ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం…

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
చందుర్తి, నేటిధాత్రి:

 

 

చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్, బూత్ అధ్యక్షులు పెరుక రంజిత్, ముప్పిడి సత్తయ్య, సీనియర్ నాయకులు చింతకుంటగంగాధర్, నిరటి శేఖర్, శ్రీనివాస్, సంపునూరిదేవయ్య, బైరగోని వేణు, ముత్యాల రాజేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు…

నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు
* బిజెపి మండల అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్

మహాదేవపూర్ సెప్టెంబర్ 17 (నేటి ధాత్రి)

 

 

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రామ్ శెట్టి మనోజ్ బుధవారం రోజున మాట్లాడుతూ నిరంకుశ నిజాం పరిపాలనకు చరమ గీతం పాడిన రోజని అన్నారు. మహాదేవ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం మండల బిజెపి అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్ మాట్లాడుతూ నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు అని, రజాకర్ల అకృత్యాలకు గోరి కట్టిన రోజని, దొరల గడీల్లో బానిసత్వానికి సమాధి కట్టిన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు లింగంపల్లి వంశీధర్ రావు, బల్ల శ్రావణ్, మండల కోశాధికారి ఊదరి పూర్ణచందర్, కార్యదర్శి బందుల సంతోష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఓడేటి బాల్రెడ్డి, మండల నాయకులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం.

కాంగ్రస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం. ప్రజాపాలన దినోత్సవం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం* మరియు ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలన నుంచి మొగలు సామ్రాజ్య వాదుల నుండి మన రాష్ట్రం విముక్తి చెంది ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మొగల్ సామ్రాజ్యవాదుల చేర నుండి విముక్తి అయిన రోజు సెప్టెంబర్ 17 ,గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి గత పది సంవత్సరాల నిరంకుశ పాలన నుండి విముక్తి చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో సురక్షితంగా సుభిష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను 6 ఆరు గ్యారెంటీలను అమలుచేసి పేదలందరికీ అనేక సంక్షేమ పథకాలను అందించి ముఖ్య మంత్రి సుపరిపాలన అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి పార్టీ అభ్యర్థులందరినీ గెలిపెంచాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొబ్బెట రమేష్ , చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ , రాష్ట్ర నాయకులు జ్యోతి రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, చిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , మార్కెట్ డైరెక్టర్ మట్టికే రవీందర్, గుంటూరు పల్లి గ్రామ శాఖఅధ్యక్షులు నాగరాజు* , నాయకులు కొరిసాంబశివుడు, సరిగమల సదానందం, గుర్రపు నరసయ్య, క్యాత మార్కండేయ ,పిట్టల సాంబయ్య చిలుముల రాజమౌళి ,శనిగరపు మొగిలి ,దేవేందర్ రావు ,మేకల రాజయ్య, కట్కూరి సుమన్, మెరుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు..

సిరిసిల్ల జిల్లాలోని ఘనంగా ప్రజాపాలన దినోత్సవం…

సిరిసిల్ల జిల్లాలోని ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే

పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

ప్రజా పాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పై వివరించారు.

 

 

ఈ సందర్బంగా విప్ మాట్లాడారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 09/12/2023న కొలువుదీరింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది.

 

 

