ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మిక తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(DM&HO) డాక్టర్ మధుసూదన్ గారు ఆకస్మిక తనిఖీ చేసినారు. ఆస్పత్రి హాజరు పట్టికను పరిశీలించినారు. ఆసుపత్రి ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలియజేసినారు. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకోబడును అని తెలియజేసినారు. అదేవిధంగా ఆస్పత్రిలో లేబర్ రూమ్ ,ఆయుష్ రూమ్, యోగ రూమ్ ములను పరిశీలించినారు . తర్వాత మొగుళ్లపల్లి ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ పరిశీలించినారు. వాక్సినేషన్ టిబి నోటిఫికేషన్ , సీజన్ వ్యాధుల గూర్చి మరియు ఎన్ సి డి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాణి గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.
#వచ్చామా పోయామా అనే రీతిలో వ్యవహరిస్తున్న వైద్య అధికారులు.
#సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందిన సిబ్బంది ఎక్కడ..?
నల్లబెల్లి, నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
గత నెల రోజులుగా భారీ వర్షాలు పడడంతో గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. అసలే వర్షాకాలం దోమకాటుతోని విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతు ప్రభుత్వ దావఖానకు వెళితే సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రి ని ఆశ్రయించే పరిస్థితి నెలకొందని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.
#వైద్యాధికారాలు ఎక్కడ..?
పేద ప్రజలు అంటే ఇంత చిన్న చూప. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తూ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ. సమయానికి దావకానకు రాకుండా ప్రైవేటు ఆసుపత్రికి సమయానికి కేటాయిస్తూ పేద ప్రజలకు అందవలసిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు రోగులు వాపోయారు.
#స్పందించని వైద్యాధికారులు.
సీజనల్ వ్యాధులపై నేటి ధాత్రి మండలంలోని వైద్యాధికారులకు చరవాణి ద్వారా సంప్రదించగా ఎలాంటి స్పందన లేదు.
#రోగుల బాధలు పట్టించుకోరా.?
వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంది రోగులు మంచాన పడ్డ కూడా కనీసం ఏఎన్ఎం లో తోపాటు ఆశ వర్కర్లు ఇంటిట తిరిగి సర్వే చేయకపోవడం చాలా బాధాకరం ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని.. సామాజిక వేత్త ప్రణీత్ డిమాండ్ చేశారు.
శాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ సాయి కృష్ణ సూచించారు ఇటీవల కురు స్తున్న భారీ వర్షాలతో ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలువ నీరు లేకుండా చూసు కోవాలని నీరు నిలిచిన ప్రాంతా ల్లో ఈగలు దోమలు చెరి అనారోగ్యాల పాలవుతారని కచ్చి తంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు ప్రస్తుతానికి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్ దగ్గు జలుబు స్కిన్ ఇన్ఫెక్షన్లు విరోచనాలు వాంతులు రక్త కణాలు తగ్గడం లాంటి సమస్యలతో హాస్పిటల్ కు రోగులు వస్తున్నట్లు తెలి పారు ప్రజలు సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు
వానొస్తే ఐలోని ప్రభుత్వ ఆసుపత్రికి జబ్బు చేస్తుంది. సరైన డ్రైనేజి వ్యవస్థ లేక గేట్ల వద్దే నిలిచి ఉంటున్న వర్షపు నీరు ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు రోగుల పాట్లు ఎక్కడా చోటు లేనట్టు ఆసుపత్రి ఆవరణంలోనే మిషన్ భగీరధ వాటర్ ట్యాంకు ట్యాంకు నిర్వహణ లేక ఎక్కువైన నీరు ఆసుపత్రి స్లంపులోకి వెళ్తున్న వైనం వర్షపు నీటి ప్రవాహనికి అడ్డంగా ఉన్న విధ్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదం జరిగేలా ఉన్నా, పట్టించుకోని తహసీల్దార్ కార్యాలయం ఆదాయం లేని చోటు అందుకేనా అటు వైపు చూడని రాజకీయ కనికట్టు
నేటిధాత్రి ఐనవోలు :-
