కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా వనపర్తి నేటిదాత్రి .
డాక్టర్ కంటే నిరంజనయ్య స్వీయ రచన కాలగమనం పుస్తకాలను కంచిరావుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రంధాలయానికి కాలగమనం పుస్తకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా కంటే నిరంజనయ్యా విద్యార్థుల తో మాట్లాడుతూ కాలగమనం పుస్తకంలో 55 కవిత అంశాలు ఉన్నాయని వాటిని చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి మాట్లాడుతూ నిరంజనయ్యా రచించిన పుస్తకంములో సామాజికాంశాలు ఉన్నాయని వీటితోపాటు తల్లి తండ్రి గురువు దైవం విద్యార్థి సమాజం రాజ్యాంగము మహాత్మా పూలే అంబేద్కర్ అంశాలు ఉన్నాయని పుస్తకం చదవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సరస్వతి ఉపాధ్యాయులు కవి రచయిత కంటే నిరంజనయ్యను అభినందించారు
జహీరాబాద్ నియోజకవర్గ కోహిర్ మండల దిగ్వాల్ గ్రామంలో బీహార్లోని మహా బోధి బుద్ధగయ విముక్తి కోసం విశ్వవ్యాప్త ఆందోళన చేపట్టినట్టు ప్రముఖ బౌద్ధ భిక్షువు వినయ్ ఆచార్య తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం దిగ్వాల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడుతూ, ఫిబ్రవరి 12, 2026న న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహా సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని అంబేడ్కర్ వాదులను కోరారు. ఈ కార్యక్రమంలో తలారి అశోక్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ అమలు కాకుంటే మరో తెలంగాణ ఉద్యమమే… – పూలే…అంబేద్కర్‌ను అర్థం చేసుకుంటేనే రాజ్యాధికారం సాధ్యం – బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా కుట్రలు జరుగుతున్నయ్ – రిజర్వేషన్ ఎవరు ఇస్తరో ఎవరుతీసుకుంటరో అలోచించాలే – కాంగ్రెస్…బీజేపీ పార్టీల మద్దతు తెలుపడం సంతోషకరమే – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని :- నేటి ధాత్రి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో బీసీ రిజర్వేషన్‌లు తీసుకువచ్చి బీసీల చేతుల్లో పెట్టాలని లేకుంటే మరో తెలంగాణ ఉద్యమంలా మారుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు మంథనిలో చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మహాత్మా జ్యోతిరావుపూలేకు నివాళులు అర్పించి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు, అనంతరం వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బంద్‌లో పాల్గొన్న వారితో కలిసి సహపంక్తి బోజనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు మేమెంతో మాకంత అని మహాత్మాజ్యోతీరావు పూలే సంకల్పించారని, పూలేను అర్థం చేసుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారన్నారు. అయితే పూలే, అంబేద్కర్‌ను అర్థం చేసుకోకపోవడం మూలంగానే అనేక అనర్థాలు జరుగుతున్నాయని, వారిని అర్థం చేసుకున్న నాడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు అన్ని రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు రోడ్డు మీదకు వచ్చి బంద్ మద్దతు తెలుపడం సంతోషకరమన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతామని ప్రతి ఒక్కరు ఉద్యమంలో ముందుకు వచ్చారని, అదే తరహాలో ఈనాడు బంద్‌కు సహకారిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అసలు బీసీ రిజర్వేషన్‌లు ఇచ్చే వారు ఎవరు తీసుకునే వారు ఎవరనే అయోమయం నెలకొనెలా అధికార పార్టీలు పాల్గొంటున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్‌లు కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అని ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుపై బీసీ సమాజం సూక్ష్మంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకరిపై ఒకరు నెపం మోపి బీసీలు ఒక్కటి కాలేరనే ఆలోచనతో బీసీవర్గాల్లో చిచ్చు పెట్టి రిజర్వేషన్‌లు ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. అందరూ బాపనోళ్లు అయితే రొయ్యల మొలతాడు ఏడ పోయినట్లు అన్న చందంగా అన్ని పార్టీల నాయకులు బీసీ బంద్‌లో పాల్గొంటే అసలు రిజర్వేషన్‌లు ఎవరు అమలు చేయాలనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంఘాల ఏర్పడిన జేఏసీ ఎవరో ఒకరిపై గురి పెట్టకపోతే అయోమయపరిస్థితులకు దారి తీస్తుందని ఆయన వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామో అదే రీతిలో బీసీ రిజర్వేషన్‌లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ రోడ్లపై కాకుండా పార్లమెంట్‌లో గళమెత్తాలని, అలాగే ప్రధాని మోడీ బీసీల గురించి ఆలోచన చేయాలన్నారు. వీళ్లిద్దరు కలిసి మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్‌లు సునాయమవుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ సంఘాల పిలుపుమేరకు నియోజకవర్గంలో బంద్‌కు సహకరించిన వ్యాపార సంస్థలు, అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు, ప్రజలు, మేధావులకు ఆయన ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
బుద్దుడి చూపిన అంబేద్కర్ ఆశయాలను నేటి యువత సాధించాలి.
