టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులుగా తోట శ్రీనివాస్…

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులుగా తోట శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యులుగా తోట శ్రీనివాస్ ఎంపికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి బి.దయాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను జిల్లా కమిటీ సభ్యులు గా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు,జాతీయ కౌన్సిల్ సభ్యులు కొలుగూరి సంజీవరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతల కుమార్ యాదవ్, గాదె రమేష్, రోంటా ల శంకర్,జిల్లా ఉపాధ్యక్షులు ములకల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా గుండు సాయిలు గౌడ్…

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా గుండు సాయిలు గౌడ్
#యాదగిరిగుట్ట ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు గుండు సాయిలు గౌడ్ నీ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీగా నియామకం.

నేటిదాత్రి యాదగిరిగుట్ట:

ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఆటో యూనియన్ రాంపల్లి రజనీకాంత్ గర్లా ఆధ్వర్యంలో మా మిత్రుడు గుండు నరసింహ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా మా ఆటో యూనియన్ నుండి పై స్థాయికి వెళ్లడానికి కృషిచేసిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నం మా ఆటో కార్మికులపై మీరు చూపిస్తున్న ప్రేమని మేము ఎన్నడు మరువలేమన్న మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్న అని బిర్లా ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు గుండు సాయిల్ గౌడ్, రాంపల్లి రజనీకాంత్ గౌడ్, మోహన్ నాయక్, కంసాని శ్రీహరి, జమాల్, ఎల్లా గౌడ్, రజినీకాంత్, చాంద్ పాషా, సత్యం గౌడ్, మంగు నాయక్, జహంగీర్, గుండు మధు, సాయి, కందుకూరు మధు, వాటర్ మధు, నగేష్ తదితర ఆటో డ్రైవర్స్ పాల్గొనడం జరిగింది.

ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రేవెల్లి ఓదెలు…

ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రేవెల్లి ఓదెలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఎరుకల జాతి చైతన్యం కోసం, ఎరుకల ప్రజా సమితి ,ఎరుకల మహిళా సమితి బలోపేతం కోసం,జాతి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా రేవెల్లి ఓదెలు అన్నారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రేవెల్లి ఓదెలు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేంసారం తిరుపతి నియామక పత్రాన్ని ఓదెలు కు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్ప, సహాయ కార్యదర్శి కుమారస్వామి, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సాయిలు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నగేష్ , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పోశయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జయతి రాములు జహీరాబాద్ మునిసిపల్ కమిషనర్‌గా నియామకం

మునిసిపల్ కమిషనర్ గా జైత్ రామ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా జయతి రాములును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న సత్యప్రనవ్ శిక్షణకు వెళ్లడంతో, రంగారెడ్డి జిల్లా మెప్మాలో పనిచేస్తున్న జయతి రాములుకు పదోన్నతి కల్పించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం ద్వారా జహీరాబాద్ పట్టణ పరిపాలనలో మార్పు చోటుచేసుకుంది.

తక్కలపల్లి రవీందర్ రావు బిఆర్ఎస్ కోఆర్డినేటర్ నియామకం

బిఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా తక్కలపల్లి రవీందర్ రావు..

నియామకపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

ఖానాపురం మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ నేత తక్కల్లపల్లి రవీందర్ రావును బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తక్కల్లపల్లి రవీందర్ రావుకు నియామకం చేసినట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మాజీ ఎంపీపీ తక్కల్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారత్ రాష్ట్ర సమితి పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా తమవంతు కృషి చేస్తానని రవీందర్ రావు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, జిల్లా నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి,మాజీ ఎంపీపీ లు వేములపల్లి ప్రకాష్ రావు,నల్ల మనోహర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,నర్సంపేట మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, ఖానాపూర్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, నెక్కొండ మండల సీనియర్ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, చెన్నారావుపేట మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీ జక్కా అశోక్, మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్ గందం చంద్రమౌళి, నల్లబెల్లి మాజీ సర్పంచ్ నానెబోయిన రాజారాం ,పట్టణ పార్టీ ముఖ్య నాయకులు బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, బుర సుమన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడికి ఘన సత్కారం

ఇనుగాలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

పరకాల,నేటిధాత్రి

 

డీసీసీ అధ్యక్షుడిగా ఇనుగాల వెంకటరామిరెడ్డి నియమితులు అయినా సందర్బంగా పరకాల మున్సిపలైటిటి 18వ వార్డు అధ్యక్షుడు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్,ఒంటెరు కుమార్,బొచ్చు వినోద్ కుమార్ లు కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీని మునుముందు రోజుల్లో పెద్ద ఎత్తున బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని శ్రీనివాస్,కుమార్, ఇనుగాలను కోరారు.జిల్లాకు పార్టీ కొత్త అధ్యక్షులు ఇనుగాల నియామకం కావడంతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలిపామన్నారు.డిసిసి జిల్లాఅధ్యక్షులు వరంగల్ కూడా చైర్మన్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికలలో విజయ డంక మోగిస్తుందని ఆకాంక్షించారు.

