జహీరాబాద్లో వ్యక్తి హత్య..

జహీరాబాద్లో వ్యక్తి హత్య!

◆:- పస్తాపూర్ శ్మశానవాటిక పరిసరాల్లో ఘటన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టపగలు కర్రలతో దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన జహీరాబాద్లో చోటుచేసుకుంది. పట్టణంలోని పస్తాపూర్ శ్మశాన వాటిక పరి సరాల్లో హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. పట్టణ సీఐ శివలింగం, ఎస్సై వినయ్కుమార్ తెలిపిన వివరాలు.. పస్తాపూర్ శ్మశాన వాటిక పరిసరాల్లో మంగళవారం వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని సీఐ, ఎస్సై సందర్శించి వివరాలు సేకరించారు. హత్యకు గురైన వ్యక్తి ఝరాసంగం మండలం గంగాపూర్కు చెందిన మహబూబ్ (30)గా గుర్తిం చారు. మృతుడు పట్టణంలోని మేస్త్రీ కాలనీలో నివాసం ఉంటూ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఘటన స్థలంలో దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అక్రమ సంబంధం నెపంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి…గంగాపూర్ గ్రామ వాసిగా గుర్తింపు..

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి…గంగాపూర్ గ్రామ వాసిగా గుర్తింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, గంగాపూర్ గ్రామానికి చెందిన మహబూబ్ (30), నభీ పటేల్ అనే వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందారు. పోలీసులు తెలి పిన వివరాలు ప్రకారం పస్తాపూర్ గ్రామ శివారులోని శ్మశానవాటిక దగ్గర ఉన్న పొలంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా చనిపోయి కనిపించాడు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందిం చగా, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వినయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు హత్య ఆత్మ హత్యనా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం.. పోలీసుల విచారణ…

శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ కలకలం.. పోలీసుల విచారణ

 

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ ఒకటి బయటపడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ద్వారా వాహన తనిఖీల్లో గుర్తించారు అక్కడి పోలీసులు.

శ్రీశైలం టోల్‌గేట్(Srisailam Toll gate) వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్(9mm Pistol) ఒకటి బయటపడింది. దీంతో సదరు తుపాకీ(Revalver)ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

కాగా.. రివాల్వర్ తీసుకువచ్చిన వ్యక్తిని మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) వాసిగా గుర్తించారు శ్రీశైలం ఆలయ అధికారులు. ఆ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ(Cyber Crime SI) అని ఆయన పోలీసులకు చెప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై విచారణలో భాగంగా.. సదరు వ్యక్తి నుంచి రివాల్వర్ సహా ఐడెంటిటీ కార్డు(ID Card)ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్టు శ్రీశైలం సీఐ ప్రసాదరావు(CI Prasada Rao) పేర్కొన్నారు.

“తల్లి మృతదేహం చూసి కొడుకు ఆత్మహత్య”

తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో హృదయ విధాకరసంఘటన చోటు చేసుకుంది తెలిసిన సమాచార ప్రకారంఈ సందర్భంగా తెలిసిన సమాచారం ప్రకారం. నిన్నటి రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తంగళ్ళపల్లి మండల గ్రామానికి చెందిన మంచి కట్లలలిత. 56. సంవత్సరములు అదృశ్యమైనది.బంధువులు ఎంత వెతికినా కనబడకపోవడంతో ఈరోజు. మానేరు వాగులో శవమై లలిత మృతదేహం కనిపించడంతో తల్లి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక పోయిన కొడుకు అభిలాష్ అదే మానేరులోవాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో సదురు పోలీసు సిబ్బంది సంబంధిత జాలర్లు సిబ్బంది ఎంత వెతికినా అభిలాష్ ఆచూకీ దొరకకపోవడంతో గాలిస్తూ ఉండడంతో ఎట్టకేలకె అభిలాష్ మృతదేహం లభ్యం అయిందని సంబంధిత పోలీస్ సిబ్బంది తెలిపారు. అభిలాష్ సర్దాపూర్ .బెటాలియన్ లో ప్రస్తుతం కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు మృతునికి సంబంధించిన వారు వివరాలు తెలిపారు. అలాగే గతంలో ఆరు సంవత్సరాల క్రితం తండ్రి మోరిలో పడి మృతి చెందగా చెల్లెళ్లు మౌనిక మానస ఇద్దరికీ వివాహాలు జరిగాయని అభిలాష్ కి సైతం వివాహo కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసిందిదీనిపై సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నదని సంబంధిత పోలీసుఅధికారులు తెలిపారు

జహీరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య

జహీరాబాద్లో వివాహిత ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలంలో భర్తతో విభేదాలు, వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బూర్డిపాడుకు చెందిన స్యాతి(22)కి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. తరచు గొడవలు, వేధింపులతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కాశినాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియా ఫేమ్ కోసం రెచ్చిపోయిన మహిళలు..

