పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..

పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..

 

మాజీ ప్రియుడి పెళ్లిలో యువతికి దారుణమైన అవమానం జరిగింది. పెళ్లి కొడుకు చెయ్యిని ముద్దు పెట్టుకోవటంతో పెళ్లి కూతురు తీవ్ర ఆగ్రహానికి గురైంది. వాయు వేగంతో స్పందించింది. భర్త మాజీ ప్రియురాలిపై దాడి చేసింది.

మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లిన ఓ యువతికి దారుణమైన అవమానం జరిగింది. పెళ్లి కొడుకు చెయ్యిని ముద్దు పెట్టుకోవటంతో పెళ్లి కూతురు తీవ్ర ఆగ్రహానికి గురైంది. వాయు వేగంతో స్పందించింది. భర్త మాజీ ప్రియురాలిపై దాడి చేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ప్యాంట్స్, షర్ట్ వేసుకున్న ఓ అమ్మాయి మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

నిషేధిత ప్రాంతంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తికి..

నిషేధిత ప్రాంతంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తికి.. ఎవరు ఎలాంటి శిక్ష వేశారో చూస్తే..

 

ఓ యువకుడు బహిరంగ ప్రదేశంలో డాల్ఫిన్ల నీటి కొలను ఎదురుగా నిలబడ్డాడు. చుట్టూ జనం ఉన్నా కూడా బహిరంగంగా సిగరెట్ వెలిగించాడు. గుప్పు గుప్పుమని పొగ ఊదుతూ సిగరెట్ తాగుతున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో జనం మధ్యలో ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ తాగుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తుంటారు. వారు అనారోగ్యానికి గురికావడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అయితే చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే శిక్షణ కఠినంగా ఉంటాయి. ఇలాంటి సంఘనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తి పరిస్థితి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

 గీజర్ కంపెనీల సేల్స్‌కు పెద్ద దెబ్బ..

 గీజర్ కంపెనీల సేల్స్‌కు పెద్ద దెబ్బ.. వేడి నీటి కోసం ఎలాంటి ట్రిక్ కనిపెట్టాడో చూడండి..

 

ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (winter bathing trick).
సాధారణంగా చలికాలం వస్తే అందరూ వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. అయితే అందరి ఇళ్లలోనూ గీజర్లు ఉండవు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ వ్యక్తి తన ట్యాలెంట్‌ను ఉపయోగించాడు. ఆ వీడియోను @DashrathDhange4 అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి బాత్రూమ్ కుళాయి కింద ఖాళీ నూనె డబ్బాను ఉంచాడు. ఆ డబ్బా కింద ఉన్న పాన్‌లో నిప్పు మండుతోంది. కుళాయి నుంచి నీరు డబ్బాలో పడగానే, కింద ఉన్న మంట కారణంగా ఆ నీరు వేడుక్కుతోంది

పెళ్లికి నో చెప్పిన ప్రియురాలు.. యువకుడు ఏం చేశాడంటే..

పెళ్లికి నో చెప్పిన ప్రియురాలు.. యువకుడు ఏం చేశాడంటే..

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతో ఓ యువకుడు కరెంట్ టవర్ ఎక్కాడు. ప్రియురాలితో పెళ్లి చేయకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఇలాంటి సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ తెలివి కారణంగా అతడు దెబ్బకు కిందకు దిగి వచ్చాడు.