చిట్యాల, నేటి ధాత్రి:
చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ ఆద్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భౌద్ధమతం స్వీకరించిన రోజును పురస్కరించుకుని ముందుగా గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పూలు వేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* విచ్చేసి మాట్లాడుతూ .. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు హిందువుగా పుట్టి హిందువుగా మరణించనని భారత దేశంలో ఉన్న అన్ని మతాల గురించి తెలుసుకొని చివరకు గౌతమ బుద్ధుడి బోధనలు సూక్తులు సిద్ధాంతాలు నచ్చి బౌద్ధమతాన్ని 14 ఆక్టోబర్ 1956న 5లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలిపారు. నేటితో ఆది 69 సంవత్సరాలు అన్నారు . ఈ ఆధునిక ప్రపంచానికి సరిపోయేది భౌద్ధ మతమే అని , ఈ ప్రపంచాన్ని రక్షించ గల శక్తి ఓక భౌద్ధ మతానికి మాత్రమె ఆన్నారు. మానవతా విలువల వైపు నడిపించేధి భౌద్ధం మాత్రమే అని బోధిసత్వ డా బి ఆర్ అంబేద్కర్ గారు తెలిపారని అని చెప్పారు. ఈ ప్రపంచంలో గౌతమా బుద్ధుడు పుట్టిన తర్వాత మానవ పరివర్తన కోసం మొట్ట మొదటి సారిగా ప్రెమ దయ జాలి ఆకరుణ దానం శీలం ప్రజ్ఞ సమత వంటి గొప్ప సిద్ధాంతమే కాక మైత్రి ధ్యానం మానవ కళ్యాణం కోసం త్రిచరణములను పంచ శిలాలను ఆస్టాంగా మార్గాలను 11 పారమిధులను 24 మానవ జీవన సూత్రాలను మనషి పకృతి జీవనాధారంలో బుధుడు కనుక్కొని ఇతరులకు వర్తించే విధంగా శ్వాసపైనా ధ్యాస మనసు శరీరానికి ఉన్న సమతా భావాలు సామాజిక శాస్త్ర విజ్ఞానము జ్ఞానంతో. భారత దేశం దేశంలో బుధుడు 45 సంవత్సరాల పాటు కాలి నడకన ప్రయాణిస్తూ తాను దమ్మ జ్ఞానాన్ని ప్రజలకు బోధించాడని అన్నారు. బుధుడు చూపిన మార్గంలో నడుస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుటకు నేటి యువతీ యువకులు ముందుకు రావాలన్నారు* ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గడ్డం సదానందం కట్కూరి మొగిలి చందర్ మొగిలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పొన్నం భిక్షపతి గౌడ్ బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థగత ఎన్నికల దృష్ట్యా బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని స్థానాల గ్రామ వార్డు సభ్యులు గ్రామ సర్పంచులు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో బీఎస్పీ ఉంటుందని పొన్నం భిక్షపతి గౌడ్ బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీట్లను కేటాయించి పోటీ చేయబోతున్నామని అగ్రవర్ణాల రాజకీయ కుట్రలను పసిగట్టి వారిని ప్రజల్లో ఎండ కడతామని రాజ్యాధికారం యొPonnam Bhikshapathi Goud
BSP Bhupalpalli District Presidentక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా ఇంటింటికి ప్రచారాన్ని తీసుకెళ్తామని రాష్ట్రంలో 92 శాతం ఉన్న బహుజనులను రాజ్యాధికార పీఠం మీద కూర్చోబెట్టడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారమే అణచివేయబడ్డ బహుజన కులాలకు విముక్తి కలిగిస్తుందని సమాజం యొక్క మార్పు కోరుకునే వారందరూ ఏకతాటిపైకి రావాలని ఎన్నికలలో పోటీ చేయకపోతే మన ఆస్తిత్వాన్ని కోల్పోయి అణచివేతకు గురైతామని కాబట్టి ఈ ఎన్నికలను మన భవిష్యత్తుగా భావించాలని ఈ సందర్భంగా అన్నారు
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు జిల్లా, నేటిధాత్రి:
మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, విద్యార్థిని, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక 79వ భారత స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో ఆగస్టు,15కు విశిష్ట స్థానం ఉంది. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచిన మనం.. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి, భారతదేశ పునాది పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పౌరులకు, అణగారిన వర్గాలకు సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం నిబంధనలు ఉండేలా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులు ఊదారు. మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. స్థానిక సంస్థలలో… విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ములుగు జిల్లా 2019లో ఏర్పడినప్పటి నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లుటకు నూతన ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా జిల్లాలో నూతన ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం, జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు జిల్లా ప్రజలకు అందించుటకు నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, శాశ్వత భవనాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకశాలను పెంచుటకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. తద్వారా 51 మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. ములుగు, బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలతో ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయటకు కృషి చేయడం జరిగింది. మల్లంపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, జిల్లాలో మరో 15 సబ్ సెంటర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2026 లో జరగనున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు దాదాపు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు దర్శించుకొనున్ననేపధ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లకై ప్రతి శాఖను సమాయత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను.
మహాలక్ష్మి పథకం : ఆడబిడ్డలకు పైసా ఖర్చు లేకుండా ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించుటకు ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకం ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి 35 లక్షల మంది మహిళలకు 81 కోట్ల 23 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగినది. జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో 4 కోట్ల 80 లక్షలతో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో 6 కోట్ల 28 లక్షలతో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. మంగపేటలో 52 లక్షల నిధులతో బస్టాండ్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నవి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది.