పిఆర్పి మంచిర్యాల మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ ఇలియాస్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T150404.565.wav?_=1

 

పిఆర్పి మంచిర్యాల మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ ఇలియాస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులుగా ఎం.డి.ఇలియాస్ ను నియమించారు.జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మనీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అనంతరం ఇలియాస్ మాట్లాడుతూ..నాపై నమ్మకంతో అప్పజెప్పిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీ అభ్యుదయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ అవకాశాన్ని కల్పించినందుకు
తీన్మార్ మల్లన్నకి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ కి,జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి కృషి చేసి,మైనారిటీల సమస్యలు పరిష్కారం దిశగా పని చేస్తానని తెలపడం జరిగింది.వచ్చేది బీసీల రాజ్యమే అని మైనారిటీలు అందరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పై తీన్మార్ మల్లన్న సారధ్యంలో మన రాజ్యాధికారం వస్తుందని విశ్వసిస్తున్నారని తెలిపారు.అనంతరం ఎం.డి.ఇలియాస్ ని శాలువాతో సత్కరించి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు.

ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్‌గా ప్రీతీమ్‌కి శుభాకాంక్షలు…

అల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్‌గా నగరాగారి ప్రీతీమ్ నియామకంపై శుభాకాంక్షలు తెలిపిన నరుకుడు వెంకటయ్య

హైదరాబాద్‌లో ప్రీతీమ్ గారిని కలిసిన ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు

పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానం
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగరాగారి ప్రీతీమ్ గారు ఇటీవల *అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన శుభసందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని వారి స్వ గృహములో కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం రాష్ట్ర నాయకులు & వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమందించి శాలువాతో సన్మానించి హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమములో
వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎస్సీ విభాగం ఇంచార్జి దబ్బెట రమేష్ , ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆర్షం అశోక్ ,ఎస్సీ విభాగం జిల్లా నాయకులు ఆరూరి సాంబయ్య లు పాల్గొనడం జరిగింది.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీలను నియమిస్తున్నట్లు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీని అన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.యువకులు, నాయకులు పార్టీలో చేరి తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా తమ వంతు కృషి చేసి పార్టీ బలోపేతం చేయాలని కోరారు.అలాగే మంచిర్యాల జిల్లాలోని చున్నంబట్టి లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి లను ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అసిఫాబాద్ లో నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం చేపట్టనున్నారు.23న గురువారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్ జిల్లాలో నియోజకవర్గం ఇన్చార్జిలను నియమించడం జరుగుతుందని తెలిపారు.

ఎన్ హెచ్ ఆర్ సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లపోతుల రమేష్ బాబు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T154501.817.wav?_=3

 

ఎన్ హెచ్ ఆర్ సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లపోతుల రమేష్ బాబు

నియమించిన జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

– ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది కదిరి రాము

 

“నేటిధాత్రి”,అమరావతి/

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ చైర్మన్ స్వప్న.యం. ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా బాపట్ల జిల్లాకు చెందిన పల్లబోతుల రమేష్ బాబును జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియమించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, న్యాయవాది కదిరి రాము తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్, ప్రోటోకాల్ సిస్టంతో పేద ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎన్ హెచ్ ఆర్ సి. కేంద్ర, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పని చేయాలని, అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేయాలని కదిరి రాము సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియామకమైన పల్లపోతుల రమేష్ బాబు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పదవిని అప్పజెప్పిన నేషనల్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది కదిరి రాము, కేంద్ర కమిటీ సభ్యులు పి. పూర్ణచంద్రరావు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థను బలోపేతం చేయడానికి అన్ని జిల్లా కమిటీలను పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రమేష్ బాబు నియామకంతో గుంటూరు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని మేధావులు, విద్యావంతులు, సామాజిక ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.

మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T113156.165.wav?_=4

 

మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్ ను నియమించడం జరిగింది ఫక్రుద్దీన్ నియమించిన పెద్దలను హృదయపూర్వకంగా ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ చైర్ పర్సన్, పెద్దలు సునితాహన్మంత్ రావు పాటిల్,యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు, మా తాత ముత్తాతల నుండి కాంగ్రెస్ పార్టీని పనిచేసిన మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాపై దృష్టి పెట్టి ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అప్పగించారు పార్టీని బలపలించినందుకు నాతో అయినంత కృషి చేస్తామన్నారు,

బిజెపి జిల్లా కార్యదర్శిగా మహేందర్ గౌడ్…

బిజెపి జిల్లా కార్యదర్శి గా రామగౌని మహేందర్ గౌడ్ నియామకం

తాండూరు(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా రామగౌని మహీధర్ గౌడ్ నీ శుక్రవారం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ నియమించి నియామక పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా బిజెపి మంచిర్యాల జిల్లా కార్యదర్శి మహీధర్ గౌడ్ మాట్లాడుతూ.. నాపైన ఎంతో నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు కల్పించినందుకు బిజెపి పార్టీకి నా శక్తి మేర కృషి చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.అలాగే బిజెపి రాష్ట్ర నాయకులకు,జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం…

