ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T181749.145.wav?_=1

 

ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకం

నేటిధాత్రి చర్ల

 

గుంటూరుకు చెందిన నల్లూరి ఉదయలక్ష్మి సేవలు స్పూర్తిదాయకమని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు ఉదయలక్ష్మి భర్త నల్లూరి సుబ్బారావు వర్దంతి సందర్భంగా వారి కుమారులు బాబ్జి నాగార్జున లు వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం విద్యార్దులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆశాలత మాట్లాడారు ఉదయలక్ష్మి కుటుంబం మొదటి నుండి సేవాభావం కలిగి ఉండటం హర్షనీయమని పేర్కొన్నారు 1977 లో దివిసీమ ఉప్పెన సందర్భంగా ప్రాణ ఆస్దినష్టం సంభవించి సర్వం కోల్పోయిన బాదిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్ ఎస్ ఎస్ ద్వారా చర్లలో నల్లూరి సుబ్బారావు ఉదయలక్ష్మి దంపతులు నిది సేకరించారని వెల్లడించారు ఆ నిది సేకరణలో వచ్చిన నగదుతో దివిసీమలోని దీనదయాలపురం గ్రామంలో ఒక ఇంటిని నిర్మించారని తెలిపారు ఆ ఇంటిపై చర్ల స్వయం సేవకుల సహకారంతో నిర్మాణం చేపట్టినట్లు పేరు రాసి ఉందని వెల్లడించారు నాటి విదేశాంగ శాఖ మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నిర్మాణం ప్రారంబోత్సం చేసారన్నారు ఉదయలక్ష్మి ఇదే స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అబినందనీయమని అన్నారు ప్రతి ఏటా కొమరం భీం విద్యార్ది నిలయంకు వితరణ అందిస్తూ మానవత్వం చాటుకుంటుంన్నారని అన్నారు ‌నిలయ కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి తమ పిన్ని ఉదయలక్ష్మి ద్వారా వితరణలను అందించడం అబినందనీయని ప్రశంసించారు విద్యార్దులు ఇటువంటి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రతి విద్యార్ది క్రమశిక్షణతో మెలగి తమనుతాము తీర్చిదిద్దుకోవాలని అన్నారు పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడటం ద్వారా తల్లిదండ్రులతో పాటు గురువుల కలలను సాకారం చేయాలని హితవుపలికారు ఈ కార్యక్రమంలో వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ కొమరం భీం నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు మహిళా ప్రముఖ్ బందా స్వరూప రాణి కమిటీ సభ్యురాలు పోలిన రమాదేవి లవన్ కుమార్ రెడ్డి నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు

వందేమాతర గీతం ఒక స్పూర్తి గేయం..

వందేమాతర గీతం ఒక స్పూర్తి గేయం

మరిపెడ నేటిదాత్రి

 

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమైక్యంగా ఆలపించడం ఎంతో గర్వకారణంగా ఉందని రాంపురం ప్రాథమిక పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ అన్నారు, బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తో కలిసి వందేమాతరం గీతాన్ని పాడారు ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్ , శ్రీధర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.

వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సమైక్యంగా ఆలాపించడం ఎంతో గర్వకారణంగా ఉందని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసిల్దార్ కార్యాలయం వద్ద పలువురు గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తినిచ్చిందని అదేవిధంగా భారత ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వందేమాతరం గీతం నిలవడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

వందేమాతర గీతం ఒక స్పూర్తి…

వందేమాతర గీతం ఒక స్పూర్తి

కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .

 

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమైక్యంగా ఆలపించడం ఎంతో గర్వకారణంగా ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బందితో కలిసి వందేమాతరం గీతాన్ని పాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బంది గీతాలాపన చేశారు

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గీతం!

