ఇంకా తీరుమారని ప్రైవేట్ పత్తి వ్యాపారుల అక్రమ దందా….
◆:- ప్రభుత్వ నిబంధనలు బేకాతర్
◆:- నియోజకవర్గ ఆయా మండలాల అక్రమ పత్తి వ్యాపారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాల్లో అక్రమ పత్తి వ్యాపారుల ప్రైవేట్ దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. పత్రికల్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ వారు మాకేం కాదంటూ తమ వ్యాపారాన్ని నడిపిస్తూనే ఉన్నారు. కూత వేటు దూరంలో ప్రభుత్వ సిసిఐ కేంద్రం ప్రారంభించినప్పటికీ ప్రైవేటు వ్యాపారుల చీకటి వ్యాపారం కొనసాగుతూనే ఉంది. అమాయక రైతులను మోసం చేస్తూ లక్షల అధికారులు ప్రైవేట్ వ్యాపారాలు ఘటిస్తున్నారు. ప్రైవేటు యాపారం అక్రమంగా జరుగుతుందని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులకు ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లగా అక్రమ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.
అధికారి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ జహీరాబాద్ మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలాల ప్రైవేట్ పత్తి వ్యాపారుల దందా వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి అక్రమ పత్తి వ్యాపారులను నోటీసులు అందించి చేస్తామని సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వాటిని కూడా ప్రైవేట్ వ్యాపారులు పట్టించుకోకుండా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ఆటోల ద్వారా వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులను మోసం చేసి పత్తిని తీసుకొచ్చి తల్లాడలో అమ్మకాలు చేస్తే ఆనాడు తల్లాడ పోలీసులు పలువురు యువకులపై బైండోవర్ కేసులు నమోదు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
మరలా అదే విధంగా ప్రస్తుతం కూడా యువకులు ఆటోలు ద్వారా రైతులను మోసం చేసి పత్తిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు కూడా బైండ్లవర్ కేసు నమోదు చేసి అవి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తల్లాడలో అక్రమ పత్తి వ్యాపారులపై కొరడాలు జూలిపించి రైతులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ సిసిఐ కేంద్రం ద్వారా పత్తిని కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
