అధికారులూ…ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానముందా……

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-03T113207.000.wav?_=1

 

అధికారులూ…ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానముందా……!?

◆-: ప్రమాదకర రసాయన పరిశ్రమ మాకొద్దుంటూ..”యువత ఇంటింటి ప్రచారం”..!

◆-: కర్మగార యాజమాన్యంతో కుమ్మక్కైన వారు ఎవరైనా వారిని..”ప్రజాక్షేత్రంలో నిలబెడతాం”..!

◆-: ప్రజారోగ్యమై ప్రధాన లక్ష్యమంటూ..”యువత ఊరూరా విస్తృత ప్రచారం”..!

◆-: పరిశ్రమ రద్దయేంతవరకు పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తాం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్ కల్,: ప్రజారోగ్యాన్ని, పంచభూతాల్ని, పంచాయతీ అభివృద్ధికి ప్రయోజనం కలిగించే పరిశ్రమలు ఏవైనా సంపూర్ణంగా సహకరిస్తాం. ఫెవికాల్, ప్లైవుడ్ పరిశ్రమలను అడ్డుపెట్టుకొని ప్రాణాంతకమైన కెమికల్, రసాయన పరిశ్రమలను ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకోమని, గతంలో సైతం గ్రామ శివారులో ఒక పేరు నా అనుమతి పొంది.. మరో పరిశ్రమ కొనసాగుతుందని.. ఇట్టి జటలమైన సమస్యపై పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని.. మరో మారు మోసపోయే పరిస్థితి లేకుండా ఉండేందుకే ఉద్యమాన్ని చేపడుతున్నామని, పరిశ్రమ ఏర్పాటు విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే పనులు చకచగా కొనసాగుతున్నాయని.. ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని, అందుకు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు సంపూర్ణంగా సహకరించాలని.. డబ్బులకు కక్కుర్తి పడి కర్మాగారంతో కుమ్మక్కై యాజమాన్యానికి సహకరించే వ్యక్తులు ఎవరైనా వారిని ఉపేక్షించేది లేదని.. తప్పనిసరిగా..”ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని” యువత ఊరురా ప్రచారాన్ని నిర్వహిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, మల్గి గ్రామానికి చెందిన యువకులు అధిక సంఖ్యలో గురువారం రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా ఊరూరా ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన అనిల్ కుమార్, కృష్ణ, మల్లేష్, తదితరుల ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో యువత.. మల్గి, డప్పుర్, అత్నూర్, వడ్డీ, న్యాల్ కల్, శంషాల్లాపూర్, కర్ణాటకలోని ఇమాంబాద్ గ్రామాల్లో కరపత్రాలను పంచుతూ ప్రచారాన్ని నిర్వహించారు. అందుకు ఆయా గ్రామాల్లో ప్రజానికం సానుకూలంగా స్పందించడం పట్ల యువత సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నెల జరిగే “ప్రజాభిప్రాయ సేకరణ”లో స్పష్టత ఇవ్వాల్సిందే..!

ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం ఉత్తర్వుల మేరకు జిల్లాకు చెందిన వివిధ శాఖాధికారులు పరిశ్రమ ఏర్పాటు పై స్థానిక ప్రజానీకానికి మౌఖికంగా కాకుండా, ఆధారాలతో సహా ప్రజలకు అవగాహన కల్పించాలని యువత స్పష్టం చేశారు. సభకు తరలిరానున్న ప్రజానీకానికి అడ్డుకోకూడదని, గ్రామసభకు వచ్చే ప్రతి ఒక్కరిని స్వాగతించి సహకరించాలని యువత పోలీసులకు విన్నవించారు. పరిశ్రమ ఏర్పాటులో ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేసి, ప్రజా ఆరోగ్యాన్ని, పంచభూతాల్ని సంరక్షించేలా ఉన్నతాధికారులు స్పష్టం చేయాలని ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

యాజమాన్యంతో కుమ్మకైతే..”ప్రజా క్షేత్రంలో నిలబెడతాం”..!

