ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మం డల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు తదనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మరిం చుకుంటూ మండల అధ్యక్షు డు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవిత సారాన్ని గుర్తు చేశారు.పండి ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ స్థాపకులలో ఒకరు. ఆయన జీవితం ఏకత్వం, మానవతా భావన, అంత్యో దయ సిద్ధాంతాల స్పష్టమైన ప్రతీక. విద్యార్థులు, యువత మరియు ప్రజల జీవితాలను మార్గదర్శకంగా మార్చిన ఆయ న సిద్ధాంతాలు, సూత్రాలు ప్ర స్తుత సమాజానికి స్ఫూర్తి ఇస్తాయని పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ విద్యారంగం లో చేసిన సేవలు, సామాజిక సదుపాయాల పట్ల ఆయన ఇచ్చిన దృష్టి, మానవతా సూత్రాలపట్ల ఆయన ప్రతిబద్ధ తపై ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పారు. పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజంలోని అసమానతల నివారణకు మార్గం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వంటి విలువలను ప్రతిబింబి స్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, యువర్ మోర్చా జిల్లా నాయ కులు కొత్తపల్లి శ్రీకాంత్ మండ ల ఉపాధ్యక్షుడు కోమటి రాజ శేఖర్, భూత్ అధ్యక్షులు బాసా ని నవీన్,గొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.