కార్మికుడిని ఆదుకున్న బిల్డింగ్ రంగం ఏఐటియుసి…

కార్మికుడిని ఆదుకున్న బిల్డింగ్ రంగం ఏఐటియుసి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి పట్టణంలోని కొమురయ్య భవన్ ఏఐటీయూసీ ఆఫీస్ నందు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా ప్రమాదం జరిగిన కార్మికుడికి ఆర్థిక సహాయం 15000 అందించిన భవన నిర్మాణ కార్మిక సంఘం సహకారంతో ప్రమాదం జరిగిన కార్మికుడికి నగదు అందించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిల్డింగ్ రంగం నాయకులు
ఈ సందర్భంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకటేష్ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణానికి చెందిన కార్ మాస్ కాలనీ నివాసం ఉంటున్న కన్నే వేణి సత్యం అనే కార్మికుడు గత 20 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ తరుణంలో గత నెల క్రితం భవన నిర్మాణం చేస్తుండగా కింద పడిపోయాడు అతనికి రెండు హరి రపాదాలలో గుత్తులు విరగగా నడవలేని స్థితికి చేరుకోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుల దృష్టికి తీసుకురాగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడిని ఆర్థిక సాయం కోరగా తలకొంత డబ్బులు జమ చేసుకొని యూనియన్ ఆఫీసులో భూపాలపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆ రెల్లి వినోద బిల్డింగ్ రంగం యూనియన్ ఆధ్వర్యంలో నగదు రూపేనా కన్నెవేని సత్యం భార్య కి 15 వేల నగదు రూపాయలు అందజేయడం జరిగిందన్నారు
తను నిరుపేద కుటుంబానికి చెందిన వాడైనందున కార్మికులు అతనికి జరిగిన సంఘటనకు చలించిపోయి కార్మికులు తోటి కార్మికుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు బిల్డింగ్ కనెక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తరఫున కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు
కార్మికులంతా కూడా కలిసికట్టుగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ తోటి సహచర కార్మికులందరికీ భరోసా ఇచ్చే విధంగా ఉండాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు లేబర్ కార్డు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే వారి కుటుంబాలకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని తక్షణము లేబర్ కార్డు లేని ప్రతి కార్మికుడు లేబర్ కార్డు చేసుకోవాలని దాని ద్వారా కార్మికుడికి చాలా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు చాలామంది కార్మికులు కార్డు పొందియుండి రెన్యువల్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగా వివాహ కానుక ప్రస్తుత సౌకర్యం సహజ మరణం యాక్సిడెంట్లు డెత్ మెడికల్ క్లైమూల వంటి అనేక సంక్షేమ పథకాలను కోల్పోవాల్సి వస్తుందని కార్మికులకు తెలియజేశారు కార్మికులు పనిచేసే చోట సేఫ్టీ భద్రత ప్రమాణాలు పాటించి పనులు నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో కార్మికులకు అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినోద గారికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు 11 రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతరాజు సతీష్ గంగ సారపు శ్రీనివాస్ గార్లకు కార్మిక వర్గం నాయకత్వం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మేకల సమ్మయ్య చిలకని రాజయ్య తమ్మిశెట్టి సతీష్ మహమ్మదువలి సిద్ధం రాజు ఇంజాల శ్రీనివాస్ అనపర్తి సురేష్ మామిడిపల్లి చరణ్ తదితరులు పాల్గొన్నారు

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

వీబీ జి రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి

ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు
ఈ సందర్భంగా ఏఐసీటియుజిల్లా కార్యదర్శి కన్నూరి దానియేలు
మాట్లాడుతూ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2005 వ సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. 25 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో 100 రోజుల కరువు పనిని ఇప్పుడున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్ర పొంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జి రామ్ జీ పథకాన్ని పార్లమెంటులో చట్టాన్ని తీసుకువచ్చి బిల్లు ఆమోదించడం జరిగింది. గత 25 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం 90% నిధులతో గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఎంతో గాను ఉపయోగపడే ఉపాధిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇప్పుడు ఈ చట్టంలో 60% నిధుల కేంద్రం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి భారం వేస్తుందని తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ జాతీయ ఉపాధి పథకాన్ని భూస్వాముల పెత్తందారులకు, బడా బాబులకు అనుకూలంగా పేద రైతు కూలీలకు వ్యతిరేకంగా ఈ పథకం ఉందని అన్నారు. వెంటనే పాత పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కొత్తగా తీసుకువచ్చిన వీబి జి రామ్ జి పథకాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

ఆదానీ, అంబానీలకు లాభం చేయడం కోసమే బొగ్గు బ్లాకుల వేలం..

