ఎస్వీ వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహన

*వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం..

తిరుపతి నేటి ధాత్రి:

 

ఎస్వీ వైద్య కళాశాల 2025 మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ, మరియు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారి ఆదేశాల మేరకు వైద్య విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన పెంపొందించడానికి (ఈజ్) అనే ఎమోషనల్ అసెస్‌మెంట్ ఇన్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్,
అంశం మీద అవగాహన కార్యక్రమం,*ఎస్వీ వైద్య కళాశాల డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో ఈజ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
మానసిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు వైద్య విద్య ఎంతో ఒత్తిడితో కూడిన వైద్య విద్య అని వైద్య విద్యార్థులు భావిస్తారు, కానీ ప్రతిరోజు వారు నేర్చుకున్న వైద్య విద్యను ఎప్పటికప్పుడువైద్య అధ్యాయపకులతో చర్చించుకుని వారి కావలసిన విధంగా తర్ఫీదైనట్లయితే వైద్య విద్య ఎంతో సులువైనదని, అప్పుడే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎంతో ఆనందం కలుగుతుందనిఒత్తిడికి గురికాకుండా ఉండడానికి వైద్య విద్యను అన్ని విధాలుగా క్రమం తప్పకుండా వైద్య లైబ్రరీ లాంటి వాటిలో సమయము వృధా చేయకుండా చదువుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

ట్రైనర్ డాక్టర్ నెల్సన్ వివిధ అంశాల వారీగా మెంటల్ హెల్త్, ఆత్మహత్యల నివారణ పైశిక్షణ ఇచ్చారు.
ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలిగుర్తించాలి అనే అంశాలను, మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులకు ఆయన తర్ఫీదు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డి ఎస్ ఎన్ మూర్తి, డాక్టర్ మల్లికార్జున రావు డాక్టర్ జాహ్నవి , యూజీ, పీజీ, వైద్య విద్యార్థులు, డాక్టర్ మహేష్ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ జి.మురళి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ. వీర కిరణ్ తదుతరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో టిబి రక్త పరీక్షలు

తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు…

 

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత మేడం గారి సూచన మేరకు తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. డాక్టర్ స్నేహ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అనుమానితులకురక్త పరీక్షలు చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు దయాగ్నొస్టిక్సెంటర్లో .అరుదుగా చేసే ఈ పరీక్ష ఎప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ పరీక్ష ద్వారా ఇనాక్టివి టిబి తెలుసుకోవడం ద్వారా ముందస్తు క్షయ వ్యాధికి గురికాకుండా ప్రివెంట్ చేయవచ్చని ఈ గ్ర పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి పూర్తిగా మూడు రోజులపాటు 12 .డోసులు వారం చొప్పున మందులు ఇవ్వడం జరుగుతుందని తెలుపుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోక్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు టిబి లేటెంట్ ఇన్ఫెక్షన్ ఈ గ్రా రక్త పరీక్షలు నిర్వహించారు. సుమారు పదిమంది అనుమానితుల నుండి రక్త నమూనాలను తీసి టీ హబ్ కి పంపించారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ టిబి ల్యాబ్ సూపర్వైజర్ నాగరాజు. సూపర్వైజర్ ప్రమీల. హెల్త్ అసిస్టెంట్ సతీష్. ఏఎన్ఎం జ్యోతి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హార్టికల్చర్‌లో పీహెచ్.డి సాధించిన ఊరటి మహేష్

హర్టికల్చర్ లో డాక్టరేట్ పొందిన ఊరటి మహేష్

వెంకటాపురం గ్రామస్తుల హర్షం వ్యక్తం

అతిచిన్న వయస్సులో పీహెచ్ డీ పొందిన డాక్టర్ మహేష్.

సంతోషం వ్యక్తపరిచిన తల్లిదండ్రులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించి అందరిమన్ననలు పొందాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి.వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన,మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు.చిన్ననాటి నుండే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.అనంతరం పిహెచ్ డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు.ఈ యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్‌.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు. అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.