ప్రజాసంక్షేమం కోసం కొనసాగుతున్న ఉద్యమంలో యువతకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు సంపూర్ణంగా సహకరించాలని, లాభాపేక్ష ధోరణితో వ్యవహరించి కర్మకార యాజమాన్యంతో కుమ్మకైతే అట్టి వ్యక్తులు ఎవరినైనా ఉపేక్షించేది లేదని, ప్రజాక్షేత్రంలో నిలబెట్టి నిలదీస్తామని యువత హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రాణాలైనా ఇస్తాం.. అంతేగానే ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసే అట్టి పరిశ్రమలను.. ఈ పరిస్థితిలో కొనసాగించమని, తప్పనిసరిగా అడ్డుకొని తీరుతామని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించి గ్రామసభకు వందలాదిగా తరలిరావాలని యువత పిలుపునిచ్చారు. ఊరూరా కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించిన వారిలో ఆయా గ్రామాలకు చెందిన పదుల సంఖ్యలో యువత హాజరయ్యారు.

జహీరాబాద్లో 108, 102 అంబులెన్స్ల ఆకస్మిక తనిఖీ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-19T124005.645.wav?_=2

 

జహీరాబాద్లో 108, 102 అంబులెన్స్ల ఆకస్మిక తనిఖీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రోగ్రాం మేనేజర్ సంపత్, ఈఎంఈ కిరణ్ 108, 102 అత్యవసర సేవల అంబులెన్స్ వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల్లోని వైద్య పరికరాలు, మందుల నిల్వలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

తంగళ్ళపల్లిలో టిబి రక్త పరీక్షలు

తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత మేడం గారి సూచన మేరకు తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. డాక్టర్ స్నేహ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అనుమానితులకురక్త పరీక్షలు చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు దయాగ్నొస్టిక్సెంటర్లో .అరుదుగా చేసే ఈ పరీక్ష ఎప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ పరీక్ష ద్వారా ఇనాక్టివి టిబి తెలుసుకోవడం ద్వారా ముందస్తు క్షయ వ్యాధికి గురికాకుండా ప్రివెంట్ చేయవచ్చని ఈ గ్ర పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి పూర్తిగా మూడు రోజులపాటు 12 .డోసులు వారం చొప్పున మందులు ఇవ్వడం జరుగుతుందని తెలుపుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోక్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు టిబి లేటెంట్ ఇన్ఫెక్షన్ ఈ గ్రా రక్త పరీక్షలు నిర్వహించారు. సుమారు పదిమంది అనుమానితుల నుండి రక్త నమూనాలను తీసి టీ హబ్ కి పంపించారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ టిబి ల్యాబ్ సూపర్వైజర్ నాగరాజు. సూపర్వైజర్ ప్రమీల. హెల్త్ అసిస్టెంట్ సతీష్. ఏఎన్ఎం జ్యోతి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పేరుకే పెద్దాసుపత్రి….సౌకర్యాలు లేక రోగుల అవస్థలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T151214.846.wav?_=3

 

పేరుకే పెద్దాసుపత్రి….సౌకర్యాలు లేక రోగుల అవస్థలు

తక్షణమే సదుపాయాలు కల్పించాలి

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంసిపిఐ (యు) బృందం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని నూతనంగా నిర్మాణం చేసి రోగులకు ఉన్నత సేవలు అందించేందుకు గాను ఏర్పాటు చేసిన జిల్లా ఆసుపత్రి ఇప్పుడు పేరు పెద్దాసుపత్రిగా మారింది.ఆ ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందడంలేదనే ఆరోపణలతో ఎంసిపిఐ (యు) పార్టీ నాయకుల బృందం ఆధ్వర్యంలో ఆసుపత్రిని సందర్శించారు.పేద,మధ్యతరగతి ప్రజల రోగుల కోసం నిర్మించిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేమితో రోగులు నానా అవస్థలు పడుతున్నారని రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ , కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు. రోగుల దగ్గరికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం వారు మాట్లాడుతూ వంద పడకల ఏరియా ఆసుపత్రి నుండి 250 పడకల జిల్లా ఆస్పత్రిగా అప్ గ్రేట్ అయిన సిబ్బంది కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుందన్నారు.టెక్నీషియన్స్ , శానిటేషన్ , సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి తగిన విధంగా లేదన్నారు.సిబ్బందిని కొత్తగా రిక్రూట్మెంట్ చేయకపోవడం మూలంగా చాలా సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.

