కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

బీసీలకు రూ.20,000 కోట్ల కేటాయింపే న్యాయం..

మెట్టు గంగారాం డిమాండ్..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల సంక్షేమానికి రూ.20,000 కోట్లు కేటాయించి చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీ ఉపాధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.9,200 కోట్లు, 2025-26 బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించినప్పటికీ, వాస్తవంగా ప్రతి ఏడాది సుమారు రూ.300 కోట్లు మాత్రమే వినియోగించబడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 60 శాతం జనాభా బీసీలే ఉన్నప్పటికీ, కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించడం, అందులోనూ ఒక్క శాతం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధికి వినియోగించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రభుత్వం బీసీ సంఘాలతో చర్చించి, రానున్న బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా రూ.20,000 కోట్లు కేటాయించి, చట్టబద్ధమైన బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని కోరారు. కేటాయించిన ప్రతి రూపాయి కూడా బీసీల అభివృద్ధికే ఖర్చు అయ్యేలా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించి, వాస్తవ ఖర్చుల్లో వెనుకబడటం సరికాదని, ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని కోరారు.

ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన టి ఆర్ పి నాయకులు…

ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన టి ఆర్ పి నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం కేంద్రంలోబుధవారం రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి చీఫ్ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షులు రవి పటేల్ పిలుపు మేరకు బీసీ సప్లాన్ తెలంగాణ రాష్టంలో అమలు చేయాలనీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో ఆర్డీవో లకి వినతి పత్రాలు అందచేశారు.
ఇందులో భాగంగా గణపురం మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి కి కూడా బీసీ లకి అనాదిగా బడ్జెట్ లో జరుగుతున్న అన్యాయం గురించి వివరించి వెంటనే తెలంగాణ లో బీసీ సప్లాన్ అమలులోకి రావాలని వినతి పత్రం అందచేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో గణపురం మండల అధ్యక్షుడు గండు కర్ణాకర్,బస్వరాజపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి అశోక్ మండల నాయకులు ఈరగోని తిరుపతి పాల్గొన్నారు

ఎంఆర్ఓ గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరుపున బిసి సబ్ ప్లాన్ వినతిపత్రం…

ఎంఆర్ఓ గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరుపున బిసి సబ్ ప్లాన్ వినతిపత్రం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారీ ఆదేశానుసారం,సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలో మండల ఆఫీస్ బిసి సబ్ ప్లాన్ వినతిపత్రం ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి కడమంచి వరప్రసాద్, జహీరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్, మొగుడంపల్లి మండల, అధ్యక్షుడు శ్రీను, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి లతీఫ్ షాప్, ఔరంగాబాద్ గ్రామ అధ్యక్షుడు దేవప్ప, మొగుడంపల్లి మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన జె ఏ సి నాయకులు.

తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన జె ఏ సి నాయకులు.

చిట్యాల, నేటిదాత్రి :

 

42 శాతం రిజర్వేషన్ సాధన సమితి పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాలలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో బిసి ఎస్సి ఎస్టీ జె ఏ సి ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కి 42% విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు 9వ షెడ్యూల్లో చేర్పు మరియు కామారెడ్డి డిక్లరేషన్ అమలు గురించి రిప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు 42%రిజర్వేషన్ సాధన సమితి మండల కోఆర్డినేటర్ చింతల రమేష్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతున్నామని
రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3 మరియు 4 ద్వారా మార్చి 2025లో విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి తొమ్మిదవ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలని,
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం 42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంవత్సరం కూడా ఖర్చులు అలాగే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలి మరియు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని
రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు కమిషన్లు బోర్డులు మరియు సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం సమాన అవకాశాలు తగు ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ గౌడ్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మండల కోఆర్డినేటర్ శీలపాక నాగరాజ్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జెన్నే యుగేందర్,బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మండల నాయకులు పర్లపల్లి కుమార్, పుల్ల అశోక్, నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్, గడ్డం కొమురయ్య, పోన్నం అశోక్ గౌడ్, రషీద్, గుర్రం శ్రీనివాస్, సంపంగి సతీష్, మాచర్ల దయాకర్ గౌడ్ మోత వెంకటేష్ పెరుమడ్ల నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు

తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
పైడిపెళ్లి రమేష్ బిసి జేఏసీ జిల్లా ఛైర్మెన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ
42% బీసీ రిజర్వేషన్
రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3 4 ద్వారా మార్చి 2020లో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి తొమ్మిదవ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలి ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మనవి చేస్తున్నాం
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి
కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంవత్సరం కూడా ఖర్చులు అలాగే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు కమిషన్లు బోర్డులు సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం సమాన అవకాశాలు తగు ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version