జనగామ నుండి సిద్దిపేట వరకు బస్సు లో అందని మహిళల ఉచిత బస్సు సౌకర్యం..

జనగామ నుండి సిద్దిపేట వరకు బస్సు లో అందని మహిళల ఉచిత బస్సు సౌకర్యం

అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్న కండక్టర్లు

చేర్యాల నేటిధాత్రి

జనగామ డిపో పరిధిలో ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలలో గొప్పగా చెప్పుకునే ఆర్టీసీ ఉచిత మహిళల బస్సు సౌకర్యం ప్రయాణం అనే పథకం జనగామ డిపో పరిధిలో గల కండక్టర్లు పలు కారణాలు చూపిస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాలేరని విమర్శలు వస్తున్నాయి ఇక్కడ తిరిగే మహిళలు వాపోతున్నారు జనగామ సిద్దిపేట వెళ్లే దారిలో నిత్యం కండక్టర్లు మొండివైఖరితో మహిళలను ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు తీసుకుంటూ ఏమైనా ఉంటే డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేసుకోమని దురుసుగా ప్రవర్తిస్తున్నారు తెలంగాణ అని రాసి ఉన్న మహాలక్ష్మి పథకం కింద ఫోటో సరిగ్గా లేదని ఫోటో లేటెస్ట్ గా లేదని కుంటి సాకులు చెబుతూ మహిళలను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు వెంటనే డిపో మేనేజర్ చర్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకు వచ్చిన మహిళలు కు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు

రాష్ట్రంలో పేదలందరికి సంక్షేమ పథకాలు…

రాష్ట్రంలో పేదలందరికి సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం మహిళ కు వరం

రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డ్

వనపర్తి నేటిదాత్రి .

 

 

రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాల ను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిఅన్నారు
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయము లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. .
అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాల పై ప్రగతి నివేదికను అధికారులు చదివి వినిపించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, అదనపు కలెక్టర్ లు రెవెన్యూ ఖిమ్యా నాయక్, స్థానిక సంస్థలు యాదయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్, డీఎస్పీ వెంకటేశ్వర రావు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూచరిత్రలో 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 78 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమయిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని, అందుకే ఈ రోజున తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 555 సంస్థానాలు ఇండియన్ యునియన్ లో కలిశాయి, హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్ర రాజ్యాంగ ఉండేందుకు నిర్ణయించుకుందన్నారు రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు
మహాలక్ష్మి పథకం మహిళలకు వరం ప్రభుత్వం ప్రతి మహిళలను మహాలక్ష్మిగా చేయాలనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల 38 లక్షల 68 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. మొత్తం ప్రయాణికులలో 64.28 శాతం మహిళలు ప్రయాణించటం జరిగింది. ఇందుకు గాను రూ.97.54 కోట్లను ప్రభుత్వం భరించిందన్నారు.
మహిళల శక్తిగా మహిళా శక్తి పథకం జిల్లాలోని మహిళా సంఘాలను బలోపేతం చేయుటకు 10 మండల మహిళా సమాఖ్యలకు 10 ఆర్టీసీ బస్సులను ఇచ్చామని వీటి ద్వారా ప్రతి మండల మహిళా సమాఖ్యకు నెలకు దాదాపుగా రూ69 వేల ఆదాయం వస్తుందని అన్నారు
కొత్త రేషన్ కార్డుల మంజూరు
జిల్లాలో ఇప్పటివరకు 17,490 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయటం జరిగింది, దీని ద్వారా 45,576 మంది లబ్దిపొందారు. అలాగే ప్రస్తుత కార్డులలో కొత్తగా 29,858 మందిని చేర్చటం జరిగిందన్నారు.
పేదలకు ఆరోగ్యదాయనిగా మారిన రాజీవ్ ఆరోగ్యశ్రీ:అందరికీ ఆరోగ్యం” సాధించాలనే లక్ష్యంతో, రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా 1835 రకాల జబ్బులకు వైద్య సేవలను అందిస్తున్నాము. గతంలో ఉన్న వైద్య చికిత్సల ఖర్చు పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి ఈ ప్రభుత్వం చెల్లించటం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో ఏప్రిల్ 1, 2024 నుండి ఇప్పటివరకు 15,540 మంది రూ.39.77 కోట్ల విలువైన వైద్య సేవలను వినియోగించుకున్నారన్నారు.
నిరుపేదల సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో 6,173 ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు ఉన్న 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉచిత కరెంటు జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాలలో సి సి కెమెరాల ద్వారా పర్యవేక్షణ నేరాలను నియంత్రించటం జరుగుతున్నదన్నారు పోలీస్ శీ టీ o ద్వారా మహిళల కు రక్షణ కల్పించటం. సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించటం జరుగుతుంని. జిల్లా ప్రజలు, యువత సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాల నిర్వహన జిల్లా లో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకంపై జిల్లాలో ప్రత్యేక పోలీస్ నిఘా టీమ్స్ ఏర్పాటు చేసి, ప్రత్యేక నార్కోటిక్ డాగ్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్, బస్టాండ్, కళాశాలలు రద్దీ గల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూన్నారని అన్నారు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా ప్రజలకు న్యాయమూర్తులకు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఎంపీలు ఎమ్మెల్సీ లకు,ఎమ్మెల్యే లకు , అదనపు కలెక్టర్లు జిల్లా ఎస్పీ విలేకరులకు జిల్లా అధికారులకు డి పి ఆర్ ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల జిల్లాలోని ఘనంగా ప్రజాపాలన దినోత్సవం…

సిరిసిల్ల జిల్లాలోని ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే

పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

ప్రజా పాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పై వివరించారు.

