మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి…

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు షైక్ సోహైల్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 80% ముస్లిం మైనార్టీ లు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. మైనార్టీ యువత సాధారణంగా జీవన అవసరాలు తీర్చి ఆదాయ వనరులు, ఉపాధి మార్గాలు లేక, దారిద్రం, బతుకుల భారమై అవమానాలతో, మానసిక వేదనతో అనేకమంది అనారోగ్య పాలైన వృద్ధుల కంటే ముందే చనిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 80% యువకులు తమ విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారూ.. అని ముస్లిం మైనార్టీ హక్కుల విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు 50% రాయితీ ఇవ్వాలి. ప్రభుత్వం మిగిలి ఉన్నా వక్స బోర్డు భూములను మరుమేద ముస్లిం మైనార్టీ లకు ప్రభుత్వం పంచిపెట్టాలి.

మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం….

మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

మహిళలు ఆర్థికపరంగా అన్ని రంగాల్లో ముందుండాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సబ్సిడీపై మత్స్యకారులకు వాహనాన్ని అందించారు మత్స్యకారులకు 10.5 లక్షల విలువ గల వాహనాన్ని సబ్సిడీపై 6 లక్షలకు ప్రభుత్వం అందించింది మహిళలను కోటేశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి పెట్రోల్ బంక్ , మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ వ్యాపా రుల అభివృద్ధి చెందే విధంగా మహిళలు ఆర్థికంగా ఎదగ డానికి మహిళలకు తోడ్పడు తుంది మహిళలు వ్యాపార పరంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేస్తుంది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలు, మహిళలు అధిక మొత్తంలో పాల్గొన్నా

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి…

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి

◆:- బీమా పథకాలపై అవగాహన

◆:- సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

◆:- ఎస్బిఐ సీజీఎం సహదేవన్ రాధాకృష్ణన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్ ) సహదేవన్ రాధాకృష్ణన్, డీజీఎం జితేంద్ర కుమార్ శర్మ లు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జన సురక్ష పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్, సురక్ష, జీవన్ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ, దీన్ దయాళ్, అంత్యోదయ యోజన, కిసాన్ సమ్మన్ నిధి, పీఎంకిసాన్, సుకన్య సమృద్ధి పథకం, బేటీ బచావో బేటీ పడావో తదితర పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రతి ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని వారు సూచించారు. ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ అరెస్టు వంటి మోసాలను నమ్మకూడదని, అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఢీ హైదరాబాద్ రాజీవ్ కుమార్, సంగారెడ్డి ఆర్‌ఎం ఆర్‌బిఓ పపాసాహెబ్ సిరాజ్ బాషా, ఝరాసంగం ఎంపీడీవో మంజుల, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, రాయికోడ్ తదితర మండలాలకు చెందిన ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version