మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161734.060-1.wav?_=1

 

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

వరంగల్, నేటిధాత్రి

 

వరంగల్ చౌరస్తాలో మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వలన స్థానికులకు చాలా పెద్దగా భారం పడుతున్నది కావున
కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురి కార్మికులు మాట్లాడుతూ, వలస వచ్చినా కార్మికులు మేము మాట్లాడిన పనికి వాళ్ళు చానా తక్కువ ధరకు మాట్లాడి మాకు పనులు లేకుండా చేస్తున్నారు ఎందుకో మరి వాళ్లకు మా మీద కోపం మేము కలిసికట్టుగా పని చేసుకోవాలి అన్నదే మా ఉద్దేశం వాళ్లు కూడా మాతో కలిసి పని చేస్తే వాళ్లకు మంచి జీవనోపాధి ఉంటది మాకు స్థానిక యూనియన్ నిర్ణయించిన ఉపాధి ఉంటది. వాళ్లు రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిండ్రు అని, మా స్థానిక యూనియన్ నిర్ణయించిన నిర్ణయాల ప్రకారం నడవాలని కోరారు. కావున కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని, మా జీవనోపాధి పూర్తిగా ఈ రంగంపైనే ఆధారపడి ఉందనీ అన్నారు. అయితే, సరైన రీతిలో పనులు లేకపోవడం, తగిన అవకాశాలు కల్పించకపోవడం వలన మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాల నుండి వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని ఐక్యంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మా సమస్యలను గమనించి తక్షణమే పరిష్కారం చూపకపోతే, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల అసోసియేషన్ నేతలు అధ్యక్షులు సమీర్, జన్ను సునీల్, ఉపాధ్యక్షులు ఫిరోజ్, ఫయాజ్, తాజ్ ఫిరోజ్, అయూబ్, జలీల్, చెన్నూరి కిషోర్, రాజేందర్, నాసం హరీష్, సాదిక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

సామాజిక న్యాయానికి మండల్ కమిషన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-81-1.wav?_=2

మండల్ కమిషన్ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం

*నేటి ధాత్రి.

కేయూ క్యాంపస్*
మండల్ కమిషన్ సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకర జ్యోతి అభిప్రాయపడినారు, డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్ గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీ లకి కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమైనాయని అభిప్రాయపడినారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ కేంద్ర విద్యా ఉద్యోగల లో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటం లేదని అభిప్రాయపడినారు. బీసీ నాయకులు డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాక కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ లను అమలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయబడినారు. మండల్ కమిషన్ నివేదికని పూర్తిస్థాయిలో అమలుపరచినప్పుడే దేశంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని అభిప్రాయపడినారు. బిసి నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ మాట్లాడుతూ జనగణలో భాగంగా జాతి ఆధారిత కుల గణన జరగాలని కాక ఖలేల్కర్ కమిషన్ మండల్ కమిషన్లు సిఫారసు చేసినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వలకు ఏడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ఫిరోజ్ డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ దాసు డాక్టర్ శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ స్వామి డాక్టర్ జయప్రకాశ్ డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్ డాక్టర్ సదానందం డాక్టర్ కొమురయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-65-1.wav?_=3

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ 186 దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

ఘనంగా 186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను
ఫోటో కెమెరా టెక్నాలజీని అభివృద్ధి చేసి, ఫోటోగ్రఫీ సాంకేతికతను , కళను ప్రపంచానికి తెలియజేసిన లూయిస్ మాండే డాగురే జన్మదినాన్ని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని ప్రోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు కార్కురి సతీష్ అన్నారు
జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో జయశంకర్ సెంటర్ లో జిల్లా మాజీ అధ్యక్షులు ఎండి రఫీ మండల అధ్యక్షులు కార్కురి సతీష్ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి, డాగురే చిత్రపటానికి , పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఎండి రఫీ కార్కురి సతీష్ మాట్లాడుతూ డాగురె సృష్టించిన ఫోటోగ్రఫీ టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు , ఈ ఫోటోగ్రఫీ రంగాన్ని ఆధారం చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకుంటూ, కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఒక ఫోటో ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ, తరతరాలకు అందిస్తుంది, ఫోటోగ్రఫీ ద్వారా ఎన్నిరంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగు రవీందర్, మండల కోశాధికారి కార్కురి శ్రీనివాస్ , సీనియర్ ఫోటోగ్రాఫర్ రాచర్ల సుధాకర్, శ్రీరాముల రమణ, కోరే సదానందం, అడ్డగట్ల శ్రీనివాస్, దిడ్డి సత్యం,మాదాసి శ్రీనివాస్, మాదాసి సతీష్, మనీషా శ్రీనివాస్, నేరేళ్ల శ్రీనివాస్, ఆముదాల మహేందర్, కన్నం కుమార్, బండ మోహన్, కిషోర్,సుమన్, మనోహర్, పూర్ణచందర్, భాస్కర్, రాజు శ్రీకాంత్, సురేష్, వెంకటేష్, కళ్యాణ్, శ్రీనివాస్, అనిల్, రాకేష్, శ్రీధర్, రాజేష్, వినయ్, మధు, శ్రీకాంత్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-7.wav?_=4