ఆదానీ, అంబానీలకు లాభం చేయడం కోసమే బొగ్గు బ్లాకుల వేలం

మణుగూరు పికె ఓసి2 ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

కోల్ ఇండియా వ్యాప్తంగా 41బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రభుత్వం వేలం వేయడాన్ని ఒప్పుకునేదే లేదని, మణుగూరు పికె ఒసి2 డిప్ సైట్ ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న మణుగూరు పికె ఓసి2 ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలైన ఆదా అని, ఏఎంఆర్ జెన్కో, మేఘ కృష్ణారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్కో కంపెనీలకు వేలం వేయడానికి ఏడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. పీకే ఓ సీ2ను సింగరేణి దక్కించుకోకుంటే మణుగూరులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందులో ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో వేలంలో పాల్గొనడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే జెన్కో సంస్థ వేలం నుండి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మణుగూరు పీకే ఓసి 2 ఓసి బ్లాక్ లలో సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, 167 హెక్టార్లలో బొగ్గు ఉందని, కంపెనీకి ఆదాయాన్ని తెచ్చి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు వేలం వేయడం దుర్మార్గమని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆదాని, అంబానీలకు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని, వారికి లాభం చేకూర్చడం కోసమే ఈ బొగ్గు బ్లాగులను వేలం వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు పీకే ఓసి2 ని వేలం వేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ కమిటీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోలేని సింగరేణి రక్షణ కోసం విశాఖ స్టీల్ ఉద్యమంలాగా రాబోయే రోజుల్లో కార్మిక సంఘాల ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, కాంట్రాక్ట్ కార్మికుల ఇంచార్జ్ నూకల చంద్రమౌళి, స్థానిక నాయకులు నల్ల సత్తి కుమారస్వామి బాబురావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

“నిరుపేద రాజయ్య కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలి”

అకస్మాత్తుగా మరణించిన కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఆకారపు రాజయ్య నిన్నటి రోజు గుండెపోటు రావడంతో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రామానికి చెందిన రాజయ్య నిన్నటి రోజు గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి నా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి రాములు. రాజయ్య జిల్లెల గ్రామంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికునుగా పనిచేస్తూ వడ్ల సీజన్లో అమాలిగా వడ్లు జోకుతూ ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని వారి పెండ్లిలకు గాను తనకున్న యావదాస్తి భూములు జాగాలు పొలం అమ్ముకొని ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో గుడిసెలో జీవనం సాగిస్తూ ఉంటున్నారని. అలాంటి నిరుపేద వారికి గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో గాని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ వారికి కానీ ఇటువంటి నిరుపేదలు కనిపించడం లేదా. ఇలాంటి నిరుపేద కార్మికుల కుటుంబాన్ని ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి వారి జీవితాలు మారడం లేదని వెంటనే ప్రభుత్వ o . గుర్తించి ఇలాంటి కుటుంబాల వారిని ఆదుకోవాలని కోరుతూ ఇటువంటి నిరుపేదలు ఉండడానికి ప్రభుత్వం కేటాయించే డబ్బులు బెడ్ రూమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అందించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూవారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని ఇచ్చి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని. వారినీ ప్రభుత్వాo ఆదుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జ వేణు. జిల్లా నాయకులు బాచుపల్లి శంకర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐఎన్టియుసి, ఏఐటియుసి, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో ఉద్యోగులకు గ్రాడ్యు టీ ప్రయోజనాలు తగ్గించడం, ట్రేడ్ యూనియన్ హక్కులు కాలరాయడం, సమ్మెలపై ఆంక్షలు విధించడం, 12 గంటల పని విధానాన్ని పెంచడం, భద్రత ప్రమాదాలు పెరగడం, సరైన ప్రక్రియ లేకుండా తొలగింపునకు శ్రీకారం చుట్టడం వంటి పలు అంశాలపై సింగరేణి ముందడుగు వేస్తున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జేఏసి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్ , ఉపాధ్యక్షులు వెంకటస్వామి, రఘు, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం…

