రోటీ పిండిలో విషం..

రోటీ పిండిలో విషం.. భర్త సహా 8 మందిని లేపేయాలని ప్లాన్..

భర్త, అతడి కుటుంబీకులను చంపేందుకు ఓ కోడలు మహత్తరమైన స్కెచ్ వేసింది. విషం కలిపిన గోధుమ పిండితో చపాతీలు తయారుచేసి అత్తమామల కుటుంబాన్ని లేపేయాలని ప్లాన్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ దారుణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఇష్టం లేని పెళ్లి చేశారనో.. ప్రియుడి కోసమో.. భర్త నచ్చలేదనో.. ఇలా ఏదొక కారణంతో కట్టుకున్న మొగుణ్ని దారుణంగా మర్డర్ చేసే భార్యల గురించి ఈ మధ్య తరచూ వినే ఉంటారు. కానీ, ఈ మహిళ స్టైలే వేరు. భర్త తిట్టాడని కాదు.. తోడికోడలు నవ్విందని అన్నట్టుగా.. ఓ మహా ఇల్లాలు వదినతో గొడవ జరిగిందని భర్తను, అతడి తరపు ఫ్యామిలీని చంపేందుకు మహత్తరమైన ప్లాన్ వేసింది. ఒకే దెబ్బతో అందరినీ లేపేయాలనే కసితో విషం కలిపిన గోధుమపిండితో చపాతీలు తయారుచేసి అందరికీ తినిపించాలని కుట్ర పన్నింది.

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తింట్లో గొడవలతో విసిగిపోయిన మాల్తీ దేవీ భర్త సహా అతడి కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నింది. ఒక రోజున సల్ఫోస్ అనే విషపూరిత రసాయనాన్ని గోధుమ పిండిలో కలిపి చపాతీలు తయారుచేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో మాల్తీ వదిన మంజూ దేవి పిండి నుంచి వింత వాసన రావడం గమనించింది. ఏదో చేస్తోందనే అనుమానంతో ఇంట్లో అందరికీ చెప్పింది. దీంతో అత్తమామలు మాల్తీ దేవిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పేసింది. కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపేందుకు పిండిలో విషం కలిపానని స్వయంగా అంగీకరించింది.

కరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కియా బాజా ఖుర్రామ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన జరిగింది. రోజువారీ తగాదాలు, మానసిక హింసతో విసిగిపోయిన మాల్తీ తండ్రి ప్రసాద్, సోదరుడు బజరంగీతో కలిసి ఈ కుట్ర పన్నింది. ఇంట్లో కలహాలు మొత్తం కుటుంబాన్నే చంపాలనే నిర్ణయానికి దారి తీస్తాయని తెలుసుకుని స్థానికుల ఆశ్చర్యపోతున్నారు. మాల్తీ దేవికి ఆమె వదిన, అత్తమామలతో తరచూ గొడవలయ్యేవని గ్రామస్థులు అంటున్నారు. ఈ మొత్తం ఘటన గురించి మాల్తీ భర్త బ్రిజేష్ కుమార్ వెంటనే కరారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మాల్తీతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. విషం కలిపిన గోధుమ పిండిని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రణాళిక, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా ముగ్గురినీ విచారణ చేస్తున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.

అతడి నోరు తెరుచుకోవడం లేదు..

అతడి నోరు తెరుచుకోవడం లేదు.. కలిసి చంపేద్దాం రా.. ఢిల్లీ హత్య కేసులో సంచలన నిజాలు..

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్‌మార్టమ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వరసకు మరిది అయిన రాహుల్ (24)తో అఫైర్ పెట్టుకున్న సుస్మిత.. అతడి సహాయంతో భర్తను అంతమొందించింది.

వివాహేతర సంబంధాలు, ఇష్టం లేని పెళ్లిళ్లు వంటి కారణాలతో భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది (Wife Kills Husband). భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లి అక్కడే అతడిని చంపించిన ఘటన నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఢిల్లీ (Delhi)లో కూడా అదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్‌మార్టమ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

వరుసకు మరిది అయిన రాహుల్ (24)తో అఫైర్ పెట్టుకున్న సుస్మిత (Susmita).. అతడి సహాయంతో భర్త కరణ్ దేవ్ (Karan Dev) ను అంతమొందించింది. ఇన్‌స్టాగ్రామ్ ఛాట్ వీరి వ్యవహారాన్ని బయటపెట్టింది. హత్య చేస్తున్న సమయంలో కూడా రాహుల్‌తో సుస్మిత ఛాటింగ్ చేసింది. ఆ ఛాటింగ్ తాజాగా బయటకు వచ్చింది. నిందితురాలు తొలుత తన భర్త కరణ్‌కు భోజనంలో 15 నిద్ర మాత్రలు కలిపి తినిపించింది. అయినా కరణ్ మరణించలేదు. దీంతో ఆ సమయంలో రాహుల్‌తో సుస్మిత ఛాటింగ్ చేసింది.

