ప్రశాంతతకు దైవచింతన మార్గం.

ప్రశాంతతకు దైవచింతన మార్గం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: ప్రశాంతతకు దైవచింతన మార్గం అని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు.
ఝరాసంగంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన భక్తులకు ప్రవచనామృతం అందించారు. మహిళలు సీరియల్స్కు బదులు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. వంటలు చేస్తూ దేవుడి నామస్మరణ చేయడం మంచిదని తెలిపారు. ధనవంతులు పేదలకు దానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమం.

ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమం

ధ్యానోత్సవాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటిధాత్రి:

ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్ లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత యోగ ధ్యాన శిక్షణలో ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని ఎస్సై జక్కుల ప రమేష్ తెలిపారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మనిషి తన శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్నాన పానాధులు ఎలా అవ సరమో మనసుని హృదయా న్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ధ్యానం ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయని తెలి పారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శారద, జిల్లా కోఆర్డినేటర్ అ చ్చయ్య,రమేష్, రాంబాబు, సత్యనారాయణ, సుధాక ర్, సురేందర్ పాల్గొన్నారు

ధ్యానం వాకింగ్ చేయాలి జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత.

ధ్యానం వాకింగ్ చేయాలి జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత. 
వనపర్తి నేటిదాత్రి :

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాసవి వనిత క్లబ్ వనపర్తి గోల్డ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశము నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా జెడ్జి శ్రీమతి ఎమ్.ఆర్ సునీత లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బి రజిని డిహెచ్ఎంఓ శ్రీనివాసులు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల న్యాయ వాది ఉత్తరయ్య పాల్గొన్నారు ఈసందర్భంగా జిల్లా జెడ్జి ఎమ్ ఆర్ సునీత మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం ఉదయం నడక తప్పనిసరిగా చేయాలని ఆరోగ్యం గా ఉంటారని అన్నారు పిల్లలను మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పిల్లలను గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ సమావేశంలో వాసవి క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి శ్రీనివాసులు సెక్రెటరీ కే బుచ్చయ్య కోశాధికారి ఏ మధుసూదన్ ఆర్యవైశ్య సంగం కన్వీనర్ పూరి బాలరాజు పట్టణ బీజేపీ మాజి అధ్యక్షులు బచ్చు రాము వనితా క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి సువర్ణ సెక్రెటరీ కొంపల్లి రజిత భార్గవి ఆర్యవైశ్య సంగం పట్టణ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి సంధ్య మాధవి రాజశేఖర్ నరసింహస్వామి నవీన్ వనపర్తి ఆర్యవైశ్య లు పాల్గొన్నారు. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version