ఆది కర్మయోగి అభియాన్ గ్రామస్థాయి శిక్షణ కార్యక్రమం
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ప్రజా పరిషత్ ఆదికర్మయోగి అభియాన్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మండల నోడల్ అధికారి ఎంపీడీవో కుమార్ అధ్యక్షతన గ్రామస్థాయి ఆది కర్మయోగి అభియాన్లను శిక్షణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ప్రాథమిక అవసరాలు, మౌలిక సదుపాయాలు కల్పించుట, ఉపాధి మొదలగునవి ఉన్న స్థితి నుండి ఉన్నంత స్థితిలో ఉన్నంతలో జీవనోపాయాలను మెరుగుపరచుకోవడం ఈ ఆది కర్మయోగి, అభియానికి ముఖ్య ఉద్దేశం ఇది కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ మినీ స్టేట్ ఆఫ్ ట్రైబల్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడపబడును .భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ప్రోగ్రాం క్రింద 136 గ్రామాలు మరియు 19 మండలాలు ఈ ప్రోగ్రాం లో నిమగ్నం కాగలవు జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటిడిఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ జరుగును విజన్ 2030లో భాగంగా మన కరక గూడెం మండలంలో నాలుగు గ్రామాల్లో రేగళ్ల, సమత్ బట్టుపల్లి, సమత్ మోతే, చిరూమల్ల గ్రామాల్లో ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీవో కుమార్, బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ నరేంద్ర నాయక్, మెడికల్ హెల్త్ హెచ్ఈఓ కృష్ణయ్య, ఎస్ ఏ మాథ్స్ చిన్నయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజమణి, ఐ కె పీసీసీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు