చందుర్తిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం…

పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం:జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు,వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ పరామర్శ.

చందుర్తి, నేటిధాత్రి:

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం లింగంపెట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించి,అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులతో కలసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించిన ఎస్పీ.

అనంతరం సాయుధ పోలీసులు”శోక్ శ్రస్త్” చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు,సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన192 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఎస్పీ తెలిపారు.
జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 8 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని,వారి త్యాగఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని,పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత,రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని,దేశ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో పహార కాస్తున్న 10 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటినుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు.విధి నిర్వహణ సందర్భంగా ఎన్నో జటిలమైన సవాళ్లు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఇట్టి కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించడం జరిగింది.

పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నుండి 31 తేదీ వరకు రక్తదాన శిబిరాలు,సైకిల్ ర్యాలీ,క్యాండిల్ ర్యాలీ,2k రన్,ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు,ఫోటో,వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈకార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు వెంకటేశ్వర్లు, వీరప్రసాద్, శ్రీనివాస్,మొగిలి, శ్రీనివాస్,నటేష్,ఆర్.ఐ రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు…

సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు

దశదినకర్మ సందర్భంగా రక్తదాన శిబిరం

మాజీ ఎంపీటీసీ సాయికుమార్ యాదిసభలో పలువురు నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపిటిసి, జిల్లెల్ల సాయికుమార్ మరణం దుగ్గొండి మండల యువతకు స్థానిక ప్రజలకు తీరనిలోటని నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్,పలువురు నేతలు అన్నారు.దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె గ్రామానికి చెందిన దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయికుమార్ ఈ నెల 4 గుండెపోటుతో మరణించారు.కాగా సోమవారం దశదిన కర్మ కాక్యక్రమం సందర్బంగా
కుమారుడు జిల్లెల ఉమేష్ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ నేపథ్యంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేశారు.అలాగే సాయికుమార్ సంస్మరణ యాదిసభ ఏర్పాటు చేశారు.మాజీ మావోయిస్టు నేతలు భారతక్క,సిద్ది రాజు,మురళీ తో ప్రజాసంఘాలు,కుల సంఘాలతో పాటు వివిధ పార్టీల నేతలు నాయకులు పాల్గొన్నారు.సాయి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బార్య రమ, కుమారుడు ఉమేష్, కుతురు లక్ష్మిప్రసన్నలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన చేసిన సేవలు జ్ఞాపకాలు గుర్తుకు చేశారు.ఈ కార్యక్రమాలలో జిల్లెల్ల శ్రీనివాస్,కందికొండ నవిన్, కందికొండ రాజు,మద్దూరి ప్రశాంత్, బూస రమేష్,
బూస శోభన్, గాండ్ల సందిప్, వల్లె విజెందర్, బూస ప్రశాంత్, తుత్తూరు లవకుమార్,నల్లబెల్లి చిరంజివి, పెళ్లి రాజశేకర్, జిల్లెల్ల మోహన్,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

తహెరా బేగం కు తన్వీర్ నివాళి…

మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోవడం బాధాకరం టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తహరాబేగం మృతి చెందగా విషయం తెలుసుకున్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితో పాటు పలువురు నాయకులు స్థానికంగా ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన అంతక్రియలో పాల్గొని పార్థివధ్యాన్ని నివాళులు అర్పించారు తన్వీర్ మాట్లాడుతూ తాహెరా బేగం చేసిన సేవలు మరువ లేనివి వారి మరణం బాధాకరం.

కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలలో కాంగ్రెస్ నేతలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T141242.614-1.wav?_=1

 

 

కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలలో కాంగ్రెస్ నేతలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

 

ప్రజాకవి కాళోజి నారాయణ రావు గారి జయంతి వేడుకలు ఎమ్మెల్యే మెగారెడ్డి ఆదేశాల మేరకు ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనo గా జరుపుకున్నారు కాళోజీ నారాయణ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు_
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పి ఏ శ్రీనివాస్ గౌడ్ రేవల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి వనపర్తి మున్సిపల్,మాజీ కౌన్సిలర్లు చుక్కరాజు నక్క రాములు, టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, చుక్క రాజు,శ్రీనివాస చారి,మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అయుబ్ ఖాన్,యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ అంబటి రమేష్ ప్రసాద్ శివ యాదవ్ నాని నరేష్ గొర్ల అనిల్,గంధం మహేష్ మురళి,సురేందర్ గౌడ్, ఎండి ఆరిఫ్,ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు

బెల్లంపల్లిలో 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T151830.696-1.wav?_=2

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజున 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి.