అన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్లాలన్న రూలేమీ లేదు. కొన్ని ప్రేమ కథలు పెద్దల కారణంగా పెళ్లి వరకు వెళ్లకుండానే ముగిసిపోతున్నాయి. మరికొన్ని ప్రేమ కథలు అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఇష్టం లేకపోవటం వల్ల పెళ్లి వరకు వెళ్లటం లేదు. తాజాగా, ఓ యువకుడికి లవర్ షాక్ ఇచ్చింది. పెళ్లి చేసుకోవటం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. కరెంట్ టవర్ ఎక్కి ప్రాణాలు తీసుకోవటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
షాహ్‌లాల్ ప్రాంతానికి చెందిన సంతోష్ సాకెత్ అనే 19 ఏళ్ల కుర్రాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. బుధవారం పెళ్లి విషయంలో ప్రేమికుల మధ్య గొడవ జరిగింది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందామని సంతోష్ ప్రియురాలిని అడిగాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోవటం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో సంతోష్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఊరి బయట ఉన్న కరెంట్ టవర్ ఎక్కాడు. గట్టిగా అరుస్తూ అటువైపు వెళుతున్న ఊరి జనాన్ని పిలిచాడు. ప్రియురాలు తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, పోలీసులు టవర్ దగ్గరకు చేరుకున్నారు. అతడిని బతిమాలి కిందకు దించే ప్రయత్నం చేశారు. ఎవరు ఎంత బతిమాలినా అతడు మాత్రం కిందకు దిగలేదు. ఈ నేపథ్యంలోనే ఓ లేడీ కానిస్టేబుల్ సూపర్ ప్లాన్ వేసింది. సంతోష్‌కు ఫోన్ చేసింది. అతడి ప్రియురాలిలా గొంతు మార్చి మాట్లాడింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చింది. తనతో మాట్లాడుతున్నది ప్రియురాలే అనుకున్న సంతోష్ టవర్ పైనుంచి కిందకు దిగి వచ్చాడు. కథ సుఖాంతం అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T141157.951.wav?_=1

 

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…..!

◆- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి

◆:- ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఝరాసంగం, ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుం టామని ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నందున సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన రాజకీయ దూషణలో జరిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండలంలోని ప్రజలు ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకొని శాంతియుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేలా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..

ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (viral stunt).

హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ…

హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

 

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025.. ఐకానిక్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో హర్మన్ ఓ ప్రత్యేకమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

టీమిండియా(Team India) ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్(Harmanpreet Kaur) తన చేతిపై ప్రపంచ కప్ టాటూనే వేయించుకుంది. ట్రోఫీతో పాటు గెలిచిన సంవత్సరం (2025), పరుగుల వ్యత్యాసం (52) కూడా వేయించుకుంది. ‘నా చర్మంతోపాటు నా హృదయంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలి రోజు నుంచి దీనికోసం ఎదురు చూశా. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం దీన్ని చూసుకుంటా. ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటా’ అంటూ హర్మన్ క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియా(Social Media)లో ఫొటోలను షేర్ చేసింది.

నా కల నెరవేరింది..

‘చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా నాన్న హర్మందర్ కూడా మాజీ క్రీడాకారుడే. ఆయన కిట్‌లోంచి బ్యాట్ తీసుకుని ఆడుకునే దాన్ని. అది చాలా పెద్దగా ఉండటంతో మా నాన్న బ్యాట్‌ను చిన్నగా చెక్కి ఇచ్చాడు. దాంతోనే నేను ఆడుకునే దాన్ని. వరల్డ్ కప్‌లో మన మ్యాచులు చూసినప్పుడల్లా నాకూ ఇలాంటి అవకాశం వస్తే బాగుండనని అనుకునేదానిని. నాకు ఆ సమయంలో మహిళల క్రికెట్ గురించి తెలియదు. ఎప్పటికైనా ప్రపంచ కప్ ఆడి గెలవాలనేదే నా డ్రీమ్. ఇప్పుడు ఆ కల నెరవేరింది. నాకు జట్టును నడిపించే అవకాశం వస్తే అస్సలు వదులుకోకూడదని అనుకున్నా. ఆ దేవుడు ఒక్కోదాన్ని నెరవేరుస్తూ వెళ్లాడు. ఇదంతా నాకు మ్యాజిక్‌లా అనిపిస్తుంది. జట్టులో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు’ అని హర్మన్ వెల్లడించింది.

ఏమ్మా.. ఇదెక్కడి డ్రైవింగ్.. బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్న అమ్మాయికి ఏం జరిగిందో చూడండి..

ఏమ్మా.. ఇదెక్కడి డ్రైవింగ్.. బైక్ మీద స్పీడ్‌గా వెళ్తున్న అమ్మాయికి ఏం జరిగిందో చూడండి..

 

అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా స్పీడ్ డ్రైవింగ్ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ యువతి పల్లెటూరి రోడ్లపై అతి వేగంగా స్కూటీ నడిపి అందుకు తగ్గ మూల్యం చెల్లించింది.

