పార్థివ దేహానికి పూలమాల అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T154052.585.wav?_=1

 

పార్థివ దేహానికి పూలమాల అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

చెనిగల రాములు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన… కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం & ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్ ఈ రోజు వర్ధన్నపేటమండలం లో, కట్రియా ల గ్రామానికి చెందిన చెనిగల కుమారస్వామి,చెనిగల రాజు గార్ల తండ్రి చెనిగల రాములు వృద్ధాప్యం పై బడి తేదీ 20-11-2025 రాత్రి 9-00 గంటల సమయంలో మరణించినందున నేడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,గుజ్జ రవీందర్ రెడ్డి, కట్రీ యాల టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య గారులు రాములు గారి నివాసం వద్ద,రాములు గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించి కుమారస్వామి,రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి ససంతాపం తెలుపడం జరిగింది.

మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన పిట్టల మల్లయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి మండల నాయకులు తో కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి మల్లయ్యకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మల్లయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉండి పార్టీకి ఎలా లేని సేవలు చేశారు ఆయన అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన వెంట జిల్లా కార్యదర్శి మాలోత్ రమేష్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నాయకులు పెంతల కొమరారెడ్డి, హౌసింగ్, రమేష్ తదితరులు ఉన్నారు.

నివాళులు అర్పించిన వీరేష్ రావు

నివాళులు అర్పించిన వీరేష్ రావు

పరకాల,నేటిధాత్రి

 

సోమవారం నాడు హైద్రాబాదు లో మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు,తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు కాగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరకాల బిఆర్ఎస్ యువనాయకులు వీరేష్ రావు సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి…

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి

•భౌతికకాయానికి నివాళిలు అర్పించిన భీంభరత్
* రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

షాబాద్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు శనివారం ఉదయం అకాల మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రాములు స్వగ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, తమిల్లి రవీందర్ షాబాద్ సర్పంచ్, షాబాద్ ఎంపీటీసీ అశోక్, తొంట వెంకటయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమలపురం శ్రీరామ్ రెడ్డి, బందయ్య దోస్వాడ సర్పంచ్ రాములు, తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య, మద్దూరు మల్లేష్ సర్పంచ్, తదితరులు రిపోర్టర్ రాములు భౌతికకాయానికి నివాళిలు అర్పించారు.

2నవంబర్ న మార్కెట్ బందు….

2నవంబర్ న మార్కెట్ బందు

 

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో దడ్వాయిగా పనిచేస్తున్న కామరెడ్డిపల్లికి చెందిన బర్గెల రాజయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో మరనించిగా 2నవంబర్ న రోజున కార్మికులు వ్యవసాయ మార్కెట్ బందుకు పిలువునిచ్చారు.అందుకు సహకరించాలని సూపర్వైజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో దాద్వాయ్ యూనియన్ అధ్యక్షులు కన్నూరిప్రభాకర్,ఉపాధ్యక్షులు కొమ్ముల శ్రీనివాస్,పసుల సదనందం,కొమ్ముల సది, రవీందర్,సత్యనారాయణ స్వామి,అశోక్,కోకిల శంకర్, డబ్బా రాజయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి…

గుర్తు తెలియని వ్యక్తి మృతి

జమ్మికుంట, నేటి ధాత్రి:

ఉప్పల్ -జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య భీంపల్లి గ్రామ సమీపంలో రైలు పట్టాల ప్రక్కన సిమెంట్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి వయస్సు సుమారు 30-35 సంవత్సరాలు బహుశా ఎదో రైలు బండి నుండీ క్రింద పడగ చనిపోయి ఉంటాడు. మృతుడు నవీ బ్లూ ఫుల్ టీ షర్ట్, నవీ బ్లూ లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు మృతుని వద్ద ఏపీఎస్ ఆర్టిసి బస్సు టికెట్ గుడివాడ నుండి విజయవాడ కలదు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గాని వస్తువులు గాని లేవు. శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ జమ్మికుంట మార్చరీ లో భద్రపర్చానైనది. ఇట్టి కేసును జి. తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం పరిశోదన చేయుచున్నాను ఏమైనా వివరాలు తెలిసినచో ఫోన్ నెంబర్ 9949304574, 8712658604 కి సమాచారం ఇవ్వగలరని కోరారు.

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T140655.340.wav?_=2

 

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

రామాయంపేట, అక్టోబర్ 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన రైతు పేగుడ దుర్గయ్య (68) మృతి చెందడంతో గ్రామం మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి.
సుమారు 25 రోజుల క్రితం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లుచిరుగి పొలం వద్దనే కుప్పకూలిన దుర్గయ్యను చుట్టుపక్కల రైతులు గమనించారు. వెంటనే స్పందించిన వారు 108 అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వగా, అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి ఆయనకు రక్తపోటు అత్యధికంగా పెరగడంతో కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించిన కుటుంబ సభ్యులు, మేడ్చల్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయితే 26 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దుర్గయ్య చివరకు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.
రైతు దుర్గయ్య భార్య లక్ష్మి కూడా సుమారు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను విడిచి వెళ్లిపోయిన దుర్గయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల విలాపాలతో తోనిగండ్ల గ్రామం మునిగిపోయింది.
గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు దుర్గయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. “ఆయన ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. కుటుంబం కోసం జీవితాంతం శ్రమించారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేం” అని గ్రామస్థులు కన్నీటి కణాలతో గుర్తుచేశారు.