జాతీయ గీతలాపన అనంతరం స్వీట్లు పంచి వేడుకలను ఘనంగా జరిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలో భవిత డిగ్రీ కాలేజ్ ఆవరణలో, కాలటెక్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.ఏఎంసి చౌరస్తా వద్ద స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రివర్యులు కాక గడ్డం వెంకటస్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ
అందరూ మహనీయులు త్యాగాలు ఫలితమే భారత దేశ స్వతంత్రం అని అన్నారు వారి సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు
ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం
పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలనాయకురాలు,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

కేటీపీపీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-52.wav?_=3

కేటీపీపి లో జాతీయ జెండాను ఎగరవేసిన చీఫ్ ఇంజనీర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ. వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ విద్యుత్ ఉద్యోగులు అందరికీ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సుపరింటెండింగ్ ఇంజనీర్లు, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు వివిధ ట్రేడ్ యూనియన్స్, అసోసియేషన్స్ నాయకులు విద్యుత్ ఉద్యోగులు అర్టీజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కెటిపిపి ముఖద్వారం అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ఎస్సీ & ఎస్టీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కూడా చీఫ్ ఇంజనీర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు విధులు నిర్వహిస్తున్న 20 మంది సెక్యూరిటీ సిబ్బందికి కెటిపిపి ఉత్తమ ఉద్యోగి అవార్డు సర్టిఫికెట్ ను అందించారు

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51.wav?_=4

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో….

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో….

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CI Krantikumar

ఎమ్మార్వో కార్యాలయంలో…..

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయం లో…….

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లో……

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.

కార్గిల్ విజయ దివస్ అమరవీరుల స్థూపానికి నివాళులు

కార్గిల్ విజయ దివస్ అమరవీరుల స్థూపానికి నివాళులు

బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్

భూపాలపల్లి నేటిధాత్రి

కార్గిల్ విజయ దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు
సయ్యద్ గాలిఫ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పిచి అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో మాజీ సైనికులకు ఆపరేషన్ సింధూర్ లో పాలుగోన్నా సైనికులకు మరియు సైనిక విధులలో ఉన్న వారి కుటుంబ సభ్యులు సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ రవి కిరణ్ హాజరై సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం రవి కిరణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం లో సైనికులను వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం.ఇది భారతదేశం భారత సైన్యం విజయాన్ని గుర్తు చేసుకునే రోజు,1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత సైన్యం విజయం సాధించినా దానికి గుర్తుగా ఈకార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో ఈ యుద్ధాన్ని నిర్వహించి శత్రువులను తరిమకొట్టింది. అనంతరం పాకిస్తాన్ సైన్యం లొంగిపోగా భరత్ విజయాన్ని సాధించింది. ఈ యుద్ధం లో 527 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు దేశం ఈరోజు వీర సైనికులను గౌరవిస్తూ,దేశభక్తిని గుర్తు చేస్తూ జరుపుకుంటున్నాం అని అన్నారు.అనంతరం సయ్యద్ గాలిఫ్ మాట్లాడుతు భూపాలపల్లి జిల్లా లోని మాజీ సైనికులు సైనికుల కుటుంబలాకు ఎటువంటి కష్టం వచ్చిన భారతీయ జనతా యూవమోర్చ ముందు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం నాయకులు వంశీ, కిరణ్,బీజేపీ నాయకులు ఊరటి మునెందర్, కోరే సుధాకర్, కోమటి రాజశేఖర్, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి

 

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణ అమరుడు, సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ ప్రజల పోరాడయోధుడని, పేద తరగతిలో పుట్టి తెలంగాణ పోరాటానికి తెలంగాణ ప్రజల గుండె చప్పుడుల అన్ని వైపులా చాటి అమరుడైన దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు
గూడూరు ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, కల్లూరి రాజు, గుండ్లపల్లి పూర్ణ చందర్, కుంభాల మల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన..