అతి వేగం (Speed) అత్యంత ప్రమాదకరం అని అందరికీ తెలిసిందే. అయినా యువకులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. బిజీగా ఉన్న రోడ్డు మీద వెళ్లినా, సందుల్లో నడుపుతున్నా వేగాన్ని మాత్రం తగ్గించరు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా ఆ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ యువతి (Girl) పల్లెటూరి రోడ్లపై అతి వేగంగా స్కూటీ (Scooty) నడిపి అందుకు తగ్గ మూల్యం చెల్లించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి ఓ గ్రామంలోని రోడ్లపై స్కూటీ మీద ప్రయాణం చేస్తోంది. ఆమె స్కూటీ మీద వెళ్తుండగా వెనుక బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ యువతి క్రమంగా తన స్కూటీ స్పీడ్ పెంచింది. గడ్డి పై నుంచి కూడా అంతే స్పీడ్‌గా వెళ్లింది. ఆ సమయంలో ఆమె స్కూటీ బ్యాలెన్స్ తప్పినా నిలదొక్కుకుంది. ఆ తర్వాత టర్నింగ్ వచ్చినపుడు మాత్రం ఆ స్పీడ్‌లో ఆమె నియంత్రించుకోలేకపోయింది. దీంతో బైక్‌తో సహా కింద పడిపోయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

భవనం పైనుంచి పడిపోయిన పిల్లాడు..

భవనం పైనుంచి పడిపోయిన పిల్లాడు.. క్యాచ్ పట్టుకున్న వ్యక్తి.. వీడియో వైరల్..

 

ఇంటి రెండో అంతస్తులో ఓ పిల్లాడు రెయిలింగ్ పట్టుకుని వేలాడుతున్నాడు. ఇలా చాలా సేపు రెయిలింగ్ పట్టుకున్న ఆ పిల్లాడు.. తర్వాత చేయి వదిలేశాడు. దీంతో నేరుగా కిందకు దూసుకొచ్చాడు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి కింద నడుస్తూ వెళ్తున్నారు. చివరకు ఏమైందో మీరే చూడండి..

అప్పుడప్పుడూ కళ్ల ముందు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరిగితే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సమయాల్లో కొందరు చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వస్తుంటారు. ఇంకొన్నిసార్లు కొందరు దేవుడిలా వచ్చి ప్రమాదంలో పడ్డ వారిని కాపాడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లాడు భవనంపై నుంచి కిందపడ్డాడు. అదే సమయంలో కింద ఉన్న వ్యక్తి పిల్లాడిని పట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంటి రెండో అంతస్తులో ఓ పిల్లాడు రెయిలింగ్ పట్టుకుని వేలాడుతున్నాడు. ఇలా చాలా సేపు రెయిలింగ్ పట్టుకున్న ఆ పిల్లాడు.. తర్వాత చేయి వదిలేశాడు. దీంతో నేరుగా కిందకు దూసుకొచ్చాడు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి కింద నడుస్తూ వెళ్తున్నారు. పిల్లాడు కిందపడడం చూసిన ఆ వ్యక్తి.. వెంటనే అలెర్ట్ అయ్యాడు.

కిందపడుతున్న పిల్లాడిని చేతులతో (Man Catch Falling Boy) పట్టుకున్నాడు. అప్పటికే ఆ పిల్లాడు నేలను తాకినా కూడా.. అతను చేతులు అడ్డుగా పెట్టడం వల్ల నేలకు బలంగా తాకలేదు. పిల్లాడిని కిందపడకుండా పట్టుకున్న ఆ వ్యక్తి.. తర్వాత బాలుడిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంతలో ఓ మహిళ కొందరు వ్యక్తులు అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఇలా ఆ వ్యక్తి పిల్లాడిని ఎంతో చాకచక్యంగా రక్షించాడు. అయితే ఈ వీడియోపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొందరు ఆ వ్యక్తి ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు ఇది ఏఐ క్రియేషన్‌లా ఉందని చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పిల్లాడి పాలిట దేవుడిలా వచ్చి రక్షించాడు’.. అంటూ కొందరు, ‘ఇది ఏఐ వీడియో.. చూస్తుంటేనే అర్థమవుతోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 730కి పైగా లైక్‌లు, 63 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు..

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు

టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు.