 

డాక్టరేట్ ప్రదానం చేస్తున్న డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ

విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్
విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డాక్టర్ ఊరటి మహేష్ ఫైల్ ఫోటో

 

డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది..తల్లిదండ్రులు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

చర్ల మండలంలో ఆర్ఎంపీలు అనధికారిక హాస్పిటల్స్ నిర్వహణ

క్వాలిఫైడ్ డాక్టర్లను మరిపించేలా చర్ల మండలం ఆర్ఎంపిలు

ఒకప్పుడు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లే నేడు హాస్పిటల్సగా నిర్వహణ

వైద్యాధికారుల అనుమతులతోనే నడుస్తున్నాయా

నేటిదాత్రి చర్ల

Vaibhavalaxmi Shopping Mall

చర్ల మండలం చతిస్గడ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతం కావడంతో అమాయకులైన ఆదివాసిలు నమ్మి ఆర్ఎంపీల వద్దకు వైద్యం కొరకు వెళ్లడంతో వారు ప్రధమ చికిత్స చేయవలసిన సదరు ఆర్ఎంపీలు స్టెరాయిడ్స హైడోస్ యాంటీబయటిక్లు ఇస్తున్నారు రక్త పరీక్షలు చేయిస్తూ మలేరియా డెంగ్యూ జ్వరాలకు కూడా వచ్చి రాని వైద్యం చేస్తున్నారు వ్యాధి ఎక్కువ అయిన తరువాత భద్రాచలం పంపిస్తూ కూడా లబ్ధి పొందుతున్నారు అక్కడకు వెళ్లి చివరి దశలో రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు ఆర్ఎంపి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఇప్పుడు హాస్పిటల్ గా చలామణి అవుతున్నాయి ఎలా సాధ్యమని వివరాలు కోరితే మాకు ల్యాబ్లకు లైసెన్స్ ఉన్నాయని చెప్పడం గమనార్హం
ప్రక్కనే మెడికల్ షాపు డయాగ్నస్టిక్ సెంటర్లు ఎలా వచ్చాయి ఒకప్పుడు క్లినిక్ అని బోర్డు పెట్టడానికి భయపడే ఆర్ఎంపీలు ఇప్పుడు కొందరు హాస్పిటల్ గా ప్రభుత్వ అనుమతులతో బయో మెడికల్ మరియు డయాగ్నిక్ సెంటర్లకొరకు అడ్డదారిలో అనుమతి తీసుకుని భద్రాచలం లో ఉండే డాక్టర్లు పేర్లతో బోర్డులు తగిలించుకొని వైద్యశాలలు నడుపుతున్నారు డిఎంఎల్ టి క్వాలిఫికేషన్ ఉన్నవారికి కూడా ల్యాబ్ పర్మిషన్ లేదు ఎందుకంటే వారు ఆర్ఎంపీలకు మరియు సెల్ఫ్ గా టెస్టులు చేస్తూ వైద్యం చేస్తున్నారని వారిని నియంత్రణ చేయాలన్న ఉద్దేశంతో మినిమం ఎంబీబీఎస్ అర్హత ఉన్న వారి వద్దే ల్యాబ్ ఉండాలన్న రూల్స్ అమల్లో ఉన్నాయి కానీ ఆర్ఎంపీల డయాగ్నస్టిక్స్ సెంటర్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారు అర్థం కాని పరిస్థితి వారి ల్యాబ్లో కనీస అర్హత కలిగిన టెక్నీషియన్స్ కూడా లేకుండానే కొందరైతే ఆర్ఎంపీలే రక్త పరీక్షలు చేస్తున్నారు మండలంలోని చిన్న గ్రామాలు తెగడ సత్యనారాయణపురం ఆర్ కొత్తగూడెం లో కూడా ఆర్ఎంపీలు ల్యాబ్లు నిర్వహిస్తున్నారు ఒక ల్యాబ్లో రిపోర్టు మరో ల్యాబ్ రిపోర్టుకి సంబంధం లేకుండా ఇస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా వీరి మధ్య పోటీ పెరగడంతో మా వద్ద రక్త పరీక్షలకు తక్కువ ధరలు అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు ఇకనైనా అధికారులు స్పందించి నకిలీ వైద్యులను గుర్తించి వారి మీద చర్యలుతీసుకోవాల్సిందిగా చర్ల మండల ప్రజలు కోరుకుంటున్నారు

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు తెలిపారు..
గురువారం గణపురం మండలం బుర్రకాయలగూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులు పూల బొకే అందించి ఆమెకు స్వాగతం పలికారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, “మీ పేరేంటి… నాకోసం ఎదురు చూస్తున్నారా?” అంటూ వారిని పలకరించారు. తరువాత ఆమె పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 140 మంది చిన్నారులు పోషణలోపంతో బాధపడుతున్నారని, వారికి తగిన వైద్య శిబిరాలు నిర్వహించి, అవసరమైన పోషకాహారాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం గురించి, అలాగే కిశోర బాలికలకు పంపిణీ చేస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీలువివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిశోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని అధికారుల నుండి సమాచారం అందుకున్న ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ బావుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పోషణ మాసంలో భాగంగా సీమంతాలు చేసి ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ సుఖ ప్రసవాలతో పాటు ఆరోగ్య వంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు.
అంతకు ముందు రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్ పరిశీలించారు. ఎలాంటి వ్యాధులకు సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశాలకు ఆశా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు విచ్చేసిన ప్రభరి అధికారి పౌసమి బసుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,
జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సిపిఓ బాబురావు, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఉప వైద్యాధికారి డా శ్రీదేవి, డా ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు

సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

#పట్టించుకోని వైద్యాధికారులు.

