జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా .!

జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకున్న నాయకులు

◆జహీరాబాద్ హెల్త్కేర్ హీరో ఉజ్వలుడు

◆ డాక్టర్స్-డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సన్మానం

◆ డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి గారికి ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఉజ్వల్‌రెడ్డి గారి స్వగృహంలో డాక్టర్స్-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్‌రెడ్డి గారికి మరియు వారి మిత్రులు డా౹౹ప్రమోద్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి కేక్‌ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్స్‌-డే పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది ఒక నిరంతర సేవా మార్గమని మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత అని వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని, ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, సీనియర్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి,అక్బర్, టీపీసీసీ జిల్లా మీడియా & కమ్యూనికేషన్ కన్వీనర్ అశ్విన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ నతానియల్ ‌,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండలం అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ, ఇమామ్ పటేల్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే.

నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రజా పరిపాలన లక్ష్యం….

తంగళ్ళపల్లి నేటి రాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో తంగళ్ళపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్.

కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి.

నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటం పాటు అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తంగళ్ళపల్లి మండలంలోని అంకుసాపూర్ నరసింహపల్లె తాడూరు గ్రామాల్లో లబ్ధిదారులకు .

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను.

అందజేసిన నాయకుడు. అలాగే. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్థిక సమస్యలను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని.

ప్రభుత్వం అమలు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో పార్టీ నాయకత్వం పనిచేస్తుందని అలాగే మహిళలకు ఉచిత బస్సు నుండి నిన్నటి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని.

ప్రజలు ప్రతి ఒక్కరు సీఎం సహాయ నిధి సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ.

ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా పాలన.

ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ.

ఇట్టి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు రావడానికి .

కృషి చేసిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డికి ప్రభుత్వ వి ప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ కి. లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు.

తిరుపతి రెడ్డి. అరపల్లి బాలు. నేరెళ్ల పాక్స్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్.

కాంగ్రెస్ నేత జనార్దన్ రెడ్డి. శ్రీరామ్ గౌడ్. రంగు శ్రీను. లక్ష్మణ్. నరసయ్య. అంజయ్య. వెంకట్ రెడ్డి. నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం.

విద్య, వైద్యం కాంగ్రెస్ ముఖ్య ద్యేయం
• ఎమ్మెల్యే రోహిత్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

విద్య, వైద్యన్నీ అందిచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించి జై బాపు, జైసంవిధాన్ లో భాగంగా మండలం లో ర్యాలీ నిర్వహించారు. అలాగే సన్న బియ్యం, ఆరోగ్య ఉప కేంద్రన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధినీ కాంగ్రెస్ 15 నెలల్లో చేసి చూపిస్తుందని కొనియడారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వైద్య కళాశాల ను కాంగ్రెస్ హయాంలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు చౌదర సుప్రభాతరావు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్, సత్యనారాయణ, లింగం గౌడ్, గుమ్ముల అజయ్, దేశెట్టి సిద్దారములు, సత్యనారాయణ రెడ్డి,శ్యామల మహేష్, అధికారులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version