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రంగా ఉన్న అయినవోలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో 2003 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అయినవోలులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది. అప్పటినుండి పేద ప్రజల ఆరోగ్య వరప్రదాయనిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలు లేమితో కొట్టుమిట్టాడుతుంది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల దృష్టిలో పెట్టుకొని గ్రామీణ పేదలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. దాంతో అయినవోలు మండల కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆస్పత్రికి వచ్చి మెరుగైన చికిత్స పొందుతున్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రావు సారథ్యంలో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతిరోజు దాదాపు 100 మంది ఓ.పి.రోగులకు సేవలు అందిస్తూ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది. మరి ఇంతలా గ్రామీణ పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి ఆవరణ చిన్న వర్షానికే చెరువును తలపిస్తుంది. ఆసుపత్రిలోకి వెళ్లే రెండు మార్గాల వద్ద వర్షపు నీరు నిలిచి ఉండడంతో ఆసుపత్రిలోకి వెళ్లేందుకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. అసలే జ్వరాలతో నొప్పులతో నడవలేని పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చే రోగులు అడ్డుగా వర్షపు నీరులో నుంచి తడుస్తూ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీటిలో నుండే వెళ్లే క్రమంలో వృద్ధులు కిందపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశము ఉందని అంతేకాకుండా జరం తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు మరియు మలేరియా డెంగ్యూ లక్షణాలు ఉన్న రోగులకు ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ విభాగంలో ఉంచి డాక్టర్ శ్రీనివాసరావు నుంచి చికిత్స అందిస్తున్నారు.మరి అలాంటి రోగులు కూడా ఈ వర్షం నేను నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాపించి మరిన్ని వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని ఆసుపత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నీరు బయటకు వెళ్లేలా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకనే..
అని ఆసుపత్రి నిర్మాణ సమయంలో ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. కానీ, వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. దాంతో చిన్న వర్షానికి ఆవరణలో వర్షపు నీరు ఎక్కడివి అక్కడే నిలిచి బురదమయం అయ్యి దుర్గంధం వెదజల్లుతుంది. గతంలో వర్షం నీరు వెళ్లేందుకు ఆసుపత్రి తూర్పు భాగంలో ప్రహరీకి ఒక గండి పెట్టగా వరద నీరు ఆ మార్గం గుండా బయటికి వెళ్ళేది. అయితే ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం, పక్కనే ఉన్న నిర్మాణాలు మరియు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు ఇటీవల వేసిన సీసీ రోడ్డు ఎత్తుగా ఉండడం చేత ట్రాన్స్ఫార్మర్ చుట్టూ వరద నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆ మార్గం గుండా వరద నీరు రాకుండా అడ్డుకట్ట వేశారని, దాంతో నీరు బయటికి పోకుండా అలాగే నిలిచి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పాలకుల స్వార్థం రోగులకు ప్రాణ సంకటం
గతంలో ఉన్న పాలకులు మండల కేంద్రంలో ఎక్కడా చోటు లేదు అన్నట్లుగా ఆసుపత్రి ఆవరణలోనే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు.అయితే నిర్మాణం అయితే చేపట్టారు గాని దాని నిర్వహణ సరిగా లేనందున వాటర్ ట్యాంక్ నిండి పోగా ఎక్కువైన నీరు ఆసుపత్రి మెడికల్ వేస్టేజ్ కోసం నిర్మించిన స్లంపులోకి వెళ్తుంది. అది కూడా పూర్తిగా నిండిపోయిన తర్వాత నీరు బయటికి ప్రవహించి ఆసుపత్రి ఆవరణలో నిలిచిపోయి అసౌకర్యానికి కారణమవుతున్నది.