#రోగులకు సరైన మందులు లేని ఆసుపత్రులు.

#వచ్చామా పోయామా అనే రీతిలో వ్యవహరిస్తున్న వైద్య అధికారులు.

#సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందిన సిబ్బంది ఎక్కడ..?

నల్లబెల్లి, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

గత నెల రోజులుగా భారీ వర్షాలు పడడంతో గ్రామాలలో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. అసలే వర్షాకాలం దోమకాటుతోని విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతు ప్రభుత్వ దావఖానకు వెళితే సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రి ని ఆశ్రయించే పరిస్థితి నెలకొందని ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు.

#వైద్యాధికారాలు ఎక్కడ..?

పేద ప్రజలు అంటే ఇంత చిన్న చూప. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తూ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ. సమయానికి దావకానకు రాకుండా ప్రైవేటు ఆసుపత్రికి సమయానికి కేటాయిస్తూ పేద ప్రజలకు అందవలసిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు రోగులు వాపోయారు.

#స్పందించని వైద్యాధికారులు.

సీజనల్ వ్యాధులపై నేటి ధాత్రి మండలంలోని వైద్యాధికారులకు చరవాణి ద్వారా సంప్రదించగా ఎలాంటి స్పందన లేదు.

#రోగుల బాధలు పట్టించుకోరా.?

వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెంది రోగులు మంచాన పడ్డ కూడా కనీసం ఏఎన్ఎం లో తోపాటు ఆశ వర్కర్లు ఇంటిట తిరిగి సర్వే చేయకపోవడం చాలా బాధాకరం ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని.. సామాజిక వేత్త ప్రణీత్ డిమాండ్ చేశారు.

జహీరాబాద్లో కొణెంగల దాడి.. ఇద్దరికి గాయాలు…

జహీరాబాద్లో కొణెంగల దాడి.. ఇద్దరికి గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పరిధిలోని కొణెంగల (కొండముచ్చు) దాడిలో శనివారం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రాంనగర్ కు చెందిన రాజ్ కుమార్, శరణమ్మ అనేవారు ఈ దాడిలో గాయపడినట్లు సమాచారం. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం, గాయపడిన ఇరువురు క్షేమంగానే ఉన్నారు.

విద్యార్థి శస్త్రచికిత్సకు నీలి ప్రకాష్ ఆర్థిక సహాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-100-1.wav?_=1

చిన్నారి వైద్యానికి 10200 ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ లయన్ నీలి ప్రకాష్

నేటిదాత్రి చర్ల

మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు నీలి ప్రసాద్ ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురైన విద్యార్థి బొడ్డు యశ్వంత్ కు అండగా పదివేల రెండు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు పాత చర్ల నివాసితులు డోల కృష్ణయ్య మనవడైన ఎనిమిదవ తరగతి చదువుతున్న బొడ్డు యశ్వంత్ అనే ఈ విద్యార్థికి అనుకోని పరిస్థితుల్లో ఈ విద్యార్థికి కడుపునొప్పి రావడంతో భద్రాచలం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అప్పులు చేసి ఆ కుటుంబం సర్జరీ చేయించారు హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితులో మీకోసం మేమున్నాం సంస్థను ఆశ్రయించగా సంస్థ చైర్మన్ నీలి ప్రకాష్ పలువురు దాతల సహాయంతో పదివేల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం చైర్మన్ నీలి ప్రకాష్ చేతులు మీదుగా మరియు కట్ట అమ్మాజీ చేతుల మీదుగా కుటుంబానికి అందించారు ఈ సందర్భంగా చైర్మన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు భరోసాగా ఉండేందుకు మా సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని ఇప్పటివరకు ఇలా సుమారు 1000 సేవా కార్యక్రమాలు పూర్తి చేయడంలో సంస్థ సభ్యులు మరియు దాతల సహకారం మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో దొడ్డ ప్రభుదాస్ కవ్వాల రాము దొడ్డి సూరిబాబు సోల్లంగి నాగేశ్వరరావు గాదె రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

కవేలిలో ఆరోగ్య కేంద్రం పనులు ఆగిపోయాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T161111.926.wav?_=2

