ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన.!

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు

నడికూడ,నేటిధాత్రి:

హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్
అనంతరం కవిత పలు విషయాలపై చర్చించారు.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని గుంటూరు పల్లి లో మంగళవారం రోజున ఇందిరమ్మ ఇళ్లకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే సత్తన్నకు దక్కిందని అన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలలను తీర్చలేదని 10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు, అలాగే మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటనలో మాట్లాడుతూ కాలేశ్వరం లో మోటార్లు పెట్టడం లేదని నిరాహార దీక్ష చేస్తామనడం ఎందుకో చెప్పాలని దొరల ఫామ్ హౌస్ లోకి నీళ్లను పంపడం కోసమేనా అని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య మండల యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దన నాగరాజు కాంగ్రెస్ నాయకులు పాశం లక్ష్మీనారాయణ నర్రా శివరామకృష్ణ మునిమాకుల నాగేశ్వరరావు తిరుపతయ్య సాంబయ్య కాంగ్రెస్ పార్టీ యూత్ మండల్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదు.

వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదు
మహదేవపూర్ జులై 12 (నేటి ధాత్రి )
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్

మహాదేవపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున వికలాంగుల హక్కుల కోసం జిల్లా అధ్యక్షులు వంశి గౌడ్ రానున్న తరుణంలో మండలంలో ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన మాటను మార్చిన క్రమంలో మరో పోరాటంలో సిద్ధం కావడానికి ఆ రోజున మండల కమిటీ నిర్మాణం చేసి వికలాంగులకు 6000 వృద్ధులు వితంతువులకు 4వేల పింఛన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలోని వృద్ధులు వికలాంగులు వితంతువులు అధిక సంఖ్యలో హాజరై మన సమావేశాన్ని ఏర్పాటు చేసి మండల సమావేశాన్ని ఎన్నుకొని మనకోసం పోరాటం చేయాల్సిందిగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పిలుపునిస్తున్నాం అని బెల్లంపల్లి సురేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పేర్కొన్నారు వికలాంగుల హక్కుల కోసం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వారికి అండగా దండగా ఉంటారని పిలుపునిచ్చారు

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి
ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు

మొగులపల్లి నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్న వారు.

కాబట్టి, ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో & ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. కొంత మేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది.
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని మీ ద్వారా తెలంగాణ | రాష్ట్ర ప్రభుత్వానికి BC, SC, ST JAC తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని క్రమంలో ప్రభుత్వంపై అనేక రకాలుగా దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలకు ఏ విధంగా అయితే ఉచిత బస్సు అందించారు అదేవిధంగా స్థానిక ప్రభుత్వ స్కూలు ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గ్రామాల నుండి పాఠశాల వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మరొక విధంగా దీనిని సెమీ రెసిడెన్షియల్ గా అనుకోవచ్చు. అలాగే పిల్లలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ తో వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు దూడపాక రాజు ఉపాధ్యక్షులు బండారి కుమార్ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీక్రిష్ణ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు శ్రీధర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ కోహిర్ మండల అధ్యక్షులు రవికుమార్ మాదిగ

ఎమ్మార్పీఎస్ కోహిర్ మండల అధ్యక్షులు రవికుమార్ మాదిగ ఆధ్వర్యంలో……

వెంకటపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో సోమవారం రోజు
(ఎమ్మార్పీఎస్ ) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆత్మగౌరవ జెండా ఎగర చేయడం జరిగింది, ఎమ్మార్పీఎస్ కోహీర్ మండల అధ్యక్షులు రవికుమార్ మాదిగ అధ్యక్షతన జెండా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాజా మాజీ సర్పంచ్ రాజశేఖర్ గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ లు మల్లికార్జున్, అంజయ్య అంజయ్య, బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండా ల్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా స్వీట్లు పంచుకొని ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాధికారం దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ,అగ్రకుల పేదలందరూ మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో నడవాలని అందరికీ సమన్యాయం చేసే విధంగా మందకృష్ణ మాదిగ అన్నగారి ఆలోచన విధానం ముందుకు నడిపించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ రెడ్డి కోహీర్ మండల్ ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్ కుమార్,మాజీ ఎంపీటీసీ సంపత్ కుమార్ (కోహీర్ )బిలాల్ పూర్ సర్పంచ్ నర్సిములు కవేలి కృష ధనరాజ్ గ్రామ అధ్యక్షులు రత్నం, పద్మ రావు, చిన్న, రాజేందర్, డేవిడ్, రత్నం, ప్రభాకర్ రమేష్ నవీన్, సీనియర్ జర్నలిస్ట్ రాయకోటి నరసింహులు, అశోక్,సుదీష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు . .
రాయికల్. నేటి ధాత్రి. జులై 07
రాయికల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను వేణు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు మంచి వైద్యం అందాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎబిసిడి వర్గీకరణను నేడు సాధించారని కొనియాడారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకుడు బాపురపు నర్సయ్య, తలారి రాజేష్, వెంకటేష్, ప్రకాశ్, రాజేష్, సాయిలు, దిల్ రాజు, నిగ రాజేష్ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేటీఆర్ సేన మండల అధ్యక్షడు ఎన్నిక.

కేటీఆర్ సేన మండల అధ్యక్షడు ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కేంద్రంలో కేటీఆర్ సేన మండల అధ్యక్షుడిని ఎన్నుకున్నారు కెటిఆర్ సేన రాష్ట్ర అద్యక్షులు. మెంగాని మనోహర్ అదేశా లమేరకు భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి & జ్యోతి, అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి అధ్వర్యంలో మండల అధ్యక్షు నిగా శానంరాకేష్ ఎన్నుకు న్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు.!

నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర నాయకులు జన్నె మొగిలి మాతృమూర్తి జన్నె దుర్గమ్మ మధ్యాహ్నం మృతి చెంది నాట్లు తెలియగానే వచ్చి వారి పార్థివ దేహం మీద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అంతిమయాత్రలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిషిధర్ రెడ్డి వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నం పల్లి పాపన్న చదువు రామచంద్ర రెడ్డి కన్నం యుగదీశ్వర్ రాష్ట్ర నాయకులు బట్టు రవి గణపురం బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు నాయకులు భాస్కర్ రావు రామచంద్ర రావు సోమా దామోదర్ దుప్పటి భద్రయ్య మంద మహేష్ దుగ్గిశెట్టి పున్నం చందర్, భూక్యా హరిలాల్, మాదాసు మొగిలి, పెండ్యాల శ్రీకాంత్ వేణు రావు రాజు శివరాత్రి వేణు, రాకేష్ రెడ్డి శాస్త్రాల తిరుపతి తదితరున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version