ఏపీ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మధుసూదన్ రెడ్డి…

ఏపీ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మధుసూదన్ రెడ్డి

 

మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.ఈ క్రమంలోనే మడ్డిని మాచవరం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ (Drugs)ని అరికట్టడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి డ్రగ్స్ ముఠాని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగానే డ్రగ్స్ ముఠాల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఆయనని మాచవరం పోలీసులు బెంగళూరులో ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. మడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏపీకి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఆయనని ఏపీకి తీసుకువచ్చిన తర్వాత విచారించే అవకాశాలు ఉన్నాయి. మడ్డిని విచారిస్తే పలు కీలక విషయాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అని పోలీసులు తెలిపారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తూ బెంగళూరులో మడ్డిగా చలామణి అవుతున్నారు మధుసూదన్ రెడ్డి. బెంగళూరులో డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మడ్డి. సెప్టెంబరులో బెంగళూరు నుంచి డ్రగ్స్‌తో విశాఖపట్నం వెళ్తూ విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రీవాత్సవ్, హవి పట్టుబడ్డారు . శ్రీవాత్సవ్, హవిల అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లారు మడ్డి. ఆయన కదలికలపై నిఘా ఉంచి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version