ఆసుపత్రిపై అధికార పాలక వర్గాల శీత కన్ను
నిత్యం ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షపు నీరు నిలువ ఉండకుండా ఆవరణ అంతా మెయిన్ రోడ్డు లెవల్ మట్టి పోయించాల్సిన అవసరం ఉంది. వర్షం నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం చుట్టూ మట్టి పోయించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు నిండిన తర్వాత వచ్చే నీరు బయటికి వెళ్లేలా సరైన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఆసుపత్రిలో మరిన్ని గదులు నిర్మాణం చేపట్టి 30 పడకల ఆసుపత్రిగా అప్డేట్ అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మొగుళ్లపళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మండల వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాలలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ఏ.ఎన్.ఎం .ఆశా వర్కర్లు చేయడం జరిగినది. అదేవిధంగా ఇసి పేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో 55 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి ఇద్దరికీ రక్త నమూనాలు తీసి ల్యాబ్ కు పంపించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ మండలంలో వర్షాలు అధికంగా పడటం వల్ల ,సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం లలో డ్రైడే కార్యక్రమాన్ని అనగా ఇంట్లో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొని వాటిని డ్రై చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా, పుట్టకుండా జాగ్రత్తలు వహించాలని ,జ్వరం వచ్చినట్లయితే మా వైద సిబ్బందికి తెలియజేయాలని మండల ప్రజలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సి .హెచ్ .ఓ. రాజేంద్రప్రసాద్ ,హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,అన్ని గ్రామాల ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన వద్ద జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించి వారికి వెంటనే సరైన వైద్యం అందేలా చూడాలని హాస్పిటల్ సిబ్బంది తో మాట్లాడిన యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఈ సందర్బంగా వారు స్థానిక హాస్పటల్ డాక్టర్ తో మాట్లాడి ఏకలవ్య విద్యార్థుల ఆరోగ్యం పట్ల మెరుగైన వైద్యం అందించి అప్రమత్తం గా ఉండాలని కోరారు, అలాగే సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న తరుణంలో ఏకలవ్య మరియు గురుకుల పాఠశాలల్లో హెల్త్ క్యాంపు లను నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు గమనిస్తూ వారికి తగిన ఆరోగ్య చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, నూనావత్ రవి, పూనెం లక్ష్మి, గుర్రం పుష్పరాజ్, గడ్డం రాజేష్, బొంగు చంద్రశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
◆: – షేక్ రబ్బాని ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఆగష్టు 29: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందని పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు. ఝరాసంగం మండల పరిధిలోని పలు గ్రామలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యయని అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ముస్లింలను దళితులను క్రిస్టియన్లను వెనుకబడిన కులాలను అణచివేయాలని దొరల పరిపాలన తరిమి కొట్టాలని మన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగ పోరాటం చేసి మన హక్కులను తీసుకోవాలన్నారు చెప్పులు మోసే చేతులు కట్టుకునే దినాలు పోయాయన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పొటీ: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో సిపిఎం పోటీ చేస్తుందని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని, ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నామని, ఎవరైనా కలిసి వస్తే ఆలోచిస్తామని ఆయన అన్నారు. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యావని ఆయన అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నేర్మట నుండి బంగారిగడ్డ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, అదేవిధంగా పుల్లెంల నుండి నేర్మట వరకు రోడ్డు నిర్మాణం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బల్లెం స్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, ఈరగట్ల నరసింహ, స్వామి, కలిమెర సైదులు, కొత్తపల్లి వెంకన్న, లక్ష్మమ్మ, ఎన్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ స్థాయిలో సర్పంచ్ లు లేకపోవడంతో కుంటుపడుతున్న అభివృద్ధి
జహీరాబాద్ నేటి ధాత్రి:
గ్రామాల్లో పాలకవర్గాల పాలన లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని బి అర్ ఎస్ యువ నాయకులు షేక్ సోహేల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ప్రత్యేకాధికారుల ముగిసి పాలన సాగుతోంది అని. ప్రత్యేకాధికారులు వారివారి బాధ్యతల్లో బిజీగా ఉండటంతో పాలన గాడితప్పింది అన్నారు. ఇప్పటికే పలుమార్లు పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని తెలిపినా అధికారుల్లో మార్పు రావడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అయితే ప్రతీ చిన్న పనికి ప్రత్యేకాధికారుల అనుమతి తీసుకుని రావాల్సి వస్తోంది. వారు అందుబాటులో లేని సమయాల్లో కార్యదర్శులు ఇబ్బందులు పడుతూ పంచాయతీల్లోని విధులు ఎలాగోలా నెట్టుకు వస్తున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఏడాదిగా విడుదల కావడం లేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని వెంటనే పాలకవర్గం ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించాలని కోరారు..