వైద్య ఆరోగ్య శాఖ : ఆరోగ్య శ్రీ బ్రాండ్ స్కీం : మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో 2800 మందికి వైద్య సేవలకుగాను 10 కోట్ల 99 లక్షలకు పైగా రూపాయాల లబ్ది చేకూర్చడం జరిగింది. ఈ సంవత్సరం 1056 గర్భిణి స్త్రీలకుగాను 748 స్త్రీలకి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు (71 శాతం) చేయడం జరిగినది. సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా 24 వేల 38 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 34 మలేరియా 10 డెంగ్యూ కేసులను నిర్ధారించి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం జరిగినది. అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించుటకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నూతన ఆలోచనతో 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 4182 మంది పేద గిరిజన ప్రజలకు పరీక్షలు నిర్వహించి, 19 లక్షల 56 వేల రూపాయలను లబ్ది చేకూర్చడం జరిగింది.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్: ఓ.పి, ఐ.పి. సేవలు గత సంవత్సరం కన్నా 10 శాతం పెరిగినవి. రోజువారి ఓపి 715, ఐ.పి. 165 గా ఉన్నది. మాతా శిశు సంబంధిత సేవలు మరింతగా పెరిగాయి. జనరల్ సర్జరీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నవి. ఈ నెల ఇద్దరికీ రొమ్ము కణితి, ఒకరికి దవడ కణితి విజయవంతంగా తొలగించి మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని అభినందిస్తున్నాను.
ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల : ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం కొరకు 50 సీట్లకు ఎన్.ఎం.సి. నుండి అనుమతి పొందడం జరిగింది. కళాశాలలో కావాల్సిన మైక్రోబయాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మా కాలేజీ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబిబిఎస్ కోర్స్ తో పాటు పారామెడికల్ కోర్స్ డి.ఎం.ఎల్.టి., డి.ఎం.ఎస్.టి. 60 సీట్లతో ల్యాబ్, తరగతి గదుల సౌకర్యాలను కల్పిస్తూ తరగతులను ప్రారంభించడం జరిగింది.
వ్యవసాయ శాఖ : రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతు భరోసా పథకం కింద వ్యవసాయ భూములకు వానా కాలానికి ఎకరానికి 12 వేల చొప్పున 79 వేల 481 మంది రైతుల ఖాతాలో 99 కోట్ల 10 లక్షల జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం కింద 2024-25 సంవత్సరంలో 218 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 10 కోట్ల 90 లక్షలను రైతుల నామినిల కుటుంబ ఖాతాలో జమ చేయడం జరిగింది. సబ్ మిషన్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళా సన్న చిన్న కారు రైతులకు 50% రాయితీపై 79 లక్షల 60 వేల రూపాయలను వ్యవసాయ పరికరాలు అందించుటకు కేటాయించడం జరిగింది. జిల్లాలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన 671 మంది రైతులకు 3 కోట్ల 80 లక్షల 97 వేల రూపాయలను నష్టపరిహారం ఇప్పించడం జరిగింది.
విద్యుత్ శాఖ : గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200యూనిట్ల వరకు 39వేల 79 విధ్యుత్ వినియోగదారులకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది. తద్వారా ఇప్పటి వరకు 39 కోట్ల 44 లక్షల రూపాయలను లబ్దిదారులకు సబ్సిడీ కల్పించాము. 21 కోట్ల 29 లక్షల నిధులతో బుచ్చంపేట, అడవీరంగాపూర్, గట్టమ్మ, జగ్గన్నపేట, నార్లపూర్, లింగాల, రోయ్యూరు గ్రామాల్లో నూతన 33 / 11 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడం జరిగినది. కోడిశాల కుంటలో 2 కోట్ల 70 లక్షలతో నిర్మించుకున్న 33 / 11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించడం జరిగింది.
పౌర సరఫరాల శాఖ :70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. సన్నధాన్యానికి ఇప్పటివరకు 52 కోట్ల 70 లక్షల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు యాసంగి సీజన్ పంటలకు కనీస మద్దతు ధర పై 78 వేల 701 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో 485 కోట్ల 49 లక్షల రూపాయలను చెల్లింపు చేయడం జరిగింది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ భారంగా మారకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో 50 వేల 64 మందిని అర్హులుగా గుర్తించి, ఇప్పటి వరకు 500 రూపాయల చొప్పున ఒక లక్ష 64 వేల 169 సిలెండర్లను డెలివర్ చేసి, 4 కోట్ల 39 లక్షల సబ్సిడీని లబ్దిదారుల ఖాతాలో జమ చేశాం. రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు జిల్లాలో 6 వేల 207 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పేదల ఆకలి తీర్చటంతో పాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు జిల్లాలో ప్రతినెల 97 వేల 634 రేషన్ కార్డుదారులకు, ప్రతి నెల 7 కోట్ల 88 లక్షల రూపాయలను వెచ్చించి 1,751 టన్నుల పోషకాలతో కూడిన సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతున్నది.