 

డాక్టర్ల కొరత కూడా ఉందని కార్డియాలజిస్ట్,న్యూరాలజిస్ట్ లేకపోవడం మూలంగా ఆ వ్యాధికి సంబంధించిన రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.వందలాది రోగులు ఈ ఆసుపత్రికి వస్తున్నారని సౌకర్యాల లేమితో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదని అవేదన వ్యక్తం చేశారు.ఇప్పటివరకు ఆపరేషన్ థియేటర్ లేకపోవడం శోచనీయమన్నారు.ఇప్పటికైనా సరిపడా సిబ్బందిని నియమించి సరైన సౌకర్యాలు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రాణాలను కాపాడాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కలకోట్ల యాదగిరి,డివిజన్ నాయకులు గొర్రె సామెల్ ,కల్లపెల్లి రాకేష్ ,జన్ను విజయ,బెజ్జంకి పుష్ప , ఈసంపెల్లి గీత తదితరులు పాల్గొన్నారు.

విచ్చలవిడిగా కల్తీ అవుతున్న ఆహారం.. తనిఖీలు ఏవి….

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T140624.896.wav?_=4

 

 

విచ్చలవిడిగా కల్తీ అవుతున్న ఆహారం.. తనిఖీలు ఏవి….?

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: నేటి మనిషి ఉరుకులు పరుగుల
జీవితంలో తినే ఆహారాన్ని నాణ్యత ప్రమాణాలు తెలుసుకోకుండా ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని తీసుకుంటున్నారు. కల్తీ అని తెలుసుకోకుండా తినడంతో అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారు. వ్యాపారస్తులు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆశిస్తున్నారు. ఆహార భద్రతా నియమాలు పాటించడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మారుమూల గ్రామాల్లో సైతం స్వీట్ హౌస్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మండల కేంద్రంలోని స్వీట్ హౌస్ లు, మిర్చి బజ్జీలు, టిఫిన్ సెంటర్లు, టీ కోట్లు, కిరాణా దుకాణాలు, మాంసం దుకాణాలు, బేకరీలు సంఖ్య ఏటేటా పెరుగుతున్నాయి.దుకాణాదారులు ఫుడ్ సేఫ్టీ యాక్టు 2006 ప్రకారం లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులు కేసులు నమోదు చేయాలి. పౌరులు, విద్యార్థులు, మహిళలు, సురక్షిత ఆహారం పై ఆహార భద్రత అధికారులు అవగాహన కల్పించాలి. వస్తువుల కొనుగోలుదారులు ప్యాకింగ్ పై తేదీ, నెల, సంవత్సరం, ఎమ్మార్పీ ధర పరిశీలించిన అనంతరం కొనుగోలు చేయాలి. మాచునూర్, కుప్పానగర్, బర్దిపూర్, ఎల్గోయి, కప్పాడు, ఝరాసంగం తదితర గ్రామాల్లో స్వీట్ హౌస్ లు, హోల్ సేల్ దుకాణాలు, బేకరీలు ఉన్నాయి.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు ప్రత్యేక పర్వదినాలలో భారీ సంఖ్యలో హాజరై ప్రసాదాలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మహాశివరాత్రి వేడుకల సన్నాహక సమావేశానికి మాత్రమే హాజరవుతారు. సంవత్సరానికి ఒక్కసారి సంతకం చేయడానికి మాత్రమే వస్తాడు. దీంతో వ్యాపారస్తులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యాపారం కొనసాగుతుంది.ఇదిలా ఉంటే.. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగే హాస్టల్లు, మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాల్సిన అధికారులు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తనకు చేయలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దుకాణదారులకు లైసెన్లు, ఆహార భద్రతపై అవగాహన సదస్సులు, తరచుగా తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మండల ప్రజలు, కొనుగోలుదారులు, విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పట్టణ పరిశుభ్రత పరిరక్షణ…..

పట్టణ పరిశుభ్రత పరిరక్షణ…..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో పరిశుభ్రత పరిరక్షణ కోసం మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు
ప్రతి దుకాణం, ప్రతి ఇల్లు ముందు చెత్త కోసం ప్రత్యేకంగా డబ్బాలు లేదా డస్ట్‌బిన్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని మున్సిపల్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
చెత్తను యాదృచ్ఛికంగా రోడ్లపై, దుకాణాల ఎదుట లేదా ఖాళీ ప్రదేశాల్లో వేయడం వల్ల ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చెత్తను క్రమబద్ధంగా వేయని వారిపై తగిన చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

పౌరులు పరిశుభ్రత పట్ల బాధ్యతగా వ్యవహరించి, నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలన్నారు. చెత్త నిర్వహణ నియమాలను పాటించని దుకాణదారులు, ఇంటి యజమానులపై జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్లు మున్సిపల్ శాఖ అధికారి వెల్లడించారు.
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని, నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు చెప్పారు.