 సోషల్ మీడియా ఫేమ్ కోసం రెచ్చిపోయిన మహిళలు.. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి..

 

ముగ్గురు మహిళలు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరు అమ్మాయిల్నికిడ్నాప్ చేసి విచక్షణా రహితంగా కొట్టారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పోగొట్టుకోవటమో.. ఇతరుల ప్రాణాలు తీయటమో చేస్తున్నారు. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో అత్యంత కిరాతకమైన సంఘటన చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు రెచ్చిపోయి ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవటం కోసం అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ అమ్మాయిలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చేసిన పాపం పండి ఆ నిందితురాళ్లు జైలు పాలయ్యారు.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జబల్‌పూర్, గ్వారీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ముగ్గురు మహిళలు ఓ గ్రూపుగా మారి నేరాలకు పాల్పడుతున్నారు. వారిపై పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ ముగ్గురు మహిళలు ఇద్దరు యువతుల్ని కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశారు. తర్వాత వారిని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. ముగ్గురూ కలిసి అమ్మాయిల్ని దారుణంగా కొట్టారు. దాడిని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో సైతం పోస్టు చేశారు.ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఓ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడి చేసిన మహిళలపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితురాళ్లను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం ఆ ముగ్గురు మహిళలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వారు తరచుగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

పాన్ మసాలా దొంగల అరెస్టు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T135730.080.wav?_=1

 

పాన్ మసాలా దొంగల అరెస్టు

◆:- ఇద్దరి దుండగులను జైలుకు తరలింపు

ఇతర దుండగుల కోసం ముమ్మర గాలింపు

◆:- వివరాలను వెల్లడించిన జహీరాబాద్ డిఎస్పి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కర్ణాటకలోని బీదర్ నుండి మధ్యప్రదేశ్ కు అక్రమంగా పాన్ మసాలాను తరలిస్తున్న ఓ లారీని.. మేము పోలీసుల మంటూ పట్టపగలె చోరీకి పాల్పడ్డ దుండగులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇద్దరు దుండగులను జైలుకు తరలించగా.. పరారీలో ఉన్న మరికొందరి దుండగుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశం మేరకు గురువారం సాయంత్రం జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బీదర్ లోని ఆర్ కే ప్రొడక్ట్స్ కర్మాగారం నుండి పాన్ మసాలాను ఈ నెల 10న మధ్యాహ్నం జహీరాబాద్ బీదర్ రోడ్డు, న్యాల్ కల్ మండలంలోని గంగువార్ గ్రామ శివారు వద్ద రూ:19.59 లక్షల విలువచేసే పాన్ మసాలాను లారీలో తరలిస్తుండగా.. కొందరు దుండగులు మాటువేసి. మేము పోలీసులమంటూ, భయభ్రాంతులకు గురిచేసి పాన్ మసాలాను తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకొని పరారయ్యారు. లారీలో ఉన్న ఓ వ్యక్తివద్ద నుండి రూ:42 వేల నగదును దోచుకున్నారు. రవి సూర్యకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి వెంటనే ముమ్మర గాలింపు చేపట్టారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పర్యవేక్షణలో.. స్థానిక ఎస్సై సుజిత్, రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్, ఝరాసంఘం ఎస్సై పాటిల్ క్రాంతి, జహీరాబాద్ రూరల్ పోలీసుల బృందం సుభాష్, రాజశేఖర్, అశోక్, సాయికిరణ్, మహేష్, శ్రీకాంత్, అప్రోచ్, సాయికుమార్, తదితరులు పాన్ మసాలా తోపాటు లారీని అపహరించిన దుండగుల కోసం మూడు రోజుల పాటు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇద్దరు నిందితులు, లారీని పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు.

మమ్మద్ ఖరీం, సక్లేన్ల అరెస్ట్, జైలుకు తరలింపు…

పట్టపగలే చోరీకి పాల్పడ్డ పలువురి నిందితుల్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక హద్దునూర్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి వివరాలను వెల్లడించారు. జహీరాబాద్ చెందిన మమ్మద్ ఖరీం (32), బీదర్ కు చెందిన సక్లెన్ (26) లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు, అతి త్వరలోనే అదుపులోకి తీసుకొని.. అరెస్టు చేసి, జైలుకు తరలించినట్లు డి.ఎస్.పి వెల్లడించారు. రూ:19.59 లక్షల విలువగల పాన్ మసాలా, రూ:15 లక్షల విలువగల లారీని అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. రూ:42 వేలను దొంగలించిన దుండగుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పట్టపగలే చోరీకి పాల్పడ్డ దుండగుల (ఇద్దరు)ను, లారీని త్వరితగతిన అదుపులోకి తీసుకోవడం పట్ల.. స్థానిక సీఐ, ఎస్సైలు, పోలీసుల బృందాన్ని డి.ఎస్.పి అభినందించారు.

