పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి…

పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద

*అవగాహన ప్రచార రథాన్ని ప్రారభించిన కలెక్టర్

నర్సంపేట/గీసుగొండ,నేటిధాత్రి:

రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
గీసుకొండ మండలం దసరుతండా గ్రామపంచాయతీ పరిధిలోని దసరుతండా, మంగళతండా గ్రామాలలో ప్రజా పాలన–ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అమృత అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వలన కలిగే నష్టాలు, పాడి పశువుల ప్రాధాన్యత మరియు వాటి ద్వారా మానవాళికి కలిగే లాభాలను వివరించారు.
జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎం. బాలకృష్ణ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి లక్షణాలు మరియు నివారణపై సంక్షిప్తంగా వివరించి, ముందస్తు టీకాలే ఉత్తమ రక్షణ అని రైతులకు సూచించారు.ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించనుంది.ఈ శిబిరంలో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు, లేగదూడలు మరియు పెద్ద పశువులకు పురుగుమందులు అందించారు. అదేవిధంగా రైతులకు 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు.గాలికుంటు వ్యాధి పశువుల పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి, రైతులకు ఆర్థిక నష్టం కలిగించే ముఖ్యమైన వ్యాధి. ఈ వ్యాధి వైరస్ ద్వారా వ్యాపించి, ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుందని. మార్చి, ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలుతుంది.

వ్యాధి నివారణ కోసం పశువులకు ముందుగానే టీకాలు వేయించడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమాన్ని మార్చి 10 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నిర్వహిస్తున్నారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని గాలికుంటు వ్యాధి రహిత ప్రాంతంగా ప్రకటించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ కార్యక్రమంలో మొత్తం 115 పశువులకు టీకాలు అందించామని స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కొమ్మాల పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్, డాక్టర్ రాధిక, సిబ్బంది చిరంజీవి, సుమన్, చందు, జితేందర్, గోపాల మిత్రులు ఇస్మాయిల్, రమేష్, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్ దారితప్పుతోందన్న గీసుకొండ సర్పంచ్ ఆందోళన

గంజాయి, డ్రగ్స్ అలవాటుతో దారితప్పుతున్న యువత

సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి:*

కొందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి స్వార్థం కోసం విస్తరింపజేస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు అలవాట్ల కారణంగా 17 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత వారి భవిష్యత్ దారితప్పి తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చితున్నారని ఈ పరిస్థితిపై గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పౌర హక్కులు–సామాజిక సమానత్వం–యువత భవిష్యత్తే లక్ష్యంగా..గీసుకొండ మండల కేంద్రంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ కాలనీలో గల అంగన్వాడీ సబ్ సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సభ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా
గీసుకొండ డిప్యూటీ తహసిల్దార్ వీందర్ రావు,టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు,
వరంగల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మెంబర్, దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి,గ్రామ ఉపసర్పంచ్ శ్రీ కోట ప్రమోద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ బోధించు,సమీకరించు, పోరాడు అనే మహానినాదంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహానుభావుడు అని కొనియాడారు. గ్రామంలో విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్, గుడుంబా వంటి చెడు ప్రభావం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ సమస్యపై తక్షణమే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను సరైన మార్గంలో నడిపించే ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ఉపసర్పంచ్ కోట ప్రమోద్ మాట్లాడుతూ
ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా సమాన అవకాశాలు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ రుణపడి ఉండాలని తెలిపారు. చదువు ద్వారా ప్రశ్నించే తత్వం పెరుగుతుందని, నేటి సమాజంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు,ఎంపీలు వంటి అనేక మంది ప్రజాప్రతినిధులు రిజర్వేషన్ ద్వారానే ఎదిగారని స్పష్టం చేశారు.

దళిత రత్న నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ,
పౌర హక్కుల దినోత్సవ సభలు కేవలం ఎస్సీ ఎస్టీ వాడల్లోనే కాకుండా నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని దళితులపై జరుగుతున్న దాడుల వల్ల నష్టపోయేది సమాజమేనని పేర్కొన్నారు.కుల భేదాలను మర్చిపోయి మేము–మీరు అనే భావనను విడిచిపెట్టి అందరం ఒక్కటిగా ఆలోచిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు జిల్లా స్థాయి గుర్తింపు, ప్రభుత్వ నిధులు లభించి గీసుకొండ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ పి. రాజేంద్రప్రసాద్, హెచ్డబ్ల్యూఓ హరిత, గ్రామం వార్డు మెంబర్లు పసుల యుగేందర్, దౌడు చిన్న జ్యోతి, దౌడు ఎలీషా, దౌడు సారిక, మాజీ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్, మాజీ వార్డ్ మెంబర్ దౌడు రాజేష్ గ్రామ కరోబార్ అలీ
అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రం సందర్శన.

సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గౌడ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. వారి చదువు, ఆరోగ్యం, పోషణపై వివరాలు తెలుసుకున్నారు.అక్కడి పిల్లల సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో విద్య, ఆరోగ్యం, పిల్లల సంక్షేమానికి తమ పాలనలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా రాజ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

ఘనంగా గీసుకొండ శ్రీమంతుని వజ్రోత్సవ జన్మదిన.!

*ఘనంగా గీసుకొండ శ్రీమంతుని
వజ్రోత్సవ జన్మదిన వేడుకలు*

పలు సంఘాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు..మజ్జిక పంపిణీ.

వరంగల్/నర్సంపేట నేటిధాత్రి:

గీసుకొండ గ్రామ శ్రీమంతుడు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా గీసుకొండ సోషల్ సర్వీస్ టీం,స్థానిక గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనాయమాకుల బస్ స్టాండ్ లో ప్రయాణీకులు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సంపేట బస్ డిపో ఎంఎఫ్ ప్రభాకర్, ఏఈ నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా మండుటెండల్లో విధులు ‌నిర్వహించనున్న బస్ డ్రైవర్లు, కండక్టర్లకు 100 మందికి తెల్ల రుమాళ్లను కూడా లక్ష్మీనారాయణ సౌజన్యంతో పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, మాజీ చైర్మన్ రామా కుమారస్వామి, ఆర్టీసీ ఉద్యోగి వంగల రాంబాబు,గీసుకొండ సోషల్ సర్వీస్ టీం సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, మహ్మద్ సోనీ,యాదగిరి కుమారస్వామి,పసుల సంపత్, వటుకుల రవికుమార్, గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం అధ్యక్ష కోశాధికారులు కర్ణకంటి రజిత, కత్తి హేమలత, గౌరవ సలహాదారులు కక్కెర్ల సుజాత, వీరగొని హేమలత,పసుల సునిత తదితరులు పాల్గొన్నారు.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు 5 అరెస్ట్.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు ఐదుగురు అరెస్ట్

పరకాల నేటిధాత్రి

 

 

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశానూసారం గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ,మనుగొండ,ఎలుకుర్తి ల లో దాడులు నిర్వహించి గీసుకొండ కు చెందిన పోలేపాక సబిత,కోట స్రవంతి,ఎలుకుర్తి కి చెందిన బొడిగే దేవేంద్ర,బొల్లు సాంబ లక్ష్మి,మనుగొండ కు చెందిన ఎంబడి మల్లమ్మ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (25) లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడులలో ఎస్ఐ జ్యోతి,సిబ్బంది లక్ష్మణ చారి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version