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ యూత్ మండల
కో కోఆర్డినేటర్ రామన్న గూడెం చెందిన యువనాయకుడు భూక్యా రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
వజ్జ సారయ్య మరియు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి తెలిపారు నా ఈ యొక్క ఎన్నిక కు సహకరించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుకు జిల్లా నాయకులకు సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కు
నా ప్రత్యేక కృతజ్ఞతలు..అని
భూక్యా రాజు తెలిపారు

వర్ధన్నపేట నూతన ఎస్సై సాయిబాబాకు ఘన స్వాగతం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T114241.463.wav?_=5

వర్ధన్నపేట నూతన ఎస్సై సాయిబాబాకు ఘన స్వాగతం

వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్ధన్నపేట నియోజక వర్గం , వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సాయిబాబా ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజీరెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఎలికట్టే చిన్న రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-5.wav?_=6

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య

గణపురం నేటి ధాత్రి :

గణపురం మండలం
భూపాలపల్లి జిల్లా బీజేపీ నూతన కమిటీలను ప్రకటించింది.జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కమిటీలను ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామ్ చందర్రావు ఆదేశాలతో నూతన కమిటీని ప్రకటించినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు. గణపురం మండలానికి చెందిన జిట్టబోయిన సాంబయ్యను జిల్లా కార్యదర్శిగా ప్రకటించారు. జిల్లా నూతన కమిటీలో స్థానం పొందిన సాంబయ్య రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-2.wav?_=7

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్యామల మధుసూదన్ రెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా శ్యామల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నా నియమాకానికి సహకరించిన బిజెపి పార్టీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న నన్ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పగించారు కావున బిజెపి పార్టీ జిల్లాలో మరింత అభివృద్ధి చెందింది నా వంతు కృషి చేస్తాను

బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T131256.308-1.wav?_=8

 

బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియమితులయ్యారు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి నియమాకాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి నాగపూర్ రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు నిషేధర్ రెడ్డికి మండల అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భూపాలపల్లి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలవడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-6.wav?_=9

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్‌గా ఊరటి మునెందర్ నియమితులయ్యారు.బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు,జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఊరటి మునెందర్ మాట్లాడుతూ “బీజేపీ భావజాలాన్ని,కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్వచ్ఛందంగా చేరవేయడం, పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయడం నా ప్రధాన బాధ్యత అని జిల్లా లోని ప్రతి గ్రామం,ప్రతి మండలానికి పార్టీ స్వరం చేరేలా కృషి చేస్తాను”అని అన్నారు.జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ… మునెందర్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు అని మీడియా విభాగంలో ఆయన అనుభవం పార్టీకి మరింత బలాన్నిస్తుంది అని అభిప్రాయపడ్డారు.ఈ నా పార్టీ పదవికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న కి కన్నం యుగదీశ్వర్ కు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల నియామకం..

*మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల నియామకం *

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T114528.955.wav?_=10

* మహాదేవపూర్ జులై 28( నేటి ధాత్రి *

జయశంకర్ జిల్లా కాటారం మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ నియమించడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపీట వేశారు ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు మహాదేవపూర్ ఉమ్మడి మండలానికి ఐదు డైరెక్టర్ పదవులులభించాయి మండల కేంద్రానికి చెందిన ఇర్ఫాద్ అహ్మ ద్, పోత రామకృష్ణ తో పాటు మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ముల్కల శ్రీనివాస రెడ్డి చండ్రు పెళ్లి కి చెందిన గోమాస సడవలి పలిమల మండలం నుండి దాసరి సంతోష్ లకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు దీంతో ఉమ్మడి మండల వ్యాప్తంగా హర్ష వ్యక్తం చేస్తున్నారు తమ నియమకానికి సహకరించిన రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శీను బాబుకు కృతజ్ఞతలు తెలిపారు

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ.

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

మందమర్రిలో 14 మంది డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ – సింగరేణి భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్న మంత్రి డా. వివేక్ వెంకటస్వామి గారు
ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గౌరవ డా. వివేక్ వెంకటస్వామి గారు, 14 మంది బొగ్గుగని కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు

ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం శ్రీ దేవేందర్ , ఏఐటీయూసీ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

 

Singareni

 

 

“బొగ్గుగని కార్మికులంటే మా కాకా డా. వెంకటస్వామి కి అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ మూసివేయకుండా అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తో చర్చించి, ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను ఆదుకున్నారు. లక్షలాది కార్మిక కుటుంబాలకు బాసటగా నిలిచారు.”

 

Singareni

 

“ఈరోజు సింగరేణి సంస్థ లాభాల బాటలోకి రావడానికి, కార్మికుల క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ప్రధాన కారణం. తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.”

“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, సంస్థ అభివృద్ధికి తగిన ప్రయత్నం జరగలేదు. కేవలం నిధుల వాడకానికే పరిమితమైంది. ఇకపై కొత్త గనులు, కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెడతాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే టెండర్లలో సింగరేణి సంస్థ నేరుగా పాల్గొనగలిగే విధంగా చర్యలు తీసుకుంటాం.”

 

Singareni

 

 

ఈ కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కుటుంబాలు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగావకాశం వారి జీవితాలకు మేలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version