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి మార్కింగ్ వాకింగ్ లో నష్టపోయే బాధితులు కలిసి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అధికారులతో కలిసివివేకానంద చౌరస్తా నుండి రామాలయం వరకు రోడ్ల విస్తరణలో నష్టపోయే బాధితుల అభిప్రాయాలను సేకరించారు ఎంతో కాలంగా కర్నూల్ రోడ్ లో రోడ్ల విస్తరణ పెండింగ్ ఉండడంతో కొత్త బస్టాండ్ దగ్గర రాజావారి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర రోడ్డు చిన్నగా ఉండడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వనపర్తి పట్టణ ప్రజల భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మెగా రెడ్డి నష్టపోయే బాధితులను ఒప్పించి రోడ్ల విస్తరణ చేపట్టడంపై ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు .ఈసందర్భంగా రోడ్ల విస్తరణ కు ముందుకు వచ్చిన ఎస్ ఎల్ ఎన్ రమేష్ రాజు షబ్బీర్ వినోద్ లకు ఎమ్మెల్యే మెగారెడ్డి శాలువతో సన్మానము చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ ఆ ర్ డి ఓ రెవెన్యూ జిల్లా అధికారులు టౌన్ ఎస్సై హరిప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం సుబ్బరాజు చుక్క రాజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు దక్కాకుల సతీష్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ డి వెంకటేష్ వ్యాపారస్తులు కూన వెంకటేశ్వర్లు బట్టల షాప్ ల యజమానులు తదితరులు ఉన్నారు

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన.

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ఉదయ్ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందాడు విషయం తెలుసుకున్న కామ్రేడ్ చంద్రగిరి శంకర్ గాజర్ల అశోక్ తో కలిసి గాజర్ల రవి గణేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన ప్రజల కోసం తన జీవితం అంకితం చేసిన విప్లవ యోధుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ప్రత్యేక జోన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ మారేడుమిల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి మృతి చెందడం జరిగింది 40 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో పనిచేసే వీర మరణం పొందాడు అని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు

కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు.

కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి గొప్ప సంఘ సేవకులు , విద్యాదాత, మతసామరస్యం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని ప్రతి మనిషికి చదువు తప్పక అవసరమని పేద విద్యార్థుల కోసం ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతిగృహాలకు, డబ్బులు దానం చేసిన గొప్పదాత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో రెడ్డి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా రెడ్డి హాస్టల్ ని నెలకొల్పిన వ్యక్తి బహదూర్ వెంకట రామిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగు మామిడి కృష్ణారెడ్డి ఎడుమల,హనుమంత రెడ్డి,వేసి రెడ్డి రామిరెడ్డి, కుంబాల మల్లారెడ్డి,కంది భాస్కర్ రెడ్డి, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

కామ్రేడ్ లక్ష్మయ్య కు ఘన నివాళి.

కామ్రేడ్ లక్ష్మయ్య కు ఘన నివాళి

కమ్యూనిస్టు కుటుంబాలకు అరుదైన గౌరవం
లక్ష్మయ్య స్మారక స్తూపం ఎదుట అరుణ పతాకావిష్కరణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