‘మాత్రలు వేసుకున్న తర్వాత ఎంతసేపటికి చనిపోతారో ఒకసారి చెక్ చెయి. ఇప్పటికి కరణ్‌కు మాత్రలు ఇచ్చి మూడు గంటలు అయింది. వామిటింగ్స్ కాలేదు. చనిపోలేదు. ఇప్పుడేం చేయాలి’ అని రాహుల్‌కు సుస్మిత మెసేజ్ పంపించింది.

ఆ మెసేజ్‌కు రాహుల్ స్పందిస్తూ.. ‘అది వర్కవుట్ కాకపోతే కరెంట్ షాక్ ఇవ్వు’ అని చెప్పాడు. అతడి కాళ్లు, చేతులను టేప్‌తో కట్టేసి షాక్ ఇవ్వాలని సూచించాడు.

‘అతడు చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాడు’ అని రాహుల్‌కు సుస్మిత చెప్పింది.

‘ఇంట్లో ఏమేం మాత్రలు ఉన్నాయో అవన్నీ అతడి చేత మింగించు’ అని రాహుల్ రిప్లై ఇచ్చాడు.

‘నేను కరణ్ నోరు తెరవలేకపోతున్నా. అతడి నోట్లో నీళ్లు వేశా. మాత్రలు వేయడానికి మాత్రం కుదరడంలేదు. నువ్వు ఇక్కడకు రా. ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాం’ అని సుస్మిత చెప్పింది.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి కరణ్‌కు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. అనంతరం సుస్మిత అత్తగారి దగ్గరకు వెళ్లి తన భర్త కరణ్‌కు కరెంట్ షాక్ కొట్టినట్టు చెప్పింది. వెంటనే అందరూ కలిసి కరణ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే కరణ్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ వద్దని అతడి తండ్రి, రాహుల్ (సహ నిందితుడు), సుస్మిత పట్టుబట్టారు. అయితే పోలీసులు వారి మాటలను వినకుండా పోస్ట్‌మార్టమ్ జరిపించడంతో హత్య విషయం బయటపడింది.

వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ గురించి.

వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ గురించి ఈ విషయాలు తెలుసా

 

2024 సంవత్సరం పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. అంతకు ముందు విశాల్‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన వరలక్ష్మీ శరత్ కుమార్ సడెన్‌గా పెళ్లి వద్దనుకుంది.

ఆ తర్వాత కొంతకాలం కామ్‌గా ఉన్న ఆమె.. తనకు 14 సంవత్సరాలుగా తెలిసిన నికోలాయ్ సచ్‌దేవ్‌‌ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లాడిన నికోలాయ్ సచ్‌దేవ్‌‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

వరలక్ష్మీ శరత్ కుమార్ అందరికీ పరిచయమే.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ నటిగా కొనసాగుతున్న వరలక్ష్మీ..

ఇటీవల నికోలాయ్ సచ్‌దేవ్‌ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అంతకు ముందు విశాల్‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన వరలక్ష్మీ..

ఆ తర్వాత పెళ్లే చేసుకోనంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది.

కానీ, తనకు 14 సంవత్సరాలుగా పరిచయం ఉన్న నికోలాయ్ సచ్‌దేవ్‌‌‌ని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు అతను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. సడెన్‌గా అనౌన్స్ చేసింది.

అలా ప్రకటించిన కొన్ని రోజులలోనే నికోలాయ్‌తో పెళ్లి పీటలు ఎక్కేసింది. దీంతో అతడు ఎవరని అంతా ఆమధ్య తెగ సెర్చ్ చేశారు. ఈ సెర్చింగ్ నికోలాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.

ఆ విషయాల్లోకి వెళితే.నికోలాయ్ సచ్‌దేవ్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్.

అతను ముంబైలో ‘గ్యాలరీ 7’ అనే ఆర్ట్ గ్యాలరీని నడుపుతుంటారు.

ఈ గ్యాలరీని చూసేందుకు తరుచుగా సెలబ్రిటీలు వెళుతుండటంతో.. ముంబైలోనే ప్రసిద్ధి చెందిన గ్యాలరీగా పేరు పొందింది. ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్‌లైన నికోలాయ్ తల్లిదండ్రులు అరుణ్ మరియు చంద్ర ఈ ‘గ్యాలరీ 7’ని స్థాపించారు.