ఉద్యమానికి మనోబలం తెచ్చిన శబ్ద తరంగం!
వందేమాతరానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా, పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కలనల్ సెంతిల్ రామదురై, పరిపాలన అధికారి రవి సోనహరే వారి ఆదేశాల మేరకు జడ్పీహెచ్ఎస్ మొగుల్లపల్లి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్.భాగ్యశ్రీ, ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్సిసి విద్యార్థులచే జాతీయ గీతం అయిన వందేమాతరం పూర్తి గేయాన్ని మూడు నిమిషాల ఆలపించి, మొగుళ్లపల్లి వీధుల గుండా ర్యాలీగా వెళ్లి,చౌరస్తాలో మానవహారం ఏర్పరిచి మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, సమక్షంలో వందేమాతర గీతాన్ని ఆలపించి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎన్సిసి అధికారి మాట్లాడుతూ వందేమాతరం యొక్క పుట్టుక, దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టి. వెంకన్న,
బి. కుమారస్వామి, కె. ప్రవీణ్
ఎం. రాజు, డి. పద్మ, పి. లలిత,
జి. విజయభాస్కర్. ఆర్. చందర్ ఎండి. మజార్, బి. వేణు, ఎన్సిసి విద్యార్థులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

 

కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా…

కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా
వనపర్తి నేటిదాత్రి .

 

డాక్టర్ కంటే నిరంజనయ్య స్వీయ రచన కాలగమనం పుస్తకాలను కంచిరావుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రంధాలయానికి కాలగమనం పుస్తకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా కంటే నిరంజనయ్యా విద్యార్థుల తో మాట్లాడుతూ కాలగమనం పుస్తకంలో 55 కవిత అంశాలు ఉన్నాయని వాటిని చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి మాట్లాడుతూ నిరంజనయ్యా రచించిన పుస్తకంములో సామాజికాంశాలు ఉన్నాయని వీటితోపాటు తల్లి తండ్రి గురువు దైవం విద్యార్థి సమాజం రాజ్యాంగము మహాత్మా పూలే అంబేద్కర్ అంశాలు ఉన్నాయని పుస్తకం చదవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సరస్వతి ఉపాధ్యాయులు కవి రచయిత కంటే నిరంజనయ్యను అభినందించారు

నేత్రదానం తో ఆదర్శంగా నిలిచిన ఎల్ఐసి ఏజెంట్ రౌతు రాజన్న…

నేత్రదానం తో ఆదర్శంగా నిలిచిన ఎల్ఐసి ఏజెంట్ రౌతు రాజన్న

జైపూర్,నేటి ధాత్రి:

 

నేత్రదానం తో ఆదర్శంగా నిలిచిన ఎల్ఐసి ఏజెంట్ రౌతు రాజన్న జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రౌతు రాజన్న ఎల్ఐసి ఏజెంట్ గా వృత్తిలో భాగంగా మంచిర్యాల నుండి ఎన్టిపిసి వెళుతున్న క్రమంలో గోదావరిఖని జిఎం ఆఫీస్ హైవే రోడ్డుపై సోమవారం గుర్తుతెలియని వాహనం వెనుక నుండి ఢీకొట్టడం వలన తలకు పెద్ద గాయం అయినట్లు స్థానికులు తెలిపారు.అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేపించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.రాజన్న పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు.కానీ తలకు పెద్ద గాయం అవ్వడం వల్ల మూడు రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుని కుటుంబ సభ్యులు మనోధర్యంతో మరొక్కరి జీవితంలో వెలుగులు నింపాలని రాజన్న కళ్ళను దానం చేసి ఆదర్శంగా నిలిచారు.

అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న కొమురయ్య…

అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న కొమురయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సిటీ కల్చర్ ఆడిటోరియం ముషీరా బాద్లో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో వ్యవస్థాపకులు చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డులు ప్రధాన చేయడం జరిగింది . అందులో భాగంగా అంబేద్కర్ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మారపల్లి కొమురయ్య సేవలను గుర్తించి అంబేద్కర్ నేషనల్ సేవా అవార్డు ముఖ్య అతిథులు డాక్టర్ గూడూరు చెన్నారెడ్డి డాక్టర్ టీవీ రామకృష్ణ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రొడ్యూసర్ మల్ల రమేష్ శంషాబాద్ ఎంఈఓ డాక్టర్ ఇస్లావత్ కాసన నాయక్ చేతుల మీద స్ఫూర్తి సేవ సమితి ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తించి అవార్డు అందించిన స్ఫూర్తి సేవా సమితి వారికి పేరుపేరునా కృతజ్ఞతలు