ఆరోగ్య కేంద్రం పనులు మధ్యలోనే ఆగిపోయాయి: గ్రామస్థుల ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గోడలు, పైకప్పు పూర్తయినా, లోపలి పనులు అసంపూర్తిగా ఉండటంతో భవనం నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామ ప్రజలు ఆరోగ్య సదుపాయాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పనులను త్వరగా పూర్తి చేసి సబ్ సెంటర్ ను ప్రారంభించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కబడ్డీ, రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-80-1.wav?_=3

కబడ్డీ,రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు

నర్సంపేట,నేటిధాత్రి:

జాతీయ క్రీడా దినోత్సవం ఉత్సవాలలో భాగంగా కలెక్టర్,క్రీడాశాఖ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారిని టీవీఏల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియం లో సోమవారం కబడ్డీ రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్జిఎఫ్ఐ సెక్రెటరీ సోనబోయిన సారంగపాణి,రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, నర్సంపేట జోన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గండి నర్సయ్య గౌడ్,సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు నర్సంపేట మండల కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లూరి స్వామి గౌడ్,డాక్టర్ సాదిక్, కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన – జాతీయ నోడల్ అధికారి

సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన – జాతీయ నోడల్ అధికారి

మహాదేవపూర్ ఆగస్టు 21 (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిని గురువారం రోజున జాతీయ నోడల్ అధికారి రమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధిక వర్షపాతం నమోదు కావడం ఎడతెరిపి లేకుండా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రులలో ఒక్కసారిగా రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మారుమూల ప్రాంతమైన మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రిని జాతీయ నోడల్ అధికారి రమణ అకస్మికంగా తనిఖీలలో భాగంగా రోగుల వివరాలను, సంబంధిత రిజిస్టర్లను, ఎమర్జెన్సీ వార్డులను, డయాలసిస్ సెంటర్లను, డాక్టర్లు అందించే సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎన్ఓ రమణ, డిఎన్ఓ ఉమాదేవి, డిపిఓ చిరంజీవి, డిఎల్వో ప్రమోద్ కుమార్, పిఓఎన్సిడి సందీప్ కుమార్, సూపర్డెంట్ విద్యావతి, పలువురు డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.

లక్ష్మారెడ్డి పల్లిలో ఉచిత వైద్య శిబిరం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42-2.wav?_=4

లక్ష్మారెడ్డి పల్లిలో వైద్య శిబిరం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో గురువారం చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి శ్రీదేవి ఆదేశాల మేరకు లక్ష్మి రెడ్డి పల్లి సబ్ సెంటర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా గ్రామస్థులకు బీపీ, షుగర్, థైరాయిడ్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ,రక్త పరీక్షలు నిర్వహించి మందులు అంద చేశారు.
ఈ శిబిరంలో సూపర్వైజర్ కృష్ణవేణి,విజయలక్ష్మి,ఏఎన్ఎం పార్వతి,ఆశా వర్కర్లు జెమున,విమల,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

క్షీణత బాధిత గాజా మహిళ ఇటలీలో మృతి.

గాజాలో తీవ్రంగా క్షీణతకు గురైన 20 ఏళ్ల మారా అబూ జుహ్రి, తల్లితో కలిసి ఇటలీకి చికిత్సకు తీసుకువెళ్ళారు. పిసా విశ్వవిద్యాలయ ఆసుపత్రి తెలిపిన ప్రకారం, ఆమెకు గుండె ఆపదకారణంగా 48 గంటల్లో మృతి చెందింది. మారా తీవ్ర బరువు తగ్గుదల, మసిల్స్ నష్టంతో బాధపడింది. ఐక్యరాజ్య సంస్థ గాజాలో విస్తృతమైన పోషణ లోపం ఉందని హెచ్చరించింది, కానీ ఇస్రాయెల్ దీనిని నిరాకరిస్తోంది.
ఇటలీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కీమ్ ద్వారా యుద్ధంతో బాధపడుతున్న 180 మంది బాలకులు, పెద్దవారు చికిత్స కోసం ఇటలీకి తీసుకువెళ్ళబడ్డారు. బ్రిటన్ కూడా గాజా నుండి బలహీన బాలకులు, గాయపడిన వారిని తక్షణమే తీసుకురావాలని కోరుతోంది. గాజాలో ఇస్రాయెల్ బాంబింగ్ కారణంగా 60,000 మందికి పైగా మృతి చెందాయని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కిడ్నీ కేన్సర్ ముందస్తు లక్షణాలు…

ప్రాణాలు తీసే కిడ్నీ కేన్సర్.. ఈ లక్షణాలను జాగ్రత్తగా కనిపెట్టండి..