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ : గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా మహిళ శక్తి పథకం లో భాగంగా ఎస్.హెచ్.జి. లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 28 వేల 797 మంది విద్యార్థులకు ఏకారూప దుస్తులను వీరి ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాల ద్వారా జిల్లాలో పౌల్ట్రీ మదర్ యూనిట్లు 5, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు యూనిట్లు 2 ఏర్పాటు చేయడం జరిగినది. సదరం క్యాంపు ద్వారా 6,776 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. బ్యాంకు లీకేజీ కింద 1060 మహిళా సంఘాలకు 80 కోట్ల 54 లక్షల రుణాలు మంజూరు చేశాం. స్త్రీ నిధి కింద 33 వి.ఓ. లకు, 136 సంఘాల సభ్యులకు 4 కోట్ల 50 లక్షలు మంజూరు చేశాం. చేయూత పెన్షన్ పథకం ద్వారా 38 వేల 60 మంది లబ్దిదారులకు 9 కోట్ల 87 లక్షల రూపాయలను ప్రతి నెల పెన్షన్స్ అందిచడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం 7లక్షల 57 వేల పనిదినాలు కల్పించి, 47 వేల 50 మంది కూలీలకు 20 కోట్ల 80 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించడమే కాకుండా, 12 కోట్ల 32 లక్షల రూపాయలను మెటీరియల్ కొరకు ఖర్చు చేయడం జరిగింది.
జిల్లా పంచాయతీ శాఖ : జిల్లాలోని 171 గ్రామ పంచాయితీలలో ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి, డంపింగ్ యార్డులకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. జిల్లా లోని 171 పంచాయితిలలోని నర్సరిలలో 11 లక్షల 39 వేలకు పైగా మొక్కలను సంరక్షించడం జరుగుతుంది.
నీటిపారుదల శాఖ : యాసంగి పంట సాగుకు 53 వేల 278 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడం జరిగింది. అంతేగాకుండా ప్రస్తుత సంవత్సరం వానకాల పంటల కొరకు సుమారు 88 వేల 18 ఎకరాలకు పైగా సాగునీరు అందించుటకు చర్యలు తీసుకొన బడుచున్నవి.
మిషన్ భగీరథ: జిల్లాలో 601 ఓ. హెచ్.ఎస్.ఆర్. లతో 88 వేల 30గృహాలకు అన్ని అవసరాలకు సరిపడు సురక్షిత మంచినీరు సరఫరా చేయడం జరుగుతున్నది.
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం: నిరుపేదలకు ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. మొదటిదశలో నిరుపేదలై ఉండి.. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారిని ప్రామాణికంగా తీసుకుని 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో బాగంగా జిల్లాలోని 10 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మొదటి దశలో 4601 ఇండ్లు మంజూరు కాగా 3 వేల 678 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. 1561 ఇండ్లు నిర్మాణ పనులు వివిద దశల్లో పురోగతిలో ఉండగా ఇప్పటి వరకు 9 కోట్ల 81 లక్షలు చెల్లించాం. ఈ పథకంతో పేదవాళ్లకు సొంతింటి కల సాకారమైంది.
కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకం: 2025-26 సంవత్సరంలో కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకాల క్రింద వివాహాలు జరిగిన పేద కుటుంబాలకు రూ.1 లక్ష 116/- ల చొప్పున 2 కోట్ల 71 లక్షల రూపాయలను 271 మంది లబ్దిదారులకు అందించడం జరిగినది.
అటవీశాఖ : వనమహోత్సవములో భాగంగా 171 గ్రామపంచాయితీలలో 14 లక్షల 26 వేల మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా వివిధ శాఖలలోని నర్సరీలలో 25 లక్షల 40 వేల మొక్కలను పెంచడం జరిగినది. తూనికాకు సేకరణలో 10వేల 359 “ఎస్. బి. “లకు 341 లక్షల 86 వేల కలెక్షన్ చేసి, 10 వేల 631 కూలీలకు రుసుముగా ఇవ్వడం జరిగింది. కాంపా అభివృద్ధి పనుల కింద ఒక లక్ష 33 వేల పని దినాలు కల్పించడం జరిగింది.
పశు వైద్య, పశుసంవర్ధక శాఖ : పాడి పశువులకు ఒక లక్ష 75 వేల గాలి కుంటు, జబ్బ వాపు, గురక వ్యాది టీకాలను, 65 వేల లంపి చర్మవ్యాధి టీకాలను వేయడం జరిగింది. గొర్రెలలో మేకలలో చిటుకు రోగం నీలి నాలుక వ్యాధి నివారణకు 42 వేల 194 టీకాలు వేయడం జరిగింది.
పరిశ్రమల శాఖ : టీజీ ఐపాస్ క్రింద 24 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు 40 వివిధ రకముల అనుమతుల మంజూరు చేయడం జరిగింది. ఇట్టి పరిశ్రమల ద్వారా 38 కోట్ల 20 లక్షల పెట్టుబడితో 221 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. టీ ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పి.హెచ్.సి. పారిశ్రామిక వేత్తలకు 10 యూనిట్లకు 33 కోట్ల 32 లక్షల రూపాయలు రాయితి మంజూరు చేయడం జరిగింది.
పర్యాటక శాఖ : రామప్ప ఐలాండ్ వద్ద 13 కోట్ల నిధులతో అభివృద్ది పనులను, ప్రసాద్ స్కీమ్ లో భాగంగా 61 కోట్లతో యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పర్యాటక ప్రాంతం పాలంపేట గ్రామంలో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్టులు, సావనీర్ షాప్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టడం జరుగుతుంది.