 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ మధుర నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పిర్యాదు మేరకు 336(4), 353(1)(C) BNS సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి కేటుగాళ్లు ప్రచారం చేశారు. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. ఈ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం…

విద్యార్థులకు తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరం

భూపాలపల్లి నేటి ధాత్రి

https://youtu.be/rTUfmQNMqwg?si=xOj8JynoqGJa6sua

 

సింగరేణి హై స్కూల్‌లో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సి హెచ్ జాన్సీ రాణి అధ్యక్షత వహించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రిన్సిపాల్ జాన్సీ రాణి మాట్లాడుతూ తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రవర్తన, చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు.
“పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న విషయాలను ఇంట్లో కూడా పునరావృతం చేసేలా ప్రోత్సహించలన్నారు . మొబైల్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసి, టెలివిజన్ సోషల్ మీడియా వినియోగంపై తగిన నియంత్రణ వహించాలన్నారు . పిల్లలతో రోజూ కొంతసేపు మాట్లాడి, వారి సమస్యలు, అభిరుచులు తెలుసుకోవాల్న్నరు . తల్లిదండ్రుల ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం, అని తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సమయపాలన పాఠశాల హాజరు విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అనవసరమైన ఆరోపణలు మానుకోవాలి…

స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అనవసరమైన ఆరోపణలు మానుకోవాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో అధికార పార్టీ నాయకులు. ఫైళ్లలో. తమ పేరు లేకుండా చేస్తున్నారని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నిన్నటి నుండి సోషల్ మీడియా వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని. అసలు స్థానిక ఎంపిటిసి మాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని. మా దగ్గర సాక్షాలు ఉన్నాయని. దీనిపై మండల పోలీస్ అధికారులు తగు విచారణ చేపట్టి దోషులపై కఠినంగా శిక్షించాలని. గ్రామంలో ప్రజలందరికీ తెలుసునని ఆయా పరిస్థితి ఏంటిదో. వాళ్ల కొడుకు కూడా మా ప్రెస్ మీట్ లో ఉన్నారని. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై విచారణ చేపట్టి దీనికి కారకులైన వారిపై. కఠిన చర్యలు తీసుకోవాలని. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఓడిపోతామని భయంతో మాపై లేనిపోని. కుట్రలు పన్నుతున్నారని అలాంటివి కుట్రలో భాగంగానే ఇలాంటివి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిగిల రాజు. గుగ్గిళ్ళభరత్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈ కోతి మరీ ఫన్నీ గురూ.. కళ్లద్దాలను కొట్టేసి.. చివరకు..

ఈ కోతి మరీ ఫన్నీ గురూ.. కళ్లద్దాలను కొట్టేసి.. చివరకు..

 

 

ఓ వ్యక్తి పర్యాటక ప్రాంతంలో ఫొటో తీసుకుంటుంటే.. వెనుకే వెళ్లిన కోతి చటుక్కున అతడి కళ్లద్దాలను లాగేసుకుంటుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతాడు. తర్వాత వెనక్కు తిరిగి కోతి నిర్వాకం చూసి అవాక్కవుతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కళ్లు మూసి తెరిచేలోగా ఒక చోటు నుంచి మరో చోటుకు గెంతుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్నిసార్లు ఇళ్లు, వాహనాల్లోకి దూరి మరీ.. ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తుంటాయి. ఇంకొన్నిసార్లు బెదిరించి మరీ తమకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కళ్లద్దాలపై కన్నేసిన కోతి.. చివరకు ఏం చేసిందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పర్యాటక ప్రదేశంలో చాలా మంది ఫొటోలు దిగుతుంటారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రదేశాల్లో కోతులు పర్యాటకుల వస్తువులు లాక్కెళ్తుంటాయి. అయితే తిరిగి వాటికి కావాల్సిన జ్యూస్ కానీ, ఆహారం కానీ ఇస్తే తిరిగి ఇచ్చేస్తుంటాయి. ఈ వీడియోలోని కోతి కూడా ఇలా అలవాటు పడిందో ఏమో గానీ.. ఓ వ్యక్తి అక్కడ ఫొటో తీసుకుంటుంటే.. వెనుకే వెళ్లి చటుక్కున అతడి కళ్లద్దాలను లాగేసుకుంటుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడిపోతాడు.