కిడ్నీ కేన్సర్ అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఈ కేన్సర్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గుర్తించడం చాలా కష్టం. కిడ్నీ కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. కిడ్నీ కేన్సర్‌ను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రాణాలు తీసే కిడ్నీ కేన్సర్.. ఈ లక్షణాలను జాగ్రత్తగా కనిపెట్టండి..  కిడ్నీ కేన్సర్ అనేది సైలెంట్ కిల్లర్. ఎందుకంటే ఈ కేన్సర్ వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా గుర్తించడం చాలా కష్టం. కిడ్నీ కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే సులభంగా దాని నుంచి బయటపడవచ్చు. కిడ్నీ కేన్సర్‌ను ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ కిడ్నీ కేన్సర్‌కు సంబంధించి ఐదు ముందస్తు సూచనల గురించి తెలుసుకుందాం  మూత్రంలో రక్తం

1) మూత్రంలో రక్తం

కిడ్నీ కేన్సర్ మొదటి సంకేతం మూత్రంలో రక్తం పడడం. దీనిని హెమటూరియా అంటారు. కేన్సర్ కణితులు మూత్రపిండాలు, మూత్ర వ్యవస్థలోని చిన్న రక్త నాళాలను దెబ్బతీయడం వల్ల మూత్రంలో రక్తం పడుతుంది.

 

2)వెన్ను నొప్పి

మూత్రపిండాల కేన్సర్ నిరంతర పార్శ్వ నొప్పిని లేదా నడుము నొప్పిని కలిగిస్తుంది. ఎటువంటి గాయం లేకుండా వీపు దిగువ భాగంలో నొప్పి మొదలై క్రమంగా తీవ్రమవుతుంది. రక్తంలో మూత్రం పడడం, తీవ్రమైన వెన్ను నొప్పిని విస్మరించకూడదు. వెంటనే చికిత్స ప్రారంభించాలి.

3)బరువు తగ్గడం

వ్యాయామం, డైటింగ్ వంటి లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోనప్పటికీ వేగంగా బరువు తగ్గుతుండడాన్ని కూడా అనుమానించాలి. కిడ్నీ కేన్సర్ ప్రారంభ దశలో ఆకలి, జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గిపోతారు.

4)నడుముకు దిగువన గడ్డలు

నడుము దిగువన లేదా పక్కటెముకల కింద ఏవైనా గడ్డలు లేదా వాపు వంటివి కనిపిస్తున్నా అనుమానించాలి. వీపు దిగువన వాపు అనేది కిడ్నీలో కణితి పెరుగుదలను సూచిస్తుంది. అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షల ద్వారా వైద్యులు ఆ గడ్డలు దేనికి సంబంధించినవో తెలుసుకుంటారు.

5)అలసట, నీరసం

తరచుగా నీరసంగా అనిపించడం, త్వరగా అలసిపోవడం కూడా కిడ్నీ కేన్సర్‌కు ప్రారంభ సంకేతంగా భావించవచ్చు. కిడ్నీ కేన్సర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అది రక్తహీనతకు దారి తీసి తీవ్ర అలసటకు, నీరసానికి కారణమవుతుంది.

విరాళంగా కంప్యూటర్ ల్యాబ్ కు లక్ష రూపాయలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-28-4.wav?_=5

విరాళంగా కంప్యూటర్ ల్యాబ్ కు లక్ష రూపాయలు

నేటి ధాత్రి కథలాపూర్

అందజేసిన ఎన్ ఆర్ ఐ డా. గట్ల నర్సింగం

కథలాపూర్, ఆగస్టు 16 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ కొరకు లక్ష రూపాయలను ఎన్ ఆర్ ఐ డా. గట్ల నర్సింగం విరాళంగా అందజేశారు. శనివారం
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ కు సిరికొండ గ్రామానికి చెందిన అమెరికా ప్రవాస భారతీయులు డా. గట్ల నర్సింగం 1 లక్ష రూపాయలు విరాళం అందజేసినట్టు ప్రధానోపాధ్యాయులు లోకిని శ్రీనివాస్ తెలిపారు. తన మిత్రులైన విశ్రాంత ఉపాద్యాయులు ఒటారికారి చిన్న రాజన్న, డా. వేముల ప్రభాకర్ మిత్ర బృందం పాఠశాలలో నగలు రూపేణా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నర్సింగం గతంలో కూడా పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారని, పాఠశాల అభివృద్ధికి తన సహకారాన్ని అందించారనీ లోకిని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా నర్సింగము కు గ్రామస్తులు, ఉపాద్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు.

