తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీలను నియమిస్తున్నట్లు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీని అన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.యువకులు, నాయకులు పార్టీలో చేరి తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా తమ వంతు కృషి చేసి పార్టీ బలోపేతం చేయాలని కోరారు.అలాగే మంచిర్యాల జిల్లాలోని చున్నంబట్టి లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి లను ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అసిఫాబాద్ లో నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం చేపట్టనున్నారు.23న గురువారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్ జిల్లాలో నియోజకవర్గం ఇన్చార్జిలను నియమించడం జరుగుతుందని తెలిపారు.