మోహన్ నాయక్ సేవలు గణనీయం.

నస్కల్ లో ..
ఉచిత వైద్య శిబిరం
మోహన్ నాయక్ సేవలు గణనీయం.

నిజాంపేట: నేటి ధాత్రి

నిరుపేదల పెన్నిధిగా డాక్టర్ మోహన్ నాయక్ నిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ.. పేదల గుండెల్లో నిలిచిపోతున్నాడు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శుక్రవారం డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బిపి, షుగర్, ఇతర వ్యాధులకు పై వైద్యులు శాస్త్ర చికిత్సలు నిర్వహించారు. పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ ను గ్రామీణ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిద్ధరాములు, లింగం గౌడ్, లక్ష్మా గౌడ్, శ్రీనివాస్, దేశెట్టి లింగం , గుమ్ముల అజయ్, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

సమస్యల వలయంలో నర్సంపేట పట్టణం

సమస్యల వలయంలో నర్సంపేట పట్టణం

పారిశుద్ధ్య పనులను తక్షణమే చేపట్టాలి

మున్సిపాలిటిలో ఎం సిపిఐ(యు) వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సమస్యల వలయంలో చిక్కుకున్నది.పట్టణ పరిష్కారం కోసం ఎం సిపిఐ(యు) ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు వంగల రాగ సుధా,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని,కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తీయకపోవడం మూలంగా వర్షపునీరు పొంగి ఇళ్లలోకి చేరుతుందని ఆరోపించారు.ప్రధానంగా కార్ల్ మార్క్స్ కాలనీ,జ్యోతిబసు నగర్ లలో డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షం పడిందంటే వరద నీరు ఇళ్లలోకిచేరి చెత్తాచెదారంతో దుర్వాసనతో అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు.మార్క్స్ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడంతో మరదమయంగా మారుతుందని తెలిపారు.పట్టణంలో కుక్కల కోతుల,బెడదల మూలంగా పట్టణవాసులు బయటికి రావాలంటేనే జంకుతున్నారని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ చెన్నారావుపేట మండల కన్వీనర్ జన్ను రమేష్ ,టౌన్ కమిటీ సభ్యులు కల్లెపెల్లి రాకేష్ ,విద్యార్థి నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు పరిష్కరించాలి

కటకం జనార్ధన్ పట్టణ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ హాస్పిటల్ సూపరిటెండెంట్ ని సమస్యలను పరిష్కరించాలని వారు సూపర్డెంట్ ను కోరారు కానీ వారం రోజులు గడుస్తున్నా హాస్పిటల్ యొక్క సమస్యలు పెరుగుతున్నాయి తప్ప వాటి పరిష్కారం కావడం లేదు కావున జిల్లా కలెకర్ట్ సమక్షంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్రాసిన వినతిపత్రం ను భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కి అందించడం జరిగింది.

రామా థియేటర్ ఎదురుగా నీళ్ళ పైపులు లీకేజీ

రామా థియేటర్ ఎదురుగా నీళ్ళ పైపులు లీకేజీ

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో శ్రీ రామ టాకీస్ ఎదురుగా మిషన్ భగీరథ పైప్ లైన్ కు సంబంధించి నీళ్ల పైపులు లీకేజీ కావడంవల్ల నీళ్లు రోడ్డుపై వృధాగా పోతున్నాయి . నీళ్ల పైపులు లీకేజీ వల్ల మురికినీరు మిషన్ భగీరథ పైపులోకి వెళ్లి కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నదని ప్రజలు తెలిపారు . వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి తనిఖీ చేసి నీళ్ల పైపులను మున్సిపల్ సిబ్బందితో రిపేరు చేయించాలని ప్రజల కోరుతున్నారు . మురికి నీరు పైపులోకి వెళ్లడం వల్ల నివాస గృహాల ప్రజలు నీళ్లు తాగడం వల్ల మలేరియా డెంగీ ఇతర రోగాలు జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెంటనే నల్ల పైపులు సరి చేయించాలని ప్రజలు కోరుతున్నా

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ….