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి,రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మాజీ తన్నీరు హరీష్ రావు నర్సంపేట పట్టణంలో
నెక్కొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన గ్రీన్ స్టార్ హాస్పిటల్ ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ప్రాంతంలో కిడ్నీ,గుండె,బ్రెయిన్ తదితర అత్యాధునిక పరికరాలతో సర్జరీలు,వైద్య సదుపాయం సేవలు చేయనున్నట్లు తెలిపారు.ఆసుపత్రికి ఆరోగ్య శ్రీ పథకం వచ్చే వరకు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ రోగికి ఉచిత ఓ.పి సేవలు అదుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు.

Green Star Hospital

ర్యామినార్ ఆపరేషన్ దియేటర్ ఏర్పాటు ద్వారా అడ్వాన్స్డ్ శస్త్ర చికిత్సలు నర్సంపేటలో మొదటిసారి వచ్చాయని డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.ఎన్నారై,ఆసుపత్రి డైరెక్టర్ శానబోయిన రాజ్ కుమార్ మాట్లాడుతూ నర్సంపేట పరిదిలో ప్రజలకు తక్కువ ఖర్చులతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో తెచ్చమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సుంకరి సంతోష్ రెడ్డి,స్వప్న సుదర్శన్ రెడ్డి, గోనె యువరాజు,డాక్టర్ శ్రీకృష్ణుడు, డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి,డాక్టర్ ఓం ప్రకాష్,డాక్టర్ రాహుల్,డాక్టర్ విద్య,డాక్టర్ కిరణ్ రెడ్డి,రాష్ట్ర మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్,వై.సతీష్ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు,ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ,పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ,నియోజకవర్గ యూత్ కన్వీనర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, పిఎసిఎస్ చైర్మన్ లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,ప్రజాసంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

లక్ష యాభై రూపాయల ఎల్ఓసి ని అందజేసిన..

లక్ష యాభై రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోహీర్ మండలానికి చెందిన రాజ్ శేఖర్ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,50,000/-( లక్ష యాభై వేల రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన *గౌరవ జహీరాబాద్ శాసన సభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మాజి సర్పంచ్ రవికిరణ్ గారికి ,ధన్యవాదాలు తెలిపారు

మన ఆరోగ్యం…!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-2.wav?_=6

మన ఆరోగ్యం…!

వంటగదే ఒక ఔషధ నిలయం:

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాములుగా వచ్చే జలుబూ జ్వరాల నుండి తీవ్రంగా వుండే ఆస్తమా, మధుమేహం వరకూ కూడా మన వంటిట్లో ఉన్న వస్తువులతో తగ్గించుకోవచ్చు. మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్ళాలి.

1) పసుపు:

▪️పసుపుని పై పూతగా మరియూ లోపలికి కూడా తీసుకుంటారు.

▪️నీళ్లతో కలిపి పాదాలకు పూయడం వలన ఫంగస్ వ్యాధులు,గజ్జి మరియూ ఇతర బాక్టీరియా వ్యాధులు తగ్గిపోతాయి. కాళ్ళ పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.

▪️పసుపుని కొద్దిగా నూనెతో కలిపి కాలి వేళ్ళ మధ్య పూస్తే నీళ్లలో నానడం ద్వారా వచ్చే ఎలర్జీ తగ్గి పాదాలకి అందం కూడా వస్తుంది.

▪️ముఖానికి పూస్తే నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.

▪️పసుపులో బెల్లం కలిపి తింటే కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి.

▪️పసుపు పూయడం వల్ల శరీరం మీద వచ్చే ఎర్రని దద్దుర్లు (రషేర్) తగ్గుతాయి.

▪️బాలింతలకు ఇస్తే పాలు బాగా పడుతాయి.

▪️వేడి పాలలో ఒక గ్రాము పసుపు కలిపి ఇస్తే జలుబు, దగ్గు, తగ్గిపోతాయి.

▪️ 5 గ్రాముల పసుపు, 5 గ్రాముల ఉసిరి పొడి కలిపి ఉదయం పరకడుపున తీసుకుంటే మధుమేహం క్రమేణా తగ్గుతుంది.

▪️పసుపు నిత్యం తీసుకునే వారిలో జీర్ణవ్యవస్ధ కి సంబంధించిన క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి.

2) ధనియాలు:-

▪️కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు దంచిన పచ్చి ధనియాలను రెండు గంటల పాటు నానబెట్టి అందులో చక్కెర కలిపి ఆ నీటిని త్రాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.

▪️దప్పిక, మంట పూర్తిగా పోతుంది. చెమట బాగా పడుతుంది.

▪️పారాసిటమోల్ టాబ్లెట్ కంటే చాలా త్వరగా పని చేస్తుంది.