బి జె పి జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపిటిసి మదన్ నాయక్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పు నూతల రమేష్, అధ్యక్షతన లక్ష్మి సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీజేపీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంపీటీసీ మదన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, నీళ్లు నిధులు నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు ( బి.ఆర్.ఎస్ ) పార్టీ నాయకులు రాబందుల్లా దోసుకుంటే దాదాపు 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజా సమస్యల మీద బిజెపి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపట్టి, కెసిఆర్ ను గద్దె దించడంలో ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేసముద్రం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఎటువంటి అభివృద్ధి చెందలేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని స్తానిక సంస్థలకు సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించక పొవట వలన గ్రామా పంచాయతిలకు రావలిసిన కోట్లాది రూపాయల కేంద్ర నిధులు మురిగి పోయి గ్రామిణా అభివృద్ది కుంటుపడుతున్నది, గ్రామపంచయతిల లో పంచాయతి అధికరులకు పరిపాలన భారంవుతన్నది. కావున వెంటనే అన్ని స్తానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి కార్యకర్తలు పోరాడాలని అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం కేసముద్రం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలిగా వెళ్లి కేసముద్రం మండలం లోని వివిధ గ్రామల ప్రజలు ఎదుర్కుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భముగ బిజెపి మండల అద్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని ఉప్పరపల్లి , ఇంటికన్నె , వేంకటగిరి, కాట్రపల్లె, అర్పనపల్లె, మహమూద్పట్నం, తాళ్ళపుసపల్లి, నారయణపురం,అన్నారం, గాంధీ నగరం, సప్పిడిగుట్ట తండ, కోరుకొండపల్లె , మేగ్య తండ,అనేక తండా గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు, రోడ్లపై నీళ్లు నిలవడం, బురద ఏర్పడటం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోవడం, మురుగునీటి నిల్వతో సీజనల్ వ్యాధులు ప్రబలి గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా సరైన రోడ్డు, రవాణ, విద్యుత్ , మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని. భారీ వర్షాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా గ్రామాలలో పేరుకు పోయిన మురుగు నీరును తొలగించి , బ్లీచింగ్ పౌడరు చల్లి మరియు అంటువ్యాధులు ప్రబలకుండా నివారించాలని ,మురుగు నీటి కాలువలను శుభ్రపరచాలని, పైప్‌లైన్ వ్యవస్థలను మెరుగుపరచి, గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని. కేసముద్రం మండలం లోని గ్రామాలలో అంటు వ్యాధుల నివారణ కు మండల వైద్య శాఖా అధికారులచే తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు . కల్వల గ్రామంలో మురుగు నీరు బయటకు పోయే కనీస వసతులు లేక పోవడంతో గ్రామస్థులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని. మెయిన్ రోడ్డు మరియు కాలనీల్లో డ్రైనేజీ లేకకపోవడంతో రోడ్లపైనే మురుగు నీరు, వరద నిరు ప్రవహిస్తోంది. దీంతో ఈగలు, దోమలు ఇళ్లలోకి వస్తుండడంతో అనారోగ్యానికి గురవుతున్నారని. గతంలో సెల్యులైటిస్, బోదకాలు , డెంగ్యూ జ్వరాలతో కల్వల గ్రామంలో బాధపడ్డారని.కావున ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మరియు కాలనీల్లో డ్రైనేజీ నిర్మించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల డిమాండ్ చేసారు.