రెవెన్యూ శాఖ : రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను అత్యంత పారదర్శకంగా, సరళతరంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుటకు గాను నూతన ఆర్.ఓ.ఆర్. భూ భారతి చట్టంను రూపొందించినది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి 36 వేల 673 అర్జీలను స్వీకరించి, రికార్డులు పరిశీలన అనంతరం 6 వేల 284 దరఖాస్తులను ఆమోదించడం జరిగినది. భూములను రీసర్వే నిమిత్తం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను ఎంపిక చేసిన దానిలో వెంకటాపురం మండలంలోని నూగూరు రెవెన్యూ గ్రామం ఒకటి. దీనిలో భాగంగా ప్రతి భూ భాగాన్ని సర్వే చేసి రైతుల యొక్క విభాగానికి ల్యాండ్ పార్సెల్ మ్యాప్ తయారు చేసి రైతుల యొక్క ఆమోదం ద్వారా రెవెన్యూ రికార్డులలో అప్ డేట్ చేయుటకు ప్రక్రియ మొదలైనదని తెలుపుతున్నాను.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖలు : జిల్లాలోని 48 వసతి గృహాల్లోని విద్యార్థులకు కామన్ డైట్ అమలు చేస్తున్నాం. ఆహార నాణ్యత పరిశీలనకు ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేశాం. సంక్షేమ, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార తనిఖీలు నిర్వహించడం, నాణ్యత పరిశీలనకు ప్రతి వారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రత్యేక అధికారులు వారంలో 3 రోజులు విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి నాణ్యత, సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాం. డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాం. ఈ శాఖల ద్వారా విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, బెస్ట్ అవైలబుల్ స్కీం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తదితర పథకాలు అమలు చేస్తున్నాం.
విద్య శాఖ : ఈ విద్య సంవత్సరము ఇంటర్మీడియట్ ఫలితాలలో 81.12 శాతం సాదించి ములుగు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన, విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు. ఈ విద్య సంవత్సరం కన్నాయిగూడెం మండలంలోని కే.జి.బి.వి. పాఠశాలను జూనియర్ కాలేజీగా ఉన్నతీకరించడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన, నాణ్యమైన విద్యా బోధనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 6 కోట్ల 91 లక్షలతో 239 పాఠశాలల్లో మరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 413 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 20 వేల 112 మంది విద్యార్థులకు లక్షా 27 వేల 880 ఉచిత పాఠ్య పుస్తకాలు, లక్షా 9 వేల 215 వ్రాత పుస్తకాలను పంపిణీ చేశాం.
State Minister Danasari Anasuya Seethakka
ఉద్యానశాఖ : జిల్లాలో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం, తెలంగాణ సూక్ష్మనీటి పారుదల పథకం, సమీకృత జాతీయ నూనె గింజల ఆయిల్ పామ్ పథకాలు అమలు చేస్తున్నాం. సమీకృత జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ పథకం లో భాగంగా 265 మంది రైతులకు 343.78 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు పరిపాలన అనుమతులు, 72 మంది రైతులకు 88.74 హెక్టార్లలో 33.35 లక్షల రూపాయలను సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు, రైతులు ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం12 ఎకరాల్లో ఆయిల్ ఫ్యాక్టరీకోసం కేఎన్ బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి అనుమతి ఇచ్చి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది.
సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ: బీఏ ఎకనామిక్స్ హానర్స్, ఇంగ్లీష్ హానర్స్ కోర్సులతో ప్రారంభమైన యూనివర్సిటీ లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయానికి ఎదురుగా 287 ఎకరాల రెవెన్యూ భూమిని, 50 ఎకరాల అటవీ భూమిని కేటాయించి, త్వరలో యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
మహిళా, శిశు సంక్షేమ శాఖ : ఈ సంవత్సరంలో సఖి కేంద్రం ద్వారా 196 మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. 1372 మంది గర్భిణి స్త్రీలకు, 1037 మంది పాలిచ్చే తల్లులకు ప్రతి రోజు అన్నము, పప్పు, కూరగాయలు పాలు, గుడ్డుతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాము. 5,938 మందికి 7 నెలల నుండి 3 సం.ల లోపు చిన్నారులకు నెలకు 2.5 కేజీల బాలామృతముతో పాటు 16 గుడ్లను అందిస్తున్నాము. 6 వేల 424 మందికి 3 నుండి 6 సం.ల లోపు పిల్లలకు ఒక గ్రుడ్డు, అన్నము, పప్పు, కూరగాయలు, స్నాక్స్ ప్రతి రోజు పంపిణి చేయడం జరుగుతున్నది. వికలాంగుల కోసం సదరం సర్టిఫికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేసాము. గతంలో కేవలం 7 రకాల వైకల్యాలను మాత్రమే సదరం క్యాంపులలో గుర్తించే వారు. ఇప్పుడు 21 రకాల వైకల్యాలను గుర్తించి సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాం. జిల్లాలో 600 మంది దివ్యాంగులను గుర్తించి వారికి బ్యాటరీ వీల్ చైర్స్- 150, వీల్ చైర్స్- 250, హియరింగ్ ఎయిడ్స్- 40, ట్రై సైకిల్స్ 150, మోటరైజ్డ్ వెహికల్స్ 10, అందించడం జరిగింది. జిల్లాలో ఐదుగురు దివ్యాంగులు సకలాంగులను వివాహం చేసుకున్న 3 జంటలకు లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించడం జరిగింది.
