గంజాయి కేసులో ముగ్గురి యువకుల పట్టివేత
మహాదేవపూర్ అక్టోబర్ 01 (నేటిధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రం లో
గంజాయి కేసులో ముగ్గురు యువకులను మహదేవపూర్ పోలీసులు పట్టుకున్నారు. మండలం లోని మహదేవపూర్, ఎడపల్లి , బ్రాహ్మణపల్లి కు చెందిన ముగ్గురి యువకులను శుక్రవారం రోజున పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు ఎడపల్లి గ్రామ శివారు సమీపంలో అనుమానాస్పదంగా బైక్ పై దెబ్బ రాజకుమార్, శీలం పూర్ణచందర్, కూనరపు రంజిత్ కుమార్ లు ముగ్గురు యువకులు కనిపించగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని పట్టుకొవడం జరిగిందని వారిని విచారించగా గంజాయి తాగుతున్నామని తెలుపడం జరిగిందని అన్నారు. జల్సాలకు అలవాటు పడి గంజాయి తాగడం ద్వారా స్నేహితులుగా మారినట్లు తెలిపారు. వారు గంజాయిని తాగుటకు మరియు గంజాయి తాగడం అలవాటు ఉన్న వ్యక్తులకు అమ్మడానికి ఉపయోగిస్తున్నటు తెలిపినారు. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయిని, స్పెండర్ బైక్ ను స్వాధీనము చేసుకోవడం జరిగింది.
నిందితులన చాక చక్యంగ పట్టుకున్న మహాదేవపూర్ పోలీస్ కానిస్టేబుల్ కిరణ్, విజయ్, అనంత్ మరియు ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ రాజు ని సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు. అనంతరం మాట్లాడుతూ యువత గంజాయి మరియు ఇతర చెడు వ్యాసనాలకు వెళ్తే కఠిన చర్యలు తిసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఎస్ఐ పవన్ కుమార్, శశాంక్ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