తర్వాత వెనక్కు తిరిగి కోతి నిర్వాకం చూసి అవాక్కవుతాడు. కళ్లద్దాలను లాక్కున్న కోతి.. (monkey Steals glasses) అక్కడే అటూ, ఇటూ తిరుగుతూ తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. అయినా అతను వదలకుండా ఎలాగైనా కోతి నుంచి తన కళ్లద్దాలను లాగేసుకోవాలని చూశాడు. ఈ క్రమంలో కోతి నుంచి కళ్లద్దాలను లాగేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అతను చేయి దగ్గరికి పెట్టగానే.. కోతి ఒక్కసారిగా చెలరేగిపోతుంది. కరవడానికి మీదకు దూకేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో అతను భయంతో దూరంగా నిలబడిపోయాడు.

ఇలా చాలా సేపు ఆ వ్యక్తి వాటిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కోతి కామెడీ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇతను కోతి వీక్‌నెస్ కనుక్కోలేకపోయాడు.. కోతికి కావాల్సిన ఆహారం ఇచ్చి ఉంటే కళ్లద్దాలను తిరిగి ఇచ్చి ఉండేది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8,900కి పైగా లైక్‌లు, 2.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

దున్నపోతు హింస.. తక్షణ శాస్తి అనుభవించిన యువకులు…

మూగజీవి కదా అని హింసిస్తే ఇలాగే అవుతుంది.. ఈ దున్నపోతు ఏం చేసిందంటే..

కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పందేలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా వెళ్తున్న క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

మూగ జీవాలను హింసించడం పాపం, నేరం అని తెలిసినా కొందరు కావాలనే పదే పదే వాటిని టార్చర్ చేస్తుంటారు. ఇంకొందరు అవి బాధపడుతుంటే చూసి శునకానందం పొందుతుంటారు. అయితే చేసిన కర్మ వెనువెంటనే వెంటాడుతుందనే విషయం వారికి ఆ సమయంలో తెలీదు. తీరా తగిన శాస్తి జరిగాక కానీ అసలు విషయం అర్థం కాదు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దున్నపోతును హింసించిన యువకులకు చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పోటీలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును (Buffalo) పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా బండిలో ముందు వైపు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు.. చేతిలో కర్రలు పట్టుకుని దున్నపోతను కొడుతూనే ఉన్నారు.

ఇలా కొంత దూరం వెళ్లాక.. ఉన్నట్టుండి (Youths tortured buffalo with stick) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నేరుగా వెళ్లాల్సిన ఎద్దు కాస్తా.. రోడ్డుకు అవతలి వైపునకు తిరుగుతుంది. ఈ క్రమంలో టైరు డివైడర్ ఎక్కడంతో బండి బోల్తా కొడుతుంది. దీంతో బండిపై కూర్చొన్న వారంతా ఎగిరి దూరంగా పడిపోతారు. కట్లు తెగిపోవడంతో దున్నపోతు అక్కడి నుంచి పారిపోతుంది. కింద పడ్డ యువకులు.. వామ్మో.. వాయ్యో.. అనుకుంటూ మూలుగుతుంటారు.

ఇలా దున్నపోతును హింసించబోయి.. చివరకు ఈ విధంగా శిక్ష అనుభవించిన వీరిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మూగజీవాలను ఇబ్బంది పెడితే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘తగిన శాస్తి జరిగింది.. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయరు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 57 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్…

భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్?.. లింక్డిన్‌లో ఉద్యోగావకాశాలకు సంబంధించి బైట్‌డ్యాన్స్ పోస్ట్..

గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది.

గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది. ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాలు స్నేహపూర్వకంగా మెలగాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు 

ఇరు దేశాల మధ్య తిరిగి సామరస్యం నెలకొన్న వేళ టిక్‌టాక్ కార్యకలాపాలు తిరిగి భారత్‌లో ప్రారంభం అవుతాయని చాలా మంది భావిస్తున్నారు (TikTok comeback). అందుకు తగినట్టుగానే టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ తాజాగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. గురుగ్రామ్‌లోని ఆఫీస్‌లో రెండు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు తెలిపింది. దీంతో టిక్‌టాక్ సేవలు భారత్‌లో తిరిగి ప్రారంభం కాబోతున్నాయా? అని చాలా మంది చర్చించుకుంటున్నారు (TikTok job openings)