గిరిజన అభివృద్ధి శాఖ : జనవరి 28 నుండి 31 వరకు మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ మహా జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఎస్టి, ఎన్డీ.ఎఫ్ పథకంలో భాగంగా గత రెండు సంవత్సరాలలో 52 రోడ్లు, 68 కోట్ల 51 లక్షలతో మంజూరు కాగా 12 రోడ్లు పూర్తి అయినవి. మిగతావి ప్రగతిలో ఉన్నవి. 25 గ్రామ పంచాయతీ బిల్డింగ్ పనులు 5 కోట్లతో మంజూరు కాగా 2 పూర్తి అయి మిగతావి పురోగతిలో ఉన్నవి. అసిస్టెంట్ టు ఐటీడీఏ లో భాగంగా గత రెండు సంవత్సరములలో 110 పనులు 723 లక్షల 30 వేలతో మంజూరు కాగా 70 పనులు పూర్తి అయినవి. అంగన్వాడి కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలు, సబ్ సెంటర్ల రిపేర్ల నిమిత్తము 227 పనులు, 11 కోట్ల 65 లక్షలతో మంజూరు కాక 126 పనులు పూర్తయినవి. 101 పనులు పూర్తి దశలో ఉన్నవి.
రహదారులు, భవనముల శాఖ :జిల్లాలో ఎస్టి.యస్.డి.ఎఫ్., ఆర్.డి.ఎఫ్., తదితర పథకాల ద్వారా 93 పనులకు గాను 228 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. 12 పనులు పూర్తికాగా 81 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవనం (కలెక్టరేట్), నివాస గృహముల నిమిత్తం 63 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. శరవేగంగా నిర్మాణం పనులు జరుగుచున్నవి. కోర్టు సముదాయ భవన నిర్మాణం కొరకు 81 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగినది. త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది.
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ :జిల్లాలో మహత్మా గాంధీ జాతీయ ఉపాది హామీ పథకం క్రింద 9 కోట్ల 52 లక్షల అంచనా వ్యయంతో 22 గ్రామ పంచాయతీ భవనాలు 30 అంగన్వాడి కేంద్రాలు 76 స్కూల్ టాయిలెట్స్ పనులు చేపట్టడం జరిగింది. సి.ఆర్.ఆర్. పథకం ద్వారా 73 కోట్ల 98 లక్షలతో 37 రోడ్లు, ఎం.ఆర్.ఆర్. పథకం ద్వారా 109 కోట్ల 76 లక్షలతో 62 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎఫ్ డి ఆర్, ఎస్టి ఆర్ పథకాల ద్వారా 28 కోట్ల 49 లక్షల నిధులతో 24 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. ఎస్.డి.ఎఫ్. గ్రాంటు క్రింద ఎస్.టి కాంపోనెంట్ లో 33 కోట్ల 25 లక్షల తో 10 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎస్.ఎస్.ఎం. జె. గ్రాంట్ క్రింద 7 కోట్ల 14 లక్షలతో 11 కూడలి అభివృద్ధి వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. 6 కోట్ల అంచనా వ్యయంతో 3 ఎం.పి.డి.ఓ. కార్యాలయ భవనాలు, ఒక కోటి 80 లక్షలతో 2 పి. ఆర్. సబ్ డివిజన్ ఆఫీస్ భవనాలు, 2 కోట్లతో ఒక పి.ఆర్.ఎస్. ఈ. ఆఫీస్ భవనం మంజూరు చేయడం జరిగినది.
యాస్పిరేషన్ అవార్డు : మన జిల్లాకు యాస్పిరేషన్ అంశాలలో రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లాకు అవార్డు ఇవ్వడం ఎంతో గౌరవంగా ఉంది. ఈ సందర్భంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ ని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను. మన జిల్లా యాస్పిరేషన్ నుండి ఇన్పిరేషన్ జిల్లాగా అభివృద్ధి చెంది రోల్ మాడల్ గా నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను.
పోలీస్ శాఖ : శాంతి భద్రతల పరిరక్షణకు పొలిసుశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటూ, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో నేరాలను చేధించడంతో పాటు నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమైన జిల్లా ఎస్పి, పోలిస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న మన జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారికి, జిల్లాలో ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు తమ పూర్తి సహకారం అందిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, వివిధ సంస్థల గౌరవ చైర్మన్లు. డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగ వేళ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ముగిస్తున్నాను.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్వి కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం విద్యార్థుల సమక్షంలో అందజేయడం జరిగినది. విషయం రాష్ట్రంలోని గురుకుల రోజుకో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ హై విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుండి దాదాపు 95 మంది విద్యార్థులు చనిపోవడం జరిగినది.అలాగైనా ఈ ముఖ్యమంత్రి విద్యార్థుల సమస్యలపై మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమని తెలియజేస్తున్నాం తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నాయకత్వంలో గురుకుల వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైందని విద్యార్థి తల్లిదండ్రులు గురుకులాలకు పంపియాలంటేనే భయపడే పరిస్థితి తీసుకు వచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల గోస కనిపియ్యకపోవడం చాలా బాధాకరం తరగతి గదిలో చదువుకునే విద్యార్థులు నడిరోడ్డు మీదికి రావడం మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేదా అని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా గురుకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి పడుకున్నప్పుడు కలలోకి పోయి ఇటు బోధన చేయాలని అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి సాయికిరణ్, ముధం అనిల్ గౌడ్, ఎస్.