దీనికి తోడు ఇప్పుడు ఈ గ్రామంలో మనుషుల జనాభా కంటే కోతుల, కుక్కల సంఖ్యనే ఎక్కువగా ఉందని. భయటికి వెళ్ళాలంటేనే జనం భయపడుతున్నారని , గ్రామాల్లో ప్రజల పై కోతులు, కుక్కల దాడులు పెరిగి అనేక మంది ప్రజలు తీవ్ర గాయాల పాలైన సంఘటనలు జరిగాయని,అంతే కాకుండా ఇక్కడ ప్రజలు ఆరుతడి పంటలు సాగు చేయడం వదిలిపెట్టారని. ఇప్పటికే ఇంటి పై కప్పులను ద్వసం చేస్తున్నాయని . గతంలో మనుషులని చూస్తే కోతులు భయపడి పరుగులు తీసేవి. కాని ఇప్పుడు కోతులను, కుక్కలను చూసి మనుషులు భయపడే పరిస్థితి నెలకొంటుందని కావున కేసముద్రం మండలం లోని అన్ని గ్రామాలలో ఉన్న కోతుల, కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాటానికి తగు చర్యలు తీసుకోవాలని బిజేపి మండల శాఖ తరుపున డిమాండ్ చేసారు . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు బోగోజు నాగేశ్వర చారి,ఉపేందర్ , మండల ఉపాద్యక్షులు కొండపల్లి మహేందర్ రెడ్డి ,నాగరాబోయిన చంద్రకళ, కార్యదర్శి జాటోత్ నరేష్ ,మాల్యాల రాములు, పూర్ణకంటి భాస్కర్ , బండి వెంకన్న ,శ్రీను ,రమేష్ నాయక్ ,సురేష్ నాయక్ ,మంగా వెంకన్న, భుక్య విజయ్ , జంగిటి అనిల్ ,సింగంశెట్టి మధుకర్ , పరకాల మురళీ మైనారిటీ మోర్చా నాయకుడు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మేదరమట్ల గ్రామంలో మొగుళ్ళపల్లి వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో డాక్టర్ వాణి (MLHP)ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ వర్షాలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , లేనిచోఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున, వర్షంలో ఎక్కువగా తిరగకూడదని ,అదేవిధంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేనిచో సీజన్ వ్యాధులు మలేరియా డెంగ్యూ ,చికెన్ గున్యా, డయేరియా లాంటి వ్యాధులు ప్రజలు అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఈ యొక్క మేదరమట్లవైద్య శిబిరంలో 66 మంది కి వైద్య పరీక్షలు చేసి రెండు జ్వర పీడితులను గుర్తించి రక్త నమూనాను తీసి ల్యాబ్ పంపినారు. అలాగే గ్రామంలో దోమలు లార్వా రాకుండా తిమోఫాస్ దోమల మందను పిచ్చికారి చేయడం అయినది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంషబీద, పంచాయతీ సెక్రెటరీ, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది ,ప్రజలు పాల్గొన్న .
పరకాల నేటిధాత్రి గత రెండురోజుల నుండి ఎడతెగక కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగాణం గుంతల్లో,లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరి బురదమయమయ్యింది.ప్రయాణికులు బస్టాండ్ ఆవరణలో నడిచే సమయంలో బస్సులు వస్తే బురద నీరు ప్రయాణికుల మీద పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు పగుళ్ళు ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి అపరిశుభ్రంగా ఉంటోందని,స్విపర్లు చెత్త డబ్బాలు ఉన్నప్పటికీ చెత్త వాటిలో వేయకుండా పక్కన పడేస్తున్నారని సాయంకాలం వచ్చే సరికి ప్రాంగణంలో నీరునిల్వ ఉండటంతో దోమలు గుమికూడి కుడుతున్నాయని ప్రయాణికులు దోమలు,ఈగలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిపో మేనేజర్ సంబంధిత అధికారులు స్పందించి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో తాత్కాలిక మరమ్మత్తులు చేసి సీజనల్ వ్యాధుల భారిన పడకుండ ఆవరణలో బ్లీచింగ్ పౌడర్ ను జల్లించాలని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
చిట్యాల మండలం లోని శాంతి నగర్ లోసోమవారం రోజున శాంతినగర్ అంగన్వాడి కేంద్రాన్ని జయప్రద సూపర్వైజర్, మెడికల్ ఆఫీసర్ రాకేష్ గారు,జాయింట్ విసిట్ చేసి వర్షాకాలం అయినందున సీజన్ వ్యాధులు ప్రబలకుండా, తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిసరాలన్నీ ఈగలు, దోమలు, వాలకుండా ఎప్పటికప్పుడు ఫినాయిల్, డెటాల్, బ్లీచింగ్ పౌడర్ , చల్లి,కడిగి శుభ్రంగా పెట్టుకొని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, వేడివేడి భోజనం తినాలని, వడకట్టి వేడి చేసిన నీటిని తాగాలని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు విరోచనాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించి, పిల్లలకు, తల్లులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజిత, ఏఎన్ఎం, ఆశ వర్కర్ హాజరైనారు.