ఆలయంలో దోపిడీ, హత్య..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T113528.288.wav?_=2

ఆలయంలో దోపిడీ, హత్య..

 

విరుదునగర్‌ జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్‌మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్‌ (65) అనే ఇద్దరు వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు.

చెన్నై: విరుదునగర్‌(Virudunagar) జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్‌మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్‌ (65) అనే ఇద్దరు వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం అర్చకులు వచ్చి ఆలయాన్ని తెరవగా ఆ ఇరువురూ రక్తపుమడుగులో శవాలుగా పడివున్నారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మూడువైపులా ఎత్తయిన ప్రహరీ ఉన్న ఆ ఆలయం చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. ఆ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పోలీసులు పరిశీలించగా, సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు రెండు కార్లలో పదిమంది దుండుగులు ఆలయానికి వచ్చి, సీసీ కెమెరా(CCTV camera)లను ఒక్కొక్కటిగా పగులగొట్టి, వెనుకవైపున్న స్తంభా ల ఆధారంగా ఆలయ ప్రాంగణంలోకి దూకారు. ఆలయం లోపల ఉన్న వాచ్‌మన్లు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

 

చేపలు పడుతూ నీటిలో పడి యువకుడు మృతి..

మూలరాంపూర్ గ్రామ శివారులోని సదర్ మట్ ప్రాజెక్టు వద్ద చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి ఒక వ్యక్తి మృతి

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పోన్కల్ గ్రామానికి చెందిన పల్లికొండ సిద్ధార్థ తండ్రి గంగన్న(18) సంవత్సరాలు అను వ్యక్తి గురువారం రోజున మధ్యాహ్నం సమయంలో చేపలు పట్టడానికి మూలరాంపూర్ గ్రామ శివారులోని సదర్ మట్ ప్రాజెక్టు గేట్ నెంబర్ 52 వద్ద వల తో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు ముందుకు పడి తలకి బలమైన గాయమై అట్టి నీటిలో మునిగి చనిగపోయినాడు అని మృతుడి తండ్రి అయిన పల్లికొండ గంగన్న తండ్రి లింగన్న, (46 ) సంవత్సరాలు అనునతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

 చీమల ఫోబియాతో మహిళ షాకింగ్ నిర్ణయం.. సూసైడ్ నోట్ రాసి..

 చీమల ఫోబియాతో మహిళ షాకింగ్ నిర్ణయం.. సూసైడ్ నోట్ రాసి..

 

ఓ మహిళ అనూహ్యంగా మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది.

సంగారెడ్డి, నవంబర్ 6: అనేక మంది అనేక రకాల వ్యాధులతో, మానసిక ఇబ్బందులతో చనిపోతుంటారు. ఆరోగ్యం బాగాలేక, లైఫ్ ఫెయిల్యూర్ కావడం, డిప్రెషన్, లోన్ల ఒత్తిడి వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా తాజాగా జరిగిన ఓ ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ఫైనాన్సియల్ సమస్యలు, లైఫ్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు లేకపోయినా ఆమె చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ ఒక్కసారిగా షాక్ కు గురి చేస్తోంది. ఇలా కూడా చనిపోతారా? వామ్మో అంటూ ఈ విషయం తెలుసుకున్నవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన తీవ్రంగా కలచివేస్తోంది.
ఓ మహిళ అనూహ్యంగా మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. చీమల ఫోబియాతో తాను చనిపోతున్నానని, తన కూతురు జాగ్రత్త అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చీమల ఫోబియాతో మహిళా చనిపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహిణి మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

 

 రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా..

 రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా?

 

రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే, అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చని మీకు తెలుసా..