▪️కళ్ళ కలకలకు ఈ నీటిని వడగట్టి కళ్ళలో వేస్తే దురద, మంట మరియు ఎరుపు రంగు తగ్గిపోతాయి.

▪️పచ్చి ధనియాలను నూరి కడితే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిపోతుంది.

▪️మూలవ్యాధి లో, చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లను ఇస్తే దురద, రక్తస్రావం తగ్గిపోతాయి.

▪️మోతాదు: 5 నుండి 10 గ్రా పొడి కి 50 నుండి 100 మి లీ నీరు కలపాలి.

3) సోంపు:

▪️సోంపు ని దంచి నీళ్లలో ఒక గంట నానబెట్టి ఆ తరవాత ఆ నీళ్ళని బాగా కలబెట్టి తాగితే కడుపు నొప్పి, గాస్ట్రీక్ సమస్య తగ్గుతుంది.

▪️విరేచనం సాఫీగా అవుతుంది.

▪️నులిపురుగులు కూడా పడి పోతాయి.

▪️కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులకు ఇది వెంటనే శ్వాశ నాళాలను తెరిపించి శ్వాశ బాగా ఆడేటట్లు చేస్తుంది.

▪️అతిసార వ్యాధి ఉన్నవారికి మెంతుల పొడితో కలిపి ఈ పొడిని ఇవ్వవచ్చు.

▪️సోంపుకి కొన్ని నీళ్ళు కలిపి నూరి మెత్తని పేస్టులా చేసి ఎముకల నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పట్టిస్తే ఎముకల నొప్పి తగ్గుతుంది.

▪️మూత్రంలో వచ్చే మంటకు సోంపు చాలా బాగా పని చేస్తుంది.

kitchen remedies

 

4). అల్లం మరియూ శొంఠి:

▪️అజీర్ణ వ్యాధితో బాధపడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఒక ఉప్పుతో కలిపి నమిలి తింటే ఆకలి పెరుగుతుంది.

▪️నాలుక, కంఠం శుభ్రపడి రుచి బాగా తెలుస్తుంది.

▪️తేనెతో కలిపి అల్లం రసం తాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

▪️నీరుల్లితో కలిపి అల్లం రసం తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి.

▪️ప్రయాణాల్లో వాంతులు వచ్చేవారు రెండు స్ఫూన్ల అల్లం రసం కానీ లేక ఒక స్పూన్ శొంఠి పొడి కానీ తీసుకుంటే 12గంటల వరకు వాంతులు రావు.

▪️అమీబియాసిస్ వ్యాధికి శొంఠి చాలా మంచిది.

▪️కీళ్ల నొప్పులకు శొంఠి పొడి రోజూ తీసుకుంటే వాపు తగ్గి కీళ్లు బాగా వంగుతాయు.

5). జీలకర్ర:

▪️జీలకర్ర వాడటం వలన జీర్ణాశయంలో వచ్చే అల్సర్లు తగ్గుతాయి.

▪️లివర్ పనిచేయడం మెరుగుపడుతుంది.

▪️నెలల తరబడి బాధించే రక్త విరేచనాలు పూర్తిగా తగ్గిపోతాయి.

▪️అతిసారంతో బాధపడే వారికి మజ్జిగ లేక పెరుగుతో కలిపి ఇస్తే గంటలో తగ్గిపోతాయి. మూత్రం కూడా సాఫీగా వస్తుంది.

▪️బాలింతలకు పాలు బాగా పడుతాయి.

▪️మూలవ్యాధితో ఉన్నవారికి రక్తస్రావం తగ్గుతుంది.

▪️నిద్ర బాగా వస్తుంది.

▪️శరీరంలో ఏ కండరము నొప్పి అయినా సరే కొన్ని గంటల్లో తగ్గిస్తుంది.

6). లవంగాలు:

▪️ఇవి పళ్ళకి, కంఠానికి సంబంధించిన వ్యాధులలో చాలా బాగా పని చేస్తుంది.

▪️చిగుళ్ల నుండి రక్తం కారే వారు ఒక లవంగం బుగ్గన పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే చిగుళ్ళు గట్టిపడుతాయి.

▪️నోటి దుర్వాసన దూరం అవుతుంది.

▪️పిప్పి పన్ను మొదటి దశలో లవంగాన్ని మెత్తటి పొడి చేసి పన్ను భాగంలో నింపి ఒక గంటసేపు అలాగే ఉంచగలిగితే వెంటనే పోటు తగ్గి దంతక్షయం కలుగకుండా ఉంటుంది.