ఇటీవలి కాలంలో మనదేశంలో టిక్‌టాక్ వైబ్‌సైట్‌ను చాలా మంది యాక్సెస్ చేయగలుగుతున్నారు. లాగిన్ కావడం, వీడియోలు చూడడం మాత్రం కుదరడం లేదు. అయితే ఇంతకు ముందు ఇలా టిక్‌టాక్‌ను యాక్సెస్ చేయడం కూడా కుదిరేది కాదు (TikTok ban status). కేంద్ర ప్రభుత్వం మాత్రం టిక్‌టాక్‌పై నిషేధం ఇప్పటికీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. టిక్‌టాక్ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు తెలిపారు. అలాగే భారత ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తున్నామని, టిక్‌టాక్ సేవలను పునరుద్ధరించలేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం…

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ యూత్ మండల
కో కోఆర్డినేటర్ రామన్న గూడెం చెందిన యువనాయకుడు భూక్యా రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
వజ్జ సారయ్య మరియు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి తెలిపారు నా ఈ యొక్క ఎన్నిక కు సహకరించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుకు జిల్లా నాయకులకు సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కు
నా ప్రత్యేక కృతజ్ఞతలు..అని
భూక్యా రాజు తెలిపారు

కుక్కపిల్ల బైకర్‌ను రోడ్డు ప్రమాదానికి దారితీశింది..

కుక్క పిల్లే కదా అనుకుంటే ఎంత పని చేసింది.. బైకర్‌కు ఏమైందో చూడండి..

 

 

రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకర్.. కాసేపటి తర్వాత బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్క పిల్ల బైకర్‌ను చూసి వెంటపడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

వీధి కుక్కల వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వీటి బారిన పడుతుంటారు. తాజాగా, వీధి కుక్కల కేసు సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్ల కారణంగా ప్రమాదానికి గురైన బైకర్ వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకర్.. కాసేపటి తర్వాత బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్క పిల్ల (Puppy Chasing the Biker) బైకర్‌ను చూసి వెంటపడింది. కరవకున్నా కూడా బండితో పాటే వేగంగా వెళ్తూ అతడిని తికమకపెట్టింది.

బైకర్ ఆ కుక్కపిల్లను చూస్తూ ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో బండి రోడ్డు పక్కకు దూసుకెళ్లి.. ఓ దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో (biker fell down) ఆ బైకర్ ఎగిరి పక్కన పడిపోయాడు. హెల్మెట్ కూడా ఎగిరి దూరంగా పడిపోయింది. చూస్తుంటే ఈ ప్రమాదంలో అతడికి గాయాలైనట్లు తెలుస్తోంది. బైకర్ కిందపడిపోగానే ఆ కుక్క పిల్ల.. ‘వచ్చిన పని అయిపోయింది’.. అన్నట్లుగా మళ్లీ వెనక్కు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఈ ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో ప్రాణాలతో బయటపట్టాడు.

ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అనుకున్న పని పూర్తి చేసిందిగా’.. అంటూ కొందరు, ‘ఈ కుక్క పిల్ల ఎంత పని చేసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 67 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను..

నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను..

విశ్వనాయకుడి కూతురు శ్రుతీహాసన్‌ (Shruti Haasan) అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలతోపాటు సినిమాల విశేషాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులపాటు  సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శ్రుతి హాసన్‌ తెలిపారు. సోమవారం ఇన్‌స్టాలో తన పాలోవర్స్‌ను ఉద్దేశించి ఆమె ఓ పోస్ట్‌ చేశారు. కొన్ని రోజులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాననీ, నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాని చెప్పారు.  
దీంతో అభిమానులు కాస్త షాక్‌ అయ్యారు. ఎందుకు ఇలాంటినిర్ణయం అని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రుతి హాసన్‌ రజనీకాంత్‌ ‘కూలీ’లో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రధారులు. అన్నీ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్…

తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్…

 

అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా అని పాడుకుంటున్నారు ఆ అమ్మడిని చూసి నెటిజన్లు. అమ్మడికి పట్టిన అదృష్టాన్ని చూసి కొందరు మధ్యలో ట్రోల్ చేశారు కానీ రీసెంట్ గా వదిలిన శాంపిల్ ను చూసి నోరెళ్ల బెడుతున్నారు. అవమానించిన వాళ్లే ఔరా అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా… మోనాలిసా గురించి.