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి వేస్తుందని, కార్మికులకు నష్టం కలిగించే నూతనంగా తెచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి షేకు హుస్సేన్, టీబీజీకేఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బడి తల సమ్మయ్యలు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య స్మారక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడుతూ..
అనేక సంవత్స రాలుగా కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న
29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కేంద్రం కాలరాస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక సంఘాల ప్రమేయం లేకుండానే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను ఏర్పాటు చేయడం యావత్ కార్మిక లోకానికి తీరని నష్టమని అన్నారు.బిజెపి అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 25, 26న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బి ఎం ఎస్ తప్ప భారీ ప్రదర్శనలకు ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా మంగళవారం భూపాలపల్లి ఏరియాలో అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అనంతరం నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ ల ప్రతులను దహనం చేశారు. నేడు కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా 26 న జిల్లా కలెక్టర్, ముందు ఉదయం 10 :00 గంటలకు ధర్నా నిర్వహించి, సాయంత్రం 4 గంటల కు జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 26న జరిగే ఆందోళన పోరాటాలలో కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు దేవరకొండ మధు, బాషనపల్లి కుమార్, బి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మఇండ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు ఇవ్వాలి…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మఇండ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు ఇవ్వాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఏఐటీయూసీ. రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి ఎమ్మార్వో జయంత్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి. ఇసుక .అందలేక నిర్మాణాలు ఆగిపోతున్నాయననీ దీనివలన నిర్మాణాలు పూర్తి కావలసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ఆగిపోవడం జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని తంగళ్ళపల్లి ఎమ్మార్వో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రతిరోజు ఇసుక అనుమతులు ఇవ్వవలసిందిగా. కోరుతూ ఇసుక అధిక ధరలు కావడంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు. అర్థిక భారంతో. డబ్బులు చాలీచాలక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారనీ అలాగే భవన నిర్మాణ కార్మికులు నిర్మాణపు పనులు లేకపోవడంతో నిర్మాణాలకు వచ్చేవారి కుటుంబాలు విధిన పడే పరిస్థితులు ఎదురవుతున్నాయని. కార్మికులు. ఇతర కూలీలు. చాలా అర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఇట్టి విషయాలన్నిటిని. పరిగణలoలోకి. తీసుకొని. కార్మికులపై ఇందిరమ్మ నిర్మాణ లబ్ధిదారులపై దయతలిచి. ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర నిర్మాణ పనులకు ఇసుకకు. అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తంగళ్ళపల్లి ఎమ్మార్వో జయంత్ కి. ఇచ్చిన వినతి పత్రంలో కోరుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో. కడారి రాములు. అజ్జి .వేణు. వడ్డేపల్లి లక్ష్మణ్. ఎం చంద్రయ్య తదితరులు వినతి పత్రంఇచ్చిన వారిలో ఉన్నారు

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాట,దీపావళి బోనస్ చెల్లించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T124741.237.wav?_=1

 

 

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాట,దీపావళి బోనస్ చెల్లించాలి

ఫిట్ కార్యదర్శి మారేపల్లి సారయ్య

శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి:

 

తమ జీవితకాలంలో దీర్ఘకాలికంగా సంస్థ అభివృద్ధి కోసం పాటుపడి పదవి విరమణ పొందిన పదవీ విరమణ పొందిన గని కార్మికులకు యాజమాన్యం లాభాల వాటా,దీపావళి బోనస్ ను వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం (ఎఐటియుసి) ఆర్కే -7 ఫిట్ కార్యదర్శి మారేపల్లి సారయ్య అన్నారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తూ అనారోగ్య కారణాల చేత అన్ఫిట్ అయిన లేదా పదవీ విరమణ పొందిన కార్మికులను యాజమాన్యం గుర్తించి సంస్థగతంగా ఆర్థికపరమైన ప్రయోజనాలను కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.పదవి విరమణ పొందిన కార్మికల సంక్షేమ ని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.పదవి విరమణ కార్మికులు నవంబర్ నెలలో జీవన్ ప్రమాణ యొక్క సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదు..

కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదు

ఎఐటియుసి జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఎఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు,సమ్మె కార్యక్రమాలు తప్పవని ఆ యూనియన్ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం శ్రీరాంపూర్-నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గుర్తింపు కార్మిక సంఘం (ఎఐటియుసి) కార్మికుల సమస్యల పరిష్కారం,సంక్షేమం కోసం ఇచ్చిన డిమాండ్లను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.మెడికల్ బోర్డు కు సంబంధించి అప్లికేషన్ పెట్టుకుని తొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటికి మెడికల్ బోర్డు పై స్పష్టత లేకపోవడం శోచనీయమన్నారు.మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారో తెలుపాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు పూర్తి చేసుకొని డిపెండెంట్ ఉద్యోగాల కింద సుమారు 375 మంది 5,6 నెలల నుండి విటిసి ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారిని ఎందుకు అపుతున్నారో స్పష్టత లేదని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సంస్థ అభివృద్ధి కోసం పాటుపడే కార్మికుల సొంతింటి పథకంపై ఎన్నిసార్లు మాట్లాడిన ఆ అంశంపై పురోగతి లేదని ఆరోపించారు.కోలిండియాలో మాదిరి అలవెన్స్ లపై టాక్సును సింగరేణి యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేసినప్పటికీ ఆ అంశంపై స్పందనలేదని అన్నారు.వెంకటేష్ ఖని( వికె) కోల్ వైన్స్,ఇల్లందు జేకే ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ లో పూర్తిగా బొగ్గు,ఓబి తీసే పనులను ప్రైవేటు వాళ్ళకే ఇచ్చారని ఆరోపించారు. ఒకవైపు యాజమాన్యం ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉందంటూనే కాంట్రాక్ట్ పద్ధతులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.డిస్మిస్ కార్మికులకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఎఐటియుసి ఆధ్వర్యంలో యూనియన్ దృష్టికి తీసుకెళ్లిన సరైన నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు.అలాగే ఎంతోమంది కార్మికులు ఆవేదన చెందుతున్న మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఒక ఫైల్ కూడా ముందుకు వెళ్లడం లేదని ఆరోపించారు.సుమారు 7000 మంది అభ్యర్థులు క్లారికల్ కొరకు రెండు,మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వారికి ఎగ్జామ్స్ పెట్టడం లేదని అన్నారు.అదే కాకుండా స్పష్టత లేకుండా 150 మాస్టర్ల ను కార్మికులను సంప్రదించకుండా తెరమీదికి తీసుకువచ్చారని,ఇచ్చేకాడ ఇవ్వకుండా,కట్ చేసే కాడ మాత్రం యాజమాన్యం ముందుంటుందని విమర్శించారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఉద్యమాలలో పాల్గొంటామని ఈ మేరకు ఈనెల 6వ తేదీన సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేపడుతూ అన్ని గనులు డిపార్ట్మెంట్లలో మెమోరాండాలు అందజేస్తామని,8వ తేదీన జిఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు అనంతరం నిరాహార దీక్షలను చేపడతామని,కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరిలో సమ్మె తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు,సహాయ కార్యదర్శి చంద్రమోహన్,మైనింగ్ స్టాఫ్ నాయకులు రాజేశ్వర్ రావు, బాలకృష్ణ,రాజశేఖర్, శ్రీనివాస్, నాయకులు,మోతే లచ్చన్న, గజ్జి రమేష్,నరసయ్య,రాజ్ కుమార్,శ్రీనివాస్ పాల్గొన్నారు.

