డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరిస్తాం…

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరిస్తాం…

మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి, వైస్ చైర్మన్ సరిత

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మునిసిపాలిటీ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి ,వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత లు అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే పేదలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సమస్యల వలయంలో ఉన్నాయని తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఇండ్ల ప్రాంతాన్ని కూటమి కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. అనంతరం చైర్ పర్సన్ సంధ్యారాణి, వైస్ చైర్మన్ సరిత లు మాట్లాడారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో 286 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి అర్హులైన పేదలకు సుమారు 230 ఇండ్లను కేటాయించారని అన్నారు. అట్టి డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాంతంలో సమస్యలు నెలకొని ఉన్నాయని తెలియడంతో బిఆర్ఎస్ సీపీఐ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులతో కలిసి సందర్శించామని తెలిపారు. ఇండ్ల సమీపంలో చుట్టూ పిచ్చి మొక్కలు ఉండగా,విద్యుత్ తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించి సత్వరమే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇంటి డోర్లు, కిటికీలు, డ్రైనేజీ, పూర్తిగా అధ్వానంగా ఉండడంతో ఇండ్లలోకి ఎవరు రావడంలేదని స్థానికంగా ఉంటున్న కొందరు తెలిపారని, ఇట్టి విషయాన్ని స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలను తెలియపరుస్తామని, సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతామని,వెంటనే వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియచేశారు. వారం రోజులలో ఇండ్ల చుట్టూ నెలకొని ఉన్న పిచ్చి మొక్కలను క్లీన్ చేయిస్తామని, మంచినీటిని సైతం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాజా రమేష్,పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, రామిడి కుమార్,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్లు కౌడగొని సాంబయ్య , జుంజుపల్లి శశి కుమార్, మద్దెల శంకర్, ముని, వెనంక శ్రీనివాస్, బొమ్మ భూమయ్య గౌడ్, జక్కనబోయిన మంజుల, కొప్పి రాజశేఖర్, ఆర్నె సంధ్య, గండమాల కృపానందం, రంగ లక్ష్మీ, బబ్బెర స్వర్ణలత, సీనియర్ నాయకులు రామిడి కుమార్,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, జిలకర మహేష్, అనిల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

కరెంట్ సమస్యలు తీర్చేందుకు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు…

కరెంట్ సమస్యలు తీర్చేందుకు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్

వివేకానంద కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

నర్సంపేట,నేటిధాత్రి:

10 వ వార్డులో ఉన్న కరెంట్ సమస్యలను తీర్చడం కోసం నూతనంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామనంద్ అన్నారు.నర్సంపేట పట్టణంలోని 10వ వార్డు వివేకానంద కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ తో కలిసి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్, ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, వివేకానంద కాలనీలో విద్యుత్ సరఫరా సమస్యలు తీవ్రంగా ఉండేవని తెలిపారు. ఓవర్‌లోడ్ కారణంగా జంపర్లు కాలిపోవడం, తరచూ విద్యుత్ అంతరాయం కలగడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కాలనీ కొంత ప్రాంతానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పట్టణంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తున్నామని, ముఖ్యంగా 10వ వార్డులో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీరామోజు రోజారాణి, విద్యుత్ శాఖ ఏఈ అశోక్, వార్డు సభ్యులు దార గణేష్, అరెపెల్లి బాబు, మహేందర్, మారపెల్లి అశోక్, పాశికంటి రమేష్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్‌మెన్ తదితరులు పాల్గొన్నారు.

తుమ్మనపల్లి గ్రామంలో విద్యుత్ ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు.

తుమ్మనపల్లి గ్రామంలో విద్యుత్ ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు.

జహీరాబాద్ నతి ధాత్రి:

ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామస్తులు తరచుగా విద్యుత్ కోతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ పేర్కొన్నారు. రోజుకు చాలాసార్లు విద్యుత్ కోతలు ఉండటం వల్ల గృహ అవసరాలు, రైతుల వ్యవసాయ కార్యకలాపాలు అంతరాయం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. [కీలక] సమయాల్లో కూడా సరైన విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులను వెంటనే సమస్యను పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఆయన కోరారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మున్సిపల్ కమిషనర్ & అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి నూతనంగా జహీరాబాద్ మున్సిపాలిటీ లో విలీనమైన గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని .రానున్న రంజాన్ పర్వదిన సందర్భంగా పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని ,ముఖ్యంగా ప్రార్థన మందిరాల వద్ద పరిశుభ్రత ,ప్రత్యేక వీధి దీపాలు ఏర్పాటు , రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని , అదేవిదంగా పెండింగ్ టాక్స్ (బకాయిలను) వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జైతు రామ్,మున్సిపల్ అధికారులు , కౌన్సిలర్ లు తంజీమ్,గౌస్ గోరి,జాకీర్, జాహేద్ అలీ ,మహిపాల్ యాదవ్,దీపక్,మాజీ కౌన్సిలర్ లు నామ రవికిరణ్ , అబ్దుల్లా, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో వ్యవసాయ విద్యుత్ అవగాహన కార్యక్రమం

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం.