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.

#ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

#సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.

#డిఎం హెచ్ ఓ సాంబశివ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ బుధవారం ఆకస్మిక తనకి చేశారు. అనంతరం రికార్డులను, మందులను, దావకాన పరిసరాలను పరిశీలించి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని కావున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రతి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులను అందివ్వాలి. ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలో నే అందుబాటులో ఉండాలని లేనియెడల చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ ఏ కృష్ణ, ఫార్మసిస్ట్ రంగారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి….

రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి

– బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

– సదరం శిబిరం పరిశీలన

– సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

వైద్యులు రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం సందర్శించారు.
ముందుగా దవాఖానలోని మెటర్నిటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్ ను పరిశీలించారు. వైద్య సేవలు పొందుతున్న వారితో మాట్లాడి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు చిత్తశుద్ధితో సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. రోగులకు మెరుగైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించడం వైద్యుల ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు.

శిబిరానికి ఎందరు వచ్చారు?

దవాఖానలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్థోకి సంబంధించిన సదరం శిబిరం నిర్వహిస్తుండగా, ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. సదరం రిజిస్ట్రేషన్లు, వైద్య పరీక్షలు, వివరాల నమోదు, తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి సౌకర్యాల తీరును ఆరా తీశారు. మొత్తం 50 మందికి ఆర్థోకి సంబంధించిన పరీక్షలు చేస్తున్నామని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు.

సదరం శిబిరానికి రావడానికి మీరు ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నారు? ఈ రోజు శిబిరానికి రావాలని మా సిబ్బంది మీకు ఫోన్ చేశారా లేదా అని ఆరా తీశారు.

శిబిరం నిర్వహణకు సంబంధించిన వివరాలను వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు

శిబిరానికి వచ్చే వారి కోసం గదిలో మౌలిక వసతులు కల్పించాలని, ఫర్నిచర్ ఇతర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, డీఆర్డీఓ శేషాద్రి, వైద్యులు సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన పట్టించుకోరా…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T123451.911.wav?_=5

 

 

పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిన పట్టించుకోరా…

ఓపెన్ జిమ్ కు దారేది సార్లూ…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల 17 వ వార్డ్ శ్రీనివాస్ నగర్ ఏరియాలో ఇళ్ల మధ్య ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడంతో పిచ్చి మొక్కలలో చెత్తాచెదరం చేరుకొని దోమలకు ఆవాసాలుగా మారి కాలనీవాసులు జ్వరాలు బారిన పడుతున్నారంటూ కాలనీవాసులు వాపోతున్నారు. మొక్కలు ఏపుగా పెరగడంతో విష జ్వరాలకు నిలయంగా మారడంతో రాత్రిపూట బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో విష సర్పాలు సంచరించడంతో పాటు క్రిమి కీటకాలు దోమల బెడద కూడా ఎక్కువైందని వారు ఆరోపిస్తున్నారు. చికెన్ గున్యా, డెంగి ,మలేరియా వంటి వైరల్ జ్వరాలు రాకుండా పిచ్చి మొక్కలను

తొలగించాలని మునిసిపాలిటీ అధికారులను వారు కోరుతున్నారు. ఎస్ఆర్కే పాఠశాల పక్కన గల రోడ్డు సరిగా లేదని, పాఠశాల సమీపంలో లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్ ఐతే ఏర్పాటు చేశారు కానీ ఓపెన్ జిమ్ కు వెళ్ళే దారి మొత్తం పిచ్చి మొక్కలతో నిండుకు పోయిందని ,వ్యాయామం కోసం వెళ్లే వారు సైతం పిచ్చి మొక్కల ను చూసి ఓపెన్ జిమ్ కు వెళ్లలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. పాలకవర్గం లేకపోవడంతో స్థానిక నాయకులు సైతం కాలనీలోని సమస్యలను పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా స్థానిక మునిసిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని కాలనీ సమస్యలు తీర్చాలని వారు కోరుతున్నారు.

