లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

లయన్స్ క్లబ్ గోపాలరావుపేట మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రామడుగు మండల శాఖల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ జండాను అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జండాను అధ్యక్షులు కర్ర శ్యాంసుందర్ రెడ్డి ఎగరవేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముదుగంటి రాజిరెడ్డి, కర్ర రాంచంద్రారెడ్డి, కర్ర రాజిరెడ్డి, ముదుగంటి సత్యనారాయణ రెడ్డి, పాకాల మోహన్, గొడుగు అంజియాదవ్, కోట్ల మల్లేశం, చాడ దామోదర్ రెడ్డి, కర్ర ప్రభాకర్ రెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, దుద్దెనపెల్లి లచ్చయ్య, ముదుగంటి లక్ష్మారెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, ఎడవెల్లి ముకుందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్ బాధిత కుటుంబానికి భరోసా

బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రానికి చెందిన ఉత్తెం అశోక్ ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటి సామాగ్రితో పూర్తిగా దగ్ధమైన విషయం తెలుసుకున్న గోపాల్‌రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి సందర్శించి పర్యవేక్షించారు. ఇంటి సామాగ్రిని పూర్తిగా పరిశీలించిన అనంతరం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అభయం ఇచ్చారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో ఫోన్‌లో విషయం తెలియజేసి ఆయనతో బాధితులను మాట్లాడించారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే త్వరలోనే స్వయంగా ఇంటిని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రామడుగు తహసిల్దార్ రాజేశ్వరిని ఫోన్‌లో సంప్రదించగా వారు వెంటనే స్పందించి రెవెన్యూ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు పంపించారు. అనంతరం మేడిపల్లి రూపాదేవి ఫౌండేషన్ ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తిరుపతి అశోక్ కుటుంబానికి తక్షణ సహాయం కింద ఐదువేల నగదు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారం అందేలా స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు సామంతుల సుజాత తిరుపతి, మామిడి కుమార్, కారుపాకల నరేష్, నాయకులు వడ్లూరి రాజేందర్, జిట్టవేణి రాజు, పంజాల శ్రీనివాస్ గౌడ్, పెసరు లచ్చయ్య, ఉత్తెం కుమార్, బాసవేని శ్రవణ్, గుర్రం శ్రీనివాస్, ఉత్తెం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

తిర్మలాపూర్ గ్రామంలో మహిళల ముగ్గుల పోటీ నిర్వహణ

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మహిళా మణులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈపోటిలో మొదటి బహుమతి తడగొండ లత, రెండవ బహుమతి మోడీ కిరణ్మయి, మూడవ బహుమతి సమ్మెట జ్యోతిలు గెలుపొందారు. గెలుపొందిన మహిళలకి గ్రామ సర్పంచ్ మోడీ రవీందర్, పాలకవర్గం చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిదులు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

కార్తీక్ వైద్యం కోసం లక్ష రూపాయల సహాయం

కార్తీక్ వైద్య ఖర్చులకు లక్ష అందజేత

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పేద యువకుడు కార్తీక్ అనారోగ్యం పాలవగా, మెరుగైన వైద్యం కోసం సుమారు ఐదు లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కార్తీక్ కుటుంబం తమ నిరుపేద ఆర్థిక పరిస్థితి కారణంగా ఆందోళన చెందారు.​ ఈవిషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న స్థానిక తాజా మాజీ ఎంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ తక్షణమే స్పందించి, కార్తీక్‌కు సహాయం అందించడానికి దాతల సహకారం కోరారు. ​గుర్రం దేవిక రాజశేఖర్ చేసిన విజ్ఞప్తికి స్థానిక దాతలు, ప్రజలు ఉదారంగా స్పందించి తమ వంతు సహాయం అందించారు. ​దాతల నుంచి మొత్తంగా ఒక్క లక్ష రూపాయాలు విరాళంగా సమకూరింది.​ ఈవిరాళాన్ని రామడుగు మండల విద్యాశాఖాధికారి రంగనాథ శర్మ చేతుల మీదుగా కార్తీక్ కుటుంబసభ్యులకు అందజేశారు.​ ఈసందర్భంగా మాజీ ఏంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ మాట్లాడుతూ మానవత్వంతో స్పందించి కార్తీక్ వైద్య ఖర్చుల కోసం విరాళాలు అందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసహాయం కార్తీక్ త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రమేష్, పి.డి,అనపురం తిరుపతి, తడగొండ రాజు, నాగం చంద్రమోహన్, చిలుముల శ్రీను, లక్ష్మణ్, నరసింహచారి, రాజమల్లయ్య, జనార్ధన్, సాయిలు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

డయాబెటిక్ పరీక్షలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T113915.637.wav?_=1

 