అంగ వైకల్యం శరీరానికే, మనోధైర్యానికి కాదు: నర్సింలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-01T125113.392.wav?_=2

 

అంగ వైకల్యం శరీరానికే, మనోధైర్యానికి కాదు: నర్సింలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని కె పెతినిక్ హోటల్ లో కొనిటీ నర్సింలు ఎం.ఏ (తెలుగు), ఎల్.ఎల్.బి పూర్తి చేసిన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ జేఏసీ జహీరాబాద్ చెర్మెన్ డా.పెద్ద గొల్ల నారాయణ, నర్సింలును సన్మానించి, “అంగ వైకల్యం శరీరానికే గానీ, మనోధైర్యానికి కాదు” అని అన్నారు. చిన్నప్పటి నుంచీ అంగ వైకల్యంతో బాధపడుతున్నా, విద్యాప్రేమ, పట్టుదలతో నర్సింలు రెగ్యులర్ డిగ్రీ, ఎం.ఏ తెలుగు, ఎల్.ఎల్.బి. విద్యను విజయవంతంగా పూర్తి చేశారని, ఆయన యువతకు ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు బీసీ జేఏసీ, జాగో తెలంగాణ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

సామాన్య కుటుంబ నుండి క్రేన్ యజమాని గా మారిన మొయిజ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-01T115938.911.wav?_=3

 

సామాన్య కుటుంబ నుండి క్రేన్ యజమాని గా మారిన మొయిజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

క్రేన్ డ్రైవర్‌గా పనిచేసి యజమానిగా ఎదిగిన ఒక రైతు బిడ్డ గురించి ప్రత్యేకంగా ఒక వార్త అందుబాటులో లేదు, అయితే డ్రైవర్‌గా పనిచేసిన ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ మొయిజ్ యజమానిగా ఎదిగిన వ్యక్తు ఉన్నాయి. ఉదాహరణకు, కుప్పా నగర్కు చెందిన మొహమ్మద్ మొయిజ్ అనే యువకుడు, మొదట్లో క్రేన్ డ్రైవర్ గా తొక్కేవాడు, కానీ తరువాత లక్షల రూపాయల విలువైన రెండు క్రేన్ యజమానిగా ఎదిగాడు. అతను పదవ తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ, తన కుటుంబ పోషకానికి ఆలోచనతో రెండు క్రేన్లు తెచ్చి యజమాని అయ్యాడు ఎవరికైనా రెంటు కావలసినవారు ఈ సెల్ నెంబరుకు 9550653577 సంప్రదించగలరని కోరారు,

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు…

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ నాట్య మయూరి..కూచిపూడి నర్తకి అకిరా జాను….

తెలంగాణ నాట్య మయూరి..కూచిపూడి నర్తకి అకిరా జాను

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ మంచిర్యాల జిల్లా కు చెందిన అకీరా జాను చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా ప్రముఖమైన
కూచిపూడి నర్తకి గా గుర్తింపు పొందింది.అకీరా తన నాట్య ప్రయాణాన్ని చిన్నతనంలోనే ఏడవ సంవత్సరంలో ప్రారంభించి,ఇప్పటివరకు సుమారు 100 కీ పైగా నృత్య ప్రదర్శన కార్యక్రమాలలో పాల్గొంది.కళా సంస్కృతి, సాంప్రదాయాల విలువల అభివృద్ధికి కృషిచేస్తూ,వివిధ సంస్కృతిక కార్యక్రమాలలో తన ప్రతిభను ప్రదర్శిస్తుంది.ప్రఖ్యాత గురువుల నుంచి శిక్షణ పొంది,శాస్త్రీయ నాట్యంలో విశిష్టమైన తనదైన శైలితో కళకు జీవం పోస్తుంది.బాల్యంలో నుండే అకీరా పలు ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల పురస్కారాలు,ప్రశంస పత్రాలు అందుకుంది.తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఉత్తమ కూచిపూడి నృత్య ప్రదర్శన కళాకారిణిగా గుర్తింపు పొందింది.రాష్ట్రీయ బాల పురస్కార్ కోసం ఆమెను నామినేట్ చేయడం ఈ ప్రాంత యువతకు స్ఫూర్తిదాయకం.అనేక పత్రికలు అకిరా నృత్య ప్రదర్శన పై ప్రత్యేక కథనాలు,శీర్షికలు ప్రచురించాయి.ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్‌లో మరిన్ని దేశ,విదేశీ వేదికలపై కూచిపూడి కళను ప్రదర్శించి భారతీయ కళా సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింప చేయాలని,ఈ సంప్రదాయ నృత్యాన్ని మరింతగా గ్రామ స్థాయి యువతలోకి తీసుకెళ్లాలని అకీరా ఆకాంక్షిస్తుంది.

మహనీయుల జీవిత చరిత్రలతో లక్ష్యాలు సునాయాసం

మహనీయుల జీవిత చరిత్రలతో లక్ష్యాలు సునాయాసం

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా వారి మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు అనడానికి వాల్మీకి మహర్షి జీవితం నిదర్శనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.కలెక్టరేట్ లో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు.వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం

శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే, ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

Vaibhavalaxmi Shopping Mall

ఈరోజు సిరిసిల్ల కేంద్రంలోని ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని,
మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ — ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, బోయవాణిగా జీవితం గడిపి, సప్తర్షుల బోధనలతో మహర్షిగా మారి ఆదికావ్యం రామాయణం అనే అమరగ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి గారు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.

“కృషి, నిబద్ధత ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు — దీనికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం” అని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు రవి, నాగేశ్వరరావు, ఆర్.ఐ రమేష్, ఏ. ఓ పద్మ,జిల్లా పోలీసు అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపివో ఉద్యోగం సాధించిన ఆమనిని సన్మానించిన మాజీ ఎంపీపీ

ఎంపివో ఉద్యోగం సాధించిన ఆమనిని సన్మానించిన మాజీ ఎంపీపీ

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన బంధారపు తిరుపతి భాగ్యల కూతురు బంధారపు ఆమని గ్రూప్2 పరీక్ష ఫలితాలలో 765 ర్యాంకుతో ఎంపీఓ ఉద్యోగం సాధించిన సందర్భంగా రామడుగు మండల మాజీ ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన అనంతరం వారు మాట్లాడుతూ ఇంతటితో ఆగకుండా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరియు ఆమని తల్లిదండ్రులను సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మేకల విజయేందర్, దాసరి రత్నమాల, అనిల్, హరీష్, పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ సీటు సాధించిన ఫిర్దోస్‌కు హరీష్ రావు సన్మానం…

ఎంబీబీఎస్‌‌ సీటు సాధించిన TMRIES (బుచినెల్లి) విద్యార్థిని సన్మానించిన మాజి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో(బుచినెల్లి) చదివిన విద్యార్థి ఝరసంఘం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గారి కుమార్తె ఫిర్దోస్ నీట్‌లో క్వాలిఫై అయ్యి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్‌లో ఉచిత సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ,స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్‌రావు విద్యార్థిని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగన్న తదితరులు..ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2021లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా..
“ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని చెప్పింది విద్యార్థిని ఫిర్దోస్.చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది.ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గం లోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు.
కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయి గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.
ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైంది తెలంగాణ రాకముందు మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది .
మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచింది.
గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.దీన్ని మార్చడానికి కేసీఆర్ గారు అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారు.
ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ గారు 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ గారు నమ్మారు.రేపటి తరంపై పెట్టే పెట్టుబడిని అద్భుత సంపదగా భావించారు.విద్యార్థుల కోసం చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (Capital Expenditure) గా నిర్వచించారు.ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయం.వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మొత్తంలో మార్పు వస్తుంది.
కేసీఆర్ గారు దీన్ని నమ్మారు కాబట్టి, విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారు.
మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి.మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నా.
ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు .
కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి అని అన్నారు

ఒడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి…

ఒడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి

పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురంలో ఘనంగా ఓబన్న విగ్రహం ఆవిష్కరణ

పఠాన్ చేరు, నేటి ధాత్రి :

భావి తరాలకు ఒడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమని పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడురామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలో వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిపాయిల తిరుగుబాటుకు ముందు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తో కలిసి బ్రిటీష్ సేనలపైన విరోచిత పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ఓబన్న అని కొనియాడారు. అతని త్యాగాలను భావితరాలకు అందించే లక్ష్యంతో విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు
ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ జైపాల్, వడ్ర సంఘం అధ్యక్షులు లింగయ్య, రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, పెద్ద రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ

నేటిధాత్రి, వరంగల్

హన్మకొండ హంటర్ రోడ్డులోని గౌడ హాస్టల్ ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ భరత మాత ముద్దుబిడ్డ తొలి తెలుగు చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ప్రపంచ ప్రసిద్ధిగాంచిందన్నారు. తెలాంగాణకె తిరుగుబాటు నేర్పిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. గౌడ జాతి గర్వకారకుడైన తెలంగాణా బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ కులస్తులందరు రాజకీయలకు అతీతంగా ఐక్యంగా ఉండి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపా పౌండర్ అధ్యక్షులు పెరుమాండ్ల మధుసూదన్ గౌడ్, డా. బైరి లక్ష్మి నారాయణ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, చిర్ర రాజు గౌడ్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు జనగాం శ్రీనివాస్ గౌడ్, జూలూరి రంజిత్ గౌడ్, బండారి జనార్ధన్ గౌడ్, అనంతుల రమేష్ గౌడ్, మార్క రవి గౌడ్, మాచర్ల శరత్ గౌడ్, కునురీ రంజిత్ గౌడ్,గట్టు నరేష్ గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి గౌడ్, ఏసీపి. కె. నాగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కళ్లకు గంతలు కట్టి అమ్మవారి ప్రతిరూపం…

కళ్లకు గంతలు కట్టి అమ్మవారి ప్రతిరూపం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : మన దేశంలో దసరా పండుగను ధనిక-బీద తేడా లేకుండా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల కేంద్రానికి చెందిన ప్రఖ్యాత శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అమ్మవారి పై ఉన్న భక్తితో కళ్లకు గంతలు కట్టి, కేవలం ఒక గంట పది నిమిషాల వ్యవధిలో మట్టితో మూడు అడుగుల ఎత్తు ఉన్న అమ్మవారి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. తన మదిలో తలచుకున్న అమ్మవారి రూపాన్ని ప్రతిష్టాత్మకంగా మలిచినట్లు తెలిపారు. “ప్రతి కళాకారుడి మదిలో రకరకాల కళారూపాలు దాగి ఉంటాయి. మనిషి ఏ విషయం పై ఎక్కువగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయన్నారు. విశ్వాసం, నమ్మకం ఉంటే ఏ పని సాధ్యమే. భగవంతుని కరుణ ఉంటే విజయవంతం అవుతాం” అని శిల్పి డాక్టర్ హోతి బస్వరాజ్ అన్నారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ…

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితాంతం కృషి చేశారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని పాత కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తొలితరం ఉద్యమనాయకుడిగా, నిబద్దత కలిగిన గొప్ప రాజకీయవేత్తగా ఎంతో పేరు తెచ్చుకున్న బాపూజీ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. బహుజన నేతగా పద్మశాలీలను సంఘటితం చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం నాడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారని పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ తో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇందిర పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి అప్పం కిషన్ అంబాల శీను ముంజల రవీందర్ పద్మశాలి కుల సంఘ నాయకులు ప్రసాద్ శ్రీధర్ శ్రీనివాస్ సతీష్ భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version