భారీవర్షాల వల్ల ఆస్తి,ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలి
భారీ వర్షాల పట్ల జాగ్రత్త చర్యలు చేపట్టాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట, నేటిధాత్రి:
ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా శిథిలావస్థలో ఉన్న గృహాలు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు.జిల్లా సంబంధిత వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పలు పథకాల క్రింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికిని , వాగులు, వంకలు ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు మార్గాలను డైవర్ట్ చేయాలన్నారు.ఇందుకు గాను పోలీసు, గ్రామ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు.తీవ్ర వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.లోతట్టు బ్ప్రాంతాల్లో జలమయం కు ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలి. డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తులు, వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని అధికారులను ఆదేశించారు.ప్రత్యేకంగా డ్యామ్‌లు, చెరువుల స్థితిగతులు నిరంతరం పరిశీలించాలని,ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
“Precautions for Heavy Rains in Warangal”
కొన్ని ప్రాంతాలలో వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.ఈనెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మండల స్థాయి టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు సెలవులో వెళ్లకుండా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.వర్షాల వల్ల నీరు కలుషితమై దోమలు ప్రబలి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి,ఇరిగేషన్ శాఖ ఈఈలు శంకర్,సునీత,జిల్లా ఆర్ అండ్ బి అధికారి,జిల్లా పంచాయతీ అధికారి కల్పన,జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,ఆర్డీఓ లు సత్యపాల్ రెడ్డి,ఉమారరాణి,తహసీల్దార్లు వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
పరకాల నేటిధాత్రి మున్సిపాలిటీలోని ఒకటో వార్డు సీఎస్ఐ కాలనీలో మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఎప్పటికప్పుడు సానిటేషన్ పనులుచేపడుతున్నారు.పదవికాలం ముగిసినప్పటికి నేనెప్పుడు ప్రజల వెంటే ప్రజలకోసమే అన్నరీతిలో సమస్యలకు తనదైన శైలిలో పరిస్కారం చూపుతున్నాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ఇంటింటి చెత్త స్వచ్ఛ ఆటోల ద్వారా క్రమం తప్పకుండా వీధులలోని చెత్త ట్రాక్టర్ల ద్వారా సేకరించాలని, దుర్వాసన వస్తున్న పరిసర ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వవున్న ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లించాలని,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల మందు పాగింగ్ చేపించి,డ్రైనేజీలు ఎప్పటికప్పుడు తీపించి,తీసిన చెత్త కుప్పలు వెను వెంటనే శుభ్రంగా ఉంచాలని,వార్డులో సంచరించే కోతుల,కుక్కల బెడద ఉందని వాటినుండి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని,వార్డులోని ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జీవించేలా చూడాలని స్థానిక కౌన్సిలర్ కమిషనర్ సుస్మ ని కోరారు.