డయాబెటిక్ పరీక్షలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు

రామడుగు, నేటిధాత్రి:

 

లయన్స్ క్లబ్ గోపాలరావుపేట ఆధ్వర్యంలో డయాబేటిక్ నెల సందర్బంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ చౌరస్తాలో నూట పంతోమ్మిది మందికి ఉచిత బ్లడ్ ప్రేషర్(బిపి), డయాబేటిక్ పరీక్షలు నిర్వహించగా యాభై రెండు మందికి షుగర్ నిర్ధారణ జరుగగా వారిని పరీక్షల నిమిత్తం డాక్టర్ వద్దకు పంపించడం జరిగింది. అనంతరం డయాబేటిక్ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగినది. ఈసందర్భంగా లయన్ కర్ర శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ డయబేటిక్ రాకుండవుండాలన్నా, కంట్రోల్ లో ఉండాలన్నా వ్యాయామం చేయాలని, వాకింగ్ చేయాలని, మితాహారం తినాలని, రాత్రి ఏడు గంటల వరకే డిన్నర్ చేయాలని, మద్యపానం, దూమపానంకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ పాకాల మోహన్, కోశాధికారి గొడుగు అంజయ్య యాదవ్, జోన్ చైర్మన్ కర్ర ప్రభాకర్ రెడ్డి, క్యాబినెట్ మెంబర్స్ కర్ర శ్యాం సుందర్ రెడ్డి, కొడిమ్యాల వెంకటరమణ, డైరెక్టర్స్ కర్ర రాజిరెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, మూల అనంతరెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, కోట్ల మల్లేశం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆల్ఫోర్స్ కళాశాల విద్యార్థులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T130324.161.wav?_=2

 

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆల్ఫోర్స్ కళాశాల విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు 28అక్టోబర్2025న కరీంనగర్ జిల్లాలో నిర్వహించినటువంటి జిల్లా స్థాయి బేస్ బాల్ అండర్19 పోటీలలో పన్నెండవ తరగతికి చెందిన విద్యార్థులు కే.సిద్ధార్థ, కే.అభిరామ్, టి.వినయ్ మంచి ప్రతిభను కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రధానోపాధ్యాయులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈకార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు…

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు

రామడుగు, నేటిధాత్రి:

 

టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు శుక్రవారం రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి జి.పి.వి.రంగనాథ శర్మ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ఈపోటిలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపోందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీ మనోభావం, జ్ఞాన విస్తరణకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ విద్యా రంగంలో చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు…

రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా భూసార పరీక్షా పత్రాల- వితరణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జె.భాగ్యలక్ష్మి పాల్గొని రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను, ఫలితాలను వివరించి, భూసార పరీక్షా పత్రాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ ఎన్. ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారిని త్రివేదిక, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వ్యవసాయ విస్తరణ అధికారులు అనంతరాజ్, సంపత్, రమేష్, గోవర్ధన్, గుండి గోపాలరావుపేట క్లస్టర్ పరిధిలోని రైతులు, తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈసందర్భంగా మండల అధ్యక్షులు మోడీ రవీందర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధుర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఒక బాధ్యత గల పదవిలో ఉండి కేంద్ర బలగాలను అవమానించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో తెలపాలన్నారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటే, ఐక్య రాజ్య సమితిలో పాకిస్థాన్ బతిలాడుకుంటే ఆపరేషన్ సింధుర్ కేంద్రంలోని నరేంద్రమోదీ అపారని, అటువంటి విధానాలను, కేంద్ర బలగాలను అవమానించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు. అర్మీ బలగాలకు, కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ళ శ్రీకాంత్ గౌడ్, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మామిడిపెళ్లి చైతన్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, యువ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, ఐటి సెల్ మండల కన్వీనర్ మాడిశెట్టి జయంత్, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మాదం శివ, బొజ్జ తిరుపతి, శేవెళ్ల అక్షయ్, సూదగోని మహేష్ గౌడ్, మామిడిపెళ్లి రమేష్, మండల ఐటి సెల్ కోకన్వీనర్ మూల వంశీ, చేనేత సెల్ కన్వీనర్ వేముల రమేష్, బూత్ కమిటీ అధ్యక్షులు ఉత్తేం కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్, బుర్ర శ్రీధర్, మడికంటి శేఖర్, భూస మధు, ఉత్తేం సాయి తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతుల కోసం తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన భాజపా నాయకులు

నష్టపోయిన రైతులను రైతులను ఆదుకోవాలని తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన భాజపా నాయకులు