కాంట్రాక్టర్ వీరభద్రరావుకు ఘన నివాళులు

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి కాంట్రాక్టర్ దివంగత కోనేరు వీరభద్ర రావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వీరభద్ర రావు(కోనేరు) ట్రాన్స్ పోర్ట్ పేరుతో సుపరిచితుడైన కాంట్రాక్టర్ కోనేరు వీరభద్రరావు గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం విజయవాడలో ఆయన కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ప్రథమ వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ప్రాంతానికి చెందిన పలువురు హాజరై, వీరభద్రరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వీరభద్రరావుతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరభద్ర రావుకు సింగరేణి తో విడదీయరాని బంధం కలదని తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

వీరభద్ర రావు సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ గా మందమర్రి పట్టణం తోపాటు సింగరేణి వ్యాప్తంగా మంచి పేరు గడించారని తెలిపారు. అప్పట్లో కోల్ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ అంటే సింగరేణి వ్యాప్తంగా వీరభద్ర రావు ట్రాన్స్ పోర్ట్ కు మంచి పేరు కలదన్నారు. పట్టణంలోని ఎంతో మందికి తన ట్రాన్స్ పోర్ట్ లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు తన లాగే కోల్ ట్రాన్స్ పోర్ట్ లో రాణించాలనే అనుకునే ఔత్సాహికులకు అవకాశాలు కల్పించడం తోపాటు, వారికి వెన్నుదన్నుగా నిలిచి, సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా ఎంతో మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులు ఆయన సతీమణి వెంకటరమణమ్మ, కుమారుడు కోనేరు ప్రసాద్ బాబు, మనవళ్లు డాక్టర్ ఫణికుమార్, కృష్ణకాంత్, వికాస్, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

నేరరహిత సిరిసిల్ల లక్ష్యం – ఎస్పీ మహేష్ గితే..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-46-1.wav?_=5

సిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పీ.ఎస్.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పరంగా మరియు విద్యా,వైద్య,ఉపాధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేశారు.

SP Mahesh Githe Independence Day

అంతేకాకుండా సిరిసిల్ల జిల్లాను శాంతి భద్రతలలో, మన వంతు కృషి ముందుండాలని, అంతేకాకుండా జిల్లాను నేరాలు లేని జిల్లాగా రూపుదిద్దడానికి మనమంతా కృషి చేయాలని పోలీసుల అధికారులకు మరియు సిబ్బందికి తెలియజేయడం జరిగినది.

SP Mahesh Githe Independence Day

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, జిల్లా పోలీస్ కార్యాలయాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

దివ్యాంగుల స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం.

జహీరాబాద్ దివ్యాంగుల స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

దివ్యాంగుల స్వయం ఉపాధికి ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి గురువారం తెలిపారు. దరఖాస్తులను http://tgobmms. cgg. gov. in 3 ໖ చెప్పారు. బ్యాంకు లింకేజీ లేకుండా 37, బ్యాంకు లింకేజీ తో 3 యూనిట్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

ఉపాధి’కి కొత్త హాజరు షురూ.

‘ఉపాధి’కి కొత్త హాజరు షురూ

◆:-‘ఉపాధి’కి కొత్త హాజరు షురూ

◆:-రెండు పూటలా కూలీల ఫొటోలు

◆:-ఒక ఫొటో అప్లోడ్ చేస్తే సగం కూలి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉపాధి హామీ పథకం హాజరులో కేంద్ర ప్రభుత్వం
కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకనుంచి ఉపాధి హామీలు పనిచేసే కూలీలను ఉదయం, మధ్యాహ్నం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఈ విధంగా రెండుపూటలా కూలీల ఫొటోలు అప్లోడ్ చేస్తేనే పనిచేసిన వ్యక్తికి పూర్తిగా కూలి డబ్బులు అందనున్నాయి.

ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫొటోలు

Central government orders

ఉపాధి హామీ పథకంలో హాజరు విధానాన్ని ఆన్లైన్ ద్వారా చేపట్టింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ ద్వారా ప్రతీరోజు కూలీల ఫేస్ రికగ్నేషన్ చేసి హాజరు తీసుకుంటున్నారు. అయితే పనికి ఆలస్యంగా వచ్చిన కూలీలు కూడా ముందు వచ్చిన కూలీలతో సమానంగా కూలి తీసుకుంటూ ఈ హాజరు విధానాన్ని దుర్వినియోగపరుస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఇటువంటి పనులను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీలో కొత్తగా ప్రవేశపెట్టిన హాజరు విధానాన్ని గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయిలో కమిషనర్ వరకు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. తీసిన ఫొటోలను మండలస్థాయిలో అధికారుల ఆదేశాల మేరకు ఫొటోలను డీఆర్డీఏకు కలెక్టర్కు పంపించాల్సి ఉంటుంది.

హార్డ్ డిస్క్ కొనుగోలుకు ఆదేశాలు.

కూలీల హాజరు కోసం తీసే ఫొటోలు విధిగా భద్రపరిచేందుకు హార్డ్ డిస్క్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ ఏటా చేపట్టే సోషల్ ఆడిట్ పూర్తయ్యేంతవరకు ఆ ఫొటోలను ఆ డిస్క్ నిక్షిప్తం చేసి ఉంచాలి.

Central government orders

వ్యతిరేకిస్తున్న కూలీలు సిబ్బంది..

ఉపాధి హామీ హాజరుకు సంబంధించి కూలీలను రెండు పూటలా ఫొటోలు తీయాలన్న నిబంధనను అటు కూలీలతోపాటు ఉపాధి హామీ సిబ్బంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త హాజరు విధానం వల్ల ఉపాధి పనులకు హాజరయ్యే వారి శాతం తగ్గిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి.

ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి…

నేటి ధాత్రి -గార్ల :-

మండల పరిధిలోని గార్ల,ముల్కనూర్, చిన్నకిష్టపురం,పెద్దకిష్టాపురం, సత్యనారాయణపురం, శేరిపురం,మర్రిగూడెం, పుల్లూరు,పోచారం, గోపాలపురం, పినిరెడ్డిగూడెం, సీతంపేట,మద్దివంచ, రాంపురం తదితర గ్రామపంచాయతీలలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధి హామీ పథకం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.అసౌకర్యాల నడుమ మండుటెండల్లో చెమట చిందించి పనిచేసిన కార్మికులకు 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించే విధానాన్ని పాలకులు స్వస్తి పలికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బ్రతుకుతారని ప్రశ్నిస్తున్నారు. వేతనాలు అందక అనేక కుటుంబాలు సుదుల ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ప్రజలు సరైన సమయంలో పాలకులకు గుణపాఠం చెబుతారని ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు..

యువతకు ఉపాధి లక్ష్యంగా ఆకాశ

 

యువతకు ఉపాధి లక్ష్యంగా ఆకాశ ఎంటర్ప్రైజెస్.

సీఎం డి సంజయ్ భరత్ రెడ్డి

చిట్యాల,నేటిధాత్రి :

యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలను అందించడమే లక్ష్యంగా ఆకాష్ ఎంటర్ప్రైజెస్ ముందుకు సాగుతున్నదని ఆ సంస్థ సిఎండి సంజయ్ భరత్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగం లేదని ఉపాధి అందడంలేదని యువకులు ప్రభుత్వం పనిలేదని అన్నారు నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు పలు రకాల అవకాశాలు కల్పించే విధంగా ఆకాష్ ఎంటర్ప్రైజెస్ ప్రయత్నం చేస్తుందన్నారు పలు రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఉద్యోగాలు ఉపాధ్యాయ అవకాశాలను సృష్టించి నిరుద్యోగులను ఆదుకోవడం జరుగుతుందని సంస్థ సీఎంటి సంజయ్ భరత్ రెడ్డి తెలిపారు. మొదటగా ప్రజలకు అత్యంత అవసరం ఉన్న 55 65 ఇంచుల టీవీలను తక్కువ ధరకు అందించడమే కాకుండా యువకులను అన్ని రకాలుగా అభివృద్ధి చెందే మార్గదర్శకాలను వారికి బోధించడం జరుగుతుందన్నారు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే లక్షలాది రూపాయలు సంపాదించి మార్గాలను తెలియజేయడంతో పాటు తమ ఆకాశ సంస్థలో పూర్తిస్థాయి భాగస్వామ్యాన్ని కల్పించడం