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.వార్డులోని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు,వ్యక్తిగత శుభ్రత పాటించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు యువత,మడికొండ.ఐలయ్య, ఇమ్మానియేల్,పాలకుర్తి భాస్కర్,జవాన్ మంద. మహేష్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యను పరిష్కరించండి మహాదేవపూర్ ఆగస్టు13(నేటి ధాత్రి
మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామంకుదురుపల్లి గ్రామపంచాయతీ కి గత ఆరు సంవత్సరాలుగా త్రాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్య పరిష్కరించాలని గ్రామ ప్రజలు మంగళవారం గ్రామంలోని గ్రామ కార్యదర్శికి నీటిసమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించిచారు మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ని పాత గూడెంలో గత ఆరు సంవత్సరాలుగా త్రాగునీటి సరఫరా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గతంలో అనేకమార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని త్రాగునీటికి సంబంధించి తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదని వర్షాకాలం కావడంతో సీజన్ వ్యాధులు వచ్చి అవకాశాలు ఉన్నాయని తాగునీటికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో రత్నం నాగరాజు గోగులబాపు రాజయ్య లక్ష్మి పద్మ లచ్చయ్య సడవలి తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండలం. ఇందిరమ్మ కాలనీలో పర్యటించిన. డిస్టిక్ రాపిడ్ రెస్పాన్స్ టీం ఆధ్వర్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటింటా సర్వే చేసిన డిస్ట్రిక్ట్ రాపిడు రెస్పాన్స్ టీం. ఇందులో భాగంగా. తంగళ్ళపల్లి. పిహెచ్సి. ఆశ అండ్. పారా మెడికల్ సిబ్బంది ఇంటింటా.ఫీవర్. కేసులను. గురించి ఆరాధిసి. రాపిడ్ టెస్టులు నిర్వహించిన ఆరోగ్య శాఖ సిబ్బంది. డ్రై డే. కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని.మురికి కాలువలో. ఏపీ ఈ.+. స్ప్రే నిర్వహించి న. ఆరోగ్యశాఖ సిబ్బంది. వీరి వెంట రాపిడి టీం సభ్యులు. రాజు. రాజేందర్. మరియు తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుండి . హెచ్ వి. ప్రమీల. సతీష్. ఏఎన్ఎం. జ్యోతి. గ్రామపంచాయతీ కార్యదర్శి. అనూష. ఆశ వర్కర్లు సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పంచాయత్ ఆఫీస్ లోనే చెత్తచెదారం… మరి గ్రామంలో పరిస్థితి అంతకన్నా అధ్వానం.
గ్రామంలో ప్రతి వీధిలో డ్రైనేజ్ తో నిండిన కాలువలు.
సైడ్ కాలువ కనపడకుండా కమ్మేసిన చెట్లు. రోడ్డుపై నిలిచిన డ్రైనేజీ నీరు..!
నిద్ర అవస్థలో గ్రామపంచాయతీ అధికారి..!
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది అలసత్వంతో వీధులలో నిండిపోయిన డ్రైనేజీ దోమలు ఈగలు విజృంభిస్తున్న పట్టించుకోని అధికారి, వివరాల్లోకి వెళితే చిట్యాల మండల కేంద్రం పెద్ద గ్రామపంచాయతీ మెయిన్ రోడ్డు వెంబడి ఒకే వైపు సైడ్ కాలువ ఉంది ఆ కాలువలో చెత్త చెదారంతో నిండి దోమలు ఈగలు విజృంభిస్తున్న పట్టించుకోని గ్రామ అధికారి, కనీసం వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారి చేసిన దాఖలాలు లేవు, సాయంత్రమైందంటే గ్రామంలోని ప్రజలు దోమలతో ఈగలతో బాధపడుతూ జ్వరాలు బారిన పడుతున్నారు, ఇంత జరిగినా పంచాయతీ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు,
అలాగే పశువైద్యశాల వెంబడి ఉన్న వీధిలో డ్రైనేజి మొత్తం నిండిపోయి ఈగలు దోమలు విజృంభిస్తున్నాయి, రాత్రి అయిందంటే దోమలతో బాధపడుతూ డెంగీ జ్వరం వచ్చే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు, కానీ ఇంతవరకు అధికారి ఆ డ్రైనేజీ వైపు చూసిన పాపాన పోలేదు అలాగే చిట్యాల గ్రామపంచాయతీ ముందు గల సైడ్ కాలువలో చెత్తచెదారంతో నిండి ఉన్న కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, ఇంత జరిగినా కూడా గ్రామ ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో ప్రజలు కోపద్రకులవుతున్నారు, చిట్యాల కొత్త బస్టాండ్ నుండి ఎఫ్ సి ఐ గోదామువరకు కనీసం సైడ్ కాలువ కనిపించకుండా చెట్లు పెరిగిన కూడా కొన్ని సంవత్సరాల నుండి పట్టించుకోని