BanSBI Account: రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ.. రూ.5.48 ఖర్చుపెట్టండి. అదే మీకు ఆపదలో ఎంతోడగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చు. ఈ పాలసీ పొందడానికి ఖాతాదారుడు ఏడాదికి రూ.2000 ప్రీమియం చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది.
మీరు ఏడాదికి రెండు వేలు చెల్లిస్తే, రూ. 40 లక్షలు, ఏడాదికి వెయ్యి చెల్లిస్తే రూ. 20 లక్షలు, లేదూ.. ఏడాదికి వంద రూపాయలు మాత్రమే చెల్లిస్తే, రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ అనుబంధ సంస్థ అయిన, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తమ ఖాతాదారులకు సమగ్రమైన, చౌకైన ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అందిస్తోంది. ఇది అనుకోని ప్రమాదాల బారిన పడ్డప్పుడు ఎంతో ఊరటనిస్తుంది.

రోడ్డు, విద్యుత్తు ప్రమాదాలు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు.. యాక్సిడెంట్స్, పాముకాటు వంటి కారణాలతో మరణించినా బాధితుడు సూచించిన నామినీకి రూ.40 లక్షలు, ఎస్‌బీఐ అందిస్తుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు లోపు వారికి అర్హత ఉంటుంది. ఈ తరహా స్కీమ్స్ ఇతర బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. హెల్త్ పరంగానే కాదు, ఇతర రంగాలకు కూడా తక్కువ ప్రీమియంతో ఎస్బీఐ ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తోంది.

వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం…

వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా. కాలనీలో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 7వ తేదీ బుధవారం కార్తీక్ పౌర్ణమి రోజున అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని, గురువారం ఉదయం ఆలయ చైర్మన్ నర్సింహా రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది. దొంగలు ఆలయంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కూతురి కిడ్నాప్‌కు యత్నం.. తల్లిదండ్రులపై కేసు…

కూతురి కిడ్నాప్‌కు యత్నం.. తల్లిదండ్రులపై కేసు

 

తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జగిత్యాల: ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై కూతురు ఫిర్యాదు చేసింది. వివరాళ్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, వెల్గటూర్ మండలం రాజక్కపల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్‌ల మధ్య 6 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుస్తోంది.

అయితే.. రాకేష్ దళితుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరిద్దరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో జులై 2న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. తనను తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తుంది. అలాగే.. వారి నుంచి తనకు, తన భర్త రాకేష్‌కు ప్రాణహాని ఉందని తెలిపింది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక ఫిర్యాదు చేసింది. ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 మరో ఘోర రోడ్డు ప్రమాదం..

 మరో ఘోర రోడ్డు ప్రమాదం..

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాణించాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలులో రోడ్డు ప్రమాదం మరువకముందే చేవెళ్లలో మరో ఘోరం జరిగింది. టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే, తాజాగా, కర్ణాటకలోని బీదర్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో-కారు ఢీ కొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మృతులు నవీన్‌ (40), రాచప్ప (45), కాశీనాథ్‌ (60), నాగరాజు (26)గా గురించారు. గణగాపూర్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు హుటాహుటినా సహాయక చర్యలు చేపట్టారు.

డివైడర్ ని ఢీకొన్న కారు బాలుడి ఆరోగ్యం విషయం…

డివైడర్ ని ఢీకొన్న కారు బాలుడి ఆరోగ్యం విషయం
* మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ఆసుపత్రికి తరలింపు
* ముగ్గురికి స్వల్ప గాయాలు
* కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్తూ ప్రమాదం

మహాదేవపూర్ నవంబర్ 5 (నేటిదాత్రి)

 

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొన్న సంఘటన బుధవారం రోజున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం కార్తీక మాసం సందర్భంగా జనగాం నుండి కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామని కారు అదుపుతపడంతో డివైడర్ ని డి కోనడంతో నాలుగు సంవత్సరాల బాబుకు తీవ్రంగా గాయాలు కాగా మహదేవపూర్ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి…

రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి

మహాదేవపూర్ నవంబర్2నేటి ధాత్రి *

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలొని అంబటిపల్లి గ్రామ అమరేశ్వర ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న గోడపర్తి నాగరాజు శర్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన శుక్రవారం రోజున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మహదేవన్ నుండి అంబర్ పెళ్లికి వెళుతుండగా సూరారం రైతు వేదిక ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలుపుతూ అతని వెంట ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గల్లంతయిన కృష్ణ మృతదేహం లభ్యం..

గల్లంతయిన కృష్ణ మృతదేహం లభ్యం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మేనేరు. వంతెనపై గత గురువారం రాత్రి.రెండు రోజుల క్రితం మానేరు వంతెన పై.దూకి. ఆత్మహత్య చేసుకోవడంతో. అతడి మృతదేహం కోసం గాలించడం జరిగిందని.లభ్యం కాకపోవడంతో. ఎస్టి . ఆర్. ఎఫ్.ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి మానేరు వాగులో.గాలించడంతో. ఈరోజు ఉదయం. కృష్ణ మృతదేహం లభించడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతునికి సంబంధించి. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అన్ని కోణాల్లో పరిశీలించి తగిన దర్యాప్తు చేస్తామని. తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.

 అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది…

 అతివేగం.. యువకుడి ప్రాణం తీసింది

 

అతివేగం ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. డ్యూటీకి వెళుతున్నానని చెప్పి బయలు దేరిన యువకుడు అరగంటలోనే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. బాలానగర్‌ సీఐ టి.నర్సింహారాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

పదివేల అప్పుకు.. ఓ నిండు ప్రాణం బలి..

#మరొకరి పరిస్థితి విషమం.

#సొంత అన్న వదినపై దాడికి పాల్పడిన మరిది.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదివేల అప్పు కోసం అన్న వదినలపై మరిది దాడికి పాల్పడి వదిన ప్రాణాలు కోల్పోగా అన్న ప్రాణాలతో కొట్టు మి ట్టాడుతున్న సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మేరగుర్తి మల్లయ్య-సమ్మక్క దంపతులకు రమేష్, సురేష్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కొడుకు రమేష్ కు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు తర్వాత 8 సంవత్సరాల క్రితం రమేష్ భార్య చనిపోగా. మరల గీసుకొండ మండలం మచ్చ పురం గ్రామానికి చెందిన స్వరూప (35) తో గ్రామంలోనే సహజీవనం చేస్తున్నాడు. స్వరూప భర్త చనిపోయాడని ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి గత పది ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం కొండాపురం గ్రామానికి వలస వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో రమేష్ తల్లిదండ్రులు, తమ్ముడు సురేష్ ఆ గ్రామంలోని ఉంటూ బ్రెడ్డు అమ్ముకుంటూ బతుకుతున్నారు. నాలుగు నెలల కిందట అన్న రమేష్ కు సురేష్ 10 వేలు అప్పుగా ఇచ్చాడు.

అప్పు తీర్చమని అడిగితే ఇవ్వడం లేదంటూ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ సైతం ఇటీవల నిర్వహించినట్లు తెలుస్తుంది. తన బంధువులు చనిపోవడంతో రమేష్ అతని భార్య చావుకు వెళ్లి బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. స్నానం చేసే క్రమంలో వేడి నీళ్లు ఎందుకు పెట్టలేదని తల్లితో రమేష్ గొడవ పెట్టుకోగా ఈ క్రమంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేష్ తన అన్నను తన డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఈ నేపథ్యంలో కత్తితో అన్నపై దాడి చేయగా గాయాలు కాగా పక్కనే ఉన్న స్వరూప ఆపడానికి ప్రయత్నించగా సురేష్ ఆమె పైన కూడా దాడి చేసి పొత్తికడుపు చాతి భాగంలో కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. హుటాహుటిన స్థానికుల సహాయంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి గాయాల పాలన ఇద్దరిని తరలించారు. చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన రమేష్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు స్వరూప కొడుకు శివ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.

బాబోయ్… కుక్కలు, కోతులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T124926.707.wav?_=3

 

బాబోయ్… కుక్కలు, కోతులు

మనిషి కనిపిస్తే చాలు వెంటాడుతూ దాడులు

ప్రభుత్వ దావాఖానాలో పెరుగుతున్న కేసులు

జంకుతున్న ప్రజలు…. పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలంలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా మండలంలో కుక్కలు ,కోతుల బెడద తీవ్రంగా మారింది ఏ గ్రామంలో చూసినా కుక్కలు కోతుల దాడులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మనిషి కనిపిస్తే చాలు వెంటప డుతూ ఉన్నాయి దీంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో కోతుల, కుక్కల బెడద తీవ్రం గా ఉన్న అధికారులు తమ కేమి పట్టనట్లుగా వ్యవహ రిస్తున్నారని విమర్శలు వెలు వెత్తుతున్నాయి. చిన్నారులు మరియు వృద్ధులు కుక్కల కోతుల దాడులకు బలవుతు న్నారు రాత్రి అయితే చాలు చెప్పనక్కర్లేదు వీధులు ప్రధాన రహదారిపై గుంపులు గుంపు లుగా సంచరిస్తూ మనిషి కని పిస్తేచాలు వెంటపడుతున్నా యి ద్విచక్ర వాహనాలను వదలడంలేదు మండలము మరియు పలు గ్రామాల్లోని ప్రజలు 300నుంచి 350 మంది దాకా ఆస్పత్రులు పాలయ్యా రు దీంతో రాత్రి వేళల్లో బయ టకు వెళ్లాలంటే ప్రజలు భయ పడుతున్నారు ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version