▪️వేడి నీళ్లలో నాలుగు లవంగాలు వేసి ఆ నీళ్లను ఒక్కో స్పూన్ తాగుతూ ఉంటే కలరా,అతిసారం వంటి వ్యాధుల కారణంగా వచ్చే దప్పిక తగ్గుతుంది.

▪️అజీర్ణం, కడుపులో గ్యాస్ చేరడం వంటి సమస్యలకు లవంగాలు చూర్ణం (500mg) 10 నిమిషాలలో ఫలితం చూపుతుంది.

7). యాలకులు:

▪️అతిసారం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేని వారికి ఒక గ్లాస్ పాలలో రెండు గ్రాముల యాలకుల పొడిని కలిపి ఇస్తే బలం చేకూరుతుంది.

▪️యాలకుల కి కిడ్నీల మీద పని చేసే ప్రభావం కలిగి ఉంటుంది.

▪️ప్రతిరోజూ యాలకుల పొడిని తీసుకుంటే మూత్రం అధికంగా వచ్చి మూత్రంలో రాళ్లు పోతాయి.

▪️గుండె దడ వచ్చే వ్యక్తుల్లో యాలకుల పొడి వలన గుండె దడ తగ్గుతుంది.

▪️మాటమాటకి తల తిరిగే వ్యక్తులకు యాలకులను చక్కెర పొడి మరియూ నేతితో కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్య పోతుంది.

9). దాల్చిని చెక్క:

▪️ఇది పళ్లకు, చిగుళ్ల కు సంబంధించిన సమస్యలకు బాగా పని చేస్తుంది.

▪️దీని వలన ఆహారం జీర్ణం బాగా అవుతుంది.

▪️తినే ఆహారంలో దాల్చిని చెక్క చేర్చడం వల్ల కాన్సర్, అల్సర్లు రాకుండా ఉంటాయి.

▪️టైఫాయిడ్ జ్వరం ఉన్నపుడు ఈ పొడిని వేడి నీళ్లలో కాసేపు ఉంచి ఆ నీటిని వేడి చేసి ఇస్తే జ్వరం తగ్గుతుంది.

▪️సూక్ష్మజీవుల వలన కలిగే విషప్రభావం తగ్గుతుంది.

▪️రక్త స్రావం కాకుండా ఆపుతుంది.

▪️చీటికీ మాటికీ నోటిలో పుండ్లు వచ్చే వారికి ఈ దాల్చిని చెక్క చూర్ణం చాలా మంచిగా పని చేస్తుంది.

10). గసగసాలు:

▪️వీటిని ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక గంటసేపు ఉంచి ఆ తర్వాత తాగితే తలనొప్పి తగ్గుతుంది.

▪️అలసట వల్ల కలిగిన వంటి నొప్పులు కూడా తగ్గుతాయి.

▪️వీటి పొడి మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరేచనాలు అరగంటలో తగ్గిపోతాయి.

▪️అరగ్రాము పొడి పాలతో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.

▪️గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు వీటి కషాయం తో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.

18 ఏళ్లు దాటాయా? అయితే..

18 ఏళ్లు దాటాయా? అయితే..

ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఆడుతూ, జిమ్, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, సిగరెట్, మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా గుండెపోటు మరణాలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

నీటినిల్వ వలన సీజనల్ వ్యాధులు సోకే అవకాశలు ఎక్కువ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-08T113409.858.wav?_=7

నీటినిల్వ వలన సీజనల్ వ్యాధులు సోకే అవకాశలు ఎక్కువ

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

సూపరిండెంట్ గౌతమ్ చౌహాన్,ఆర్ఎంఓ డాక్టర్.బాలకృష్ణ

పరకాల నేటిధాత్రి

ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరకాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని,కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.కలుషిత నీరు,కలుషిత ఆహారం,అపరిశుభ్ర వాతావరణం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్నారు. పందులు,ఈగలు,దోమలు విషజ్వరాల వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని నీటి కుండిలను,పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకెట్లలో,ఖాళీ కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదని ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని,కూలరులో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

Seasonal Diseases

రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా,దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని,ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.మన ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో నీటి నిలువ లేకుండా చూడాలని,పరిసర ప్రాంతాలు శుభ్రతగా ఉంటేనే మనకు ఎటువంటి వ్యాధులు రావని,డెంగ్యూ,మలేరియా వ్యాదులు అనేవి ప్రధానంగా దోమల వల్ల వస్తుందని,ప్రధానంగా గ్రామాలలో ఎక్కడ నీటి నిలువ లేకుండా చూసుకోవాలని ఒకవేళ నీటి నిలువ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలని అన్నారు.పరిసరాల ప్రాంతాల శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లక్షణాలు కనిపించిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి అని వైద్యులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version