 

 

 

 

జరుగుతుందనిఅన్నారు. 55 ఇంచ్ల టీవీని 60 వేలకు మాత్రమే అందిస్తూ మరో 10 వేల విలువ చేసే హోం థియేటర్ ను సైతం అందించడం జరుగుతుందని 24 వేల రూపాయలు చెల్లించి టీవీ మరియు హోమ్ థియేటర్ను తీసుకొని వెళ్లవచ్చునని అన్నారు. లేదంటే తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలను చెల్లించి తమ పేరును బుక్ చేసుకొన్న అనంతరం మరొక పదిమంది తమ స్నేహితులను సంస్థ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసి టీవీ హోమ్ థియేటర్ ను తీసుకొని వెళ్ళిపోవచ్చని అనంతరం ఈఎంఐలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు తీసుకున్న టీవీ సంవత్సరంలోపు పాడైతే తిరిగి కొత్త టీవీని అందించడం జరుగుతుందని లేదంటే రెండు సంవత్సరాల వారంటీ రూపకంగా ఎలాంటి సమస్య తలెత్తిన రెండు సంవత్సరాల వరకు దానిని బాగు చేసి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కంపెనీలలో టీవీ తీసుకున్న ప్రతి వారు షేర్ హోల్డర్ గా

 

 

 

పరిగణించబడుతారాన్నారు. కంపెనీ కోసం ఎలాంటి పని చేయకపోయినా ఎంటర్ప్రైజెస్ ద్వారా వచ్చే లాభాల్లో పర్సంటేజ్ ని ప్రతి యేటా పంచుడం జరుగుతుందని భరత్ రెడ్డి తెలిపారు. జిల్లా మొత్తంలో కేవలం 150 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని ఉత్సాహవంతులైన వారు ఎవరైనా కంపెనీకి షేర్ హోల్డర్లుగా చేరవచ్చును అన్నారు ఎలాంటి రుసుము అవసరం లేదని ఒక్క రూపాయి కూడా కంపెనీ కోసం పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. కావలసిన పెట్టుబడి మొత్తంగా ఆకాష్ ఎంటర్ ప్రైజెస్ నుంచే అందుతుందన్నారు మరిన్ని వివరాల కోసం సెల్ నెంబరు 9398903016 నందు సంప్రదించవచ్చు అన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్ల పెండింగ్ వేతనాలు వెంటనే.!

ఫీల్డ్ అసిస్టెంట్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి….!

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో, ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారి మూడు నెలల పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ పటేల్ కోరారు. సోమవారము మండల కేంద్రమైన ఝరాసంగం లో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఉపాధిహామీ పథకంలో, ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నాం. ఈ ఉద్యోగం పైనే మా కుటుంబాలు అన్ని ఆధారపడి జీవిస్తున్నాయని ఆయన తెలిపారు. గత మూడు నెలల నుండి మాకు వేతనాలు అందక కుటుంబాలను పోషించలేక చాలా ఇబ్బందికరంగా మారిందని, తమ పిల్లల ఫీజులు కట్టుకోలేక ఇంట్లో ఖర్చులు కుటుంబాలను పోషించలేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించి తమ కుటుంబాలను అందుకోవాలని ఈశ్వర్ పటేల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ.

నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, ఉపాధి మేళా

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

తేదీ. 03/07/2025. గురువారం రోజున ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ నడికూడ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి మేళ నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గజ్జెల విమల ఆధ్వర్యంలో మేళా నిర్వహించబడును.ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పేద నిరుద్యోగ యువతీ యువకులకు కంప్యూటర్,స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు లాజిస్టిక్స్ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణానంతరము ప్రముఖ కార్పొరేట్ కంపెనీల యందు ఉద్యోగ అవకాశం కల్పించబడును శిక్షణ కాలంలో ఉచిత భోజనము మరియు వసతి యూనిఫామ్స్ స్కాలర్షిప్ మరియు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం చే ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.ఈ అవకాశాన్ని నడికూడ మండలంలోని అన్ని గ్రామాల నుండి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ యొక్క విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు మరియు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని తేదీ.03/07/2025. రోజున గురువారం ఉదయం 10 గంటలకి నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి హాజరు కాగలరని ఎంపీడీవో గజ్జెల విమల తెలిపారు‌. పూర్తి వివరణ కోసం 9849131050,9642141539. సంప్రదించగలరు.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి

బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించాం

రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

shine junior college

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి ఈ రోజు చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు. వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని? వారానికి ఎంత ఆదాయం వస్తుందని? అడిగి తెలుసుకున్నారు. చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు. తమకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళ శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు.
కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయించామని వెల్లడించారు.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక యువతకు ఉపాధి కల్పించని పరిశ్రమలు అవరమా.

స్థానిక యువతకు ఉపాధి కల్పించని పరిశ్రమలు అవరమా?..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం 50వరకు పరిశ్రమలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మహీంద్రా&మహీంద్రా,దిగ్వాల్ పిరామిల్,రాక్ వూల్,విఎస్టీ,గిరిధర్ ఎక్స్ ప్లోజెస్,హాట్ సన్, మరియు కొత్తగా వచ్చేవి నీమ్జ్,ఇండస్ట్రీరియాల్ పార్క్,చాలా ఉన్నాయి.ఒక ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయంటే అక్కడ ఉన్న భూముల ధరలు,ఆ ప్రాంతంలో ప్రజా జీవనానికి అవసరమయ్యే కనీస ఖర్చులు పెరిగిపోతాయి,నియోజకవర్గంలో యువతకు ఉపాధి,ఉద్యోగాలు అయితే రాలేదు కానీ అన్నిటి ధరలు పెరిగిపోయాయి.ఒక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చాలా రాయితీలు ఇస్తుంది అవి తక్కువ ధరలకు భూములు,నీరు,విద్యుత్,పెట్టుబడిపై రాయితీలు,ట్యాక్స్ మినహాయింపు,రోడ్డు రవాణా సౌకర్యం మొదలైనవి కల్పిస్తారు,అందుకు స్థానిక పరిశ్రమలలో నైపుణ్యం లేని యువతకు 70% నుండి 80% మరియు నైపుణ్యం ఉన్న యువతకు 50% నుండి 60% స్థానికులనే భర్తీ చేయాల్సి ఉంటుంది కానీ నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో ఎక్కడా కూడా స్థానికులకు ప్రాధాన్యత నిచ్చింది మాత్రం అంతంత మాత్రమే స్థానిక యువత ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు,దిగ్వాల్ రసాయన కర్మాగారం వల్ల ప్రజలకు ఉపాధి లేదు కానీ త్రాగడానికి నీరు దొరికే పరిస్థితి లేదు,చిలమామిడి శివారులో గల గిరిధర్ ఎక్స్ పోర్ట్ వల్ల చుట్టు ప్రక్కల ఇండ్లు కూలిపోయే పరిస్థితి, గోవిందపూర్ లో గల హాట్ సన్ పరిశ్రమలో డైరీకి సంబంధించి ఉత్పత్తి అవుతాయి కానీ దానికి కావాల్సిన పాలను ఎక్కడో బయటి నుండి తెప్పించుకుంటున్నారు ఉద్యోగాలు చూస్తే నైపుణ్యం గల వారు అంతా తమిళనాడు వారే నైపుణ్యం లేని వారిని యుపి,బీహార్,వారిని తీసుకున్నారు దీనిపై ఆరా తీసుకుందామంటే అక్కడ అధికారులు కనీసం మాట్లాడాటానికి కూడా సిద్ధంగా లేరు, నియోజకవర్గంలో సుమారు 2లక్షల 80 వేల మంది యువత ఉన్నారు వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కానీ అది మర్చిపోయారు.వీటన్నిటిని బట్టి చూస్తే ఈ పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి దొరకాలేదు కాని కాలుష్యం,కనీస వసతుల ధరలు పెరిగిపోయాయి మరియు ఇక్కడి సంపదను ఇతరులు కొల్లగొట్టుకుపోతున్నారు దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు/ ప్రభుత్వంపై ఉన్నది కానీ ప్రభుత్వం అది మర్చిపోయింది.పరిశ్రమల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగాలు కల్పించాలి లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం, స్థానిక యువత మొత్తం దీన్ని అర్థం చేసుకొని ప్రతిఘటించాల్సిన బాధ్యత యువతపై ఉన్నది త్వరలో ఉద్యమించి ఈ అన్యాయాన్ని అరికట్టాలని కోరారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,శ్రీనివాస్, లు ఉన్నారు.

ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి.

ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎండలు పెరిగిపోవడంతో రైతులు ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా పనులు ముందే ముగించాలన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి నవీద్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ కూలీలు పాల్గొన్నారు.

ఉపాధి హామీ మహిళ కూలీ మృతి.

ఉపాధి హామీ మహిళ కూలీ మృతి….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి డి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మాణిక్యమ్మ (62) అనే ఉపాధి హామీ మహిళ కూలీ సోమవారం మధ్యాహ్నం పని స్థలంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని సర్పంచ్ ప్రతినిధి విజయ కుమార్ తెలిపారు. సంబంధితశాఖ అధికారులు, సిబ్బంది మృతురాలి కుటుంబాన్ని పరామార్శించారని విజయ కుమార్ వివరించారు. సంబంధిత శాఖ మండల స్థాయి అధికారులు మృతురాలి అంత్యక్రియలకు కొంత నగదు ఆర్థిక సహాయం అందచేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఉపాధి హామీ కూలి మృతి.

ఉపాధి హామీ కూలి మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలి మహిళ గుండెపోటుతో మృతి చెందిందని తోటి ఉపాధి కూలీలు తెలిపారు. సోమవారం ఉదయం ఆమె ఉపాధి హామీ కూలి వెళ్లడంతో పని స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సుధాకర్ ఏపీఓ రాజ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన కొలతలను పరిశీలించారు. ఎంపీడీవో సుధాకర్ మాట్లాడుతూ. ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని, ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మల్లప్ప ఫీల్డ్ అసిస్టెంట్ శశి కూలీలు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ఏపీఓ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సుధాకర్ ఏపీఓ రాజ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు చేసిన పనులకు సంబంధించిన కొలతలను పరిశీలించారు. ఎంపీడీవో సుధాకర్ మాట్లాడుతూ. ఎండాకాలం కావున ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా రావాలని, ఎండలు ముదురుతున్న కొద్ది పనుల వద్ద జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలాగే పని ప్రదేశంలో నీటి సౌకర్యం కూడా కల్పించాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మల్లప్ప ఫీల్డ్ అసిస్టెంట్ శశి కూలీలు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన( డిడియు-జి కే వై ) కార్యక్రమంలో భాగంగా గ్రామీణ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉపాధి వైపు మళ్ళించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వ ర్యంలో ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని 18-30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ యువకులు కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని సూచించారు. హైదరాబాద్ లో నాలుగు నెలలు వివిధ రంగాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ జ్ఞానాన్ని పెంచి భవి ష్యత్తులో ఎంతో ఉపయోగక రంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణ రావు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకు లకు ఉపాధి కల్పించడం ప్రధానంగా తీసుకున్నారని, ఇలాంటి కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా మండల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకు న్నట్లు డిడియు- జీకే వైఅధికారులు సునీల్, శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్లా చక్రపాణి,మారేపల్లి రవీందర్ చిందంరవి,దుబాసి కృష్ణమూర్తి భాస్కర్, మారేపల్లి రాజు, కట్టయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.

జీతాల కోసం 4 నెలలుగా ఎదురుచూపులు.. ఉపాధి ఫీల్డ్ హామీ అసిస్టెంట్ల పస్తులు!

◆ సుమారు 10.000 మందికి అందని వేతనాలు.

◆ అప్పులతో కుటుంబాలను పోషిస్తున్న సిబ్బంది.

◆ ఏడాదైనా పేస్కేల్‌ హామీని నెరవేర్చని ప్రభుత్వం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర ఉపాధి హామీ జాయింట్ యాక్షన్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పే స్కేల్, పెండింగ్ జీతాలు పరిష్కారం కోసం ఎంపిడిఓ సుధాకర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది. ఏపీవో రాజ్ కుమార్ మాట్లాడుతూ
 క్రమం తఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఎక్కడా పొంతనలేదని, ఇందుకు తమ దుస్థితే నిదర్శనమని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలతో పనులు చేయించడం, సకాలంలో వేతనాలు అందించడంలో సాంకేతిక, క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వహిస్తారు.ప్పకుండా కూలీలతో పనులు చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేరకు నిధులు రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version