కె అప్రోచ్, హరీష్,జోయల్, శివ రాకేష్, కృష్ణ, వంశీ,రోహిత్,విష్ణు తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్ల అంబేద్కర్ కాలనీ15వ వార్డులో రేషన్ కార్డుల పంపిణీ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్, 15వ వార్డు కాలనీలోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకునూరి బాలరాజు ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగినది. బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలందరికీ ఇలాంటి రేషన్ కార్డులు ఇవ్వ లేదు, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలందరికి ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరమని అంతే కాకుండా పేదకుటుంబలకు రేషన్ షాపులలో అందించే సన్న బియ్యం తింటున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేదురి లక్ష్మణ్,గొల్లపల్లి పరశురాములు,నక్క నరసయ్య, కొమ్ము త్యాగరాజు, ఆకునూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
సంగారెడ్డి జిల్లా కోహీర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నరేష్ కు బుధవారం నాడు పైడిగుమ్మల్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చీమల ప్రశాంత్, ఉపాధ్యక్షుడు నేరేడు మహేష్, అనిల్ కుమార్, అంబేద్కర్ యువజన యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం… తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కమాన్ ఆర్చి ప్రారంభోత్సవం జరిగింది. సందర్భంగా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ ఇందుకుగాను దాతలు సాయం కమాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ఎందుకు సహకరించిన దాతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్టి విమానానికి సహకరించిన దాతలకు కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపిక అందజేసి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఇందుకుగానుముఖ్య అతిథులుగా గౌరవధాతలు. తుమ్మ రామస్వామి . రిటైర్డ్ సెక్రటేరియట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ. గొట్టే.పద్మారావు రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ కరీంనగర్. గొట్టే.జయశ్రీ స్పెషల్ డిస్టిక్ డిప్యూటీ కలెక్టర్ భువనగిరి జిల్లా. గొట్టే.అశోక్. రిటైర్డ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్. గొట్టే సంజీవయ్య ఎస్సార్ మేనేజర్ ఎన్టిపిసి మరియు తుమ్మ శ్రీనివాస్ . టి జి పి డి సి ఎల్ జూనియర్ అసిస్టెంట్.గొట్టే పద్మ. టిఆర్ఎస్ జిహెచ్ఎంసి జనరల్ సెక్రెటరీ హైదరాబాద్ కమిటీ సభ్యులు గట్టేపల్లి రమేష్ .క్యారo పెంటయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి లింగాల జలంధర్ . గొట్టే కరుణాకర్. నాయకులు గ్రామ మహిళలు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం కొత్వాల్ గూడ నూతన కమిటీ ఎన్నిక…
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం నూతన అధ్యక్షులు, కమిటీ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది. అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం నూతన అధ్యక్షులుగాచేవెళ్ల గిరి,ప్రధాన కార్యదర్శిగా చేవెళ్ల రాకేష్,కోశాధికారిగా : పిల్లి రాహుల్ కుమార్, ఉపాధ్యక్షులుగా పత్యర రాములు , సిద్ధం విజయ్, చెరుకుల శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ నిరటినరసింహ, చేవెళ్ల రాజేష్,పత్తి నర్సింగ్ రావు, పత్యారాశ్రీనివాస్, పంబాల చంద్రయ్య, పత్యారా శేఖర్, ఆవుల బెంజ్ మేన్, చేవెళ్ల కృష్ణ, చేవెళ్ల రమేష్,పిల్లి ప్రేమ్ రాజు, పత్యార ఎలీషానవీన్ కుమార్, అవుల కళేబ్, పంబల రాజు, చేర్కుల నర్సింహ, చెర్కుల అంజయ్య పెద్దలకు సమక్షంలో నూతన అధ్యక్షులు కమిటి సభ్యులను ఎన్నుకొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మన్నె దర్శన్ రావు, ఉపాధ్యాయులు మేకల ప్రవీణ్ కుమార్ ల ఆధ్వర్యంలో నూతనంగా అంబేద్కర్ సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈయొక్క కమిటీ గౌరవ అధ్యక్షులుగా మన్నె కిషన్ చందర్, కమిటీ సలహాదారునిగా మేకల విజేందర్, అధ్యక్షులుగా మేకల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, ఉపాధ్యక్షులుగా చిలుముల హరీష్, మేకల కిరణ్ లు, కోశాధికారిగా సుమన్, కార్యదర్శిగా మేకల అభిషేక్, జాయింట్ సెక్రెటరీగా రవితేజ, సహాయ కార్యదర్శిగా గడ్డం రాజు, కార్యవర్గ సభ్యులుగా దాసరి సుధీర్ కుమార్, కనకం సతీష్, గుడిసే శ్రీకాంత్, కలిగేటి శ్రీకాంత్, వడ్లూరి మహేష్, మన్నే విక్రం, గోల్కొండ సంతోష్, మేకల విని కుమార్, తదితరులను ఎన్నుకోవడం జరిగింది.
Mekala Praveen Kumar.
ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కొరుటపల్లి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా మావంతు కృషి చేస్తామని తెలిపారు.
