భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రభుత్వం…

భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రభుత్వం

వెల్ఫేర్ బోర్డు క్లైమ్ లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పడం మానుకోవాలి

ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 12 ని సవరించాలి

బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారి (ALO) నజీర్ సార్ గారికి పలు డిమాండ్లతో వినతి పత్రం అందించడం జరిగినది.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు గీస బిక్షపతి , కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి గార్లు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల సంక్షేమం కొరకు చేపట్టిన అనేక ఐక్య పోరాటల ఫలితంగా 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం ఏర్పడిందని దేశవ్యాప్తంగా ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలను సాధించుకున్నామని తెలిపారు వెల్ఫేర్ బోర్డులో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విధానాల వలన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వలన నిర్మాణరంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు సరియైన ఉపాధి లేకుండా పోతుందని అన్నారు.ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నిధులను పక్కదారి పట్టించే విధంగా వెల్ఫేర్ బోర్డు స్కీం లకు సంబంధించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే విధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 12 వలన కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుందనీ ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 12 ని సవరించాలని లేకుంటే రానున్న రోజుల్లో కార్మికులందరినీ ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఈసంపేల్లి రాజెలయ్య , సావనపల్లి ప్రభాకర్ , దేవయ్య , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి…

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి

సెప్టెంబర్ 15 న మహాసభ

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు

సిరిసిల్ల టౌన్ *(నేటిధాత్రి)

 

 

 

సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్లలో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా 3 వ. మహాసభల కరపత్రాలను ఈరోజు బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో నాయకులు ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికుల ఉపాధి , సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గత పోరాటాలను సమీక్షించుకొని ఉద్యమ కార్యచరణను రూపొందించుకోవడం కోసం యూనియన్ జిల్లా 3 వ. మహాసభలను సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు , గురజాల శ్రీధర్ , కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version