అప్పుడు చిరాకు.. ఇప్పుడు వ్యసనం.. మాట మార్చిన కింగ్
హిందీలో బిగ్ బాస్ (Bigg Boss) అంటే సల్మాన్ ఖాన్ (Salman Khan).. సల్మాన్ ఖాన్ అంటే బిగ్ బాస్. అదే తెలుగులో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అంటే బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటే నాగ్ అని చెప్పుకుంటున్నారు.Akkineni Nagarjuna: హిందీలో బిగ్ బాస్ (Bigg Boss) అంటే సల్మాన్ ఖాన్ (Salman Khan).. సల్మాన్ ఖాన్ అంటే బిగ్ బాస్. అదే తెలుగులో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అంటే బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటే నాగ్ అని చెప్పుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు 7 సీజన్లుగా నాగ్ నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ మొదలయ్యింది. సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు. మూడో సీజన్ నుంచి నాగ్ బిగ్ బాస్ ని తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రతి సీజన్ కి హోస్ట్ మారతాడు అంటూ వార్తలు వచ్చినా చివరకు నాగ్ నే హోస్ట్ గా వస్తున్నాడు.అయితే బిగ్ బాస్ రెండు సీజన్స్ నడిచేటప్పుడు.. ఆ షో గురించి నాగ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ షో కాన్సెప్ట్ అంటేనే చిరాకు అని, తానెప్పటికీ ఆ షో చూడను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత సీజన్ లోనే హోస్ట్ గా కనిపించేసరికి నెటిజన్స్ నాగ్ పై విమర్శలు గుప్పించారు. చెప్పడానికే నీతులు.. డబ్బులు ఎక్కువ వస్తే మాటలు కూడా మార్చేస్తారు అని చెప్పుకొచ్చారు. అయితే ఆ విమర్శలపై నాగ్ ఎప్పుడు స్పందించలేదు.ఇక తాజాగా జియో హాట్ స్టార్ సౌత్ అన్ బాండ్ వేడుకలో నాగార్జున.. మాట మార్చాడు. ఒకప్పుడు చిరాకు అన్న షోనే ఇప్పుడు తనకు వ్యసనంగా మారిందని చెప్పుకొచ్చాడు. ‘ ఒకప్పుడు బిగ్ బాస్ అంటే నాకు ఇష్టం లేదు అన్న మాట వాస్తవమే. కానీ, ఒక్కసారి ఇందులోకి అడుగుపెట్టాక తెలిసింది. ఇప్పుడు నాకు ఈ షో ఒక వ్యసనంలా మారింది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో గతంలో నాగ్ అన్న మాటను వెనక్కి తీసుకున్నట్టే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకో వారం బిగ్ బాస్ సీజన్ 9 కూడా పూర్తవుతుంది. మరి బిగ్ బాస్ సీజన్ 10 కి కూడా నాగ్ నే హోస్ట్ గా వ్యవహరిస్తాడా.. ?లేక మారతాడా అనేది చూడాలి.