కరీంనగర్: నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రామడుగు మండల కేంద్రంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈసందర్భంగా మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ మాట్లాడుతూ మోంథ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాల కారణంగా మండలంలోని రైతుల పంటలు నష్టపోయి, కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు మొదలుపెట్టక అనేక రైతుల ధాన్యం తడిసిపోయి, వరదల్లో కొట్టుకోపోవడం, వరి, మొక్కజొన్న, పత్తి రైతులు కూడా పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల శ్రీకాంత్ గౌడ్,మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, కారుపాకల అంజిబాబు,మండల కార్యదర్శి గుంట అశోక్, యువ మోర్చా మండల అధ్యక్షులు దుర్శేట్టి రమేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, షేవెళ్ల అక్షయ్, మాదం శివ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, బూత్ కమిటీ అధ్యక్షులు ఉత్తేమ్ కనుకరాజు, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంకి చెందిన బూత్ అధ్యక్షులు ఉత్తేం కనకరాజ్ తాత మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల అధ్యక్షులు మోడీ రవీందర్. ఈకార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతిరెడ్డి, మండల జనరల్ సెక్రటరీలు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, పోచంపల్లి నరేశ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, మండల కార్యదర్శి గుంట అశోక్, దళిత మోర్చా అధ్యక్షులు సంటి జితేందర్, ఐటీ సెల్ మండల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బీజేయం ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజుకుమార్, సీనియర్ నాయకులు అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు..

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గల గడికోట మైదానంలో జరుగుతున్న రామడుగు మండలం విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా రామడుగు గ్రామానికి చెందిన రామడుగు రాయల్స్ టీమ్ జట్టుకు యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ టిషర్ట్స్ అందజేయడం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడి దిలీప్ కుమార్, బసరవేణి అజయ్, పూరెల్ల రాహుల్ , ఎడవెల్లి సాగర్, రామడుగు గ్రామస్తులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T135534.081.wav?_=3

 

రామడుగు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామడుగు ఏఎస్ఐ మనోజ్ కుమార్, మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, ప్రతి విద్యార్థి మంచి నడవడికతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో ముందుకు సాగుతూ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కలలు నెరవేరుస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగ్, డయల్ 100, షీటీమ్స్, భరోసా, సైబర్ అవేర్నెస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్, వంటి వివిధ నేర సంబంధిత అంశాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రామడుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది, అక్షర హై స్కూల్ విద్యార్ధిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

హ్యాండ్ బాల్ టోర్నమెంట్లో సత్తాచాటిన సరస్వతి స్టూడెంట్…

హ్యాండ్ బాల్ టోర్నమెంట్లో సత్తాచాటిన సరస్వతి స్టూడెంట్

రామడుగు, నేటిధాత్రి:

 

 

ఎస్జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థి గంధం విక్కీ సత్తాచాటినట్లు పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో జరిగిన పోటీల్లో కరీంనగర్​ జట్టు తరపున ఆడి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, పీఈటీ సాయికృష్ణ విక్కీని అభినందించారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T130127.741.wav?_=4

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పాకాల ప్రశాంత్ రెండు రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు తడగొండ సత్యరాజ్ వర్మ, బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నర్సింబాబు, బక్కశెట్టి శ్రీనివాస్, అజయ్, రాజు, ఖాసీం షరీఫ్, త్రినాథ్ వర్మ, పాదం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T125631.338.wav?_=5

 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో దుబాయ్ లో మరణించిన ఎలగందుల ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్. గత కొద్దిరోజుల క్రితం మరణించిన ప్రకాష్ మృతదేహాన్ని అక్కడి ఎన్నారై సభ్యుల సహకారంతో ఇండియాకు రప్పించి వారికి ఇద్దరు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని తెలుసుకొని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి పిల్లల చదువుల ఫీజులు మాఫీ చేయాలని కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులు రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పూడూరు మల్లేశం, ఎడవల్లి పాపిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, దాసరి అరుణ్ కుమార్, సుద్దాల మల్లేశం, రేణికుంట బసంతం రేణిగుంట అశోక్, దాసరి అనిల్, వేల్పుల రవి, రేణికుంట శ్రావణ్, రేణిగుంట రవి, రేణిగుంట ఆనంద్, దాసరి శంకర్, రేణిగుంట హరీష్, లింగంపల్లి రవి, దాసరి శ్రీనివాస్, దాసరి శేఖర్, దాసరి శ్రీనివాస్, దాసరి రవీందర్, పురాణం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

మానసిక ఆరోగ్య అవగాహన రామడుగులో

మానసిక ఆరోగ్యమే సంపూర్ణ జీవితానికి పునాది

యువత విద్యార్థుల్లో మానసిక వికాసం– స్ఫూర్తిదాయక సమాజానికి పునాదిగా నిలుస్తుంది- ఎజ్రా మల్లేశం

