దత్తగిరిని సందర్శించిన జిల్లా ఎస్పీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు
నిలయమైన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బుధవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా మృత్యుంజయ లక్ష జప యజ్ఞానికి హాజరయ్యారు. వారికి ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలకు అభిషేకం, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని మంగళ హారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వరానందగిరి మహారాజ్ ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.