రోడ్డు వెడల్పు విషయంలో అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం సమంజసం కాదు
నిజాంపేట: నేటి ధాత్రి
మెదక్, సిద్దిపేట నేషనల్ హైరోడ్డు వెడల్పు విషయంలో అంబేద్కర్ విగ్రహాలు తొలగించడం సమంజసం కాదు
నిజాంపేట: నేటి ధాత్రి
మెదక్, సిద్దిపేట నేషనల్ హైవే రోడ్డు పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను తొలగించడం విషయమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తొలగించిన విగ్రహాలను యధావిధిగా ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఏంఆర్పిఎస్టిఎస్ అధ్యక్షులు గరువుల శ్రీనివాస్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సల్లూరి శ్రీనివాస్, ఆందోల్ దళిత నాయకుడు మాసన్నపల్లి నాగరాజు ,పిఎస్ టీఎస్ నిజాంపేట మండల అధ్యక్షుడు జనగామ స్వామి మెదక్ కాంగ్రెస్ యువ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు వే రోడ్డు పనుల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను తొలగించడం విషయమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తొలగించిన విగ్రహాలను యధావిధిగా ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఏంఆర్పిఎస్టిఎస్ అధ్యక్షులు గరువుల శ్రీనివాస్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సల్లూరి శ్రీనివాస్, ఆందోల్ దళిత నాయకుడు మాసన్నపల్లి నాగరాజు ,పిఎస్ టీఎస్ నిజాంపేట మండల అధ్యక్షుడు జనగామ స్వామి మెదక్ కాంగ్రెస్ యువ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక సోషల్ వెల్ఫేర్ వెలుగు బాలికల గురుకుల పాఠశాలలో రిటైర్డ్ డిడబ్ల్యు ఓ అధికారి చిన్నయ్య ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నిసోమవారం రోజున గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించా:రు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు.
అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు , ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీజ చిట్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు చిలుకల రాయకోమురు, దబ్బేట అనిల్ శ్రీనివాసు రాజమౌళి మార్కండేయ తదితరులు పాల్గొన్నారు
శాయంపేట మండలంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదల ప్రజల అదృష్టం. అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం. ఎమ్మా ర్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం వెంకటేష్ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపేల్లి రవీంద ర్ (బుజ్జన్న) మర్యాద పూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలకేంద్రం ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమైన అంబేద్కర్ భవనం లేకపోవడం చాలా దురదృష్ట కరం. అంబేద్కర్ భవనం రావడం సంతోషం. అంబేద్కర్ భవనం నిర్మాణ చేస్తానని కాంగ్రెస్ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావు హామీ ఇవ్వడం జరిగింది.. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తుడుం వెంకటేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ, ఎంఎస్ పి మండల అధ్యక్షులు మారపేల్లి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి రజినికర్ మాదిగ ,మాజీ మండల అధ్యక్షులు కొమ్ముల పరమేష్, ఎమ్మార్పీ ఎస్ మండల సీనియర్ నాయకు లు.రంగు బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకు లు,పోతుగంటి సాంబరాజ్, ఎమ్మార్పీఎస్ పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
హోతి బి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ
జహీరాబాద్ . నేటి ధాత్రి:
అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన రాసిన రాజ్యాంగం పల్లె తెలంగాణ రాష్ట్ర ఏర్పడినందుకు తెలంగాణ ఫాదర్ ఆఫ్ ది గార్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచిపోతారని చరిత్రలో నిలిచిపోయే పేరు రాజ్యాంగ గ్రహీత డాక్టర్ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్ని వర్గాలకు సమానత్వం చేస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తూ మనమంతా ఒకటేనని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాజీ కౌన్సిలర్లు మాజీ జెడ్పిటిసిలు మండల అధ్యక్షులు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ నినాదంతో ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు
Ambedkar
తట్టు నారాయణ, నామ రవి కిరణ్, మహమ్మద్ ఇమ్రాన్ బి ఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్, డ్రైవర్ కాలనీ జాకీర్, అహమద్ నగర్, ఆలీ, సీఎం అశోక్ రెడ్డి, బండి మోహన్, మోయోద్దీన్ సాబ్, పాల్గొనడం జరిగింది.
అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్. నేటి ధాత్రి:
బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ గారు అందించిన సేవలు ఆమోగమని భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా అంబేద్కర్ గారు దేశ రాజ్యంగాన్నీ తీర్చిదిద్దారని అన్నారు,వారు ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలో మనమందరం నడుచుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో నాయకులు డి.మాణిక్ ప్రభుగౌడ్ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,శివ కుమార్,పి.జి.ఈశ్వర్,యస్, గోపాల్,చెంగల్ జైపాల్,బి. వేణుగోపాల్,యస్.శ్రీనివాస్, రాజేందర్,దిలీప్,ప్రేమ్ కుమార్, ప్రకాష్,సునీల్, తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించాడని, అంటరానితనం అస్పృశ్యత నివారణకు కృషి చేశారన్నారు. బహుజనులకు ఆరాధ్యుడన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, వెంకటాచారి, యాదయ్య, శ్రీశైలం, నుప్ప ప్రకాష్, కొంగళ్ళ శ్రీను, శంకర్ నాయక్, లక్ష్మయ్య, వెంకటయ్య, జంగయ్య, మాసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జన్నే యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరీ రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ మండల ప్రధాన కార్యదర్శులు మడికొండ రవీందర్రావు ఏరుకొండ రాజేందర్ మండల నాయకులు బైరం భద్రయ్య పాండ్రాల వీరస్వామి దామెర రాజు మేడిపల్లి శ్రీనివాస్ వల్ల కొండ లింగారెడ్డి చిదిరాల సరోజన వినవంక శ్రీదేవి మైదము కరుణ ముల్కోజు ప్రవీణ్ సిద్ధోజు శ్రీకాంత్ చారి కైరిక రాజు గుండు నగేష్ కట్కూరి రాజేందర్ కట్కూరి కుమార్ (గని) అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆదివారం గీసుగొండ మండల కేంద్రంలో కీర్తిశేషులు తుప్పరి సూర్యనారాయణ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు తుప్పరి వికాస్ ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం గీసుగొండ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దౌడు అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు.రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశాకిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.