ఒకటో వార్డులో అధ్వానంగా అంతర్గత రోడ్లు…

ఒకటో వార్డులో అధ్వానంగా అంతర్గత రోడ్లు

రెండేళ్లుగా ఫిర్యాదు చేసిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు

నర్సంపేట మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో గల అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం ఆరోపించారు. వార్డు పరిధిలో ఉన్న అన్ని వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి కంపు కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బురదమయంగా మారుతున్న అంతర్గత రోడ్ల పట్ల గత రెండు సంవత్సరాలుగా మున్సిపాలిటి అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆరోపించారు.

పారిశుద్ధంపట్ల చెత్త సేకరణ కోసం రెండు రోజులకు ఒకసారి రావాల్సిన సంబంధిత వాహనము వారం రోజులైనా రాకపోవడంతో గత కొంతకాలంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి.. చెత్త పేరుకుపోయిన 1వ వార్డు గల్లీలు ఆడవిని తలపిస్తున్నది వాపోయారు. డ్రైనేజీ కాలువలు తీయక.. మురికితో నిండిపోయి..ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి.దుర్వాసన వెదజల్లుతున్న డ్రైనేజ్ కాలువలను మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోని ఆగ్రహం వ్యక్తం చేశారు.అపరిశుభ్రతతో ఈగలు,దోమల దాడులతో వార్డు ప్రజలు అనారోగ్యాలపాలవుతున్నారని పేర్కొన్నారు.చిన్న వర్షం పడ్డ అంతర్గత మట్టి రోడ్లన్నీ బురుదమయమై నడవడానికి కూడా వీలు లేకుండా..కాలు వేస్తే కాలు తీయలేని పరిస్థితి నెలకొందని వివరించారు.

డ్రైనేజ్ కాలువ పక్కనే వేసిన మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీలు ఏర్పడి మిషన్ భగీరథ వాటర్ వదిలినప్పుడల్లా డ్రైనేజీ నీటిలో కలిసి కలుషితమవుతున్నాయని గతంలో మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన నేటికీ కూడా మరమ్మతులు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లుగా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం కోరారు.

మా తలరాత రోజు మురికి రోత అంటించుకోవాలి కొంత…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T125816.587.wav?_=6

 

మా తలరాత రోజు మురికి రోత అంటించుకోవాలి కొంత

◆:- ప్రతిరోజు ఇంతే కనబడదు పట్టించుకోలేని అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కోట్ల రూపాయలు పెట్టి మురికి కాల్వని నిర్మాణం చేసిన వాటి మీద అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ లేక నిర్లక్ష్యంగా వ్యవహరించి వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఆ మురికిని కొంచెం తమపై చిట్లించుకుంటున్న కూడా అధికారులు మాత్రం చూస్తూ వింతగా నిర్లక్ష్యం వహిస్తున్నారు కావలసినంత పారిశుద్ధ్య కార్మికులు కార్మికులు ఉన్నప్పటికిని కొంతమంది దొరవారి దొడ్లకే పరిమితం అవుతున్నారు ప్రతిరోజు పురపాలక సంఘం అధికారులు కార్మికులకు హాజరు తీసుకుంటారు హాజరుకి అందరు వస్తారు కొద్దిసేపటికే కనుమరుగవుతారు అధికారులు ఇండ్లకు చేరుతారు తర్వాత అంతా కార్మికులు దొరల దొడ్లలో పనికి వెళ్తారు చిన్నపిల్లలను ఎత్తుకుంటారు వారి ముడ్లు కడుగుతుంటారు దొరల బట్టలు ఉతుకుతారు ఇల్లు వాకిళ్లు ఊడుస్తారు ఉద్యోగం పురపాలక సంఘం పని దొరలది ఇది జహీరాబాద్ పురపాలక సంఘం కార్మికుల దినచర్య అధికారుల నిర్లక్ష్యంతో ఏ మూల మలుపులో చూసిన విపరీతమైన చెత్త అది అక్కడే మురుగుతున్న పట్టించుకోరు వాటిని ఆసరా చేసుకొని ఊర కుక్కలు పందులు వీధి పశువులు కొండముచ్చులు విపరీతంగా పట్టణానికి వలస వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రజలపై ఎగబడి గాయపరుస్తున్నాయి ఆయన అధికారులకు పట్టింపు ఉండదు వాస్తవానికి ప్రజలకు చైతన్యం చేసే మార్గాలు అనేక ఉన్నప్పటికిని పట్టించుకునే పని లేదు రోజు ఎక్కడపడితే ప్రజలు చేత వేయాలి వేణు వెంటనే పురపాలక సంఘం కార్మికులు వీలైతే