కలగానే మిగిలిన సింగరేణి కార్మికుల సొంతింటి కల…

కలగానే మిగిలిన సింగరేణి కార్మికుల సొంతింటి కల

సింగరేణిలో మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉంది

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

స్ట్రక్చర్ మీటింగ్లో యాజమాన్యం అంగీకరించిన సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె కైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణిలో 2014 నుండి 2023 వరకు కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగులు జరగలేదని, రాజకీయ జోక్యంతోనే కార్మికులకు సంబంధించిన ప్రకటనలు చేసేవారని అన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన అనంతరం వివిధ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగులు నిర్వహించడం జరిగిందని అందులో కొన్ని యాజమాన్యం పరిష్కరించిన పూర్తిస్థాయిలో అమలు పరచడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి దానికి కమిటీ వేసి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. కోల్ ఇండియా మాదిరిగానే పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉందని 9 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 6న అన్ని డిపార్ట్మెంట్లలో మెమోరండాలు నిరసన, ధర్నా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 8న జిఎం కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలను కలుపుకొని దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. 8 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలవడం జరుగుతుందని సమస్యలను వారికి వివరించి పరిష్కరించకుంటే కార్మిక సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసి సమ్మెకు పిలుపు నివ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 6, 8న జరిగే ధర్నా, నిరస నలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజ్ కుమార్ కార్మికుల కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచి సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి, బ్రాంచ్ కమిటీ నాయకులు నూకల చంద్రమౌళి, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T150827.181.wav?_=2

 

ఘనంగా ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం

కార్మికుల డిమాండ్ లు నెరవేర్చాలి-లంకదాసరి అశోక్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవం కార్మికులు ఘనంగా నిర్వహించారు.అనంతరం హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ జెండావివిష్కరణ చేసి ఏఐటీయూసీ 1920లో ఏర్పడి పోరాటాల ఉద్యమాల చరిత్రలో 106వ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కార్మిక వర్గానికి ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని అన్ని విధాలుగా కార్మికులను ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కోగిల.శంకర్,కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరె రవి,శ్రీపతి కలనాయక్,సప్పిడి సాంబయ్య,తిక్క స్వామి,ఈర్ల ఐలయ్య,మామిడి జగన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T130519.597-1.wav?_=3

 

ఘనంగా ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకలు

జెండా ఎగరవేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో జెండా ఆవిష్కరణ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం రాకముందు కార్మికుల యొక్క హక్కుల కోసం ఆవిర్భవించిన గొప్ప చరిత్ర ఉన్న ఏఐటీయూసీ ఆరోజు జరిగిన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమే అని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా మార్చి హక్కు లేకుండా చేసి యాజమాన్యాలకు తొత్తులుగా చట్టాలు మార్పు చేశారన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ రద్దు కోసం ,కనీస వేతనాలు అమలు కోసం, సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఉద్యోగ భద్రత కోసం నిరంతర ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉందన్నారు …ఫ్యాక్టరీల చట్టం ,ఈఎస్ఐ చట్టం, పీఎఫ్ చట్టం ,ప్రసూతి ప్రయోజనాల చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, గ్రాటిటీ చెల్లింపు చట్టం ,బాల కార్మిక నిషేధ చట్టం, ఉద్యోగుల పదవి విరమణ పెన్షన్ పథకం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ,ఉపాధి హామీ చట్టం .వీటితోపాటు అనేక కార్మికుల హక్కుల కోసం చట్టాలను సాధించిన గొప్ప చరిత్ర కలిగిన యూనియన్ ఎఐటియుసి అని అన్నారు.. భవిష్యత్తులో మోడీ అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ ఇచ్చే పోరాట పిలుపులో భాగంగా కార్మికులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు…
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మోట పలుకుల రమేష్, ఏఐటీయూసీ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్, ఎఐటియుసి నాయకులు కమలాకర్ ,శ్రావణ్ ,రాజు ,యాదగిరి రాజయ్య, పీక రవి ,భూమయ్య తోపాటు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు

ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు…

ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో “భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి, ‘ఉక్కు మనిషి ’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సంధర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింధి ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మొదటగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి, పూలతో నివాళులు అర్పించారు.
జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ … “భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి, హోం మినిస్టర్ ‘ఉక్కు మనిషి ’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సంధర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం మన మందరం గౌరవంగా జరుపుకుంటున్నాం అన్నారు . దేశ సమైక్యతకు, జాతీయ ఏకతకు పటేల్ సేవలు అమూల్యం అన్నారు . ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మనం సమాజం మరియు దేశం అభివృద్ధికి పాటు పడాలన్నారు .
ఈరోజు గ్లోబల్ పోటీ కాలంలో , మన కార్యాలయంలోనూ ఐక్యత, పరస్పర గౌరవం, సహకారం అత్యంత అవసరంఅన్నారు . వివిధ ఆలోచనలు, భిన్న సంస్కృతులు ఉన్న మనమందరం ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేయడం మన బలం. ఉద్యోగులు తన బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చాలన్నారు . ఐక్యత భావనతో, సమైక్యతతో ముందుకు సాగితే సింగరేణి సంస్థ ఇంకా ఎన్నో విజయ శిఖరాలను అధిరోహిస్తుందన్నారు .
సమైక్యత ఒక్క రోజు కార్యక్రమం కాకుండా — అది మన రోజువారీ ఆచరణ. మనం కలిసికట్టుగా పనిచేయాలన్నారు , పరస్పరం ప్రోత్సహించుకొని , సామూహిక అభివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు . ప్రతి ఉద్యోగి సంస్థ పురోగతిలో ముఖ్య భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమములో ఏరియా ఎస్ఓటీజిఎం కవీంద్ర, , ఎస్ జోతి– రాజేశ్వర్ (క్వాలిటీ) కృష్ణప్రసాద్, ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, పోషమల్లు గుర్తింపు సంఘం ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ఇతర ఉన్నత ఆధికారులు,జియమ్ కార్యలయంలోని సిబ్భంది పాల్గొన్నారు .

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి..

ఈ నెల 26వ, తేదీన జరిగే ఏఐటీయూసీ వెంకటాపూర్ మండల మహసభను జయప్రదం చేయండి

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఏఐటీయూసీ మఖ్యనాయకుల సమావేశం లో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య మాట్లాడుతూ కార్మికులు ఎధుర్కొంటున్న అనేక సమస్యలు, ప్రభుత్వాల కార్మిక వ్వతిరేఖ విధానాలపై పోరాట రూప కల్పన చేయడానికి గాను ఈ నెల 26 వ, తేదీన వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవణలో జరిగే ఏఐటీయూసీ మండల

మహసభను, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కావెంజర్లు, హమాలీ కార్మికులు, భవణ నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్స్, నీరడీలు, ఆశ, అంగన్వాడీ, రెండవ ఏ,యన్, యం, లు తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు,, ఈ సమావేశంలో పాల్గొన్న వారు కొక్కుల రాజేందర్, గాలి సమ్మయ్య, జనగాం శోభ, తోట సంపత్,సంగు పోషమ్మ, నార్లగిరి సరిత, జనగాం లావణ్య,

ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు…

ప్రజా పక్షం ప్రజల గొంతుక -7వ వార్షికోత్సవ వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రజాపక్షం దిన పత్రిక ప్రజల గొంతుకగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. ప్రజాపక్షం దిన పత్రిక 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు హాజరై కేక్ కట్ చేశారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో,పారదర్శక పాలనను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రజాపక్షం దిన పత్రిక ఎనలేని కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో ఈ పత్రిక మరింత ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి పార్వతి సురేష్ కుమార్,మంచిర్యాల ఆర్సీ ఇన్చార్జి కేశేటి వంశీ,నస్పూర్ మండల విలేకరి నారగొని పురుషోత్తం,గంగారపు గౌతమ్,కుమ్మరి సతీష్, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బంద్ పిలుపు

బిసి 42 శాతం అమలు చేయాలని రాష్ట్ర బంద్ కు పిలుపు

ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కార్మిక హక్కులను రక్షించుకోవడానికి కనీస వేతనాలు

కార్మిక హక్కులను రక్షించుకోవడానికి కనీస వేతనాలు సాధించుకోవడానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

