భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త
చేవెళ్ల, నేటిధాత్రి:
కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు అనుబంధం గ్రామమైన వెంకన్నగూడ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య
నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఇతనికి ఇద్దరు భార్యలు. రెండో భార్య అయిన రజితను అతికిరాతకంగా హత్య చేశాడు. వెంకన్నగూడ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య నగరంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య రజిత(30)తో గత రెండేళ్లుగా మనస్పర్దాలున్నాయి. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగిన మంగళవారం జంగయ్య రజిత హత్యకు పథకం వేశాడు. సోమవారం సాయంత్రం భార్య రజిత, జంగయ్య ఇద్దరు గ్రామ సమీపంలో మద్యం త్రాగారు. అనంతరం రజితను చున్నీతో మెడకు బిగించి ఉరివేశాడు. అప్పటికి చావలేదనుకుని సిమెంట్ కడ్డీతో మోది అతికిరాతకంగా హత్య చేశాడు.
హత్య చేసిన అనంతరం ఫోటోలు, వీడియోలు తీసి మొదటి భార్యకు పంపించాడు. అదేరోజు రాత్రి నిందితుడు చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.