విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమం

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్: విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచే కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘చదువుకో తెలంగాణ – బాగా చదవండి’ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని, ప్రతిభను వెలికితీయడం దీని లక్ష్యం. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పోటీల్లో ప్రతిభచూపిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ఉన్నత లక్ష్యాలతో రాణించాలని వక్తలు సూచించారు. గ్రామ సర్పంచ్ రాజ్కుమార్, ఉపసర్పంచ్ వాహబ్, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బి.డి.ఎం సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పర్యాటక బ్రోచర్ నీ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్…

పర్యాటక బ్రోచర్ నీ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

పర్యాటక ప్రదేశాల సమాచారం పై పోటీలు
పర్యాటకశాఖ 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్ చేయడానికి ప్రోత్సాహికుల నుండి పర్యాటక ప్రాంతాలను పర్యాటక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఈ పోటీలను నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా రూపొందించిన పోస్టర్ ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐఏఎస్, జిల్లా అదనపు కలెక్టర్ ఎల్ విజయలక్ష్మి జిల్లా టూరిజం అధికారి సి హెచ్ రఘు పర్యాటక బ్రోచర్ ని ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను ప్రాచుర్యం కల్పించే విధంగా 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో పోటీలను నిర్వహిస్తున్నట్లు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి వీక్ క్రాంతి వెల్లడించారు.
తెలంగాణలోని పర్యాటక ప్రదేశం స్పష్టంగా కనిపించేలా మూడు ఫోటోలు, 60 సెకండ్ల వీడియో 100 పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జనవరి 5లోగా ఎన్ఫీల్డ్ పంపాలని సూచించారు. అందులో హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ వసతి తదితర వివరాలను తెలియజేయాలని సూచించారు 50,000 30,000 20,000 ఇస్తానన్నారు. పదిమందికి కన్సోలేషన్ బహుమతులు అంద చేస్తారు. సంక్రాంతి రోజున కైట్ ఫెస్టివల్లో బహుమతులను ప్రధానం చేస్తారు.

తంగళ్ళపల్లి పోలీస్ ఆధ్వర్యంలో 2కే రన్..

తంగళ్ళపల్లి పోలీస్ ఆధ్వర్యంలో 2కే రన్..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి ఎస్సై. ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని తంగళ్ళపల్లి పోలీసుల. మరియు స్థానిక విద్యార్థుల యువకుల ఆధ్వర్యంలో టూ కే రన్ నిర్వహించడం జరిగిందని. ఇందులో భాగంగా. దేశం మొత్తం ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు పండుగ జరుపుకోవడం తో. ఈరోజు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. తద్వారా రన్ ఫర్ యూనిటీ. ద్వారా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో టూ కే రన్. లిమిటేషన్ .పరిధిగా. పిల్లలు గాని విద్యార్థులు గాని. అగ్రికల్చర్ స్టూడెంట్స్ గాని. అందరూ సంతోషంగా పాల్గొని టూకే రన్స్ ను విజయవంతం చేసిన సందర్భంగా. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ. 2కె రన్ లో. పాల్గొన్న. వారికి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరఫున. నగదు బహుమతులు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారితో పాటు. యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తంగళ్ళపల్లి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్…

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సులో ప్రయాణించి..బహుమతులు పొందండి

నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. బహుమతి గెలుపొందండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కాగా నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఇందుకుగాను ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల కోసం ప్రత్యేక బంపర్ లక్కీడ్రా స్కీం నిర్వహిస్తోందని చెప్పారు.ఈనెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ సెమీడీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణి కులు తమ టికెట్ పైన పేరు,ఫోన్ నెంబర్, చిరునామా రాసి నర్సంపేట బస్టాండ్ లో ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాలన్నారు.అక్టోబర్ 8వ తేదిన ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ముగ్గురు విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ. 15వేలు, మూడో బహుమతి రూ.10 వేలు నగదు రూపంలో అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణి కులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ సూచించారు.

తిరుప‌తి వేదిక‌గా అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్.

*తిరుప‌తి వేదిక‌గా అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్..

*ఈనెల 24, 25, 26వ తేదీల్లో రాష్ట్ర‌స్థాయి పోటీలు..

*శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు.

తిరుప‌తి(నేటి ధాత్రి)

 

తిరుప‌తిలో ఈనెల 24, 25, 26వ తేదీల్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్-2025 పేరుతో రాష్ట్ర‌స్థాయి క్రీడా పోటీల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈనెల 29న జ‌ర‌గ‌నున్న నేష‌న‌ల్ స్పోర్ట్స్ డేలో భాగంగా రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు తిరుప‌తి ఆతిధ్య‌మిస్తుంద‌ని తెలియ‌జేశారుజిల్లా స్థాయి, జోన‌ల్ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు చేరుకున్నార‌ని వివ‌రించారు. రాష్ట్ర‌స్థాయిలో హాకీ, బ్యాడ్మింట‌న్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, ఖోఖో, క‌బ‌డ్డీ, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్అథ్లెటిక్స్‌, ఆర్చ‌రీ పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ పోటీల్లో 2వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న‌ట్లు తెలిపారు. క్రీడాశాఖామంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి, క్రీడాశాఖ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 29వ తేదీన విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రిగే నేష‌న‌ల్ స్పోర్ట్స్ డేకు సీఎం చంద్ర‌బాబునాయుడు ముఖ్య అతిధిగా విచ్చేస్తార‌ని, రాష్ట్ర‌స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు సీఎం చేతులు మీదుగా న‌గ‌దు ప్రోత్సాహ‌కాలుప‌త‌కాలు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version