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మానసిక ఆరోగ్యమే వ్యక్తి సంపూర్ణ జీవితానికి పునాదులుగా నిలుస్తాయని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టీపీఏ) జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో టెలంగాణ సైకాలజిస్టిస్ అసోసియేషన్ (టిపిఏ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితంలోని ప్రతి రంగంలో రాణించగలమని, ఆనంద జీవితం సాధించడానికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యమే బలమైన ఆధారం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా, భారత్‌లో కూడా ఈసమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలో అరవై శాతం మంది నిద్రలేమి, డెబ్బై శాతం మంది తరగతి గదుల్లో ఏకాగ్రత లోపం సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణాలు మానసిక ఆందోళన, సెల్‌ఫోన్‌ వ్యసనం, సామాజిక మాధ్యమాల అధిక వినియోగం, చదువు ఒత్తిడి, కుటుంబ అనుబంధాల లోపం అని వివరించారు. మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామం, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఆత్మీయ సంభాషణ అలవాటు చేసుకోవాలని సూచించారు.
“మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరానికి శక్తి, ఆత్మకు ఉల్లాసం, జీవితానికి దిశ లభిస్తుంది,” అని ఆయన అన్నారు. సైకాలజిస్ట్ అలియన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డిజి నాగేశ్వర్ మాట్లాడుతూ మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో విశ్వముఖ చారి, ప్రిన్సిపాల్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు బస్సుల సమస్యపై బీజేపీ నేతల ఆందోళన

బస్సు రాని పక్షంలో ఎల్లుండి ఆర్టీసి ఆఫీస్ ముట్టడి- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ పెగడపెల్లి నుండి గోపాలరావుపేట్ మీదుగా మోతె, గోలిరామయ్యపల్లి, కొక్కెరకుంట నుండి కరీంనగర్ వేళ్ళు బస్సు వచ్చే బస్సు ఎందుకు రావట్లేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని వారు అన్నారు. విద్యార్థులు, రైతులు, ఇతర ప్రాంతలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారిందని అయిన కానీ స్థానిక ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పాట్ల అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకొని వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో ఎల్లుండి ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆర్టీసీ ఆర్ఎమ్ ఆఫీస్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, ఉప్పు శ్రీనివాస్ పటేల్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా మండల అధ్యక్షులు దూరుశెట్టి రమేష్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెళ్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, చేనేత సెల్ కన్వీనర్ రమేష్, సీనియర్ నాయకులు కలిగేటి ఎల్లయ్య, షేవెళ్ళ అక్షయ్, బూత్ అధ్యక్షులు ఉత్తేం కనుకరాజు, రాగం కునకయ్య, అంబటి శ్రీనివాస్, ఉప్పు తిరుపతి, నాగి లచ్చయ్య, ఆకరపు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ భవన్ రేకుర్తి కంటి హాస్పిటల్ వారి సహకారంతో కంటి టెక్నిషన్ ప్రభాకర్ సారథ్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమంలో మొత్తం ఎనభై రెండు మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ముప్పై నాలుగు మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి కంటి ధవాఖానకు బస్సులో తీసుకుపోవడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైస్ గవర్నర్-1 మోర భద్రేషం, అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ పాకాల మోహన్, కోశాధికారి గొడుగు అంజి యాదవ్, జోన్ చైర్మన్, కర్ర ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ కర్ర శ్యాం సుందర్ రెడ్డి, డైరెక్టర్స్ ముదుగంటి రాజిరెడ్డి, చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, ఎడవెల్లి రాజిరెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, మూల అనంతరెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్, ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు…

ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం

గ్రామాల అభివృద్ధి గాలికి ఒదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా ఎన్నికల డ్రామా నిర్వహించిందని, వారిది బీసీలపై కపట ప్రేమ నటిస్తుందని వారు అన్నారు. కేవల రాజకీయ లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా నటించి తిరిగి వారి నాయకులతోనే హై కోర్ట్ లో కేసులు వేపియ్యడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ కి అన్ని పార్టీలు సహకరించాయని ఆనాడు తెలిపి, ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఒంటరి పోరాటం చేస్తుందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకంచలేదని, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని వారు తెలిపారు. కేవలం వారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందొ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న ట్రయల్ వేసినట్టు ఉందని, వారి ప్రభుత్వం మీద,వారి అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకొని ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం అని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్,జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, సూదగోని మహేష్ గౌడ్, కలిగేటి ఎల్లయ్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బూత్ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగి లచయ్య, మాడిశెట్టి శ్రీసాయి, కోడూరి ప్రణయ్,కట్ట అనీల్ కుమార్, కొలిపాక రాజేష్, పురేళ్ల సన్నీ, కొలిపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version