 

 

ఈ సందర్బంగా విప్ మాట్లాడారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 09/12/2023న కొలువుదీరింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది.

 

 

2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను.
మహిళల అభ్యున్నతే ధ్యేయంగా: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డీఆర్డీఓ, మెప్మా ఆద్వర్యంలో జిల్లాలోని ఎస్ హెచ్ జీల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7వేల 111 లక్ష్యానికి గాను ఇప్పటిదాకా 1 వెయ్యి 586 యూనిట్లను గుర్తించి 200 కోట్ల బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా రూ.68 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటిదాకా రూ. 25 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. 5వేల 691 యూనిట్లు లక్ష్యం కాగా, వెయ్యి 607 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. చేయూత పింఛన్లు జిల్లాలో లక్ష 17 వేల 370 మంది పించన్ దారులకు ప్రతి నెలా రూ.25 కోట్ల 73 లక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది.
ఎస్ హెచ్ జీ మహిళలకు చీరలు: సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షల 7౦ వేల మందికి పైగా ఉన్న ఎస్ హెచ్ జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగినది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది.
సన్న బియ్యం పంపిణీ: పీడీఎస్ వ్యవస్థ పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతున్నది. లక్ష 77 వేల 851 కుటుంబాలు, 5 లక్షల 35 వేల 920 మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది.నూతన రేషన్ కార్డులు: జిల్లాలో కొత్తగా 14 వేల 75 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 3౦ వేల 376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్చడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. రైతు రుణమాఫీ: గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు, రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి.. కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. “ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో 393 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాము. రైతు భరోసా కింద లక్ష 26వేల 278 మంది రైతులకు.. 149 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 45లక్షల రుణ మాఫీ చేశాము. రాష్ట్రంలో 7 వేల 178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతున్నది. దీని కోసం రూ.16 వేల 691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లించడం జరుగుతున్నది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష 13 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఇందిరమ్మ ఇండ్లు: తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి రూ.22 వేల 500 కోట్లు వెచ్చించడం జరుగుతున్నది. జిల్లాలో 12 వేల 623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 7 వేల 927 ఇండ్లు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4వేల 696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. 10వేల 234 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5 వేల 305 గృహాలకు లబ్దిదారులు ముగ్గు పోయడం జరిగింది. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 38 కోట్లకు పైగా నేరుగా జమ చేసింది.
మహాలక్ష్మీ పథకం: ద్వారా ఆడబిడ్డలకు రూ.6 వేల 790 కోట్లు ఆదా అయ్యింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా రూ. 46 వేల 689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 315 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు.
గృహజ్యోతి పథకం: ద్వారా మార్చి 2024 నుంచి ఆగస్ట్ 2025 వరకు మొత్తం 17 లక్షల 52 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ. 67 కోట్ల 70 లక్షల లబ్ది చేకూర్చాము. జెగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్
(వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎన్.పీ.డీ.సీ.ఎల్ కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
వైద్యారోగ్య శాఖ : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యారోగ్యంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచగా, డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ఆగస్ట్ 2025 వరకు 24 వేల 154 మంది రోగులు రూ. 62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది. జిల్లాలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటిదాకా 4వేల 795 చెక్కుల ద్వారా రూ. 16కోట్ల 85 లక్షలు, అలాగే 275 ఎల్ఓసీల ద్వారా రూ. 5 కోట్ల సాయం అందజేయడం జరిగింది.
మత్స్య శాఖ: ధర్తి అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన రుద్రంగి, వీర్నపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్దిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ: యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం.ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీ.జీ.పీ.ఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది.
పోటీ పరీక్షల్లో రాణించేలా: జిల్లాలోని విద్యార్థులు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ-జేఈఈ, నీట్-యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతున్నది. మొత్తం 13 వేల 564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
పనుల జాతర: జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో రూపాయలు 7 కోట్ల 80 లక్షల విలువ గల 258 పనులు చేపట్టడం జరుగుతున్నది.చివరి ఆయకట్టుకు నీరు అందించేలా: తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలి…

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ బస్టాండ్ లో పరకాలకు వెళ్లే నూతన బస్సును జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి – పరకాల(వయా మొరంచపల్లి, ఎస్ యం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల, రేగొండ) సర్వీసును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మొరంచపల్లి, ఎస్ఎం కొత్తపల్లి, ఒడితల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుడిలా ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎస్.యం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎలగొండ సమ్మక్క తో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఒడితల గ్రామానికి బస్సు చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. బస్సు వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయకస్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహాలక్ష్మీ పథకం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
ఉదయంబసు టైమింగ్స్
6:30 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి పరకాలకు 8 గంటలకు చేరుకుంటుంది.
తిరుగుప్రయణంలో ఉదయం 8:15 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 10 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది.
బసు సాయంత్రం టైమింగ్స్
5:15 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 6:45 గంటలకు పరకాల చేరుకుంటుంది.
7:00 గంటలకు పరకాల బస్టాండ్ నుండి బస్సు బయలుదేరి 8:20 గంటలకు భూపాలపల్లి బస్టాండ్ కు చేరుకుంటుంది. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version