి గా చూడాలని అన్నారు.జస్టిస్ గవాయ్ ఎల్లప్పుడూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తీర్పులు ఇచ్చారనీ, అది గిట్టని మతోన్మాద శక్తులు లాయర్ రాకేష్ కిషోర్ రూపంలో దాడులు చేపిస్తున్నారని తెలిపారు. బిజెపి ఆర్ఎస్ఎస్ మతోన్మాద అరాచకాలను ఆపాలని లాయర్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.ఈ దాడికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజ్ సతీష్, నేరెళ్ల జోసెఫ్, పీక రవి, రవీందర్, జనార్ధన్, పొనగంటి లావణ్య, పల్లెల రజిత, పెద్దమామల సంధ్య, ఇటికల శ్రీలత, పోతుగంటి స్వప్న, వాసం రజిత, సుభద్ర రాజమణి తదితరులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.