ఇది కాకుండా.. నికోలాయ్ సచ్‌దేవ్ పవర్‌లిఫ్టర్ మరియు ఫిట్‌నెస్ నిపుణుడిగానూ పేరు పొందారు.

అనేక పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆయన విజేతగా నిలిచారు. అలాగే ఆయన టాటూ ప్రేమికుడు కూడా.

ఆ విషయం ఆయనను చూస్తేనే తెలుస్తుంది.

ఇక నికోలాయ్‌కి అంతకు ముందే పెళ్లయింది.

వరలక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు నికోలాయ్. 2006లో మోడల్ మరియు ఫిట్‌నెస్ శిక్షకురాలైన కవితను నికోలాయ్ పెళ్లి చేసుకున్నారు.

ఈ జంటకు కాషా అనే కుమార్తె కూడా ఉంది.

కాషాకు కూడా నికోలాయ్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గానూ, పవర్‌లిఫ్టింగ్‌ శిక్షకుడిగానూ వ్యవహరించారు. ఫలితంగా ఆమె అనేక అవార్డులను సైతం గెలుచుకుంది.

అయితే పెళ్లయిన 13 సంవత్సరాల అనంతరం నికోలాయ్, కవిత విడాకులు తీసుకున్నారు.

2019లో వీరి వివాహ బంధం పూర్తిగా ముగిసింది. అయితే అప్పటికే వరలక్ష్మీ, నికోలాయ్‌కి పరిచయం ఉండటంతో, వారి పరిచయం ప్రేమ వరకు వెళ్లి, చివరికి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో భార్యాభర్తల ఫైట్..

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో భార్యాభర్తల ఫైట్.. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడంతో..

 

 

 

 

శనివారం ఓ ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డారు.

ఈ క్రమంలో మహిళ భర్త మరో ప్యాసెంజర్‌తో కూడా దురుసుగా వ్యవహరించడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

మరో ప్యాసెంజర్ ఫిర్యాదు మేరకు..

భార్యతో గొడవ పడ్డ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఏఐ 454 ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది.

విమానం ల్యాండయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది.
ఇద్దరి గొడవను చూసి మరో ప్యాసెంజర్ వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో మహిళ భర్త..
ప్యాసెంజర్‌తో తగవుకు దిగాడు.
వీరి గొడవ పతాకస్థాయికి చేరడంతో విమానం క్రూ సదరు ప్యాసెంజర్‌ను బిజినెస్ క్లాస్‌లోకి మార్చాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.
‘ల్యాండింగ్‌లో సిద్ధమవుతున్న సమయంలో మహిళ భర్త సీట్ల మధ్య నడవాలో నిలబడి మరో ప్యాసెంజర్‌తో తగవుకు దిగారు.
ఈ విషయం క్యాబిన్ క్రూ దృష్టికి రావడంతో వారు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.
రెండో ప్యాసెంజర్‌ను బిజినెన్ క్లాస్‌లోకి పంపించారు.
ఈ మేరకు మహిళ భర్తపై రెండవ ప్యాసెంజర్ ఫిర్యాదు చేయడంతో పైలట్ ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
విమానం ఢిల్లీలో దిగాక వారు మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నారు’ అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

విమానంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనను తాము అస్సలు సహించబోమని ఎయిర్ ఇండియా పేర్కొంది.

ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొంది.

ఈ విషయంలో దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది.

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలి భర్త.

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలి భర్త

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మునిసిపాలిటీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో శనివారం మృతి చెందారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యురాలు రజియా భర్త మరణం పార్టీకి తీరని లోటని బిఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజా రమేష్ బాబు అన్నారు. కుటుంబాన్ని పరామర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రజియా కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, గడ్డం సంపత్, నాయకులు జక్కన బోయిన కుమార్, గడ్డం రాజు, చంద్రమౌళి, సదానందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

బాణాల రాంబాబుకు పెద్ది ఘన నివాళులు.

బాణాల రాంబాబుకు పెద్ది ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మున్సిపల్ 23 వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి బాణాల ఇందిరా భర్త బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాల రాంబాబు గుండెపోటుతో మరణించగా రాంబాబు పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి దంపతులు పూలమాలవేసి నివాళులర్పించారు.రాంబాబు భార్య మాజీ కౌన్సిలర్ ఇందిరతో పాటు కుటుంబాన్ని ఓదార్చారు.అనంతరం స్థానిక నాయకులతో కలిసి పెద్ది అంతిమ యాత్రలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ,ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ బాధ్యులు, మాజీ కౌన్సిలర్స్, పట్టణ ఉపాధ్యక్షులు, పట్టణ పార్టీ ప్రచార కార్యదర్శి,వార్డు అధ్యక్షులు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు వివిధ అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version