తొలగించాలి లేకపోతే లేదు ఇది పరిస్థితి జహీరాబాద్ పురపాలక సంఘం దినచర్య నాయకులు ఎవరైనా ఏదైనా పని చెప్తే ఏదైనా సంస్కరణలు తీసుకురమ్మని చెప్తే నేరుగా వెళ్లి కార్మికులు ప్రజలతో పలాని నాయకుడు ఇలా చెప్తున్నాడు కొంచెం సక్రమంగా ఉండండి అని నాయకుల పేరు చెప్తారు తప్ప మీరు ఇలా చేయకూడదు ఇది చాలా తప్పు అధికారులు తప్పుపడుతున్నారు మీ పైన చర్యలు ఉంటాయని మాత్రం ఏ అధికారి చెప్పడు అధికారుల పూర్తిస్థాయి నిర్లక్ష్యంతో జహీరాబాద్ పట్టణమంతా మురికి తో మురికి కాలువలు నిండుకుండలాగా తయారై పొంగిపొర్లుతున్నాయి ఏ వీధిలో చూసినా విపరీతమైన దోమలు చిన్న పిల్లలు వృద్ధులు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా దోమల మందులు పిచికారి చేసేది లేనేలేదు కనీసం దోమలను పారద్రోలడానికి ఫాగింగ్ లాంటి పొగ చేసేది కూడా లేనేలేదు ప్రజలకు వ్యాధులు వస్తేనే మురికితో ముక్కుపూటలమురికితో ముక్కుపూటలు అదిరిపోతేనే అదిరిపోతేనే ఇవన్నీ మాకేం పట్టవు మాకు అడిగే వారెవరున్నారు పాలకవర్గం అయితే లేదు ప్రశ్నించినప్పుడు చూద్దాంలే ఇది జహీరాబాద్ పరిస్థితి

రెండవ రోజున నిండు జీవితానికి రెండు చుక్కలు…!

రెండవ రోజున నిండు జీవితానికి రెండు చుక్కలు…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల్ గ్రామపంచాయతీ పరిధిలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రెండవ రోజున పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, సోమవారం నాడు కోహిర్ మండలంలోని పైడిగుమ్మల్ అంగన్వాడీ కేంద్రం, బస్టాండ్ సమీప ప్రాంతంలో వద్ద పోలియో చుక్కలు వేయించుకో లేనటువంటి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఏఎన్ఎం శాంతమ్మ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.

నాన్ మెడికల్ అధికారుల నియామకం వైద్యరంగానికి ముప్పు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T123808.196.wav?_=7

 

నాన్ మెడికల్ అధికారుల నియామకం వైద్యరంగానికి ముప్పు

ఏఐఎఫ్డీడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వ ఆసుపత్రుల పరిపాలన కోసం నాన్ మెడికల్ అధికారుల నియామకం చేయడం వైద్య రంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆసుపత్రుల పరిపాలన బాధ్యతలను నాన్ మెడికల్ అధికారులకు అప్పగించాలని చేసిన ప్రతిపాదనలపై వైద్య వర్గాల్లో తీవ్రమైన అసహనం నెలకొందని, ఈ నిర్ణయం ఆరోగ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని,రోగి సేవల నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏఐఎఫ్డీడబ్ల్యు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఆసుపత్రుల పరిపాలన,వైద్య నిర్ణయాలు,చికిత్స విధానాలు అన్ని వైద్య పరిజ్ఞానంతో ముడిపడి ఉంటాయని అలాంటి వ్యవహారాలను నాన్ మెడికల్ అధికారుల చేతుల్లో పెట్టడం అనేది రోగి సేవలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయమని, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఈ నిర్ణయం పట్ల పునరాలోచించాలని అన్నారు. నాన్ మెడికల్ అధికారుల చేతుల్లో ఆసుపత్రుల నిర్వహణ ఉంటే వైద్యులు పరిపాలన అధికారాలు కోల్పోతారని,రోగుల సేవలు క్షీణిస్తాయని, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో వైద్యుల పాత్రను బలహీనపరిచే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే రద్దుచేసి రోగి సేవలు మెరుగుదలకు వైద్యులే ప్రధాన కేంద్రంగా ఉండే విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో పరిపాలన ప్రజా ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా ఆరోగ్యం రాజకీయ నిర్ణయాలకు బలి కాకూడదని అన్నారు.ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలంటే, వైద్యులే పరిపాలన బాధ్యత వహించాలని, నాన్ మెడికల్ అధికారులకు అప్పగించే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో వైద్య వర్గాలను, రోగులను, ప్రజాస్వామ్య వర్గాలను సమీకరించి ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని రాగసుధ హెచ్చరించారు.