రెవ.రే.భూమన్ సుందర్ రాజ్ మృతి పట్ల సంతాపం…

రెవ.రే.భూమన్ సుందర్ రాజ్ మృతి పట్ల సంతాపం

◆:- ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణానికి చెందిన రెవ.రే.భూమన్ సుందర్ రాజ్ 17-10-2025 రోజు అమెరికా దేశంలో స్వర్గస్తులైనరు వారి అంత్యక్రియలు అక్కడే జరుగును జహీరాబాద్ పట్టణంలోని వారి నివాసంలో వారి బంధుమిత్రులు,ఆప్తుల తో కలసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించి,నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతు వారి మృతి బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు,ఈ కార్యక్రమంలో ఇండిపండెంట్ పాస్టర్ రమేష్ బాబు,మోహన్, రవీందర్ పాల్,ప్రకాష్, రత్నం,ధన్ రాజ్, సురేష్,పాల్,సునీల్, పాస్టర్స్ బృందం, తదితరులు పాల్గొన్నారు,

ఆర్థిక సహాయం అందచేసిన మండల కాంగ్రెస్ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T122357.569.wav?_=3

 

ఆర్థిక సహాయం అందచేసిన మండల కాంగ్రెస్ నాయకులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…

 

కరకగూడo మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడుకొమరం నాగేశ్వరరావు (40) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందినారు కరకగూడెం మండలంలో కాకుండా మంగపేట గోవిందరావుపేట ఏటూర్ నాగారం మండలాలలో అందరికీ సుపరిచితుడు గొప్ప మానవతవాది డ్రైవింగ్ ఫీల్డ్ లో సిద్ధహస్తుడు రాజకీయంలో తుమ్మల నాగేశ్వరరావు వీరఅభిమాని కావడంతో ఇతనిని తుమ్మల అని పేరు పెట్టి పిలుస్తారు. అతనికి భార్య ముగ్గురు కూతుర్లు 10 సంవత్సరాలలోపు ఉన్నారు అందరూ చిన్నపిల్లలు కావడంతో పెద్ద దిక్కు కోల్పోవడంతో అందరూ కన్నీటి పర్వతమయ్యారు దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో పరిస్థితి తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించి ఎంతో బాధపడుతూ హృదయం చలించిపోయి గుర్తు చేసుకుంటూ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 11000/రూపాయలు దశదినకర్మలకు ఆర్థిక సహాయం చేసినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు. పోలబోయిన రామారావు కొమరం తాతారావు చందా నాగేశ్వరరావు గొగ్గలి కృష్ణ పోలే బోయిన కృష్ణారావు పోలే బోయిన సత్యనారాయణ పోలే బోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు…

సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు

దశదినకర్మ సందర్భంగా రక్తదాన శిబిరం

మాజీ ఎంపీటీసీ సాయికుమార్ యాదిసభలో పలువురు నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపిటిసి, జిల్లెల్ల సాయికుమార్ మరణం దుగ్గొండి మండల యువతకు స్థానిక ప్రజలకు తీరనిలోటని నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్,పలువురు నేతలు అన్నారు.దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె గ్రామానికి చెందిన దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయికుమార్ ఈ నెల 4 గుండెపోటుతో మరణించారు.కాగా సోమవారం దశదిన కర్మ కాక్యక్రమం సందర్బంగా
కుమారుడు జిల్లెల ఉమేష్ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ నేపథ్యంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేశారు.అలాగే సాయికుమార్ సంస్మరణ యాదిసభ ఏర్పాటు చేశారు.మాజీ మావోయిస్టు నేతలు భారతక్క,సిద్ది రాజు,మురళీ తో ప్రజాసంఘాలు,కుల సంఘాలతో పాటు వివిధ పార్టీల నేతలు నాయకులు పాల్గొన్నారు.సాయి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బార్య రమ, కుమారుడు ఉమేష్, కుతురు లక్ష్మిప్రసన్నలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన చేసిన సేవలు జ్ఞాపకాలు గుర్తుకు చేశారు.ఈ కార్యక్రమాలలో జిల్లెల్ల శ్రీనివాస్,కందికొండ నవిన్, కందికొండ రాజు,మద్దూరి ప్రశాంత్, బూస రమేష్,
బూస శోభన్, గాండ్ల సందిప్, వల్లె విజెందర్, బూస ప్రశాంత్, తుత్తూరు లవకుమార్,నల్లబెల్లి చిరంజివి, పెళ్లి రాజశేకర్, జిల్లెల్ల మోహన్,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది…

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ అనారోగ్యంతో గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్జయ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

నర్సంపేట, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ ,  కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి…

డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ 75 సంవత్సరాల వయసులో మరణించారు. మౌలానా హఫీజ్ సాకిబ్ సాహిబ్ నాయకత్వంలో జుహర్ ప్రార్థన తర్వాత బాగ్దాదీ మసీదులో అంత్యక్రియల ప్రార్థన జరిగింది, దీనిలో పెద్ద సంఖ్యలో బంధువులు మరియు స్నేహితులు పాల్గొన్నారు. మృతుడు పదిహేను సంవత్సరాలుగా పరిహారం లేకుండా హజ్ యాత్రికుల కోసం దరఖాస్తులు రాసి రెండుసార్లు పెన్షన్ పొందాడు.

అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
డాక్టర్ అల్హాజ్ సయ్యద్ గౌసుద్దీన్ ను వారిలో అతని భార్య, 3 కుమారులు మరియు 4 కుమార్తెలు ఉన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత…

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత

 

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో…

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జార్జ్‌(97) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమార్తె శిబా తెలిపారు. 1938, మే 7న కేరళలో జన్మించిన జార్జ్‌.. 1950లో ప్రీ ప్రెస్‌ జర్నల్‌ ద్వారా బొంబాయిలో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు. సుదీర్ఘకాలం ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌సలో కొనసాగారు. సుమారు రెండున్నర దశాబ్దాలపాటు ‘పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’ పేరిట కాలమ్స్‌ రాశారు. 2007లో కన్నడ రాజ్యోత్సవ పురస్కారం, 2011లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి నన్నేసాహెబ్ తల్లి అనారోగ్యంతో మృతిచెందగా. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతురాలి స్వగృహానికి చేరుకొని ఆమె పార్థివ దేహం పై పూలమావిసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగడ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ నాయకులు నాన బోయిన రాజారాం, సట్ల శ్రీనివాస్ గౌడ్, ఖ్యాతం శ్రీనివాస్ గుమ్మడి వేణు పాండవుల రాంబాబు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.,

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

ఓదెల (పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం గుంపుల మానేరు వాగులో మద్యం మత్తులో మునిగి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఎస్సై దీకొండ రమేష్ ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెళ్ళి రవీందర్ (51) హమాలీ వృత్తి చేస్తున్న రవీందర్ తరచుగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య, కుమారుడు మందలించగా గుంపులలో గల రామభద్ర ఆలయ సమీపానికి వెళ్లాడు. అనంతరం తన కుమారుడికి ఫోన్ చేసి అక్కడ ఉన్నానని తెలిపాడు. కుమారుడు దిలీప్, బంధువు రాజు అక్కడికి చేరుకోగా ఒడ్డున బట్టలు ఉండగా, రవీందర్ నీటిలో కనిపించాడు. బయటకు రావాలని కుమారుడు పిలవగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే కుమారుడు బయటకు తీసుకురాగా అప్పటికే స్పృహ తప్పి ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందాడని ధృవీకరించారు. ఈ ఘటనపై దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T143955.810.wav?_=4

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (బి) గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతానికి చెందిన ఆయన, నిర్వర్తిస్తున్నారు. ఈనెల 162 తేదీన ఆరోగ్య సమస్యలు ఉన్నందున సెలవు ఇవ్వాలని ఎం.పీ.డీ.వోను కోరగా, ఆ సెలవు తిరస్కరించారని మృతుని భార్య ఆరోపించారు. అంతేకాక, గత ఎం.పీ.వో.తో పాటు ప్రస్తుత ఎం.పీ.వో కూడా తన భర్తను మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్కు ఒక చిన్న పాప ఉంది.

కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T121029.177.wav?_=5

 

కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కీర్తిశేషులు ఏలేటి సోమిరెడ్డి తుంగతుర్తి మండలం కంప్యూటర్ ఆపరేటర్ మరణించటం తో అయన చిత్రపటానికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎంపీడీవో మంజుల, కార్యాలయంలో ఎంపీడీవో జూనియర్ అసి స్టెంట్ శాస్త్రము, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది పూలమాల వేసి నివాళుఅర్పించి మౌనంపాటించి సంతాపం తెలిప్యారు.

పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..

పశువుల మేతకు వెళ్ళి వ్యక్తి మృతి..
• రెస్క్యూ టీం గాలింపులో శవం లభ్యం.

నిజాంపేట: నేటి ధాత్రి

పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలో జరిగింది. నార్లపూర్ గ్రామానికి చెందిన బదన కంటి మహేష్ (25) అను వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల నుండి కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు.

Man dies after going to graze cattle

సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్ గ్రామంలో గల హైదర్ చెరువులో రిస్క్యూమ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపులో శనివారం సుమారు 12 గంటలకు మహేష్ శవం లభ్యమయింది. పశువుల మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం…

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండలం కేంద్రంలోని షౌకత్పల్లి కి చెందిన సుజాత మృతి చెందింది. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక టిఆర్ఎస్ నేతల ద్వారా బాధిత కుటుంబానికి 5000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ మావురం రాజు,
మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్, పత్య నాయక్, రాజు నాయక్ ,రమేష్ , రవీందర్ రెడ్డి, సుర మల్లేశం,రాములు,రాంరెడ్డి, ఐలయ్య, బాల్ రెడ్డి, రాజు నాయక్, నాగిరెడ్డి, దేవుల మహారాజ్, అంతీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version