పీడిత తాడిత శ్రామిక వర్గాల కోసం కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మరవలేనివని, ఎందరో నాయకులు భౌతికంగా దూరమైన వారిని స్మరిస్తూ వారి కుటుంబాలకు ఇప్పటికీ సమాజంలో అరుదైన గౌరవం లభిస్తున్నదని సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ఏఐటిఈసి జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు, ఎంసీపీఐ మండల కార్యదర్శి గాజుల వెంకటయ్య, బీఆర్ఎస్ మండల నాయకులు మారం రాము, ఈదునూరి వెంకన్న, తెలంగాణ గిరిజన రత్న వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ అన్నారు.నెక్కొండ మండల కేంద్రంలో స్థానిక జిపిఎస్ పాఠశాల ఎదురుగా కమ్యూనిస్టు దివంగత నేత కామ్రేడ్ బూరుగుపల్లి లక్ష్మయ్య స్మారకస్తూపం ఎదుట అరుణ పతాకాన్ని ఎగురవేసి దివంగత కమ్యూనిస్టు నేత లక్ష్మయ్యకు ఘన నివాళులు అర్పించారు. నెక్కొండ మండలంలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు, అనుబంధ ట్రేడ్ యూనియన్ల నాయకులు లక్ష్మయ్య సేవలను స్మరించి ఎందుకు ఒకే వేదికను పంచుకోవడం అద్భుతమైన ఘట్టమన్నారు. విభిన్న సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పీడిత వర్గాల పక్షాన తుది శ్వాస విడిచే వరకు పోరాడిన లక్ష్మయ్య సేవలను స్మరించేందుకు ఒక వేదిక పైకి రావడం తమకు ఆనందంగా ఉందన్నారు. మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ శ్రామిక వర్గాల గుండెల్లో బూరుగుపల్లి లక్ష్మయ్య చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చాగంటి వెంకటయ్య, సిఐటియు మండల అధ్యక్షులు భూక్య నరేశ్ ఉపాధ్యక్షులు ఈదునూరి సాయిలు, నాయకులు మదార్ కృష్ణ ,భస్క శ్రీను, మోహన్ బిర్రు రమేష్, దేవేందర్, హైమ, సూరమ్మ, ఉపేంద్ర, సబిత, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, సిపిఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు, గుమస్తా సంఘం నాయకులు, భావన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మార్త మధుసూదన్,సురేష్,కందిక వెంకన్న, లక్ష్మణ్ ,రాజు, సొసైటీ మాజీ చైర్మన్ , బిఆర్ఎస్ నాయకులు మారం రాము, ఈదునూరి వెంకన్న, ఎంసీపీఐ మండల నాయకులు జల్లి బుచ్చయ్య, గాజుల వెంకటయ్య ,సొల్లేటి రామబ్రహ్మం, ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్ నాయక్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

పార్థివ దేహాన్ని సందర్శిం చి నివాళులు.!

పార్థివ దేహాన్ని సందర్శిం చి నివాళులు అర్పించిన మాజీ ఎంపీపీ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలo భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం మండల కేంద్రంలోని కీ||శే|| మారపేల్లి నాగరాజు గోడకూలి మరణిం చగా విషయం తెలుసుకున్న మండల మాజీ ఎంపీపీ మెతు కు తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి నాగరాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించా రు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబ సభ్యులను పరామ ర్శించి తమ ప్రగాఢ సాను భూతిని తెలియ జేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ ఉపసర్పంచ్ దైనంపేల్లి సుమన్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, గ్రామశాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మండల యూత్ అధ్యక్షులు మారపేల్లి మోహన్, సీనియర్, నాయ కులు కరుణ్ బాబు, దైనంపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

రఘురామారావు కి నివాళులు అర్పించిన

రఘురామారావు కి నివాళులు అర్పించిన

బీ ఆర్ ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీదర్

వనపర్తి నేటిదాత్రి

 

రెవెల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ సింగి ల్ విండో అధ్యక్షులు రఘురామారావు కు వారిస్వగృహంలో బారస జిల్లా అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వారి చిత్రపటానికి పూలమాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.నివాళులర్పిం చిన వారి లో హై కోర్ట్ న్యాయవాది వెంకటేశ్వరావు మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ లక్ష్మణ్ యాదవ్ శ్రీహరి శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ గోపాల్రావు నారాయణ్ రావు భాస్కర్ రావు ప్రవీణ్ రావు
నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ 135 వ జయంతికి పురస్కరించుకొని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి,అంగన్వాడి టీచర్ జహీరబేగం,మాజీ ఉప సర్పంచ్ బరిగెల భక్కయ్య,గ్రామస్తులు ఎల్లారెడ్డి, ఉప్పుల ఐలయ్య,రాజు,తదితరులు పాల్గొన్నారు. 

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

#డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో యువత ముందుకు సాగాలి.

#మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి .
బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, పార్టీలతోపాటు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను పురస్కరించుకుని దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో మండల తాసిల్దార్ ముప్పు కృష్ణ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి, ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, చార్ల శివారెడ్డి, మాలోతు రమేష్, వైనాల అశోక్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్, పెరుమాండ్ల కోటి, బచ్చు వెంకన్న, బోట్ల ప్రతాప్,సిపిఎం నాయకులు కడియాల వీరాచారి,, మనోహర్, బొడిగ సమ్మయ్య, దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్, పవన్, పరికి కోర్నెల్, రత్నం, జన్ను జయరాజ్, గౌడ సంఘ నాయకులు సట్ల శ్రీనివాస్ గౌడ్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, ముత్యాల కుమార్ గౌడ్, గాధ గాని రమేష్ గౌడ్, తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి ఘన నివాళులర్పించారు.

బి ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళులు.

బి ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు కేసముద్రం మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు

అనంతరం కేసముద్రం మండలలో అంబేద్కర్ సంఘం భవనం నిర్మాణం కోసం కోటి 50 లక్షలు రూపాయలు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి, ఎమ్మెల్యే మురళి నాయక్ కు ఎంపీ బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం , ఎస్సై మురళీధర్ రాజ్, పిసిసి సభ్యులు దశ్రు నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,వేముల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలపాక నాగరాజు,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ సిహెచ్ వసంతరావు, ఎండి అయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, దామరకొండ ప్రవీణ్, యాకూబ్, కనుకుల రాంబాబు, మహేందర్, సమ్మయ్య గౌడ్, సామల నరసయ్య, సారయ్య,చేడుపేల్లి ఎలేందర్,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వల్లందాస్ రవి, నిల్పుగొండ ఏలియా, మందుల కృష్ణమూర్తి, సోమారపు మదర్, జల్లంపల్లి శ్రీను, జల్లే యాకాబ్రాం,దండు శ్రీను,జలంధర్,ఆనందం, నేరెళ్ల శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి ఘన నివాళి.

పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి ఘన నివాళి

మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
హనుమంతరావు

మల్కాజిగిరి నేటి ధాత్రి మార్చి 27:

 

సికింద్రాబాద్ సెంచనరీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏపీ గవర్నమెంట్ తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని తెలపడం జరిగింది.
కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, వెంకటేష్ యాదవ్ స్వీటీ, సంజీవరావు బాబు సత్యనారాయణ గుండా నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టు నేత సుధాకర్‌ కు ఘన నివాళులు.

మావోయిస్టు నేత సుధాకర్‌ కు ఘన నివాళులు
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర జేబీజేబీజేఎస్‌ కో ఆర్డినేటర్‌ మాజీ పీసీసీ జనరల్‌ సెక్రటరీ నమిండ్ల శ్రీనివాస్‌

కాజిపేట(వరంగల్‌ జిల్లా),నేటిధాత్రి:

కాజిపేట్‌ మండల్‌ లోని తరాల లపెల్లి గ్రామం చెందిన అంకేశ్వరపు సారయ్య అలియాస్‌ సుదీర్‌ అసువులు బాసారు. గురువారం ఉదయం తరాలపల్లి లోని సారన్నా స్వగ్రమం తరాల పల్లి కీ అయన భాతిక కాయం చేరుకున్నది.

Secretary N Srinivas

తరాలపల్లి చేరుకొని సారన్నా భాతిక కాయం కు పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన నమిండ్ల శ్రీనివాస్‌ , మాజీ కార్పొరేటర్‌ తోట్ల రాజు యాదవ్‌. మాజీ సర్పంచ్‌ పుల్యాల యాదవ్‌ రెడ్డి . గ్రామ పార్టీ అధ్యక్షులు బషీర్‌ . వేల్పుగొండ చంద్రుడు ఎర్ర గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడు దుబ్బాక మోహన్‌ గౌడ్‌ డేవిడ్‌ జవాజి రమేష్‌ మనుపటి రాజు. ఇల్లందుల సంతోష్‌. రిపీక వినయ్‌.పోలేపక వినయ్‌.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version