నిండు జీవితానికి రెండు చుక్కలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T112042.576.wav?_=8

 

నిండు జీవితానికి రెండు చుక్కలు.

మహేంద్ర కాలనీ లో పల్స్ పోలియో కార్యక్రమం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీ లో ని కేంద్రాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం లో యువ నాయకులు మీదొడ్డి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు ఈ కార్యక్రమం లో .అంగన్వాడీ టీచర్లు తుక్కమ్మ అనిత, ఆశ వర్కర్ జ్ఞానలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)

దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)

 

ఎమ్మెల్యే,మున్సిపల్ అధికారులు స్పందించాలి

బిఆర్ఎస్ యువజన నాయకులు ఇంగిలి వీరేష్ రావు

ఆహ్లాదకరంగా ఉండాల్సిన దామెర చెరువు(మినీ ట్యాంక్ బండ్)ప్రాంతం దుర్గంధంతో, చెత్త చెదరంతో కంపు కొడుతూ పరిసర ప్రాంతా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అధికారులు దామెర చెరువు పై నిర్లక్ష్యం వీడాలని బిఆర్ఎస్ యువజన నాయకుడు ఇంగిలి వీరేష్ రావు అన్నారు.పరకాల ప్రజలు వాకింగ్ చేయడానికి,మరియు ఆహ్లాదకరంగా పిల్లలతో గడపడానికి గత ప్రభుత్వం సుమారు 4 కోట్ల రూపాయలతో దామెర చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దిందని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పాలన పై శ్రద్ధ లేకుండా కేవలం పైసల పైనే శ్రద్ధ వహిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

మునిసిపాలిటీ కి సంబంధించిన ఆటోలే ఇక్కడ చెత్త వేస్తున్నట్టు స్థానికులు వివరించారని,పక్కనే ఉన్న శ్రీనివాసకాలని ప్రజలు ఈ కంపును భరించలేక పోతున్నారని,ఈ దుర్గంధం వల్ల వారి ఆరోగ్యాలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమీషనర్ లు ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.

సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

#పట్టించుకోని వైద్యాధికారులు.

#రోగులకు సరైన మందులు లేని ఆసుపత్రులు.

#వచ్చామా పోయామా అనే రీతిలో వ్యవహరిస్తున్న వైద్య అధికారులు.

#సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందిన సిబ్బంది ఎక్కడ..?

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

గత నెల రోజులుగా భారీ వర్షాలు పడడంతో గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. అసలే వర్షాకాలం దోమకాటుతోని విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతు ప్రభుత్వ దావఖానకు వెళితే సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రి ని ఆశ్రయించే పరిస్థితి నెలకొందని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.

#వైద్యాధికారాలు ఎక్కడ..?

పేద ప్రజలు అంటే ఇంత చిన్న చూప. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తూ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ. సమయానికి దావకానకు రాకుండా ప్రైవేటు ఆసుపత్రికి సమయానికి కేటాయిస్తూ పేద ప్రజలకు అందవలసిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు రోగులు వాపోయారు.

#స్పందించని వైద్యాధికారులు.

సీజనల్ వ్యాధులపై నేటి ధాత్రి మండలంలోని వైద్యాధికారులకు చరవాణి ద్వారా సంప్రదించగా ఎలాంటి స్పందన లేదు.

#రోగుల బాధలు పట్టించుకోరా.?

వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంది రోగులు మంచాన పడ్డ కూడా కనీసం ఏఎన్ఎం లో తోపాటు ఆశ వర్కర్లు ఇంటిట తిరిగి సర్వే చేయకపోవడం చాలా బాధాకరం ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని.. సామాజిక వేత్త ప్రణీత్ డిమాండ్ చేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version