దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో…

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో
పొత్కపల్లి యువత ..

సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న యువత..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం లోని పొత్కపల్లి గ్రామానికి యువత గత దశాబ్దకాలంగా దుర్గాభవాని కమిటీగా ఏర్పాటై భవాని మాత సేవలో తరిస్తూ మన సనాతన ధర్మాన్ని ,భక్తి మార్గాన్ని భావి తరాలకి అందిస్తుంది.యువత అంటే మనకు ఉండే ఆలోచనలకి ఆమడదూరంలో ఉంటూ సనాతన ధర్మానికి, భక్తిగా చిరునామాగా నిలుస్తూ పొత్కపల్లి యువత భవాని సేవలో దశ్జబ్దకాలంగా త్రికరణశుద్ధిగా ముందుకు సాగుతుంది.ఓదెల మండలంలోని ఎంతో ప్రాచుర్యం పొందిన పొత్కపల్లి శ్రీ రాజ వేణుగోపాలస్వామి మరియు భవాని సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత దశాబ్ద కాలంగా భవాని మాత ఉత్సవాలు స్థానిక యువత ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తు హిందూ ధర్మ పరిరక్షణకు మేము సైతం చెడుపై పోరాటానికి సిద్ధం అంటూ భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు పొట్కపల్లి గ్రామంలో నీ యువత కులాల కతీతంగా భవాని మాత కమిటీగా ఏర్పడి,భవాని మాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తు ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నారు.ఆనాడు మరాఠా రాజ్య స్థాపకుడైన చత్రపతి శివాజీ మహారాజ్ భవాని మాత ఉత్సవాలను ప్రారంభిస్తే దానిని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లడానికి పొత్కపల్లి యువత సంకల్పించారు. సమాజ హితమే తమ అభిమతంగా దశాబ్దకాలంగా భవాని మాత ఉత్సవాలని అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క భవాని మాలలు ధరించి భక్తిని ,బాధ్యతలని సమపాళ్లలో నిర్వర్తిస్తూ యువతకి ఒక మార్గాన్ని జీవనవిధానాన్ని చూపిస్తున్నారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజాన్ని మంచి దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క భక్తి భావంతో పాటు సామజిక స్ఫూర్తిని రగిలిస్తున్నారు భవాని కమిటి గ్రామ కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల లో అయిన హెల్మెట్ ధరించాలని, స్థానిక వ్యాపారులని ప్రోత్సహించాలని,స్వదేశీ ఉత్పత్తులు కొనడం దేశభక్తికి శోభా అని,విద్యతోనే వెలుగు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని గుర్తు చేస్తూ అందరిలో చైతన్యం తీసుకువస్తున్నారు. మాదకద్రవ్యాలు,మద్యం, జూదం జీవితం చెడగొట్టే మార్గాలు కావున వాటికీ దూరంగా ఉండి భవిష్యత్తుని వెలిగించండి అని యువతకి హితబోధ చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవం ఒక ఆనందం మాత్రమే కాదు మన గ్రామాన్ని ఒకటిగా నిలబెట్టే శక్తి అని చెబుతు రాక్షస సంహారానికి ప్రతీక అయిన నవరాత్రులని ఘనంగా నిర్వహిస్టు నవ సంకల్పంతో ముందుకు సాగుతూ యువత అంటే ఇలానే ఉండాలి అనే స్ఫూర్తిని ప్రతివో ఒక్కరిలో కలిగిస్తూ పోత్కపల్లి యువత ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి
సామజిక కార్యకర్త

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version