ములుగు జిల్లాలో ఈరోజు ఏఐటీయూసీ ములుగు మండల మహాసభ గుంజ శ్రీనివాస్,,, పెద్ద కాసు వినోద్ గారి అధ్యక్ష వర్గంగా, ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన మహాసభలో పాల్గొన్న, ఏఐటియుసి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి, జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం,కార్పోరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉండడానికి గాను, నాలుగు కోడ్స్ గా కుదించడం జరిగింది అన్నారు,అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రజలు,కార్మికులు,ఉద్యోగులు,ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు, కనుక పై చట్టాలను రక్షించుకోవడానికి, కనీస వేతనాలు సాధించుకోవడం కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు,, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని తీర్పు ఇచ్చినప్పటికీ, పాలకులు మాత్రం అమలు చేయడం లేదు అన్నారు, కనుక సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం పైన కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది, కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే బదులు వాటిని ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు, అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను విరమించుకొని ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించాలని ప్రభుత్వం ద్వారా అనే నేరుగా వేతనాలు చెల్లించాలని స్కీం వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని కనీస వేతనాలు 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇవన్నీ సాధించుకోవడం కొరకు అన్ని వర్గాల ప్రజలు కార్మికులు ఉద్యోగులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జేఐటియుసి మండల అధ్యక్షులుగా పెద్దకాసు వినోద్ ప్రధాన కార్యదర్శిగా గుంజ శ్రీనివాస్ గారలతోపాటు 22 మందిని ఎదుర్కోవడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బండి నరసయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షురాలు సామల రమ, సిపిఐ సీనియర్ నాయకులు ఇంజన్ కొమురయ్య, ముత్యం కొమురయ్య, వీరన్న,శ్రవణ్,, కొత్తపెళ్లి శ్రీనివాస్,అజిత, సంధ్య, లలిత, సంధ్య, సమత, గుండ్రెడ్డి శ్రీనివాస్, గుండె దీపిక,మల్రాజుల సమ్మయ్య,కమలక్క రమేష్,కుంకర స్వామి,కౌసల్య, శ్రీను, శిరీష, ప్రవీణ్,శ్రీకాంత్,జంపాల శ్రీనివాస్, ఎండి రంజాన్, నవ లోక,రజిత,లావుడే రాములు, కనక లక్ష్మి ఆసరి లక్ష్మి రాజకుమారి స్వరూప

గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి….

గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి తన తల్లిదండ్రులు దివంగత గుండు రాధ,రామలక్ష్మన్ జ్ఞాపకార్థం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడు కు రూ 40 వేల రూపాయల విలువగల పుస్తకాలను అందించి ఔదార్యం చాటుకున్న భూపాలపల్లి రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పూజిత,నరహరి దంపతులు. సందర్భంగా వారు మాట్లాడుతూ
నేటి సమాజంలో పుట్టినరోజు చనిపోయిన రోజుల పేరుతో ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నారని,ఏదైనా ఒక మంచి పని చేయాలని ఉద్దేశంతో విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలను గ్రంధాలయానికి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ఏఐటీయుసి నాయకుడు రమేష్. బాలగొని రమేష్ మంతెన సమ్మయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు

సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి…

సింగరేణి కార్మికుల లాభాల వాటా పై యాజమాన్యం పునరాలోచించాలి

ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి వ్యాప్తంగా లాభాల వాటా ప్రకటనపై ప్రతి కార్మికుడికి అసంతృప్తి ఉందని, వాస్తవ లాభాలు ప్రకటించాలని ఏఐటీయూసీ గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తుందని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. లాభాల వాటా పై రకరకాల చర్చలు, కామెంట్లు వస్తున్న నేపధ్యంలో వాస్తవ లాభాలను ప్రకటించకుండా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం గోప్యతతో లాభాలను ప్రకటించడం కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా వాస్తవిక లాభాలను ప్రకటించాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తుందని అన్నారు. లాభాలను సింగరేణి ప్రాంతంలో అభివృద్ధికై కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వం,యాజమాన్యం సింగరేణి ప్రాంతాలలో ఏం అభివృద్ధి చేశారో తెలియచేయాలని అన్నారు. ప్రభుత్వం నుండి సింగరేణికి ఇప్పటికే 40 వేల కోట్ల బకాయిలు రావాల్సింది ఉందని గుర్తు చేశారు. లాభాలు ఎన్ని వచ్చాయో యాజమాన్యం ప్రకటించకుండా ఇన్ని రోజులు నాన్చుతూ వచ్చి చివరకు కేవలం 34% లాభాల వాటా మాత్రమే అందించడంతో కార్మిక లోకం తీవ్ర అసంతృప్తికి లోనైందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సైతం సరైన లాభాలు ప్రకటించకపోవడంతో వారు కూడా నిరాశ చెందుతున్నారని తెలిపారు. ఏఐటియుసి సంఘం తరఫున లాభాల వాటపై ప్రభుత్వం పై,యాజమాన్యం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రతి కార్మికుడికి చెందాల్సిందేనని డిమాండ్ చేశారు. లాభాల వాటాపై యాజమాన్యం పునరాలోచించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

వంట కార్మికులకు భీమా కల్పించాలి డిమాండ్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T135851.019.wav?_=4

 

మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని భాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు,, మల్లంపల్లి మండలాల సంయుక్త సమావేశము గున్నాల రాజకుమారి,,అంకం పధ్మ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ పాఠశాలలలో వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికులు అంటే ప్రభుత్వానికి, అధికారులకు చిన్నచూపు అన్నారు అందుకే వారి సర్వీసు,సేవాభావానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా హేళనగా చూస్తున్నారు అన్నారు,వంట కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతూ అనేక దఫాలుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్ళినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికే వంటలు చేస్తున్న సందర్భంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా జరిగాయి అన్నారు రంగారెడ్ది జిల్లా శంషాబాద్ లో, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గాంధినగర్ లో, హన్మకొండ జిల్లా కటాక్షపూర్ లో,నిన్న నిజామాబాద్ జిల్లా అమ్రాధ్ ఉన్నత పాఠశాలలో లలిత అనే కార్మికురాలు ఇలా గంజి పడి ఒకరు, కుక్కర్ పేలి ఒకరు కూర పడి ఒకరు ఇలా అనేక మంది వంట కార్మికులకు విపరీతమైన గాయాలై నడువలేని స్థితిలో ఉన్నారు అన్నారు ఇదంతా విధ్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందిస్తున్న సందర్భంలో జరిగినవే లక్షలాది రూపాయలు వారు స్వంతంగా పెట్టుకోవలసిన పరిస్థితితులు వీరు ప్రభుత్వం లో భాగస్వాములు కారా వారి ఖర్చులు ప్రభుత్వం భరించకూడదా అన్నారు కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి వంట కార్మికులకు భీమా కల్పించి పరిహరాలు అందించాలని డిమాండ్ చేశారు, ఇప్పటికే లక్షలాది రూపాయలు స్వంత డబ్బులు పెట్టి వంటలు చేస్తుంటే ఆ బిల్లులు నేలల తరబడి పెండింగ్లో ఉండి అప్పుల పాలౌతుంటే, మల్లీ ప్రమాదాలు జరుగుచున్న సందర్భంలో ప్రభుత్వం భరించక పోతే ఎలా అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పరిహరాలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్రంలో ఉన్న 54200 మంది వంట కార్మికులను సమీకరించి ఏఐటియుసి నాయకత్వంలో ఉద్యమాలు నిర్వహస్తము అన్నారు,,ఈ సమావేశంలో గున్నాల రాజకుమారి,గుండ్రెడ్డి శ్రీనివాస్,మాలగాని కమల,పౌర రాధ,మాడిశెట్టి భాగ్య,సలువాల స్వరూప, కొత్త కనుకలక్ష్మి, కొత్త పూల,ఆసరి లక్ష్మి,ముత్యం రవీంద్ర,,అకఖం పధ్మ, బండి సరోజన,పోరిక ప్రమీల,భానోత్ బుల్లీ,భానోత్ కమల,సార సుగుణ,పల్లెవేణ మల్లిఖాంభ, తదితరులు పాల్గొన్నారు*

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version