 

shine junior college
మహా కుంభమేళ 2025లో ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేసిన అమ్మాయి మోనాలిసా భోంస్లే (Monalisa). ఈ 16 ఏళ్ల మధ్యప్రదేశ్ బ్యూటీ, ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అమ్ముతూ ఉండగా, ఒక నెటిజన్ తీసిన వీడియోతో రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. ఆమె ఆకర్షణీయమైన తేనెకళ్లు, చిరునవ్వు, సింపుల్‌గా ఉండే స్వచ్ఛమైన అందంతో నెట్టింట్లో స్టార్ అయిపోయింది. జాతరలో పూసలు అమ్మే అమ్మాయి నుంచి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. బాలీవుడ్ లో  ఛాన్స్ కొట్టేసింది కానీ సినిమా తెరపైకి వచ్చేందుకు టైం పట్టేలా ఉంది. ఆ లోపు అమ్మడు మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ భామ ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. అది రీసెంట్ గా యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తోంది. ఉత్కర్ష్ సింగ్‌ (Utkarsh Singh)తో కలిసి మోనాలిసా ఆ సాంగ్‌లో ఎంబ్రాయిడరీ లెహంగా, క్లాసీ జ్యువెలరీతో ఫుల్ స్టన్నింగ్‌గా కనిపించింది. ఆమె డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫ్లాట్  అవుతున్నారు. ఈ అమ్మాయి… హీరోయిన్స్‌కి ఏం తక్కువ అంటూ  కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు.. ఈ సాంగ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు తెగ చూసేస్తున్నారు.

Monalisa

సనోజ్ మిశ్రా (Sanoj Mishra) డైరెక్ట్  చేస్తున్న హిందీ సినిమాలో ఈ భామ లీడ్ రోల్‌లో కనిపించబోతోంది. యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఫుల్ ట్రైనింగ్ తీసుకుంటూ, సినిమా ఎంట్రీ కోసం ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ‘సాద్గి’ సాంగ్ లింక్‌కి లైక్స్, కామెంట్స్ జోరు చూస్తే, ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. పూసల అమ్మాయి నుంచి కలల రాణిగా మారిన మోనాలిసా జర్నీ చూస్తే, ఎవరైనా సరే అవకాశం వస్తే ఆకాశం అందుకోవచ్చని నిరూపించేలా ఉంది. ఇక ఇప్పుడు ఈ భామ సినిమా రంగంలో ఎలా రాణిస్తుందో చూడాలి!

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో.

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో
ఉచిత కంటి వైద్య శిబిరం
వనపర్తి నేటిధాత్రి :

 

 

 

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా అధ్యర్య ములో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ విలేకరులకు తెలిపారు
పోస్టర్ ను బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ఆవిష్కరించారని తెలిపారు
ఈ సందర్బంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ
, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా*
వనపర్తి సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా సాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి సంయుక్తంలో
ఉచిత కంటి వైద్య శిబిరం
వనపర్తి జిల్లా పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని తెలపడం జరిగింది సోమవారం
:ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు
అభయాంజనేయ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర,ఉంటుందని తెలిపారు వనపర్తి ప్రజలు, ఉచిత.కంటి వైద్య శిబిరం లో పాల్గొనాలని కోరాడు
పోస్టర్ ఆవిష్కరణ లో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ మార్కాట్ యార్డ్ చైర్మన్ లక్ష్మా రెడ్డి.మాణిక్యం కృష్ణయ్య రెడ్డి డేగ మహేశ్వర తిరుపతయ్య యాదవ్.ధర్మ నాయక్, సూర్యావంశం గిరి, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి, చిట్యాల రాము అలీం యుగేందర్ రెడ్డి సయ్యద్ జమీల్, జహంగీర్ కుమ్మరి సత్యంనాయక్, నరసింహ కరుణాకర్ బాలరాజు మునికుమార్, రామస్వామి నందిమల్ల సుబ్బు, సౌమ్య నాయక్ మరియు ముఖ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version