నర్సంపేట,నేటిధాత్రి:

వ్యవసాయం పట్ల విద్యుత్ వినియోగం అందుకు నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో నర్సంపేట రూరల్ విద్యుత్తు ఏఈ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రధానంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయానికి విద్యుత్ వాడే క్రమంలో కెపాసిటర్లు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. మోతాదుని మించి విద్యుత్తు వాడరాదని తెలిపారు. విద్యుత్తు సమస్యలు వస్తే వెంటనే పరిష్కారం చేస్తామని ఏఈ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ కుమారి,వార్డు సభ్యులు మామిడి ఐలయ్య,
లైన్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్ మ్యాండ్ రమేష్, మాజీ వార్డు మెంబర్ ఉప్పుల రాజు, భయ్య నవీన్, సలుపాల ప్రభాకర్, సుధాకర్, ఐలయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట కార్యక్రమం

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజాబాట

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి రూరల్ మండలంలోని గుడాడ్ పల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో ఎస్.ఎస్ నెంబర్ 17/15 కేవిఏ డిటీఆర్ క్రింద లైన్ కు తగిలే చెట్టుకొమ్మలు కొట్టివేయడం జరిగింది మరియు లూస్ లైన్ ఉంటే సరిచేయటం జరిగింది. ఎల్ టి లైన్ లో మిడిల్ పోల్స్ కొరకు ఎస్టిమేషన్ పంపించి మిడిల్ పోల్స్ వేస్తాము ఎన్ని చెప్పారు, విద్యుత్ షాక్ కు గురికాకుండా ఉండడానికి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫర్మర్స్ ఫ్యూస్ బూర్న్ అయినపుడు ప్యూజ్లను వెంటనే వేయవద్దని వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియపర్చాలి.తెగివున్న లైన్ను తాకకూడదు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని అన్నారు. రైతులు జాయింట్ ఉన్న సర్వీస్ వైర్స్ ను వెంటనే మార్చాలని అన్నారు. విద్యుత్ వినియోగదారుల్లు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి సంప్రదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడాడ్ పల్లి గ్రామ సర్పంచ్ దారూరి శారదా సంతోష్ విద్యుత్ శాఖ భూపాలపల్లి రూరల్ సబ్ ఇంజనీర్ గుగులోత్ నాగేష్ ,సిబ్బంది శ్రీకాంత్ లైన్ ఇన్స్పెక్టర్ మల్లేశం లైన్మెన్ ఎండి బాబా సాదిక్ హైదర్ లైన్మెన్ గణేష్ జేఎల్ఎం రాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.

అలియాబాద్ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం…

అలియాబాద్ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

 

 

 

మండలంలోని అలియాబాద్ గ్రామంలో విద్యశాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ తో పాటు గ్రామ వీధుల్లో పర్యటిస్తూ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ విద్యుత్ వినియోగంపై బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. విద్యుత్‌ను సక్రమంగా వినియోగిస్తూ బిల్లులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని సూచించారు.అలాగే విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు,సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ విజయం అవసరం..

గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ విజయం అవసరం

ఉల్లెంగల యాదగిరి స్పష్టం

నేటి ధాత్రి ఐనవోలు:

 

 

రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి ఉల్లెంగల యాదగిరి పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో అభివృద్ధి జరగాలంటే అనుభవజ్ఞులు, ప్రజాభిమానాన్ని గెలుచుకున్న నాయకులు ముందుకు రావాలని పేర్కొన్న యాదగిరి,రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 14వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే మాత్రమే గ్రామాలు మార్పు దిశగా అడుగులు వేస్తాయి” అని స్పష్టం చేశారు.

యాదగిరి నాయకత్వం – గ్రామాలకు భరోసా మాట

ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, గడచిన కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటించిన ఉల్లెంగల యాదగిరి ప్రతి ఇంటి సమస్యను విన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు.తాగునీరు అందుబాటులోకి రావాలి.గ్రామీణ విద్యా వ్యవస్థ బలపడాలి. ఉద్యోగావకాశాలు పెరిగే విధానాలు రావాలి.మురికినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరం.ఎలక్ట్రిసిటీ సమస్యలు పూర్తిగా తొలగాలి.గ్రామీణ రహదారులు, పంచాయతీ భవనాలు అభివృద్ధి చెందాలి.”ఈ పనులు చేయగలిగేది కేవలం ప్రజలు ఎన్నుకున్న శక్తివంతమైన సర్పంచులు మాత్రమేనని, అందుకోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం తప్ప ప్రజలకు మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ – యాదగిరి దృఢసంకల్పం

“గ్రామం అభివృద్ధి చెందాలి అంటే నాయకులు కాదు… ప్రజలే ముందుకు రావాలి.
ప్రజలు ఓటుతో ఇచ్చే తీర్పే పాలనను మార్చగల శక్తి” అని యాదగిరి పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజల పురోగతి, భవిష్యత్తు తరాలకు మంచి గ్రామం నిర్మించాలనే లక్ష్యంతో, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. అభివృద్ధిని కాంగ్రెస్ హామీ ఇస్తుంది, అని ఉల్లెంగల యాదగిరి ప్రజలను కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version