2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్‌ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను.
మహిళల అభ్యున్నతే ధ్యేయంగా: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డీఆర్డీఓ, మెప్మా ఆద్వర్యంలో జిల్లాలోని ఎస్ హెచ్ జీల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7వేల 111 లక్ష్యానికి గాను ఇప్పటిదాకా 1 వెయ్యి 586 యూనిట్లను గుర్తించి 200 కోట్ల బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా రూ.68 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటిదాకా రూ. 25 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. 5వేల 691 యూనిట్లు లక్ష్యం కాగా, వెయ్యి 607 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. చేయూత పింఛన్లు జిల్లాలో లక్ష 17 వేల 370 మంది పించన్ దారులకు ప్రతి నెలా రూ.25 కోట్ల 73 లక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది.
ఎస్ హెచ్ జీ మహిళలకు చీరలు: సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షల 7౦ వేల మందికి పైగా ఉన్న ఎస్ హెచ్ జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగినది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది.
సన్న బియ్యం పంపిణీ: పీడీఎస్ వ్యవస్థ పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతున్నది. లక్ష 77 వేల 851 కుటుంబాలు, 5 లక్షల 35 వేల 920 మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది.నూతన రేషన్ కార్డులు: జిల్లాలో కొత్తగా 14 వేల 75 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 3౦ వేల 376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్చడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. రైతు రుణమాఫీ: గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు, రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి.. కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. “ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో 393 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాము. రైతు భరోసా కింద లక్ష 26వేల 278 మంది రైతులకు.. 149 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 45లక్షల రుణ మాఫీ చేశాము. రాష్ట్రంలో 7 వేల 178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతున్నది. దీని కోసం రూ.16 వేల 691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లించడం జరుగుతున్నది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష 13 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఇందిరమ్మ ఇండ్లు: తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి రూ.22 వేల 500 కోట్లు వెచ్చించడం జరుగుతున్నది. జిల్లాలో 12 వేల 623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 7 వేల 927 ఇండ్లు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4వేల 696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. 10వేల 234 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5 వేల 305 గృహాలకు లబ్దిదారులు ముగ్గు పోయడం జరిగింది. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 38 కోట్లకు పైగా నేరుగా జమ చేసింది.
మహాలక్ష్మీ పథకం: ద్వారా ఆడబిడ్డలకు రూ.6 వేల 790 కోట్లు ఆదా అయ్యింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా రూ. 46 వేల 689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 315 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు.
గృహజ్యోతి పథకం: ద్వారా మార్చి 2024 నుంచి ఆగస్ట్ 2025 వరకు మొత్తం 17 లక్షల 52 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ. 67 కోట్ల 70 లక్షల లబ్ది చేకూర్చాము. జెగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్
(వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎన్.పీ.డీ.సీ.ఎల్ కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
వైద్యారోగ్య శాఖ : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యారోగ్యంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచగా, డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ఆగస్ట్ 2025 వరకు 24 వేల 154 మంది రోగులు రూ. 62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది. జిల్లాలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటిదాకా 4వేల 795 చెక్కుల ద్వారా రూ. 16కోట్ల 85 లక్షలు, అలాగే 275 ఎల్ఓసీల ద్వారా రూ. 5 కోట్ల సాయం అందజేయడం జరిగింది.
మత్స్య శాఖ: ధర్తి అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన రుద్రంగి, వీర్నపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్దిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ: యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం.ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీ.జీ.పీ.ఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది.
పోటీ పరీక్షల్లో రాణించేలా: జిల్లాలోని విద్యార్థులు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ-జేఈఈ, నీట్-యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతున్నది. మొత్తం 13 వేల 564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
పనుల జాతర: జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో రూపాయలు 7 కోట్ల 80 లక్షల విలువ గల 258 పనులు చేపట్టడం జరుగుతున్నది.చివరి ఆయకట్టుకు నీరు అందించేలా: తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం
వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్.బిగి.తే

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే ఐపిఎస్ భారత జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి తర్వాత తెలంగాణకు స్వతంత్రం రావడం సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం మరియు ప్రజాపాలన దినోత్సవం గా జరుపుకోవడం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను గుర్తిస్తూ ప్రభుత్వం పట్ల ప్రజలు అధికారులు కలుపుకుంటూ ముందుకు సాగించడం ఎంతో గర్వకారణమని తెలిపారు.

 

 

ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ముర్తుజపూర్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం…

ముర్తుజపూర్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సెప్టెంబర్ 17, బుధువారం రోజున న్యాల్కల్ మండలంలోని ముర్తుజాపూర్ గ్రామ పంచాయితీ, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైంది. రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రారంభమైంది. ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి నరేశ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాత్ , గ్రామ నాయకులు, అజమ్ పటేల్, సిరాజ్ పటేల్, మోహన్ రెడ్డి, రమేశ్ పటేల్, సాల్మన్, దినకర్,ప్రశాంత్ మరియు పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి…

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి

నేటి ధాత్రి కథలాపూర్

 

 

కథలాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం రోజున మండల అధ్యక్షులు మల్యాల మారుతి అధ్యక్షతన సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, మండల సేవాపక్షం ఇంచార్జి లింగంపల్లి శంకర్ మాట్లాడుతూ….. బిజెపి జాతీయ పార్టీ . పిలుపుమేరకు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు బూత్ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.. 19 గ్రామాల్లో రక్తదానం,స్వచ్ఛభారత్, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి జన్మదినవేడుకలు, తెలంగాణ విమోచన దినోత్సనం ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లో బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, సర్పంచ్ లు గెలవాలని కోరారు. కార్యక్రమంలో మల్యాల మారుతి,కోడిపెల్లి గోపాల్ రెడ్డి,గాంధారి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి గంగారాం,ప్రమోద్,శ్రీకర్, మహేష్,వినోద్,నారాయణ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version