గ్రామపంచాయతీ అధికారి తూతూ మంత్రంగా పనులు ముగించుకొని వెళ్తూన్నారు, మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వాడల్లో చెత్తాచెదారంతో డ్రైనేజీతో దోమలతో ఈగలతో నిండిపోతున్న పట్టించుకోని అధికారిపై మండల ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు మండల అధికారులు స్పందించి వర్షాకాలం సీజన్ కావున వీధులలో దోమల మందు పిచికారి చేసి కాలువల శుభ్రం చేయించి బ్లీచింగ్ చేయాలని వేడుకుంటున్నారు, లేనియెడల రోగాల బారిన పడే అవకాశం ఉందని ఇప్పటికే కొన్ని వీధులలో ప్రజలు విరోచనాలు వాంతులతో
హాస్పటల్లో చేరి బాధపడుతున్నారు కనీసం వారంలో రెండు రోజులైనా క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు, అసలే పంచాయితీకి సర్పంచ్ లేని కారణంగా పనులను పట్టించుకోకుండా పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కావున మండల కేంద్రంలోని వీధులలో చెత్తచెదారంతో నిండకుండా డ్రైనేజీలను శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో లక్ష్మీ కాలనీ గ్రామంలో వైద్యశిబిరం
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల పరిధిలో లక్ష్మీ కాలనీ గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి రక్త పరీక్షలు చేసి సాధారణ జ్వరంగా నిర్ధారణ అవ్వటంతో వైద్యం అందించడం జరిగినది ఈ ఆరోగ్య శిభిరంలో 47 మంది ప్రజలకు వైద్య సేవలు అందించారు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కనుక అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అందరూ ఫ్రైడే డ్రైడే పాటించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు పెరిగే అవకాశం ఉండదనీ తెలిపారు రాత్రి వేళలో నిద్రించేటప్పుడు అందరూ దోమతెరలు వాడాలని తెలియజేశారు నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉన్నప్పుడే భోజనం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మొబైల్ డాక్టర్ సచిన్ ఆర్ బిఎస్కే వైద్యురాలు డాక్టర్ స్పూర్తి హెల్త్ సూపర్వైజర్ రామ్ ప్రసాద్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ శిరీష మొబైల్ నర్సింగ్ ఆఫీసర్ దీక్షిత హెల్త్ అసిస్టెంట్ స్వరూప రాణి ఆర్బిఎస్కే స్టాఫ్ నర్స్ దుర్గ సార్బి ఎస్ కే ఎన్ ఎం భారతి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరకాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని,కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.కలుషిత నీరు,కలుషిత ఆహారం,అపరిశుభ్ర వాతావరణం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్నారు. పందులు,ఈగలు,దోమలు విషజ్వరాల వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని నీటి కుండిలను,పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకెట్లలో,ఖాళీ కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదని ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని,కూలరులో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Seasonal Diseases
రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా,దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని,ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.మన ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో నీటి నిలువ లేకుండా చూడాలని,పరిసర ప్రాంతాలు శుభ్రతగా ఉంటేనే మనకు ఎటువంటి వ్యాధులు రావని,డెంగ్యూ,మలేరియా వ్యాదులు అనేవి ప్రధానంగా దోమల వల్ల వస్తుందని,ప్రధానంగా గ్రామాలలో ఎక్కడ నీటి నిలువ లేకుండా చూసుకోవాలని ఒకవేళ నీటి నిలువ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలని అన్నారు.పరిసరాల ప్రాంతాల శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లక్షణాలు కనిపించిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి అని వైద్యులు తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.